అంతు లేని కథ

ఆఫీసులో గడియారం 6 గంటలు చూపిస్తూంది. ఇంటికి వెళ్ళే టైం ఐనా సుబ్బారావుకి కదలాలని లేదు. భయం! విపరీతమైన భయం! అతనికి ధైర్యం కూడగట్టుకోవడానికి ఇంకో నాలుగు గంటలు ఐనా పడుతుంది. దాదాపు పదిన్నరకి ఇంటికి చేరుకుంటాడు అతను రోజూ. ఇంట్లో అందరూ రక రకాలుగా చెప్పి చూసి విసిగిపోయారు. ముందు కోప్పడ్డారు. తరువాత అలిగారు. నచ్చ చెప్పి చూశారు. కాని సుబ్బారావుని మార్చలేకపోయారు.

“అలా అని తాను మారడానికి ప్రయత్నించలేదు అని కూడా కాదు,” తనలో తాను అనుకున్నాడు సుబ్బారావు. ఎంతో కష్టపడ్డాడు. కాని ఒక ఐదు నిముషాల కంటె ఎక్కువ తట్టుకోలేక పోయేవాడు. ముచ్చెమటలు పోసేవి. గొంతులో తడి ఆరి పోయేది. తనకు తెలీకుండానే ఇంటినుంచి బయటపడే వాడు. చిత్రమేమిటంటే అతనింట్లో మిగతా వాళ్ళకు ఈ సమస్యే లేదు. వాళ్ళంతా హాయిగా ఉండేవాళ్ళు. ఒక్క సుబ్బారావుకే ఈ బాధంతా! ఈ పోరు పడలేకే అతను రాత్రి ఇంటికి లేటుగా వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు.

సుబ్బారావు ఆఫీసులో ప్యూన్ వచ్చి చిన్నగా దగ్గాడు. ఏంటన్నట్టు చూశాడు సుబ్బారావు. “అందరూ వెళ్ళిపోయారు సార్! మీరు ఉంటున్నారా? నన్ను వెయిట్ చేయమంటారా?” అడిగాడు అతను. సుబ్బారావుకి అతన్ని చూసి జాలి వేసింది. “లేదులే నేను కూడా బయలుదేరుతున్నాను. నువ్వు తాళం వేసుకో,” అని ఆఫీసు నుంచి బయట పడ్డాడు.

ఇప్పుడు ఒక మూడు గంటలన్నా కాలక్షేపం చేయాలి. ఏం చేస్తే బాగుంటుంది ఆలోచించాడు సుబ్బారావు. అటూ ఇటూ చూస్తున్న అతనికి ఎవరో దూరం నుంచి చేయి ఊపుతూ కనిపించారు. అది అతని ఫ్రెండ్ రాజేష్. “ఏంటి గురూ? ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్నావా?” చనువుగా అడిగాడు.

“నీకెలా తెలుసు?” ఆశ్చర్యంగా చూశాడు సుబ్బారావు.

“నాదీ నీ ప్రాబ్లమే,” అప్పటి వరకూ నవ్వుతున్న రాజేష్ సీరియస్‌గా మారిపోయాడు.

“నాకు ప్రాబ్లెం ఉందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?” బింకంగా అన్నాడు సుబ్బారావు.

“ఊరుకో గురూ, మీ వీధిలోనే ఉంటాను. నువ్వు ఎందుకు లేటుగా వస్తున్నావో ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఐతే నువ్వు చుట్టు పక్కల వాళ్ళని పట్టించుకోవు. నేను కుంటాను. అంతే తేడా,” అన్నాడు రాజేష్.

ఇక బుకాయించి లాభం లేదు అని అర్థమైపోయింది సుబ్బారావుకి. అతని కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. “ఛ ఛ ఊరుకో! ఏంటిది చిన్న పిల్లాడిలా!” సముదాయించాడు అతన్ని రాజేష్. ఆ మాత్రం ఓదార్పుకే ఎంతో స్వాంతన కలిగింది సుబ్బారావుకి. “నాకు మాత్రం ఇంటికి తొందరగా వెళ్ళాలని ఉండదా?” ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు.

“కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు సుబ్బారావు. నువ్వేం ఫీల్ కాకు. పద, టూ టౌన్‌లో ఏదో కొత్త రెస్టారెంట్ తెరిచారట. వెళ్ళొద్దాం,” అన్నాడు రాజేష్.

“మరి పది వరకు ఉండచ్చా అక్కడే?” ప్రశ్నించాడు సుబ్బారావు. “భేషుగ్గా ఉండచ్చు. పద పద,” సుబ్బారావుని వెంటపెట్టుని అక్కడి నుంచి కదిలాడు రాజేష్.

***

యదావిధిగా రాత్రి పదిన్నరకు ఇల్లు చేరుకున్నాడు సుబ్బారావు. తల్లి తండ్రులు అతని వైపు ఛీత్కారంగా చూశారు. భార్య మొహంలో ఒక రకమైన నిర్లిప్తత. అవన్నీ పట్టించుకోకుండా ఉండడానికి ట్రై చేస్తూ, పడక గది వైపు వడివడిగా నడిచాడు అతను. “వడ్డిస్తాను పదండి,” అన్న భార్య పిలుపుకు సమాధానంగా, “బయట తిన్నాలే,” అంటూ పక్క మీద వాలిపోయాడు, “హమ్మయ్యా ఇంకో రోజు గడిచింది,” అని గొణుక్కుంటూ.

***

ఇంతకీ సుబ్బారావు అంత భయపడేది దేనికనుకున్నారు? కేబుల్ టీవీలో ఉన్న అనేక చానెల్స్‌లో వచ్చే రక రకాల సీరియల్స్‌కి! సంవత్సరాల తరబడి సాగుతున్న ‘ఛీ యాక్ థూ స్రవంతీ’, ‘పక్షవాతం’, ‘బండమావులూ’, వంటి సీరియల్స్‌కి. వాటిని రోజూ చూసి భరించే శక్తి అతని చిన్ని గుండెకి లేదు…

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

14 Responses to అంతు లేని కథ

 1. ట్విస్టు ఎండింగును ముందే ఊహించా 🙂

 2. cbrao says:

  కేబుల్ టీవీ ఇష్టం లేక పోతే, తన గదిలో,ఒక మంచి పుస్తకం తో లేక చక్కటి సంగీతం తో కాలక్షేపం చెయ్యవచ్చు కదా? రోజూ ఇంటికి ఆలస్యంగా వెళ్లి, ఇలా కాలాన్ని వృధా చెయ్యటమేమిటి? బాగా లేదు.

 3. సీ గాన పెసూనాంబ says:

  cbrao గారు, ఈ కథలో నాకు తెలిసి హాస్యం అందుకే పండింది, ఇంటికి వెళ్ళాలంటేనే విరక్తి వచ్చేంత చెత్త గా ఈ టీవీ సీరియల్స్ ఉంటున్నాయని, ఇందులో హాస్యం. ఇది వివరించటం నాకే బాగా లేదు. ఈ కథ లో లాజిక్ కోసం వెతికితే, ఇందులో హాస్యపు కోణం దెబ్బ తినటం , ఖాయం.

  ఈ కథని నేను బాగా relate చేసుకోగలను, ఎందుకంటే , నేను చదువుకునే రోజుల్లో, డాబా పైన కూర్చుని చదువుకునే దాన్ని, ఇంట్లో టీవీ హోరు పడలేక.

  డాబా పైన కూర్చున్న, పక్కింట్లో నుంచో, లేక మా ఇంట్లో నుంచే గట్టిగా వినిపించేవి ఇవే సీరియల్స్. ఇంట్లో ఏ గది లో కుర్చున్నా, పెద్ద తేడా ఉండదు. ఏ హాల్ లోనో టీవీ ఉంటుంది కాబట్టి, అన్ని గదుల్లో ప్రతిధ్వనిస్తుంటుంది.

 4. సీ గాన పెసూనాంబ says:

  ఇంతకీ cbrao గారి విశ్లేషణ చూసి, అసలు సంగతి మర్చేపోయాను. మురళి గారు, మీ హాస్య కథ, భలే బాగుంది. ఎప్పటి నుంచో జీడి పాకం లా సాగే మన టీవీ సీరియల్స్ మీద చక్కని వ్యంగ్యం ఇది. 🙂

 5. Murali says:

  నవీన్ గారూ,

  అందుకోండి నా అభినందనలు!

  -మురళి

 6. gangabhavani says:

  మీ కధ చదివాక నాకో సంఘటన గుర్తుకు వచ్చింది. మాకు ఇంగ్లీషులో “రిపోర్టు రైటింగ్” ఉండేది. ఒకమ్మాయి పరీక్షలో న్యూస్ రిపోర్టు రాస్తూ దూరదర్షన్ చూడలేక ఆత్మహత్య చేసుకునే ఒకమ్మాయి గురించి రాసింది.

 7. Falling Angel says:

  హ్హి హ్హి హ్హి

 8. Pingback: సీ గాన పెసూనాంబ « Paradarsi పారదర్శి

 9. Karthik says:

  Murali garu chala bagundandi ee katha meru chivrlo ichina twist inka chala bagundi.
  anthuleni katha ani title pettaru kani vallavi anthuleni badalandi…….

  chala chala bagundandi……..

 10. Sujatha says:

  Muraligaru joharlandi…..what a wonderful name u r giving fr TV serials,chee yak thu sravanthi,pakshavatham and bandamavul………super very nice names and super settair sir.

 11. Kitta says:

  Super sir. Chalbagundi…. same nenu aa typea inti ki tonadaraga vellanu . but naku inka pelli kaledu…. antey teda….idi jabbu matarma kadu bayam… e serails meda….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s