మహాత్ముడు కాదట!

జంబూ ద్వీపం. కొత్త ఢిల్లీ. గాంక్రెస్ పార్టీ కార్యాలయం.

గాంక్రెస్‌లోని అతిరథ మహాయోధులు అంతా రావడంతో ఆఫీస్ నిండి పోయింది. ఢిల్లీ అమ్మ తన సింహాసనం మీద విషాదంగా కూర్చుని ఉంది. జంబూ ద్వీప ప్రధాని జగన్మోహన్ సింగ్ సింహాసనం పక్కనే చతికిల పడి ఉన్నాడు. ముందు వరుసల్లో మిగతా ముఖ్యులు, దుర్జన్ సింగ్, విషరాజ్ పాటిల్, వ్రణబ్ ముఖర్జీ తదితరులు కూర్చుని ఉన్నారు.

ఎట్టకేలకు ఢిల్లీ అమ్మ నోరు విప్పింది. “ఎలా జరిగింది ఇది?” వణుకుతున్న గొంతుతో అడిగింది. అందరూ తల అడ్డంగా ఊపారు.

దుర్జన్ సింగ్ మెల్లగా, “అమ్మా, గాంక్రెస్ పార్టీ అనాదిగా పాటిస్తున్న పద్ధతే ఇంకా నడుస్తూంది. హెన్రూ గారూ, మీ అత్త గారు మందిరా గాంధీ, మీ ఆయన జాజావ్ గాంధీ, మీరూ, ఇంకేమన్నా అవకాశముంటే మహాత్ముడూ, తప్ప ఇంకెవరి పేరు ప్రాముఖ్యంగా ఉండకుండా అన్నీ జాగ్రత్తలూ తీసుకున్నాం. రోడ్లనుంచి విమానాశ్రయాల వరకూ, మందిరాలనుంచి మరుగుదొడ్ల వరకూ, అన్నిటికి ఈ పై పేర్లే పెట్టాం,” అన్నాడు.

“అవును, ప్రతి పాఠ్య గ్రంథంలో దుర్జన్‌జీ చెప్పిన పేర్లు ఉన్న వారి త్యాగాలే పాఠ్యాంశాలుగా పెట్టాం. మన ఘోరదర్శన్ చానెల్స్‌లో కూడా ఓ వీళ్ళ కథలు కబుర్లే పూర్తిగా నింపేశాం. అసలు వీళ్ళు తప్ప ఇంకెవరూ మన దేశం కోసం కష్ట పడలేదనీ, అన్నీ త్యాగాలూ వీరివే అని బల్ల గుద్ది, బాకా ఊది మరీ చాటింపు వేశాం.” ఇది విషరాజ్ పాటిల్.

“మరే, నేను కూడా అవకాశం దొరికినప్పుడల్లా ప్రతి ఇంటర్వ్యూలోనూ హెన్రూ, మందిరా, జాజావ్ అనే భజన చేస్తాను,” నమ్మ బలికాడు జగన్మోహన్ సింగ్.

“ఛీ! మీరు నోరు మూయండి. మిమ్మల్ని మాట్లాడమని ఇప్పుడు ఎవరడిగారు?” హుంకరించింది ఢిల్లీ అమ్మ. జగన్మోహన్ అర్జెంట్‌గా నోరు మూసుకున్నాడు.

“అది కాదమ్మా…” వ్రణబ్ ముఖర్జీ ఏదో చెప్పబోయాడు.

“మీ ఎక్స్‌ప్లేనేషన్స్ నాకు అనవసరం. దీన్ని ఎలా ఎక్స్‌ప్లేన్ చేస్తారో చేయండి మరి,” వాళ్ళందరి మీద ఒక వార పత్రిక విసిరేసింది ఢిల్లీ అమ్మ.

ఆ పత్రిక “జంబూ ద్వీప్ టు డే.” అందులో వాళ్ళు చేసిన పోల్ ప్రకారం ఉత్తమ జంబూ ద్వీపస్తుడిగా, చాలా ఆశ్చర్యంగా, భగవంత్ సింగ్ ఎన్నికయ్యాడు. రెండో వాడిగా సుభాష్ సూర్య బోస్, మూడో వాడిగా మహాత్ముడు ఉన్నారు.

“ఏంటి మహాత్ముడు మొదటి స్థానంలో లేడా!” కెవ్వుమని కేకేశాడు వ్రణబ్ ముఖర్జీ.

“మహాత్ముడి సంగతి తరువాత. మా అత్త గారి పొజిషన్, హెన్రూ గారి పొజిషన్ గమనించండి,” కోపంగా అంది అమ్మ.

“మందిరా గాంధి గారు ఆరవ స్థానం, హెన్రూ గారు తొమ్మిదవ స్థానం. మీరూ, జాజావ్ గారూ లిస్ట్‌లోనే లేరు. అయ్యో భగవంతుడా నాకు చావైనా రాదే!” భోరుమన్నాడు దుర్జన్ సింగ్.

“ఎహె ఆపండి. భగవంతుడు అంటే నాకు ఆ భగవంత్ సింగ్ గుర్తొస్తున్నాడు. అసలు వాడు ఫస్టు రావటమేంటండీ,” రెండు కన్నీటి బొట్లు కార్చింది ఢిల్లీ అమ్మ.

“ఏమో అమ్మ. ముఖ్యంగా ఆ భగవంత్ సింగ్ గురించి ఏ మాత్రం ప్రచారం జరగకుండా జాగ్రత్త పడ్డాం. అసలు స్వాంతంత్ర్యం రావడానికి ముందు నుంచే మన పార్టీ అతగాడిని ఎంత నొక్కెయ్యాలో అంత నొక్కేసింది,” ఏడుపు మొహం పెట్టి అన్నాడు వ్రణబ్.

“అసలే వాడొట్టి రాలుగాయి. మహాత్ముడూ, హెన్రూ గారూ ఎంత చెప్పినా వినకుండా, మన మాతృభూమికోసం అవసరమైతే హింసని కూడా ఆశ్రయించక తప్పదన్న మూర్ఖుడు. పైగా అసయ్యంగా ఇరవయి మూడేళ్ళకే ఉరికంబం ఎక్కాడు. వాడు ఫస్టు రావడమేంటి, కలి కాలం కాపోతేనూ,” ఆవేశంగా అన్నాడు దుర్జన్ సింగ్.

మిగతా గాంక్రెస్ సభులు అంతా హాహాకారాలు చేస్తూ గుండెలు బాదుకున్నారు.

“సర్లే! వెధవ గొడవాపి, అందరూ భగవంత్ సింగ్ విగ్రహావిష్కరణకి బయలుదేరండి,” విసుగ్గా అన్నాడు సాహుల్ గాంధి.

“విగ్రహావిష్కరణమా?” అందరూ ముక్త కంఠంతో అరిచారు.

“మరే! మన పార్టీ నో-క్లియర్ డీల్ గురించి సపోర్ట్ కోసం కష్టపడుతున్నప్పుడు, అఖిల పక్షాలూ (ఎర్ర పార్టీతో సహా) గత సంవత్సరమే భగవంత్ సింగ్ విగ్రహం పార్లమెంట్ మధ్య ప్రతిష్టాపించాలని నిర్ణయించారు. మనం పట్టించుకోలేదంతే. పద్దెనిమిది అడుగుల విగ్రహమంట!” అన్నాడు అసూయగా సాహుల్ గాంధి.

“ఘొల్లు, కెవ్వు, భోర్,” అంటూ ఢిల్లీ అమ్మతో సహా అందరూ ఆవిష్కరణ స్థలానికి బయలుదేరారు. అక్కడికి రాగానే అందరూ మొహం మీద కష్టపడి చిరు నవ్వు పులుముకున్నారు ప్రెస్సోళ్ళకోసం.

భగవంత్ సింగ్ కాంశ్య విగ్రహం వారినే సూటిగా చూస్తున్నట్టు ఎవరికి వారికే అనిపించి గాంక్రెస్ వాదులు అంతా తెలీకుండానే తమ తల కిందికి దించుకున్నారు.

Shaheed Bhagat Singh Reaches Indian Parliament After 79 Years

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

17 Responses to మహాత్ముడు కాదట!

 1. రవి says:

  బాసూ, సూపర్, అదిరిపోయింది అసలు.సెటైర్ రాస్తూనే, మంచి విషయాలు చెబుతున్నావు. ఆ భగత్ సింగ్ కు క్షమా భిక్ష పెట్టడానికి, బ్రిటిష్ వళ్ళు రెడీ అయి, గాంధీ ని అడిగేరట, నువ్వు ఓ మాట చెబితే చాలు, అని. ఈ మహాత్ముడు ఒప్పుకోలే. ఈయనే ఓ మహమ్మదీయ ఉగ్రవాదికి క్షమాభిక్ష కోసం ఎగేసుకుంటూ వెళ్ళి అడిగేడట.

  పోనీలెండి, ఇప్పటి మన తరం వాళ్ళయినా, గాంక్రెస్ నాయకుల (మహాత్ముల) దివాళా కోరు తనం కనిపెట్టారు.

 2. chaitanya says:

  మళ్ళీ కేక పెట్టించారు మురళి గారు. దేశం అంటేనే వాళ్ళు , వాళ్ళే దేశం అన్న రీతిలో తయారు అయ్యింది పరిస్తితి. ఏమి చేద్దాం. పేర్లు మాత్రం అదుర్స్ గురువుగారు.

 3. భగత్ సింగ్ ఉరితీత నిర్ణయించబడిన సమయంలో గాంధి-ఇర్విన్ సమావేశం జరిగినది. ఆ సమావేశంలో గాంధి కనుక ‘ఓ మాట ’ చెప్పి ఉంటే భగత్ సింగ్ ఉరి నిలిపివేయబడి శిక్ష మార్చబడేదనీ, ఆ విధంగా కొందరు గాంధీకి విజ్ఞప్తి చేసుకొన్నారనీ(ఇందులో భగత్ సింగ్ ప్రమేయం లేదు) అంటారు.

  కానీ గాంధీ ఇర్విన్ తో ‘ఆ సంగతే’దో త్వరగా తేల్చండి… అవతల కరాచీ కాంగ్రెస్ సమావేశానికి సమయం దగ్గరపడుతున్నది’ అని అన్నాడని తరువాత బయటపడింది.

  ఈ విషయం మీద కరాచీ కాంగ్రెస్ లో రభస కూడా జరిగినది.

 4. బ్రిటిష వాళ్ళతో సైనిక పరమైన యుద్ధం చేద్దామన్న సుభాష చంద్రబోసునే సమర్ధించని గాంధీ, భగత్ సింగ్ ని “హింసాత్మక తీవ్రవాదిగా” పరిగణించిన బ్రిటిష్ వారినుండీ తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా క్షమించమని అడుగుతాడని అనుకోవడంకూడా అసాధ్యం.

  ఇప్పుడు చాలా తప్పుగా అనిపించినా,అది ఒక సైద్ధాంతిక నిర్ణయం అయుండొచ్చు.కాకపోతే అప్పటికీ ఇప్పటికీ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి యువతకున్న ఒక ఆదర్శరూపం భగత్ సింగ్. ఒక వేళ తను బ్రతికి ఒక రాజకీయనాయకుడిగా మారుంటే, అంత powerful icon అయ్యుండేవాడు కాదేమో!

 5. ఉపేంద్ర says:

  మురళిగారు మీ శైలి విలక్షణం. అందరి పేర్లతో ఆడుకున్నారు 🙂 మరి గాంధీగారిని మాత్రం..?
  నాదో చిన్న మనవి! ఈ సమస్య అందరికి ఉందో లేదో తెలియదు కానీ మీ బ్లాగ్ home page load అవ్వడానికి చాల సమయం పడుతోంది. బహూశా చాలా ఎక్కువ శీర్షికలు ఉండటం వల్ల అనుకుంటాను.

 6. మహాత్ముడి గురించి “ఏమీ ” లేదా రాయడానికి? ఎప్పుడు రాస్తారు, ఎదురు చూస్తున్నాను! భగత్ సింగ్ ఉరి విషయంలో మాట సాయం గురించి నేనూ చదివి, విస్తుపోయాను చిన్నప్పుడు.

 7. భగత్ సంగ్ నాస్తికుడు – గాంధీగారు ఆస్తికుడు
  భగత్ సింగ్ హింసావాది – గాంధీగారు అహింసావాది
  భగత్ సింగ్ ఇఱవయ్యొక్కేళ్ళ పిల్లకాకి – గాంధీగారు డెబ్బయ్యేళ్ళ భీష్ముడు
  భగత్ సింగ్ గురువు కారల్ మార్క్సు – గాంధీగారి గురువు శ్రీ కృష్ణుడు

  ఏ విషయంలో ఇద్దరికీ పోలికలున్నాయి ? భగత్ సింగు విసిరిన బాంబులతో భారతీయులు కూడా చనిపోయే అవకాశమున్నప్పుడు ? ఆ బుద్ధీ జ్ఞానం భగత్ సింగుకి లేనప్పుడు ? గాంధిగారు ఎందుకు సమర్థించాలి భగత్ సింగుని ? భగత్ సింగు ఏ విషయంలో గాందీగారిని సమర్థించాడు ? మనం చెయ్యలేని సైద్ధాంతిక త్యాగాల్ని గాంధీగారి నుంచి మాత్రం ఆశించవచ్చునా ?

 8. Murali says:

  తాడేపల్లి గారూ,

  మీరు చెప్పింది నిజమే. భగత్ సింగ్‌కి సాయం చేయాల్సిన అవసరం గాంధీకి ఏ మాత్రం లేదు. ఐతే గాంధీ సిద్ధాంతం ప్రకారం అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయాలి కాబట్టి, గాంధీనుంచి కొంత మంది ఇంతకంటే పెద్ద మనసుని ఆశించారు. భగత్ సింగ్‌కి గాంధీ గారి ఈ ప్రవర్తన వల్ల “జ్ఞానోదయం” అయ్యేదేమో! అలా అని ఇక్కడి వ్యాఖ్యల్లో చెప్పినట్టు భగత్ సింగ్ చావు గురించి ఏనాడూ భయపడలేదూ, తనని కాపాడమని ఎవరినీ కోరుకోనూలేదు.

  ఇక హింసావాది అంటారా, భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు, గాంధీ మార్గాన్ని ఆయనకంటే effectiveగా ఉపయోగించి, అంటే 55 రోజులపైన ఉపవాసం ఉండి, సామాన్య ఖైదీల హక్కులు సాధించాడు.

  భగత్ సింగ్ పిల్ల కాకే. పిల్ల కాకులకు కమ్యూనిజం రుచించడం కూడా సహజమే. అప్పటికి కమ్యూనిజం తొలి అడుగులు వేస్తూంది. దాని గురించి పూర్తిగా ఎవరికీ అవగాహన లేదు. పక్క దేశం రష్యాలో సామ్రాజ్య వాదాన్ని తిప్పి గొట్టిన కమ్యూనిజమంటే దాస్యంలో మగ్గుతున్న భగత్ సింగ్ లాంటి భారతీయుడికి ఆకర్షణ కలగడంలో ఆశ్చర్యం లేదు.

  ఐతే గమనించవలసిన విషయం ఇంకోటి ఉంది. భగత్ సింగ్ మూర్ఖంగా ఏ సిద్ధాంతాన్ని పట్టుకుని వేలాడే టైప్ కాదు. ఎప్పుడైతే హింస వల్ల తాము అనుకున్న ప్రయోజనం సాధించలేకపోతున్నాము అనుకున్నాడో, వెంటనే పార్లమెంట్‌లో స్మోక్ బాంబ్ వేసి స్వచ్ఛందంగా లొంగి పోయి ప్రపంచానికి “ఇంక్విలాబ్” అంటే ఏమిటో తెలియచెప్పాలని నిశ్చయైంచాడు. ఒక వేళ కమ్యూనిజం సృష్టించే కంపు గురించి తెల్సుకుని ఉంటే, నిస్సంకోచంగా దాన్ని కూడా విసర్జించి ఉండేవాడు. Indians then, and even now, like(d) this moral flexibility, lack of bigotry, focus on goal and the unmatched courage in Bhagat Singh.

  ఇక భగత్ సింగ్ బాంబులేసి భారతీయులని చంపడానికి కూడా వెనుకాడలేదు అన్నది అసత్య వాదన. భగత్ సింగ్ బ్రిటీషు వాళ్ళలో కూడా తప్పు చేయని వారిని చంపడానికి ఇష్టపడలేదు. నిజానికి అతను నిజమైన బాంబుని పార్లమెంట్‌లో పేల్చి ఉండవచ్చు. (పీడ విరగడయ్యుండేది ఒక రకంగా.) కాని అతను అలా చేయలేదు. భగత్ సింగ్‌కి మానవ ప్రాణం విలువ బాగా తెలుసు. అతనికీ, చిన్న పిల్లల్ని కూడా పాశవికంగా చంపే ఉగ్ర వాదులకీ చాలా తేడా ఉంది.

  -మురళి

 9. నరేంద్ర భాస్కర్ S.P says:

  నరేంద్ర భాస్కర్ S.P.
  మురళి గారూ నమస్తే!
  అందరూ అన్నట్టే పేర్లతో మాత్రం గొప్పగా ఆడుకుంటారు-మాకు ఆరో తరగతి లో సంఘీక శాస్త్రం చెప్పిన మాస్టారు ఒక మాజీ నక్షలైటు ఆయన ప్రతి వారంలొ ఒక్కసారైనా సుభాష్ బోసు గారి గురుంచీ, భగత్ సింగు గారి గురించీ అల్లూరి వారి గురించీ చాలా చెప్పేవారు అలా ఆయన వేసిన ముద్ర వల్ల ఐతేనేమి, నేచదివిన వాళ్ళకు సంబంధించిన పుస్తకాలవల్లనైతేనేమి వీళ్లంతా మహాత్ములు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు-మన దేశనికి స్వాతంత్ర్యం కేవలం అహింసావాదం ద్వారా వచ్చిందంటే అది కేవలం ఆతిశయోక్తి, ఏన్నొ అత్మార్పణల తర్వాతే అది జరిగింది. అన్నట్టు తాడేపల్లి గారూ గాంధీ గారి గురువు కృష్ణుడు కాదు భేచార్జీ స్వామి అని ఒక జైనుడు-

 10. Murali says:

  ఉపేంద్ర గారూ,

  మీ సలహాకి థాంక్స్! వెంటనే అమలు పరిచేశాను. 🙂

  -మురళి

 11. భగత్ సింగుకు జరిగిన సత్కారం లాంటిదే అల్లూరి సీతారామరాజు విప్లవోద్యమం నడుపుతున్నపుడు ఆయనకు జరిగిందట.

 12. sathish says:

  mueali garu tadepalli gari prasna ku samadanam bagundi…..thanq for all.ee blog ni ma friends ki parichayam chestanu…..

 13. Rajesh says:

  Hi Thadepalli garu,

  Nenu chinnappudu oka katha chadivanu, puli, nakka oka challenge chesukuntayata, evaru ekkuva balavanthulo thelchukovadaniki. Danikosam avi oka balamaina godanu pagalagottali. Nakka mundunga puli tho andi ” mundu nee balam choopinchamani” appudu, puli godanu padeyadaniki thana thalatho chalasarlu godanu badindi. Chivaraga chala alasi poyindi kanee a samayanike puli debbala vall goda chala week ayipoyindi, adi grahinchinchina nakka thanu oka sari try chestanani godanu dee kottindi. Appatike goda puli debbala valla chala week ayinanduna adi okka debbthone padi poyindi.

  Ee katha lage mana so called MAHATHMA kooda manaku swathanthryam thechi nattu thanu cheppu kovadam or manam cheppukovadam anthe. Ardam ayindanukunt…..

 14. ravikiran says:

  hai sir yours blog is very exallent
  i want to know some matters about mahatmagandhi
  why he do not accept to save bagath singh please tell me iam very enthsiastic in that matter.

 15. anand says:

  tadepalli ki mathi braminchindi….bhagath singh ugavaada…pillakaaka…himsavaada…mathi unde matladutunnara….manaki freedom vachindi gandhi gaari vallakaadu…endaro viplava veerulu chesina tyagam valla…communisam kampu kadu prapamcha maanavaaliki…..margadarchi….aa communisam neti prapamchaniki dikku….

 16. anand says:

  murali gaaru ee blog edo chuddam ani open chesanu…baga rastunnaru…karlmax veyyella medavi ga gurthincha badddaru….telusa.. comminisam matrame ee prapamchani margam….comminisam kampu kadu guruvu garu….maarpu…

 17. anand says:

  evvarini vimarshinchadani rayaledu…tappulunte manninchandi…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s