నిన్నలా మొన్నలా లేదురా…

“నా ప్రేమను నికృష్టంగా, నా ప్రేమను అతి కష్టంగా, నా ప్రేమను ముదనష్టంగా, చెలియా ఫీల్ మై లవ్,” హుషారుగా పాడుకుంటున్నాడు ఆనంద్. ఆ ఉత్సాహానికి కారణం ఉంది. అతను కాసేపట్లో తన గర్ల్‌ఫ్రెండ్ రాధని కలవబోతున్నాడు.

పది మైళ్ళ అవతల రాధ కూడా అంతే ఉత్సాహంగా, “మందంగా లేనా, అసలేం లావు లేనా, నీ వెయిటు సైజూ కాననా?” అంటూ పాడుకుంటూంది. ఆమె కూడా వాళ్ళిద్దరి ఇళ్ళకు సమానమైన దూరంలో ఉన్న పార్క్‌లో జరగబోయే వాళ్ళ మీటింగ్ కి తయారవుతుంది.

“ఈ రోజు విషయం నాన్చకుండా రాధకు చెప్పేయాలి. ఆ తరువాత ఇక ఏ బాధా ఉండదు,” అనుకున్నాడు తనలో తాను ఆనంద్.

“ఇప్పటివరకూ మా మధ్య కమ్యూనికేషన్ గాప్ లేదు. ఈ రోజు కూడా అలానే ఉండేలా చూడు స్వామీ,” దేవుడిని మనసులోనే మొక్కుకుంది రాధ.

సరిగ్గా అనుకున్న సమయానికి ఇద్దరూ పార్క్ చేరుకున్నారు. ఒకరినొకరు చూసీ చూడగానే, “నీకో విషయం చెప్పాలి!” అన్నారు ఇద్దరూ ఒకే టైంలో. వెంటనే గట్టిగా నవ్వుకున్నారు. “మీ ఇంటికి చుట్టాలొస్తారు,” మళ్ళీ ఒకేసారి అన్నారు ఇద్దరూ. మళ్ళీ పెద్దగా నవ్వుకున్నారు. అక్కడే వాకింగ్‌కి వచ్చిన ఒక వృద్ధ జంట వీరిని చూసి ముచ్చటగా తల ఊచారు.

“సరే, ముందు నువ్వు చెప్పు రాధా!” అన్నాడు ఆనంద్. పైకి అతని గొంతు సంతోషంగానే ఉన్నా, ఎక్కడో విషాద ఛాయలు ఉన్నట్టు అనిపించింది రాధకి.

“ఎలా చెప్పాలో తెలీడం లేదు ఆనంద్…” ఆగిపోయింది రాధ. ఫరవాలేదు చెప్పూ అన్నట్టుగా చెయ్యి ఊపాడు ఆనంద్.

“రెండేళ్ళనుంచి మనం ఒకరికొకరు తెలుసు. ముందు స్నేహితులుగా ఉన్నాం. తరువాత ప్రేమికులుగా మారాం. ఐతే ఎప్పుడూ నేను ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు,” బరువుగా అంది రాధ.

ఆనంద్ ఏమీ మాట్లాడలేదు.

“నిన్న మా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. వస్తున్న అన్ని సంబంధాలను తిప్పి కొడుతున్నాను అని నాన్నగారు పెద్ద గొడవ చేశారు. మొన్న వచ్చిన సంబంధం తప్పనిసరిగా చేసుకోవాల్సిందే అని పట్టు పట్టారు. అప్పుడు నీ గురించి చెప్పాను. అంతే అగ్గి మీద గుగ్గిలమైపోయారు ఆయన. తన ఇష్టానికి వ్యతిరేకంగా చేస్తే ఆత్మ హత్య చేసుకుంటానని బెదిరించారు. నేను ఓడిపోయాను ఆనంద్. నాకు మా వాళ్ళని ఇంత కష్టపెట్టి మనిద్దరం మాత్రం సుఖపడాలని లేదు. అందుకే నన్ను మరిచిపొమ్మని చెప్పడానికే ఈ రోజు ఇక్కడకు వచ్చాను,” వణుకుతున్న గొంతుతో అంది రాధ.

“ఎంత మాటన్నావు రాధా! ఈ రెండు ఏళ్ళు మనం కన్న కలలన్నీ మరిచిపోయావా?” ఆవేదన ధ్వనించింది ఆనంద్ గొంతులో.

“రెండేళ్ళ కింద మనం జస్ట్ కలిసాం ఆనంద్. కలలు కనడం మొదలు పెట్టింది, ఆరు నెలల కింద మాత్రమే,” సరి చేసింది రాధ.

“ఏదో ఒకటి. అవన్నీ మర్చిపోయావా ఐతే? విడిపోవడానికే నిర్ణయించుకున్నావా?” బాధగా అన్నాడు ఆనంద్.

కళ్ళు దించుకుని తల ఊపింది రాధ. చాలా సేపు మౌనంగా ఉండిపోయాడు ఆనంద్.

“సరే రాధా! నీకిష్టం లేనప్పుడు నేను మాత్రం చేయగలిగింది ఏముంటుంది? అలాగే కానీ. నిన్ను మర్చిపోవడం అంత సులభం కాదు. ఐనా ప్రయత్నిస్తాను,” ఇక మాట్లాడేదేమీ లేదన్నట్టుగా లేచి నిలబడ్దాడు ఆనంద్.

“ఆనంద్…” ఏడుపు గొంతుతో అంది రాధ. కానీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అతను.

***

“హమ్మయ్యా, అనుకున్నదానికంటే సులభంగా అయిపోయింది పని. ఆ అమెరికా సంబంధం వచ్చినప్పటినుంచి ఇతగాడిని ఎలా వదిలించుకోవాలా అని ఎంతో టెన్షన్ పడ్డా. ఇప్పుడు నా దారి క్లియర్. పాపం చాలా బాధగా వెళ్ళిపోయాడు, ప్చ్. కాలం అన్ని గాయాలని మారుస్తుందంటారు. త్వరలో కోలుకుంటాడులే,” ఇంటికి వెళ్తున్న రాధ ఆలోచనలు ఇవి.

“ఎన్నో డైలాగులు ప్రాక్టీసు చేసి వచ్చా. ఒక్క దాని అవసరం కూడా లేకపోయింది. తనే విడిపోదామని చెప్పి నా ప్రాబ్లెం సాల్వ్ చేసింది. కొత్త ప్రదేశానికి ఉద్యోగానికి వెళ్తూ, అక్కడ హాయిగా ఎంజాయ్ చేయకుండా ఈ లంపటమేంట్రా అనుకున్నా. చాలా సింపుల్‌గా పరిష్కారమయిపోయింది,” ఇది పబ్‌కి వెళ్తున్న ఆనంద్ మనోగతం.

ఎక్కడో దూరం నుంచి, “నిన్నలా మొన్నా లేదురా, ఇవాళ కాలమే మారిపోయిందిరా,” అన్న పాట వినిపిస్తూంది.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

11 Responses to నిన్నలా మొన్నలా లేదురా…

 1. krantigayam says:

  మీ టపాలో మొదటి లైన్ చదివగానే నేను పగలబడి నవ్వాను.చాలా బాగుందండి.

 2. ఉపేంద్ర says:

  మురళిగారు,
  టపా.. టప టపా. చాన్నాళ్ళకు సామాజిక రాజకీయ సమస్యల్ని వెనుక బెంచికి పంపించి మాంచి హాస్యానికి ముందు బెంచి ఇచ్చారు. మీరు మరీ మన సినిమావాళ్ళ మీద శీతకన్నేశారు ఈమధ్య.

 3. Murali says:

  ఉపేంద్ర గారూ,

  మీరు ఒక వేళ చదివి ఉండకపోతే, ళ తెచ్చిన తంటా చదవండి. అది కూడా మన సినీ లోకానికి సంబంధించిందే.

  -మురళి

 4. రవి says:

  ఈ యేడాది నేను చదివిన బెస్ట్ టపాల్లో ఇదే మొదటిది. సూపర్. చించేసావు బ్రదరూ!

 5. మొదటి లైను అదరహో

 6. నిజమే, కాలం మారింది మైనరూ అని పాడుకోవాల్సిందే.

 7. ramesh says:

  it is a good topic.

 8. Hari krishna says:

  Hi i am new to this website after reading this i become fan of this blog super adurs.

  keep going,
  Varma.

 9. Sujatha says:

  Muraligaru,super…first line chadavagane navvaleka chachananukondi.Today only Iam reading and visiting ur blog……but superb…I like ur way of expressions very much.

 10. srikanth says:

  kekkaa pettisthunnave

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s