అధోగతి రాయ్ – షాక్మీర్ సమస్య


జంబూ ద్వీపంలో అధోగతి రాయ్ అనే ఒక రచయిత్రి ఉండేది. ఆవిడ రాసిన ఒకానొక పుస్తకానికి ప్రతిష్టాత్మకమైన Booker prize వచ్చింది. చిన్న వయసులోనే ఎంతో కీర్తి వచ్చి పడింది. దాంతో ఆవిడ గాడి తప్పింది. 1998లో జంబూ ద్వీప ప్రభుత్వం అణు బాంబుల పరీక్ష చేసినప్పుడు, ఈవిడ గారు, “ఒక వేళ అణు యుద్ధం జరిగితే మనమంతా ఎంత దరిద్రంగా చస్తామో మీకు తెలుసా?” అని ఒక పెద్ద వ్యాసం రాసింది.

అందులో జంబూ ద్వీపం చేసినట్టు పీకిస్తాన్ కూడా అణు పరీక్షలు చేసి, ఒక వేళ యుద్ధం సంభవిస్తే ఎంత జన నష్టం వాటిల్లుతుందో రిటైల్డ్‌గా డిటైల్డ్‌గా రాసింది. అలాంటి స్థితి తీసుకొచ్చిన జంబూ ద్వీప ప్రభుత్వాన్ని తూర్పార బట్టింది.

దీనితో సూడో సెక్యూలరిస్టులూ, ఎర్ర మేధావులూ ఆమెని నెత్తిన పెట్టుకున్నారు. “మెజారిటీలను విమర్శిస్తున్నంత వరకూ ఏ రాయ్ ఐతేనేం!” అన్న ప్రాతిపదిక మీద ఆమెకి కూడా మేధావి బిరుదు అంటగట్టారు.

దీంతో అధోగతి రాయ్ తాను నిజంగానే ఒక మేధావిని అని నమ్మడం మొదలెట్టింది. దాని తరువాత జంబూ ద్వీపానికి సంబంధించిన ప్రతి సమస్యలోనూ తగుదునమ్మా అని తల దూర్చడం మొదలు పెట్టింది. డ్యాం ఎందుకు కట్టకూడదు నుంచి, గ్లోబలైజేషన్ ఎందుకు తప్పు నుంచి అన్నిటి మీద అనర్గళంగా తన అభిప్రాయాలు తెలియ పరిచేసింది. మిగతా మేధావులనుంచి వచ్చిన పాజిటివ్ రెస్పాన్సు చూసి ఇంకా రెచ్చిపోయింది.

కాని ఆమె మేధాశక్తికి (పిచ్చికి?) పరాకాష్ట షాక్మీర్ సమస్య దగ్గర చేరుకుంది. అధోగతి రాయ్ షాక్మీర్ లోయలో వేర్పాటు వాదుల సమావేశానికి వెళ్ళి వాళ్ళ నినాదాలు విని బోలెడు ఇంప్రెస్ అయ్యింది. వెంటనే ఢిల్లీకి వచ్చి ప్రెస్ కాన్‌ఫరెన్స్ ఇచ్చింది.

పనికొచ్చే న్యూస్ కంటే సెన్సేషనల్ న్యూస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే జంబూ ద్వీపపు జర్నలిస్టులు ప్యాంట్లు మోకాళ్ళ దాక మడత పెట్టుకుని లగ్గెత్తుకుని వచ్చేశారు.

“ఈ రోజు నాకొక గొప్ప నిజం తెలిసింది. షాక్మీర్‌కి మనమెంత అనవసరమో, షాక్మీర్ కూడా మనకు అంతే అనవసరం,” డిక్లేర్ చేసింది అధోగతి రాయ్.

“అది ఎలా తెలిసింది మీకు?” ప్రశ్నించారు విలేఖరులు.

“షాక్మీర్ లోయకి వెళ్ళండి. మీకే తెలుస్తుంది. వాళ్ళు వద్దు మొర్రో అంటూంటే వాళ్ళని పట్టుకుని వేళ్ళాడడం ఎంత నామోషీ మనకు?” ఎదురు ప్రశ్నించిది రాయ్.

“వాళ్ళని పట్టుకుని ఎవరు వేళ్ళాడుతున్నారు? ఆ భూభాగం జంబూ ద్వీపానిది. దాన్ని పట్టుకుని వేళ్ళాడుతున్నాం. కావాలంటే వాళ్ళు పీకిస్తాన్‌కి దయ చేయవచ్చు,” అన్నాడు మేధా శక్తి తక్కువగా ఉన్న ఒక కుర్ర జర్నలిస్టు.

“నువ్వు S.R.R. కి సంబంధించిన మనిషిలా ఉన్నావు. ఏ భూభాగం ఎవరిదో నిర్ణయించడానికి మనం ఎవరమయ్యా? ఎవరికి ఇష్టం లేకపోతే వాళ్ళు విడిపోవచ్చు. మళ్ళీ వాళ్ళే తిరిగి వస్తే వాళ్ళని కలుపుకుందాం. అది మన దొడ్డ మనసుని తెలియజేస్తుంది,” విశాలంగా నవ్వుతూ అంది అధోగతి రాయ్.

“మళ్ళీ వాళ్ళు విడిపోతామంటే, ఇచ్చేయ్యాలా?” వొళ్ళు మండి అడిగాడు కుర్ర జర్నలిస్టు.

“ఇచ్చేయాలి, ఇచ్చేయాలి,” అంది రాయ్.

“మరీ పామూల్యాండో?” ఇంకో విలేఖరి అడిగాడు.

“ఇచ్చేయాలి, ఇచ్చేయాలి,” అంది రాయ్.

“నైచా మన కరుణాచల్ ప్రదేశ్ వాళ్ళదే అంటూంది?” ఇంకొకరి ప్రశ్న.

“ఇచ్చేయాలి, ఇచ్చేయాలి,” అంది రాయ్.

సడన్‌గా కుర్ర జర్నలిస్ట్ సెల్ ఫోన్ మోగింది. అతను కాసేపు మాట్లాడాక, అధోగతి రాయ్ వైపు తిరిగి, “మేడం. మీరు పంచమర్హీలో కట్టుకున్న బంగళా యొక్క ల్యాండ్ గిరిజనులు వాళ్ళది అని అడిగారు కాబట్టి అక్కడి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేసిందంట!” అన్నాడు.

“ఇచ్చేయాలి, ఇచ్చేయాలి,” అంది రాయ్. విషయం పూర్తిగా అర్థం కాగానే, “అలా ఎవరు అడిగితే వాళ్ళకు ఇచ్చేయ్యడమేనా! ఇప్పుడే పంచమర్హికి వెళ్ళి ధర్నా చేస్తాను,” అంటూ ప్రెస్ కాన్‌ఫరెన్స్ మధ్యలోనే వదిలేసి అక్కడినుండి హడావుడిగా పరిగెట్టింది.

Bungalow blow to Arundhati

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

28 Responses to అధోగతి రాయ్ – షాక్మీర్ సమస్య

 1. chilamakuru vijayamohan says:

  చాలా బాగుంది.సూడో సెక్యులరిస్టులకు తగిలిస్తూనే వుండండి చురకలు అయినా వాళ్ళ చర్మం మందం లెండి.

 2. independent says:

  బాబోయ్..మీరు కొన్ని అదరగొడుతున్నారండీ. నేను మీ బ్లాగు ఎప్పుడూ చూడలేదు..మొన్న మీరు కమ్యూనిజం గురించి రాసేంతవరకూ.
  నేను గత కొద్ది కాలంగా ఈ అరుంధతి రాయ్ నీ, ఆమె మాటల్ని, ఇంటర్వ్యూలని చూసి, ఈమె అతి చేస్తుందిరా బాబూ అని అనుకున్నా. అపుడెప్పుడో ఆమె “గాడెస్స్ అఫ్ స్మాల్ థింగ్స్” చదివి ఇంప్రెస్స్ అయ్యా..కాని మీరన్నట్లు “కొంచెం” ఎక్కుద్దనుకుంటా వీళ్ళందరకీ. ఈమె anti-american-rhetoric చూడాలి, అందులో ఏ మాత్రం లాజిక్ ఉండదు.

  Keep Going..

 3. independent says:

  “మెజారిటీలను విమర్శిస్తున్నంత వరకూ ఏ రాయ్ ఐతేనేం!” Awesome..ఇది నేను రెండో సారి చదివినప్పుడు కాని ఎక్కలా. 🙂 wonderful

 4. krantigayam says:

  చాలా బాగుందండి.

 5. Vamsi says:

  naako chinna doubt…
  kasmeer samsyanu oka nimisham pakkana petti…naa chinna doubtni therchandi…
  china tibet akramana paina mee stand enti….

  –Vamsi

 6. 🙂 అన్నీ సరిగ్గా రాసి చంపమర్హి ఒక్కటి తిరగరాసారు!

 7. Murali says:

  Vamsi,

  Keeping aside the complex relationship Tibet had with China, Tibet has been an independent country for a little more than 100 years before People’s Rebulic of China invaded and occupied it 1950. What’s my stand on that? That it’s illegal and immoral. What do most countries think privately about this? That this is preposterous. But “realpolitik” stops them from expressing those opinions.

  By the way, China calls Arunachal Pradesh as “South Tibet” and claims it as its own. As if “North Tibet” belonged to it in the first place…

  -Murali

 8. “దానితో ఆవిడ గాడి తప్పింది” దాదాపు అందరూ ఇదే రకంగా ఫీలవుతున్న సంగతి అధోగతి రాయ్ పట్టించుకున్నట్టు లేదు.
  “మెజారిటీలను విమర్శిస్తున్నంతవర్కు ఏ రాయ్ ఐతే ఏం” సూపర్!

  మేథా శక్తి తక్కువగా ఉన్న కుర్ర జర్నలిస్ట్ వేసిన ప్రశ్న నచ్చింది.!

 9. Vamsi says:

  ippudu meeru chesina pai commentni okka saari choosi tibet samasyani pakkana petti:D… ….kashmir samasyani gurinchi alochinchandi…:)

 10. Murali says:

  వంశీ,

  మీరు ఆ ప్రశ్న వేసినప్పుడే, నాకర్థమయ్యింది మీరు ఎందుకు వేశారో. కానీ చైనా టిబెట్‌ని ఆక్రమించడానికి, Instrument of accession ద్వారా భారతదేశంలో విలీనం కావడానికి తీర్మానించుకున్న కాశ్మీర్‌కి పోలికే లేదు. టిబెట్ ఎప్పుడూ చైనాలో భాగం కాదు. కాశ్మీర్ ఎప్పుడు భారత దేశం నుంచి వేరు కాదు.

  మీ లాజిక్ ప్రకారం 1947 లొ 600 రాజ సంస్థానాలు 600 దేశాలుగా తయారయ్యి ఉండాలి. అదే మీ అభిప్రాయం ఐతే ఇంక మనం మాట్లాడుకోవడానికి ఏం లేదు.

  -మురళి

 11. Vamsi says:

  Please just go through my previous comments. I never made any arguments if you can see.. All I did was, just posted some of my doubts…. spare my ignorance:D…

  Let me tell you first of all…
  I dont support ajaadi for kashmir (as they call it)..at the same time i am not against it…of course if you care to know…

  But just a few snippets to ponder over…
  if you think ‘Instrument of accession’ is the basis… what about junagadh? (dont bring plebiscite here..even if you do..i am sure you will help urselves…)…
  As you said(‘Keeping aside the complex relationship Tibet had with China’)…what abt ‘india-kasmir’ relationship? do you think is it(kashmir-india ) as simple as distinguishing black and white…

  “charitra tappidaalanu” bharisthoo ayinaa vellali… leka vaatine edirinchi tiraga raase dhairyamainaa vundaali… kaani vaatini dAchadaaniki prayatninchinanni rojulu ilane vuntundi…

  finally these are some topics which we can keep opposing or supporting. but eod we should admit that solutions for this problems are not as simple as people think… perhaps its because we made those problems too complex to understand or too obvious to see at all..

  This would be my last comment here.. actually never wanted to indulge at all(as i mentioned in my blog already..) but could not help it…

  just meere okka saari alochinchu kovalsindigaa manavi….
  who are the stakeholders (kashmir issue)? past and presnt and consequences…
  ikkada meeru gurtupettukovalsindi enti ante meeru….nenu…akariki arundhati roy or adhogati roy evaroo stakeholders kaademo….. nenu kooda stakeholder ani vaadinchaali anukunte nenu emi cheyyalenu….
  but please ponder over…

  — Vamsi

  P.S: I really love reading your posts… I don’t have anything against you personally. I hope you take this comment in good spirit

 12. ravi says:

  aaviDa pEru vinaDam tappinci, aame gurinci naaku teliyadu. ippuDE mee Tapaa dvaaraa telisindi.

 13. తెలుగు అభిమాని says:

  పిచ్చి ప్రేలాపనకు మంచి వాతలే పెట్టారు. very nice.

 14. వికటకవి says:

  అధోగతి రాయ్ పేరు అదిరింది, సరైన పేరు ఆవిడకి.

 15. Kiran says:

  ఏమిటి మనకి కాశ్మీర్ భూమిపై ఉన్న హక్కు ? అక్కడే పుట్టి, బ్రతుకుతున్న కాశ్మీరీలకంటే ఎక్కువ హక్కు ఉందా మనకి ? వాళ్ళకి కావలసింది ఏమిటొ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అక్కడికి సైనికులని పంపి, కర్ఫ్యూలని పెట్టి, వాళ్ళ ముక్కు పిండి మనం ఏమి సాధించాలి ? ఇదా మన భారత ప్రజాస్వామ్యం ?

  అరవై ఏళ్ళుగా సగం భూమి భారత్ లో సగం భూమి పాకిస్తానులో వుండి కుటుంబాలు చెల్లాచెదురయ్యి వాళ్ళు ఏడుస్తుంటే ఎప్పుడు పట్టించుకున్నాం మనం ?

  సొంత గొప్ప చెప్పుకోవడం తప్ప అసలు కాశ్మీరులో ఒక్కసారైనా నికార్సైన ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసామా ?

  ఇప్పుడు అక్కడ టీవీ చానెళ్ళు బందు చేసారు. రేపు ఇంటర్నెట్టు బందు చేస్తారు. ఎవ్వరికి కావాలి కాశ్మీరీల గోడు ?

  మన తప్పుని మర్యాదగా ఒప్పుకుని, సరిచేసుకుందామని ఒక మేధావి వ్యాసం వ్రాస్తే, ఆవిడకి అధోగతి రాయ్ అని పేరుపెట్టి సంబరపడిపోవడమేనా మీ తెలివి ?

  మన భారతదేశం ఒక సంధి దశలో ఉంది. మన భవిష్యత్తు రక్షించుకోవాలంటే మనం కొంత తెలివిగా ఆలోచించి మార్గాలు వెతుక్కోవాలి.

 16. Murali says:

  మిత్రులారా,

  కిరణ్ అడిగిన ప్రశ్నలకు మీలో ఎవరన్నా సమాధానం చెప్పగలరా? 🙂 ప్రతి సారీ నేను చెయ్యి చేసుకుంటే బాగుండదేమో అని మొహమాట పడింగ్స్.

  -మురళి

 17. కిరణ్,

  మీ వ్యాసం చదివా. ఓకే. వర్తమానం తప్ప మిగతావన్నీ విడిచి కొత్త జీవితం మొదలుపెడదాం అన్నారు బాగుంది. ఆ మొదలు ఏకంగా అటానమీతో మొదలు పెట్టెయ్యటమే? మీరన్న ప్రకారం నేనసలు గతం జోలికే పోను. భారత్, పాకిస్తాన్ మధ్యన భారత్ ప్రమేయం లేకుండా కాశ్మీర్ మనుగడ ఎలా సాగిస్తుందనుకుంటున్నారు? దీనిక్కూడా గతంతో పనిలేకుండా ఇప్పట్నించేమవుతుందో చూద్దాం అంటారా? లేదు, దీనికి మాత్రం ఒక్కసారి “కార్గిల్” తప్పక తలుచుకోవాలి. భారత్ ఒక్క సరిహద్దు భద్రత తప్ప మరే విషయములోనూ కాశ్మీర్ విషయంలో తలదూర్చద్దు అంటారా, ఆచరణలో అదెంత సాధ్యమో నాకు తెలియదు. కాశ్మీర్ ప్రజలు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారన్న మీ ఆవేదన అర్ధమయింది, కానీ ఉన్నపళంగా అటానమీ దానికి పరిష్కారం కాదు. సియాచిన్లో 24*7 మంచులో కాపలాలు కాసే ఆనందం ఎవరు కోరుకుంటారు? ఇప్పుడు కొద్దిగా నయం, కొన్న్ణ్ణేళ్ళ క్రితం రోజూ సైనికులు కూడా రెగ్యులర్గా చనిపోతూనే ఉండేవారు కదా. ఆ కష్టం మాత్రం ఎవరు కోరుకుంటారు? అసలు మీరు ముందుగా మీరు ఖచ్చితంగా చెప్పలేను అని చెబుతున్న ఆ స్వేచ్చ ఏమిటో చెప్పండి? సొంత కాశ్మీర్ దేశమా? ఒకటే సమస్య అప్పుడు. పాకిస్తాన్ తో మన సరిహద్దు మనకి మరింత ముందుకు జరగటం ఖాయం.

  చివరగా, బాధాకర విషయమే అయినా, కాశ్మీర్ సమస్య తీరటం అన్నది కాశ్మీరీల చేతిలో కన్నా భారత, పాకిస్తాన్ చేతుల్లో ఎక్కువున్నది అన్నది నిర్వివాదాంశం. అయితే దీనికి పరిష్కారంగా మీరు భారత్ ఒక్కటే సీన్ లోంచి తప్పుకుంటే తీరిపోతుంది అనుకోవటం పొరపాటు. ఇందుకు “కార్గిల్” కన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు.

  ఓ పులిట్జర్ ప్రైజు వస్తే, దేశ రాజ్యాంగానికి,దేశానికి వ్యతిరేకంగా మాట్లాడెయ్యటమేనా? “అజాదీ” అంటే సరిపోయిందా, ఇక్కడ మా కే.సీ.ఆర్ అంటున్నాడు ఆజాదీ అని. ఆ మాటల్తో సమస్య తగ్గించుతోందా లేక భారతంలో తాను జీవిస్తూ భారత్ మీదే తిరగబడమని చెబుతోందా? ఆవిడకే తెలియాలి.

 18. Murali says:

  వికట కవి గారూ,

  థాంక్స్! కాని కిరణ్ అధోగతి రాయ్‌ని ఒక మేధావి కింద పరిగణిస్తున్నారు. నా టపాలో ఆవిడ పాత్ర ఏ పలుకులు పలికిందో, “ఏ భూభాగం ఎవరిదో డిసైడ్ చేయడానికి మనమెవరమయ్యా?”, అవే చిలుక పలుకులు ఈయన కూడా వల్లె వేస్తున్నారు. ఆయన మాటల్లో “ఏమిటి మనకి కాశ్మీర్ భూమిపై ఉన్న హక్కు ?” అని ఆవేదన వెళ్ళగక్కారు. ఆయనకు నా టపా ఎలా నచ్చుతుంది? 😉

  ఇక కాశ్మీరీలు పడే బాధ అంటారా? (సబ్సిడీల వల్ల తేరగా వచ్చిన తిండి) తిన్నది అరక్క, ఉగ్రవాదులని ప్రోత్సహిస్తే, మరి కష్టాలు రాకుండా ఉంటాయా? ఏ రాష్ట్రానికి లేని స్వయం ప్రతిపత్తి, బడ్జెట్ ఉండి కూడా ఏడ్చేవాళ్ళను ఎవరూ సంతోష పరచలేరు. ఒకటే మార్గం. ఆర్టికల్ 370 ఎత్తేసి, మిగతా భారతీయులని కూడా అక్కడ నివసించేందుకు వీలు పరచడమే.

  కిరణ్ వాస్తవానికి ఎంత దగ్గరలో ఉన్నారో, కలల్లో ఎంత దూరం వెళ్ళిపోయారో తెలుసుకోవాలంటే ఆయన మాటల్లోనే ఆయన రాసిన “తెలివైన ఆలోచన్లు” చదవండి.

  -మురళి

 19. సవరణ: పులిట్జర్ బదులు బుకర్ గా చదువుకోగలరు.

 20. వసుధైవ కుటుంబకం అనే మన “పరమసత్యానికి” ‘కాశ్మీర్ మనది’ అనే ఈ నిత్యసత్యం చుక్కెదురేమో! మన వైదాంతిక ఆదర్శానికీ,రాజకీయ ఆదర్శానికీ ఆమాత్రం తేడావుండాలి.అదే “అర్థసత్యం”. రెండువైపులా తక్కెడ సమానంగావున్నప్పుడు సత్యం మధ్యలోనే వుంటుంది. ఎటువైపూ వెళ్ళదు.

  కొందరు మేధావులు (?) “గోడలు/హద్దులు లేని మానవప్రపంచాన్ని” ఆకాంక్షిస్తారు. అంతమాత్రానా మనకు తెలిసిన చిన్నప్రపంచాన్ని మనం త్యజించనఖ్ఖరలేదు, వార్ని ఎద్దేవా చెయ్యనూ అఖ్ఖరలేదనుకుంటాను.

 21. kiran says:

  అరుంధతి రాయ్ అంటే నాకు చాలా గౌరవం. ఆవిడ అభిప్రాయాలన్ని నాకు నచ్చకపోవచ్చు. కానీ, ఆవిడ చెప్పే మాటల వెనక కొంత నిజం ఉంది (అది అమెరికా సార్వభౌమత్వ రాజకీయాలవ్వచ్చు, నర్మదా బచావో ఆందోళన కావచ్చు).

  కాశ్మీరుతో భారతదేశానికి ఎంత సంబంధం ఉందో, మనకి పాకీస్తానుతోనూ అంతే సంబంధం ఉంది. ఎక్కడ గిరి గీయలం మనం ? కాశ్మీరు రాష్ట్రంలో అడ్డదిడ్డంగా ఉన్న “లైన్ ఆఫ్ కంట్రోలు” ని సరిహద్దుగా ఎంతకాలం ఉంచగలం ?

  ప్రతి మనిషికి ఏమికావాలో అతడే నిర్ణయించుకోవాలి, ఇదే ఆధునిక ప్రజాస్వామ్యం. ఎవ్వరో ఢిల్లీలో కూర్చుని శ్రీనగర్లో కర్ఫ్యూ పెట్టాలని చూడడం ఏమిటి ? అటానమీ అనేది అత్యవసరం. ఇది ఒక మానవ హక్కు. మన భారతదేశం చైనా లాగ ఉక్కు పిడికిలితో పాలన చెయ్యలేదు. దీనిని గుర్తించకపోతే మన దేశ అస్థిత్వానికే ప్రమాదం.

  మన భారతదేశంలో అధికార వికేంద్రీకరణ జరగాలి. ఇది ఒక్క కాశ్మీరుకే పరిమితం కాదు. భవిష్యత్తులో ఇలాంటి ఆందోళనలు అన్నిచోట్లా జరుగుతాయి. గుజరాత్లోని నరేంద్ర మోడీయే తనకి అటానమీ కావాలని అడుగుతున్నాడు. అస్సాం, నాగాలాండ్ : అన్నిచోట్లా వికేంద్రీకరణపై కోరికలున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ కే వికేంద్రీకరణపై ఆశలున్నాయి.

  ఎవ్వరివి తెలివైన ఆలోచనలో భవిష్యత్తు నిర్ణయిస్తుంది.

  నా ఆశ మన భారత ఉపఖండం మొత్తం యూరోపియన్ యూనియన్ వలే ఒక కరెన్సీ, ఒక పార్లమెంటు, ఒక కోర్టు తో పౌరులు వీసా అవసరాలు లేకుండా ఒక ప్రదేశం నుండీ మరో ప్రదేశానికి వెల్లగలిగేటట్లు ఉండాలి. ఇది మన ప్రస్తుత భారత సరిహద్దులకి మాత్రమే కాదు. అటు బంగ్లాదేశుకి, ఇటు పాకీస్తానుకి మనదేశంతో కాశ్మీరుకి, కన్యాకుమారికి ఎంత సంబంధాలు ఉన్నాయో, అంతే ఉన్నాయి.

 22. Murali says:

  కిరణ్,

  తెలివైన ఆలోచనలు అన్న మాట నేను అనలేదు. మీరే చెప్పుకున్నారు. (మీ మొదటి క్యామెంట్‌లో ఆఖరి లైన్ చదవండి.) మీరనే వికేంద్రీకరణ రావాలంటే, ముందు కావల్సింది దానికి సరయిన వాతావరణం. అది శాంతి లేకుండా అసంభవం. కాబట్టి నేను ప్రస్తుతం శాంతికి ప్రతికూలమైన ఉగ్రవాదం గురించే మాట్లాడుతాను.

  మహేష్: మీ మొదటి ప్యారాగ్రాఫ్ అర్థం కాలేదు. కావడానికి రాసినట్టు కూడా లేదు. మీరూ బాగానే ఎద్దేవా చేశారు “చిన్ని ప్రపంచం” అంటూ. ఐతే మీరు మేధావి కాబట్టి కొంత సోఫిస్టికేటెడ్‌గా చేశారు. అంతే తేడా. 😉

  -మురళి

 23. Kiran says:

  మీరు చెప్పే శాంతి తేవాలంటే సైనిక చర్యల ద్వారాను, కర్ఫ్యూల ద్వారాను తేలేము. పదేళ్ళు ఎటువంటి గొడవా లేకుండా ప్రశాంతంగా ఉంది కాశ్మీరు లోయ, అప్పుడు ఏమన్నా చేశామా ? లేదు, కుక్కిన పేనులా పడి ఉంటారులే అని పట్టించుకోలేదు.

  ఇలాంటి దాటివేత వైఖరినే 60 ఏళ్ళు ఉపయోగించాము. ఇది ఫలితాలు ఇవ్వదు. ధైర్యంగా అధికార వికేంద్రీకరణపై చర్చించాలి; ఇది తెలివైన ఆలోచన అని చెప్పడానికి నేనేమీ సిగ్గుపడట్లేదు. నా ఇంగ్లీషు బ్లాగుపై వ్రాసిన టపాని తిరిగి మొత్తం తెలుగులోకి అనువదించడానికి సమయం లేక లింకు ఇచ్చాను. వీలైతే ఆ బ్లాగులోనే వివరంగా మీ కామెంట్లు వ్రాయండి.

  బరువు మోయలేక తెగిపడే దారంలా తయారైంది కాశ్మీరు పరిస్థితి. ఇలాంటి సున్నితమైన సమస్యని నేర్పుగా చక్కదిద్దకుండా ఇంకా సైన్యం, కర్ఫ్యూలు, ఎంకౌంటర్లు చేస్తే మరి దారం తెగదా ? కాశ్మీరులో పరిస్థితి చేయిదాటిపోతే మొత్తం దేశం అదుపు తప్పుతుంది. ఇది అందరికీ తెలుసు. భారతదేశమంతా హిందువులు, ముస్లింల మధ్య ఊచకోత జరుగుతుంది. ఇప్పటికే ఒరిస్సాలో హిందువులు, క్రైస్తవులు మారణకాండ జరుగుతోంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా పరిష్కరించాలి కాశ్మీరు సమస్యని.

 24. nomi says:

  @కిరణ్ ,
  “నా ఆశ మన భారత ఉపఖండం మొత్తం యూరోపియన్ యూనియన్ వలే ఒక కరెన్సీ, ఒక పార్లమెంటు, ఒక కోర్టు తో పౌరులు వీసా అవసరాలు లేకుండా ఒక ప్రదేశం నుండీ మరో ప్రదేశానికి వెల్లగలిగేటట్లు ఉండాలి.”
  ఇది జరిగితే ఖచ్ఛితంగా తీవ్రవాదులకు మరింతగా లాభం తప్పితే మనకొచ్చే ఉపయోగం పెద్దగా లేదనుకుంటాను.

 25. bharat says:

  అసలే పిరికి సన్నాసిని. ఇంట్లోవారిపై అంతెత్తు ఎగరగలను గాని బయటి వారిని, అందులో ఇంటినే శత్రువులుగా చూసే రాక్షసుల్ని విమర్షించగలనా?…

  అందులో మంద బుధ్ధి… తెలివైన మాటలు గాని బాగుపడే ఆలోచనలు ఎలా చేయగల్ను?

  మరి ఇలాంటి పిరికితనంతో, మంద బుధ్ధితో, బయట ధైర్యవంతుడిగా, మేధావిగా గుర్తింపు రావాలంటే? … ఎలా ?

  ఇంటివారిని, కన్న తల్లినే విమర్శిస్తే ?!… ఇంట్లో వారు గాని, కన్న తల్లి గాని నన్ను చంపలేరుగా. మహా అంటే ‘సూడో సెక్యులరిస్టో’ మరేదో అంటారు అదేదో తిట్టైనట్టూ…( నాకైతే అదో గొప్ప గౌరవంగానే వినిపిస్తుంది ) … పైగా … బయట బోల్డు గుర్తింపు!!!

  -భరత్

 26. Sreenivas Paidi says:

  అధోగతి రాయ్ కోసం మెంటల్ హాస్పెటల్ లో మంచం రెడీ గా ఉన్న విషయం ఆవిడ గారికి తెలిసినట్టు లేదు. ఆవిడ అభిమానులయినా తీసుకెళితే సరి.

 27. Sastry says:

  Hi Srinivas,

  Papam Picchi Aaasa meedi. Mental hospital lo seat ready ga vunna vaaallaki fance vuntey vaallu marintha mental gaallu ayi vuntaaru. Manamey yedo okati cheyaali.

  Hello Murali.

  Meerannadi correct. subisidy meeda vachhindai aragaka cheysey tappulaku ksahmapana vundadu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s