ఇప్పుడు ఏది దారి?

ప్రతి ఉగ్రవాద చర్య జరిగినప్పుడు మన దేశస్తులమంతా ఒకటి, రెండు వారాలు కోపంతో రగిలిపోవడమూ, ఆ తరువాత  అలాంటిదే ఇంకో సంఘటన జరిగే వరకు ఏమీ చేయకుండా, యధా విధిగా మన జీవితాలని గడిపేయడమూ, సాధారణమైపోయింది. ప్రతి సంఘటనకి విడి విడిగా నిరసన తెలపడం కంటే, ఇలాంటి వాటిని నిరోధించేందుకు ఒక జాతీయ ప్రణాలిక రూపొందించడం ముఖ్యం. 

ఎర్ర పార్టీలని, “మేధావులని,” కాసేపు పక్కన పెడదాం. మొదటి వర్గం ధ్యేయం భారత దేశంలోని మెజారిటీ మతాన్ని ఎలాగైన ధ్వంసం చేసి కార్ల్ మార్క్స్ రాజ్యాన్ని స్థాప్పించడమైతే, రెండో వర్గం వారు చప్పట్లకోసం, పనికి రాని అవార్డులకోసం, ఏం చేయడానికైనా వెనుకాడరు. రెండు వర్గాలూ, “అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం” పేరున, మన దేశాన్ని నయా పైసాకి కూడా అమ్మేయడానికి సిద్ధమే. వీళ్ళు మారరు.

మారాల్సింది, మార్పు తేవాల్సింది మనమే. అది ఎవరికి చేతనైన రీతిలో వారు చేయాల్సిన విషయం. ఐతే ప్రజలైనా, పార్టీలైనా, ప్రభుత్వమైనా పాటించాల్సిన మౌలిక ప్రమాణాలు కొన్ని ఉన్నాయి.

ఇవి మనకు ఎప్పుడూ లేవు అని కాదు. పూర్తిగా కొత్తవి అని కూడా కాదు. కాని వందల ఏళ్ళ బానిసత్వంలో ( ముందు ముస్లింల చేతిలో, తరువాత బ్రిటీష్ వాళ్ళ చేతిలో) ఉన్నాక, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి కమ్యూనిస్టులు చేసిన అబద్ధపు ప్రచారం (చరిత్ర గురించి కానివ్వండి, కరెంట్ ఎఫైర్స్ గురించీ కానివ్వండి) విన్నాక, మనం ఈ విలువలని మళ్ళీ ఒక సారి నిర్ధారించుకోవల్సిన అవసరం ఉంది.

1) ప్రాణం విలువైనదే, కానీ దానికి ఆత్మ గౌరవం తోడైనప్పుడే ఆ విలువ వచ్చేది.

అన్ని రకాల అవమానాలనీ దిగమింగుకుని, ఎప్పుడూ బెదిరిపోతూ కాపాడుకునే ప్రాణం విలువ అంత ఎక్కువేం కాదు.  ఉదాహరణకు జంతువులు కూడా కొన్ని సార్లు చావు తథ్యమని తెలిసినా, తమ పిల్లల్ని కాపాడుకోవడానికి సిద్ధ పడతాయి. ఎందుకంటే తమ పిల్లల్ని రక్షించుకోలేక పోతే అవి తమ బతుకు నిరర్థకం అని భావిస్తాయి.

ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నది అవి తాము ఏది విలువయ్యింది అని భావిస్తాయో వాటి గురించి నిస్సంకోచంగా పోరాడతాయని. మనకు సంబంధించింత వరకు ఈ విలువలు పిల్లలైనా కావచ్చు, స్వేచ్చైనా కావచ్చు,ఇంకేదైనా కావచ్చు. కాని మనం ఇది తప్పని సరిగా నేర్చుకోవాల్సిన విషయం.

నా అర్థం ప్రతి చిన్న ఎత్తి పొడుపుకీ, అవమానానికీ, అన్యాయానికీ, ఆత్మాహుతి చేసుకోమని కాదు. నేను చెప్పేది కొన్ని సార్లు మన విలువలని రక్షించుకోవడానికి మన ప్రాణాలు సైతం ఫణంగా పెట్ట వలసి వస్తుందని.

2) అహింస అన్ని వేళలా పనికి రాదు.

గాంధీ గారు మనకు అహింస ద్వారా స్వాంతంత్ర్యం తెచ్చారు, తద్వారా హింస తప్పనీ, కాబట్టి వీధిలో కత్తి చూపెట్టి బెదిరించి దోచుకునే ఆకు రౌడీదీ, సరిహద్దుల్లో చలికి గజ గజ వణికిపోతూ కాపల కాసే సైనికుడిదీ, ఇద్దరిదీ హింసే, రెండిటికి తేడా లేదు, అని వాదించే pacifists భారత దేశానికి చాలా హాని చేశారు.

ఒక వేళ మనకు స్వాతంత్ర్యం అహింస వల్లే వచ్చింది అనుకున్నా, పిడుగుకి బియ్యానికి ఒకటే మంత్రం ఎప్పటికీ పని చేయదు. అవసరాన్ని బట్టి సామ దాన భేద దండోపాయాలని మార్చి మార్చి ప్రయోగించాల్సి వస్తుంది. కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు చెప్పినట్టు ఒకోసారి “అనివార్యం యుద్ధం, శరసంధానమే ధర్మం.” దీని అర్థం ముస్లింల మల్లే ప్రతి చిన్న మాటకు కత్తులు దూయడం కాదు. సిక్కుల మల్లే, అవసరమైనపుడు కత్తి దూయడానికి వెనుకాడకపోవడం.

3) సోషలిజం/కమ్యూనిజం/సబ్సిడీలు/రిజర్వేషన్లు పని చేయవు.

కావల్సింది, కొందరిని కొల్ల గొట్టి అందరికీ పంచడం కాదు. అర్హత లేకుండా అందలమెక్కించడమూ కాదు. అందరికి అర్హతను సంపాదించుకోగలిగే వాతవరణాన్ని కలిగించడం. బలవంతుడు బలహీనుడిని అణిచి వేయనీయకుండా అరికట్టడం.

తాత్కాలికమైన సహాయం తాత్కాలికంగానే పని చేస్తుంది. కావల్సింది Long term solution. అందరూ చెప్పే, కాని పెద్దగా పాటించని, “ఆకలితో ఉన్న వాడికి చేపలు ఇవ్వకు. చేపలు పట్టడం నేర్పించు” పరిష్కారం. మళ్ళీ నేను చెబ్తూంది, నిర్ధాక్షిణ్యంగా, ఆకలితో చావబోతున్న వాడికి వల ఇవ్వమని కాదు. ముందు ఆకలి తీర్చు. కానీ అదే అలవాటు చేయకు. అలానే అందరినీ పోటీకి తయారు చెయ్యి. కానీ కొందరికోసం పోటీ రూల్స్ మార్చొద్దు.

4) కులం, మతం, డబ్బు, వంశం, ఆఖరికి ప్రతిభ కంటే కూడా సంస్కారానికి ఎక్కువ గౌరవం ఇవ్వాలి.

దీని అర్థం ప్రతిభని పక్కకి తోసేయమని కాదు. ఆత్మ గౌరవం లేకుంటే ప్రాణానికి ఎలా విలువ ఉండదో, సంస్కారం లేని ప్రతిభ కూడా పనికి రాదు.

కులాన్ని, మతాన్ని, వంశ గౌరవాన్ని, డబ్బుని ప్రాతిపదికగా పెట్టుకుని, ఉద్యోగులనీ, బిజినెస్స్ పార్ట్నర్స్‌ని, జీవిత భాగస్వాము(మిను)లని ఎంచుకుంటే తప్పని సరిగా కావలిసిన ఫలితాలను సాధించలేమని ఇప్పటికే ఋజువు అయ్యింది.

వీటన్నిటికంటే ప్రతిభ ప్రాతిపదిక మీద ఎంపిక చేయడం ఉత్తమం. కానీ, కొద్దిగా ప్రతిభ తక్కువ ఉన్నా, సంస్కారం ఎక్కువ ఉన్న వాళ్ళని ఎన్నుకోవడం ఉత్తమోత్తమం.

5) అభివృద్ధి సాధించాలంటే, అన్నిటికంటే ముఖ్యమైనది infrastructure, law and order మరియు free markets. మిగతావన్నీ కంటి తుడుపు కోసమే.

రోడ్లు, టెలికమ్యూనికేషన్స్, కరెంటూ దేశం నలుమూలలా లభ్యం కావాలి. ఎంత హై పొజిషన్‌లో ఉన్న వారైనా సరే, తప్పు చేస్తే శిక్షించే న్యాయ వ్యవస్థ కావాలి. ప్రభుత్వం regulation పూర్తిగా తగ్గాలి.

ప్రభుత్వం రైళ్ళు నడపక్కర్లేదు. కో-ఆపరేటివ్ బ్యాంకులు పెట్టక్కర్లేదు. ఉచిత మద్యాహ్న భోజన పథకాలు వద్దు, ఋణాల మాఫీలూ వద్దు. Infrastructure, Law & Order, Capitalist markets నిర్మిస్తే, ప్రగతి దానంతట అదే వస్తుంది.

భారతదేశం ఎంత తొందరగా ఈ పై ప్రమాణాలు అమలు చేస్తే అంత తొందరగా super power అవుతుంది. అన్ని రకాలుగా super power…

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

13 Responses to ఇప్పుడు ఏది దారి?

 1. sarath_s says:

  “కావల్సింది, కొందరిని కొల్ల గొట్టి అందరికీ పంచడం కాదు. అర్హత లేకుండా అందలమెక్కించడమూ కాదు. అందరికి అర్హతను సంపాదించుకోగలిగే వాతవరణాన్ని కలిగించడం. బలవంతుడు బలహీనుడిని అణిచి వేయనీయకుండా అరికట్టడం.”
  well said.

 2. Krishna says:

  మనం ఈ విలువలని మళ్ళీ ఒక సారి నిర్ధారించుకోవల్సిన అవసరం ఉంది. చాలా మంచి మాట. కాకపొతే, మన మీద మనకు నమ్మకం (మనం ఎవరికంటే తక్కువ కాదు అని, ప్రజాస్వామ్యం లో, ఒకరు ఏదయినా సాధించాలనుకొంటే, అది సాధించకలరు అన్న) లేని ప్రజలు (అందులో ముఖ్యంగా చదువుకున్న మే’థా’వులు) ఉన్నంత కాలం, మనం అవసరమయిన విలువలను నిర్ధారించుకోలేము ప్రజలుగా. ఎప్పుడు ప్రజలుగా మనం విలువల మీద నిలబడటం లేదో, మన నాయకులనుండి ఆ విలువలు ఆశించలేము. ఇప్పుడు జరుగుతుంది అదేను.

  ఇక మీరు ఆశిస్తున్న విలువలకు వస్తే, మీ ముడో point. ‘సోషలిజం/కమ్యూనిజం/సబ్సిడీలు/రిజర్వేషన్లు పని చేయవు’అన్న మాట.అవి long term పని చేయవు అన్నది చాలా మందికి తెలిసిన విషయమే.
  కాకపొతే ప్రస్తుతానికి అవి వాళ్లకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి, పైకి ఎన్ని కబుర్లు చెప్పినా, వాటిని సమర్ధించే మే’థా’వులు (సుడొ సెక్యులరిస్ట్ లు అనండి, ఎర్ర చొక్కాలు అన్నండి, పైకి ఎంకమ్మ కబుర్లు (sophisticated talk, సత్యం రెండూ ప్రక్కలా వుంటుంది అంటూ పాపం SIMI వాళ్ల ప్రక్కన వున్న సత్యం కోసం సత్యాన్వెషణ చేసె) చెప్పే వాళ్లు గట్రా), ప్రజలు, ఉన్నంత కాలం, విలువల గల సమాజాన్ని, దానిలో నుండి వచ్చే విలువల గల నాయకులను మనం ఆశించటం, అత్యాశేనేమో. నేను కొంచం నిరాశగా మాట్లాడుతున్నాను అనుకొంటే క్షమించండి.

 3. purushotham says:

  well said,
  I like your blog.

 4. chaitanya says:

  మారాల్సింది, మార్పు తేవాల్సింది మనమే. ,,ముందు ఆకలి తీర్చు. కానీ అదే అలవాటు చేయకు. super guruvu gaaru.adirindi

 5. మీరు లేవనెత్తిన ప్రతి అంశంలోనూ ప్రతిఫలిస్తున్న సందిగ్ధత ప్రస్తుత స్థితికి అద్దం పడుతోంది. There are no simple solutions.అందుకే ఒక agreed framework in the interest of national progress కావాలి. మనది ప్రజాస్వామ్యం కాబట్టి,అది రాజకీయనాయకులవల్లనే అవుతుంది.మనం కేవలం వారిపై వత్తిడి తీసుకొచ్చి ఆదిశగా ప్రయాణించడానికి వార్ని ప్రేరేపించగలం అంతే.

  అలా చెయ్యాలంటే పౌరులుగా మనలో కొన్ని మౌళికమైన మార్పులు రావాలి.అది ఒక్కరోజులో అయ్యేపనికాదు. కనీసం మరొ 20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి, ప్రస్తుతం ఉన్న బద్రతా అవసరాల ధృష్ట్యా మనం తీసుకునే జాగ్రత్తలు,విధానపర నిర్ణయాల గురించి సూచించగలిగితే చర్చ మరింత అర్థవంతంగా ఉంటుంది. You have only stated the obvious and suggested a basic change that is Utopian at the best.

 6. Murali says:

  @మహేష్:

  మీరు చెప్పింది నిజమే. ప్రస్తుతం మన సెక్యురిటీ పటిష్టంగా ఉండడానికి కావల్సిన జాగ్రత్తలు విధానాల గురించి నేను ఎక్కువగా మాట్లడలేదు.

  ఐతే, సెక్యూరిటి కోసం తీసుకోవల్సిన చర్యలు (వోటు రాజకీయాలు పక్కన పెట్టడం, ఉగ్ర వాదాన్ని ఎదుర్కోవడానికి కటినమైన/సమర్థవంతమైన చట్టాలు అమలు పర్చడం) ఎంతోమంది పేర్కొనడం జరిగింది.

  కాని అది జరగాలంటే ముందు కింది స్థాయి నుంచి మార్పులు రావాలి. పై స్థాయి నుంచి ప్రభుత్వం తన పని చేయాలి. వీటన్నిటికీ we need a system overhaul. అందుకే ఈ మౌలికమైన ప్రమాణాల గురించి రాయడం జరిగింది.

  నిజమే, నేను చెప్పింది బేసిక్ పాయింట్సే. కాని బేసిక్స్ నుచి తప్పు చేస్తున్నాం కనుకే మనకు ఈ గతి పట్టింది.

  By definition, utopian means the best (though impractical probably), so your phrase “utopian at best” doesn’t make any sense. Anyway, if we aim for Utopia, may be we will reach at least half the distance? Also, whether we establish Utopia or not, the basic means we adapt should be both morally correct and feasible. The government can never eliminate poverty, but it can certainly stick to these basics, and actually deliver on them, if the public insists on them. In that sesne, I don’t think these standards are impractical at all.

  -మురళి

 7. కమ్యునిస్టు ధృక్పధం ఉన్న వారు ఒకప్పుడు త్యాగశీలురై స్వాతంత్ర పోరాటంలో, నిజాంకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణ త్యాగాలు చేసారు. మిగతా పార్టీల వలె కాకుండా ప్రజలతో సరి సమానంగా నడిచి ఆదర్శమైన పనులు చేశారు.అది మనందరం గుర్తు పెట్టుకోవలసిన విషయం.

  ఇకపోతే ప్రతి దానికీ రాజకీయ నాయకులే పరిష్కారం కనుక్కోవడానికి అవకాశం రావడం ప్రమాదకరం, ఎందుకంటే మన రాజకీయాలకు అర్హతలు ఏమిటో అందరికీ తెలుసు కదా! రాజకీయ పరంగా ఇంకా మార్పులు రావలసింది ఉన్నది…

  4,5 పాయింట్లు నాకు బాగా నచ్చాయి.

 8. Murali says:

  నాగన్న గారూ,

  తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించినంత వరకు, కమ్యూనిస్టుల రోల్ ఒప్పుకుంటాను. ఐతే ఈ విషయం అప్పట్లో (అంటే, మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు) ఉన్న అందరు కమ్యూనిస్ట్‌లకి వర్తించదు. ఇక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, వాళ్ళలో వర్గ పోరాటం మీద ఉన్న మక్కువ తప్ప, దేశంపై అంకిత భావం పెద్దగా చూడలేదనుకోండి.

  Anyway, నేను ఇక్కడ చెప్పింది కమ్యూనిజం అనే రాజకీయ సిద్ధాంతం గురించి. అది మాత్రం ఎప్పటికీ పని చేయదు.

  మీకు 4,5 పాయింట్లు నచ్చాయి అన్నారు. మూడో పాయింట్‌కి, ఐదో పాయింట్‌కి, చాలా దగ్గర సంబంధం ఉంది మరి…

  -మురళి

 9. Karthik says:

  Materu baga chepparandi.

 10. sathish says:

  ippudu kalem vundi mana chethilo gurram matram pade gotuilo laga ayyindi master…………

 11. Satheesh says:

  బ్రదర్ ప్రతిఓక్కరు కమ్యూనిజాం మీద ఎందుకు పడతారో అర్దం కావడం లేదు….. ప్రపంచం మోత్తంలో కమ్యూనిస్ట్ పాలిత దేశాలను ఓక్కసారి గమనించండి రైటిస్ట్ పార్టీల కన్న లౌకిక పేరు జపించే అలౌకిక పార్టిలకన్న మంచి పాలనను ఇస్తున్నాయి… మనదెగ్గరున్నంత అవినీతి అక్కడలేదు…. చైనా ఎంత ప్రగతి పదంలో దూసుకు పోతుందో మనం చూడోచ్చు అఫ్ కోర్స్ కమ్యునిస్ట్ వ్యతిరేఖ విదానాలకు అక్కడ బీజాం పడిన అది తాత్కాలికమే సోషలిజాం అక్కడి అంతిమ లక్ష్యం…. ఇక అమోరికా దాడిలో నష్టపోయిన వియత్నం కమ్యూనిస్ట్ దేశం… అత్యంత తక్కువ సమయంలో అర్దిక పరిపుష్టిపోందింది అర్దికంగానే కాదు విద్యా వైద్యం రక్షణా కనీస ప్రజల మౌలిక అంశాలల్లో ముందుకు సాగుతుంది. ఇక ఉత్తరకోరియా, బోలివియా,వెనుజులా.పరాగ్వే,నికరగువ ఓక్కదేశం ఎంటి యావత్ ఉత్తరా మరియూ దక్షణ అమెరికా ఖండాలలో కేవలం కెనడా అమెరికా తప్ప అన్ని కమ్యూనిస్ట్ దేశాలే …. అక్కడ మనదెగ్గర వున్నంత దేశాబివ్రుద్దికి అనుకుల పరిస్తితులు వుండవు అయినప్పటికి అబివ్రుద్దిలో ముందుకు దూసుకుపోతున్నాయి… నేను పైన రాసిన దేశాలలో ఎవికూడా అవినీతిదేశాలు కావు అక్కడ అవనీతి కేసుల్లో శిక్షలు కటినంగా వుంటాయి. మనకు లాగా రూల్ బ్రేకర్స్ రూల్ మేకర్స్ గా వుండరు…… రాష్ట్రాన్నో దేశాన్నో ద్రుష్టిలో పెట్టుకోని మాట్లాడోద్దు ప్రజల్ని ప్రపంచాన్ని ద్రుష్టిలో పెట్టుకోండి… అయినా కులం మతం ప్రాంతం ముసుగులో దోచుకు తినే దోంగల్ని మీరు ప్రోత్సహిస్తారు కాని ప్రానాలను పనంగాపెట్లి అడవుల్లో పోరాటంచేసే వారిగురించి తప్పుడు రాతలు రాస్తారు…. ఎర్ర పార్టీలు దేశం కంటే వర్గం గురించే ఎక్కువ అలోచిస్తారన్నారు కదా అవును వర్గం అంటే అనగారినప్రజావర్గం ప్రజలు బాగుపడాలనే కోరుకుంటాం…. వారుబాగు పడితే దేశం బాగుపడినట్లేకదా…… మరి ఇంకేంకావాలి…….
  ఓక్కసారి అలోచించండి మిత్రులారా బిజేపి హిందు సపోర్ట్ కాంగ్రేస్ లౌకికం అనిచేప్పి ముస్లిం లకు క్రష్టియన్లకు పెద్దపీటవేసే పార్టి ఇక ప్రాంతియాపార్టిలన్ని ముస్లింల ఓట్లకోసం దేవులాడి వల్లపక్షన నిలుస్తాయి….. కాని కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరివైపు నిలువవు
  దేశంలో లక్షలకోట్ల కుంబకోనాలు చేశిన కమ్యూనిస్ట్ నాయకులను చూపించగలరా…. అ దమ్ముందా…… చూపించలేరు కమ్యూనిస్టేతర పర్టీలు చేసిన కుంభకోనాలగురించి చెప్పనవసరం లేదేమో…… ముందు మీరు మారండి తరువాత మరోకరికి హితభోదలు చేద్దురుగని

  • Murali says:

   > బ్రదర్ ప్రతిఓక్కరు కమ్యూనిజాం మీద ఎందుకు పడతారో అర్దం కావడం లేదు

   ఎందుకంటే, కమ్యూనిజం వద్దన్నా అందరి మీద పడుతుంది కాబట్టి. 🙂

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s