షాక్మీర్ ఇచ్చేస్తే పోలా!

స్థలం: జంబూ ద్వీపం
సందర్భం: భవిషత్తులో ఎప్పుడో.

జంబూ ద్వీప ప్రధాని ఒక సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. దానికి కొన్ని మత తత్వ పార్టీలు తప్ప అందరూ మద్దతు ప్రకటించారు. అదేంటంటే, షాక్మీర్‌కి స్వాతంత్ర్యం ఇచ్చేయడం. షాకయ్యారా! ఐతే మీరు మేధావి కారన్నమాట. మేధావులు దేన్నైనా సరే అన్ని కోణాలనుంచి పరిశీలించి కానీ ఒక నిర్ణయానికి రారు. (ఒక్కోసారి వాళ్ళు నిర్ణయానికి వచ్చేసరికీ, అసలు దేని గురించి నిర్ణయానికి వచ్చారో ఆ విషయమే గల్లంతు అయ్యుంటుంది అనుకోండి. అది వేరే విషయం.)

ఇదిగో, సరిగ్గా అలాంటి మేధావులకోసమే, జంబూ ద్వీప ప్రధాని టీవీపై ప్రసంగించాడు.

“ప్రియాతి ప్రియమైన నా ప్రజలారా. మొన్న షాక్మీర్ మీద హెలికాప్టర్‌లో ప్రయాణం చేస్తూ, ఎందుకో కిందకి చూశా. ఏదో చిన్న పెంకుటిల్లు పక్కన పీకిస్తాన్ జెండా పాతి ఉంది. మీ అందరికీ నేనేంత దొడ్డ దేశభక్తుడినో వేరే చెప్పకర్లేదు. ఒక క్షణం నాకు పిచ్చి కోపం వచ్చింది. కానీ కోఫం ఆపుకుని ఒక మేధావిలా ప్రశంతంగా ఆలోచించా.

వీళ్ళు ఎలాగూ మనతో ఉండేలా లేరు. ఒక వేళ ప్లీబిసైట్ పెడదామా అన్నా మనం గెలుస్తాం అన్న నమ్మకం లేదు. అహహా, షాక్మీర్, దమ్ము, డలక్ మూడింట్లో ప్లీబిసైట్ పెడితే మనమే గెలుస్తామనుకోండి. కానీ అలా పెట్టడం ఏ మేధావి ఒప్పుకోడు. ప్లీబిసైట్ పెడితే ఉత్త షాక్మీర్ లోయలోనే పెట్టాలి. అప్పుడు మనం ఓడిపోతాం.

ఇదంతా చూసి నాకు అనిపించింది.  ‘ఇది మనకు అవసరమా?’ అని. వెంటనే నా క్యాలుకులేటర్ పై లెక్కలు వేశా. అప్పుడు తెలిసింది నాకు మనం షాక్మీర్ మీద, ఉగ్ర వాదులని ఎదుర్కోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నామో.

పోనీ దాని వలన మనకు ఒరుగుతూందేమిటి? అంతా నష్టాలే. పైగా వాళ్ళు మిగతా దేశమంతటా బాంబులు పేలుస్తున్నారు. ఇదంతా వాళ్ళు కేవలం షాక్మీర్ కోసమే చేస్తున్నారని, ఏ మేధావికైనా ఇట్టే తెలిసిపోతుంది.

బుద్ధున్నోడికెవడికైనా షాక్మీర్‌కి స్వాంతంత్ర్యం ఇచ్చేస్తే ఉగ్రవాదం సమసిపోతుంది అని అర్థమవుతుంది. ఇంతవరకు మనం షాక్మీర్ కోసం పెట్టిన ఖర్చు ఎంచక్కా ఏ సబ్సిడీలకో, రైతుల ఋణాలు  మాఫీ చేయడానికో వాడుకోవచ్చు.

కొందరు ఈ నిర్ణయం వల్ల ఉగ్రవాదం గెలిచింది అనుకోగలరు. కానీ నేను ఇలా చేయడం వల్ల ఉగ్రవాదాన్ని సమర్థించడం లేదు. మేధావులకు అర్థమవుతుంది లెండి. ఏది ఏమైనా, ఒక మంచి ఆలోచన వస్తే పెద్దలు ఆలస్యం చేయొద్దంటారు. కాబట్టి రేపే షాక్మీర్‌కి స్వాతంత్ర్యమోచ్!” అంటూ తన స్పీచ్ ముగించాడు జంబూ ద్వీప ప్రధాని.

వెనక బ్యాక్‌గ్రౌండ్‌లో “జనగణమన” బదులు “ఓ పనైపోతుంది బాబూ, ఓ పనైపోతుంది బాబూ,” పాట మొదలయ్యింది.

***

అలా షాక్మీర్‌కి స్వాతంత్ర్యం వచ్చింది. వాళ్ళు సంబరాలు జరుపుకుని జెండా రంగు ఏంటో డిసైడ్ చేసే లోపల పీకిస్తాన్ వాళ్ళని ఆక్రమించుకుంది. సరిహద్దు మరింత దగ్గరకు జరిగింది. వారం రోజుల తరువాత…

***

జంబూ ద్వీప ప్రధాని తల పట్టుకుని కూర్చున్నాడు తన ఆఫీసులో. ఆయన ముందు ఆయన క్యాబినెట్‌లోని ముఖ్యులు అంతా ఆసీనులై ఉన్నారు.

“మళ్ళీ ఈ సరిహద్దు ప్రాబ్లం ఏంటయ్యా? షాక్మీర్‌ని ఇచ్చేశాంగా. పీకిస్తాన్‌కి ఏం కావాలంట?” అన్నాడు.

“దమ్మూలో కొన్ని మైనారిటీలు ఉన్న ప్రాంతాలు ఉన్నాయటండీ. అక్కడ ప్లీబిసైటన్నా పెట్టండి, లేదంటే వాటికీ స్వాంతంత్ర్యం ప్రకటించండి అని గొడవ చేస్తున్నారు. లేకపోతే మళ్ళీ ఉగ్రవాదం తప్పదంట,” సమాధానమిచ్చాడు హోం మంత్రి.

“పైగా ఇప్పుడు షాక్మీర్ దొరికాక వాళ్ళకు బాంబులు వేయడానికి అనుకూలంగా కూడా ఉందండి,” అన్నాడు సైన్యాధ్యక్షుడు. ఆయనకి ప్రధాని పీక పిసకాలన్నంత కోపంగా ఉంది. (ఆయనకు హాలిస్టిక్ సొల్యూషన్స్ తెలీవు. అన్నీ సింప్లిస్టిక్ సొల్యూషన్సే!)

“ఇంకా చాలా మంది వేర్పాటుకు అర్జీలు పెట్టుకున్నారండి. త్రిలింగ దేశం రాజధాని ఆదరాబాదరాలో పాత బస్తీకి స్వాతంత్య్రం కావాలంట. ప్లీబిసైటుకు కూడా వాళ్ళు రెడీ అంట. రేకళ రాష్ట్రంలో మైనారిటీలు సోదీ అరేబియాతో కలిసిపోతారంట. పాములాండ్‌లో వేరే మైనారిటీలు వాళ్ళ దేవుడి రాజ్యం స్థాపించుకుంటారట. ఇంకా చాలా ఉన్నాయి లెండి. లేకపోతే వీళ్ళంతా బాంబులు వేస్తారంట,” సెలవిచ్చాడు హోం మంత్రి.

“అన్నట్టు లఖీస్తాన్ ఉద్యమం మళ్ళీ మొదలయ్యిందండోయి. వాళ్ళు షాక్మీరు ఉగ్రవాదుల విజయాన్ని చూసి స్ఫూర్తి పొందారట.” ఇది విదేశాంగ వ్యవహారాల మంత్రి.

“ఇవన్నీ వేర్పాటు చేసి ఇచ్చేస్తే, మనకు ఒక రెండు రాష్ట్రాలు మిగులుతాయండి. ఇచ్చేద్దామంటారా?” అడిగాడు హోం మంత్రి.

అంతలో ఆఫీసులోకి ప్రధాని మనమడు దూసుకు వచ్చేశాడు. “తాతయ్యా, నేను అన్నయ్యతో పాటూ వాడి రూంలో పడుకోను. నాకు సపరేట్ రూం కావాలి. ఇవ్వకపోతే మన కిచెన్‌లో దీపావళి బాంబులు వేస్తా,” బెదిరించాడు ఆ బుడతడు.

ప్రధాని మొహం పాలిపోయింది.

***

బయట ఎగస్పార్టీ నాయకుడు కె.ఎల్.అవధాని ఆవేశంగా రిపోర్టర్లతో అంటున్నాడు ఇలా. “అసలు పీకిస్తాన్ ఇవ్వడమే పెద్ద తప్పు. అప్పటినుంచే ఈ వేర్పాటు వాదానికి బీజం పడింది. ఒకవేళ ఇచ్చిన వాళ్ళు ఆ వేర్పాటుని లవ్లీ భాయి పటేల్ గారు చెప్పినట్టు సరిగా చేసుండాల్సింది. 1200 ఏళ్ళనుంచి మన దేశంలో ఉన్న మైనారిటీలు, మీరు మాకు వద్దు అని వేరు కుంపటి పెట్టుకున్నప్పుడు, అందరినీ అక్కడికి తోలేయాల్సి ఉండేది. అటూ ఇటూ కాని ఆ సంకర జాతి నిర్ణయం వల్ల ఇంకా జంబూ ద్వీపం రక్తం ఓడుస్తూనే ఉంది.”

(అసంపూర్తి)

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

18 Responses to షాక్మీర్ ఇచ్చేస్తే పోలా!

 1. యవన్ says:

  ఎప్పటి లాగానే అదుర్స్

 2. jhansi says:

  excellent…..
  medhavulemantaro….

 3. పెదరాయ్డు says:

  ప్రస్తుత మేధావులకు లాలూ లాంటి వారు హీరోలైపోయారు. వాళ్ళను పొగుడుతూ బ్లాగేస్తున్నారు. అంతటితో కూడా ఆగకుండా కాశ్మీర్ ఇచ్చేస్తే పోలా అంటూ సంచలనాలు రాస్తున్నారు. ఎందుకు అనవసర భావోద్వేగాలంటూ లెక్చర్లు దంచుతున్నారు. పెళ్ళికి ముందు సెక్స్ ఒక జీవిత అవసరమని దానిలో పెద్ద తప్పు లేదని, అలా అలోచించే వాళ్ళూ సనాతన వాదులనీ, మూర్ఖులనీ కొందరు. మన సంస్కృతి సంప్రదాయాలను తెగనాడతం వారికి ఒక ఫ్యాషన్. డబ్బే(బ్లాగులోకంలో హిట్లే) పరమావధి ఐపోతే ఇంతకంటే గొప్పగా ఎలా ఆలోచించగలం? మనిషి కొన్ని కట్టుబాట్లకు, అనుభూతులకు, భావోద్వాగాలకు లోబడి ఉండకపోతే, మనిషి కంటే కౄరమృగం ఈ సృష్టిలోనే లేదు.

  ఇక మన నేతల విషయానికొస్తే త్యాగమయి సోనియా గారు మనదేశానికి అప్రకటిత మహారాణి. ఇక కోపమనే నరం తెగిపోయిందని చెప్పుకునే ఒక నేత నిజానికి ఆత్మాభిమానాన్ని చంపుకొని బాకా ఊదటంలో మనదేశ నేతలందరికంటే అగ్రగణ్యులైపోయారు. సిద్దాంతాలకు ఏమాత్రం విలువ లేదు. సిద్దాంతాలు పాటించినవాడిని ఒక చేతగాని దద్దమ్మగానో, మత చాంధసుడిగానో, అతివాదులుగానో పేరుపెట్టి అవహేళన చేయటం పరిపాటి ఐపోయింది.

  ఇన్ని అధునాతన భావాలను ప్రకటించే వీరు తనదాకా వచ్చినపుడు మాత్రం అవే నైతిక విలువలను, సంప్రదాయాలను విమర్శకులపై ఎక్కుపెడతారు.

  తేటగీతి గారూ, మనదేసంలో జరుగుతున్న అన్యాయాలను సున్నితంగా తెరకెక్కిస్తున్నారు. అభినందనలు.

 4. శివ says:

  పిడివాదులకు బాగ చురకలంటించారు ..

 5. bezawa says:

  షాక్మీర్ ఇచేయటం మన అసమర్ధత కు నిదర్శనం అని భావించే ఒక సగటు మనిషిని నేను.
  ఏది ఏమైనా మీ సటైరు సూపరు

 6. chaitanya says:

  కేక మురళి గారు. మేధావుల మనోభావాలు దెబ్బతిన్నాయో ఏమొ !

 7. Murali says:

  ఝాన్సీ గారూ, చైతన్య గారూ,

  మేధావుల మనోభావాలా? దెబ్బ తినే ఉంటాయి. వారి దృష్టిలో వారివొక్కరివే సున్నితమైన మనసులు కద! ఈ మేధావులకు ఒక common characteristic ఉంటుంది. అది selective amnesia. కాబట్టి ఏ విషయాన్నైనా tunnel visionతో వాదిస్తారు.

  ఉదాహరణకు ఒకాయన పన్నెండు వందల సంవత్సరాల నుండి మన దేశంలో ఉన్న మన మైనారిటీ సోదరులని ఎలా వేరు చేసి చూడగలుగుతాం అని ప్రశ్నిస్తాడు. వాళ్ళు భారతీయులు కారా అని ఎంతో ఆవేదనగా అడుగుతాడు. ఆ “భారతీయులే” 1940s లో రక్త పాతం ద్వారా పాకిస్తాన్
  సాధించుకున్నారని వారికి గుర్తు రాదు. Selective amnesia.

  ఇంకొకాయన holistic solutions కావాలి అని ఒక వైపు అంటూనే కాశ్మీర్‌కి స్వాతంత్ర్యం ఇస్తేనో, లేదా కాశ్మీర్‌ని పాకిస్తాన్‌కి ఇచ్చేస్తేనో (రెండూ ఒకటేననుకోండీ), ఉగ్రవాదం సమసి పోతుందేమో అని ఆశాభావం వ్యక్తం చేస్తాడు. అదొక్కటే మన దేశంలో ఉగ్రవాద సమస్య అయినట్టూ, కాశ్మీరు సమస్యకీ వాటికీ సంబంధం లేనట్టూ. ఇది ఎలాంటి holistic solution? పదం మాత్రం వినడానికి ఘనంగా ఉందనుకోండీ. ఇది ఒక రకమైన selective amnesiaనే.

  ఇక్కడ కావల్సింది నిజాయితీ. ఎంతమందిని మెప్పించేలా రాస్తున్నాం అని కాదు. కావలసింది రక రకాల దృష్టి కోణాల్లోంచి ఒక సమస్యని చూసి “అర్థం చేసుకుటూ” ఉండడం కాదు. చేయాల్సింది action. కర్మ. స్వామి వివేకానందుడు అన్నట్టు “ఊరికే భగవద్గీత చదువుతూ కూర్చోవడం కంటే, ఒక గంట ఫుట్‌బాల్ ఆడడం మంచిది.” లేకపోతే analysis paralysis తప్ప ఇంకేం మిగలదు.

  -మురళి

 8. శివ says:

  “ఊరికే భగవద్గీత చదువుతూ కూర్చోవడం కంటే, ఒక గంట ఫుట్‌బాల్ ఆడడం మంచిది.” లేకపోతే analysis paralysis తప్ప ఇంకేం మిగలదు.

  well said.

 9. Bharat says:

  ప్రపంచంలో ఏ మేధావీ ఏమీ చేయలేనంత శక్తివంతమైంది ఇస్లాం. ఏదైనా ‘అద్భుతం’ జరిగితే తప్ప దీన్ని ఆపడం ఈ యుగంలో ఎవరికీ సాధ్యం కాదు. ప్రపంచంలో ఎవరూ మిగలకుండా అందరూ ముస్లింలుగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. దేహానికి కాన్సర్, ఈ ప్రపంచానికి ఇస్లాం ఒకటే. తేడా ఏంటంటే, కాన్సర్ భయంకర వ్యాధి అని తెలుసు అంతే.

  సూడో సెక్యులర్ మందబుద్దులూ, ప్రతీకారం తీర్చుకోవాలనే ఆవేశ పరులూ దానికి సహాయం చేస్తున్నావారే. అదెలాగా? …ఆలోచించండి…

 10. Murali says:

  భరత్ గారూ,

  A truly chilling statement. అలా అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నిజమే. అధమాతి అధమం ఒక మహా యుద్ధం అవుతుంది త్వరలోనే. అందులో మిగతా ప్రపంచం గెలుస్తుంది అని ఆశిద్దాం.

  -మురళి

 11. @మురళీ: మీ దగ్గర అభిప్రాయాలెక్కువా దానికి సంబంధించిన వివరాలు తక్కువా ఉన్నాయి. You have far more opinion than facts. అలాంటప్పుడు మీ అభిప్రాయాల్ని ఖండించడమో లేక నా అభిప్రాయాలు చెప్పడమో చెయ్యాలి. దానివల్ల మీరు మారే అవకాశం లేదు, నేనూ మారను.ఈ కారణంగా కేవలం ఒక వివాదం జరుగుతుందేతప్ప సంవాదానికి అవకాశం లేదు.

  కాశ్మీర్ సమస్య కాకుండా మనదేశంలోవున్న ఉగ్రవాదం గురించీ నేను రాసాను. కాబట్టి అది మాత్రమే ఉగ్రదాదమనే అపోహ నాకు లేదు.నా వ్యాసంలో వేర్పాటువాదాన్ని అణచివెయ్యడానికి మనదేశం అవలంభించే విధానాన్నికూడా చెప్పాను.ఆ సామ,దాన, భేద,దండోపాయాలు కాశ్మీర్ విషయంలో విఫలమయ్యాయి కాబట్టే ఒక alternate plan కావాలని suggest చేసింది.కనీసం పూర్తి వ్యాసాన్నికూడా చదవకుండా, మీ ధృక్కోణానికి ప్రతికూలంగా ఉన్న కొన్ని భాగాలను ఎంచుకుని పదేపదే వాటిని ఉటంకించిమరీ తిమ్మినిబొమ్మిని చేసే ప్రయత్నం నిజంగా అవసరమా?

  ఇక ‘అర్థం చేసుకుంటూ’ ఉండటం మాని action కోసం పిలుపునిస్తున్నారు.మీరు ఏవిధంగా దేశాన్ని ఉద్దరించే పని చేస్తున్నారో నాకు తెలియదుకానీ, I am a practicing ‘Development professional’. చాలా మంది ప్రీచర్స్ కన్నా నా జీవితంలో direct action ఎక్కువుంది.కాబట్టి,ఆవేశాల్ని రెచ్చగొట్టడానికో లేక ఉద్దేశపూర్వకంగా కొన్ని alternate ideologies ని ఎత్తిపొడవటానికో మీ సమయాన్ని కేటాయించే బదులు you swing in to direct action and find out reality.

  మీరన్న selective amnesia నాబోటివాళ్ళకుంటే,నిస్సందేహంగా selective memory మాత్రమే మీకుందని నిరూపించారు. మీకు నా అభినందనలు.

  Further,ప్రపంచ ముస్లింల సమస్యకూ, భారతీయ ముస్లింల సమస్యకూ చాలా తేడాలున్నాయి. ఆ తేడాలను గుర్తించకుండా అమెరికాలాగానో లేక ఇజ్రాయిల్ లాగానో మీరు చెప్పినట్లు మనం ప్రవర్తిస్తే,మనకు మిగిలేది సంవత్సరాల తరబడి చెయ్యాల్సిన ‘చీకటి యుద్దం’, క్షణక్షణం భయంభయం.Holistic solution ని మీరు ఎద్దేవాచేసినా, మనకు కావాల్నింది అదే.

 12. Murali says:

  @మహేష్:

  నా దగ్గర అభిప్రాయాలు ఎక్కువా, వివరాలు తక్కువా అన్నారు. మీరు ఏం వివరాలు చూపించారు మీ టపాలో? మీవీ అభిప్రాయాలే. Of course, దేవన హరి ప్రసాద్ రెడ్డి గారు ఎన్నో వివరాలు అందిస్తే మీరు “మంచి సమాచారం” అని మెచ్చుకుని వదిలేశారు. Any way, some things are beyond stastics. ప్రతి సారి ఫ్రెష్‌గా ఇస్లాం ఉగ్రవాదాన్ని ప్రేరేపించే మతం అని ప్రూవ్ చేయక్కర్లేదు.

  మాస్టారూ, నేను మీ పూర్తి వ్యాసం చదివాను. ఆ ఉత్తేజం(?)తోనే “షాక్మీర్ ఇచ్చేస్తే పోలా!” రాసింది. కాని ఆ టపా అంతా మీ టపాలో ఏం చెప్పారో దాని గురించి మాత్రమే కాదు. మీలానే ఇంకొంతమంది కూడా రెగులర్‌గా కాశ్మీర్ ఇచ్చేద్దాం అంటూంటారు. ఈ టపా వాళ్ళందరి గురించి కూడా.

  Let’s not get into the “who’s more active” discussion here. You have no clue about what I do or don’t do. Also, my post is not about who preaches and who practices. When I said action, I meant acting on the problem rather than pontificating about it, as you seem to do most of the time.

  ఉదాహరణకి మీ వ్యాఖ్యలు ఇలా ఉంటాయి. “అది పెద్ద తప్పు కావచ్చు, కాని అప్పటికి అలా అనిపించలేదేమో!” లేదా “సమస్య ఇంత సింపుల్ ఐతే బాగుండేది.” వగైరా వగైరా. ప్రతి సమస్యకి ఒక గొప్ప holistic solution ఉంటుంది అన్నట్టు మీ ధోరణి ఉంటుంది కాబట్టే, ఆ పదాన్ని ఎద్దేవా చేయడం జరిగింది. ఇక ముందు కూడా చేస్తాను. 🙂

  -మురళి

  (మీరన్నట్టు మనం ఇద్దరం మారం. కాని మీరు, or anybody else for that matter, “ఈ కాశ్మీరం నాకొద్దు” లాంటి టపాలు రాస్తే, నేను ప్రతి సారీ “షాక్మీర్ ఇచ్చేస్తే పోలా!” లాంటి ప్రతి టపా రాస్తూనే ఉంటాను. మీ గురించి కాదు సుమా! మీ టపా చదివిన వారి కోసం!)

 13. బాగా రాశారు. కాశ్మీర్ ఇచ్చేస్తేనే సమస్య తీరిపోతుందనుకోవడం తెలివితక్కువతనమే అవుతుంది.

  మన స్థలంలో ఎవడయినా గుడిసె వేసి జులుం చేస్తే వాడిని అదిరించో బెదిరించో పంపుతామా వాడికి ఆ స్థలాన్నప్పగించి చేతులు ముడుచుకు కూర్చుంటామా ?
  మరి ఆ విషయంలో ఉన్న “స్వార్థం” ?? దేశం దగ్గరకొచ్చినప్పుడు మారిపోతుందెందుకో ?

  మీ శైలి అదుర్స్. 🙂

 14. ‘Dust off’ Kashmir from the body of Bharat. China builds a road for its army with that dust to invade India.

 15. KASmIr ni dhULi anukuni dulipEstE A dhULi tO cInI bhAyi dAricEsukuni damDetti vastADamDI

 16. Pingback: పొద్దు » Blog Archive » ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం

 17. Kiran says:

  This blog is nice. మురళి గారు keep it up.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s