తొట్టి గ్యాంగ్

“మీ ముగ్గురిని మా ప్రోగ్రాంకి ఎందుకు పిలిచామో తెలుసా?” అడిగింది యాంకరమ్మ.

ఆ ముగ్గురూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. తరువాత కూడ బలుక్కున్నట్టు తల అడ్డంగా తిప్పారు. ప్రస్తుతం వాళ్ళు టీవీ999 చానెల్‌లో ప్రసారమయ్యే “మీకూ పని లేదు, మాకూ సిగ్గు లేదు” కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

“మీరు ముగ్గురూ మూడు పార్టీలకు చెందిన వారైనా, మీలో ఒక కామన్ ఫీచర్ ఉంది,” డ్రమాటిక్‌గా ఆగింది యాంకరమ్మ.

ఆ ముగ్గురూ ఉత్సాహంగా చూశారు.

“మీ ముగ్గురూ సినిమా నటులు. నటన వదిలేసి రాజకీయాల్లో చేరారు,” అంది యాంకరమ్మ.

“సినిమాల్లోంచి దాదాపు బయటకి గెంటాకే కద రాజకీయాల్లోకి వచ్చింది,” గొణిగాడు క్యామెరా మ్యాన్.

ఆ ముగ్గురికి సరిగ్గ వినపడలేదు కామోసు, ప్రశ్నార్థకంగా మొహం పెట్టారు.

“ఆయన్ని పట్టించుకోకండి. మా క్యామెరా మ్యాన్‌కి తనలో తాను మాట్లాడుకునే అలవాటు ఉంది. అది రికార్డ్ కాదు లెండి,” సర్ది చెప్పింది యాంకరమ్మ.

సరే అన్నట్టు తల పంకించారు ఆ ముగ్గురూ.

“మీ కామన్ ఫీచర్ ఏంటి అంటే, మీరు ముగ్గురూ ఒకే వ్యక్తిని నానా దుర్భాషలాడుతున్నారు. ముఖ్యంగా ఆయన ఎంతో హుందాగా ఉన్నా, మీ నీలాపనిందలకు స్పందించక పోయినా, రోజు రోజుకి రెచ్చి పోతున్నారు. దీన్ని చూసి మాకో చిలిపి ఆలోచన వచ్చింది,” గొంతు సవరించుకుంది యాంకరమ్మ.

“ఇప్పుడు నేను టైమర్ స్టార్ట్ చేస్తాను. సరిగ్గా ఒక నిముషం టైం ఇస్తాను. మీ ముందున్న మైకుల్లో మీరు ఆయన్ని తూలనాడాలి. మా దగ్గర సాఫ్ట్‌వేర్ మీరు ఒక్క నిముషంలో ఆయన్ని ఎన్ని శాపనార్థాలు పెడతారో కౌంట్ చేస్తుంది. ఎవరు ఎక్కువ తిట్లు తిడతారో వాళ్ళని విన్నర్‌గా నిర్ధారిస్తాం,” ముగించింది.

“అసలు పోటీ దేనికి?” ముక్త కంఠంతో అడిగారు ముగ్గురూ.

“మీలో ఎవరు ఎక్కువ నికృష్టులో తేల్చుకోలేక జనం జుత్తు పీక్కుంటున్నారు. ఈ పోటీ ద్వారా అది వాళ్ళకు తెలిసి వాళ్ళ మనసు కొంచెం చల్ల బడుతుంది,” ఎక్స్‌ప్లేన్ చేసింది యాంకరమ్మ.

ఆ ముగ్గురూ ఖంగు తిన్నారు.

ఇంతకీ ఆ ముగ్గురూ ఎవరనుకున్నారు?

గాంక్రెస్ పార్టీ నుంచి వాజశేఖర్, తెగులుదేశం నుంచి శ్రీమతి కూజా, తల్లి తోడు పార్టీ నుంచి విరగ శాంతి! ఇక వారు దుర్భాషలాడుతున్న వ్యక్తి గురించి చెప్పడం అనవసరం అనుకుంటాను?

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

20 Responses to తొట్టి గ్యాంగ్

 1. Pardhu says:

  బాగా చెప్పారు మాస్టారు.

 2. Motorolan says:

  మురళీగారు, రిచంజీవి కూడా అంతేకదండీ 🙂
  గెంటేసే పరిస్థితి వచ్చాకే కదా, రాజకీయాలు గుర్తొచ్చాయి.

  నాకు పాపం రిచంజీవి అభిమానుల్ని చూస్తే జాలేస్తోంది, ఇంతకుముందు తమహీరోమీద ఈగ వాలనిచ్చేవారుకాదు. రిచంజీవి సినిమాకెళ్ళి నచ్చకపోతే అక్కడ గట్టిగా చెప్పడానికి భయపడేవాళ్ళం, ఫాన్సెక్కడ కొడతారో అని.
  ఇప్పుడు ప్రతీ వెధవా తిడుతున్నాడు.

  I want to see the faces of some of my college-friends now 🙂

 3. jhansi says:

  excellent….

 4. రవి says:

  ముగ్గురి బూతులకీ ఆ సాఫ్ట్వేర్ క్రాష్ అయి ఉంటుంది.

 5. Phani says:

  హ్హ హ్హ! నా అంచనా ప్రకారం అయితే ముగ్గురికీ టై అవ్వాలి 🙂

 6. “మీకూ పని లేదు, మాకూ సిగ్గు లేదు” .. సూపర్ టైటిల్ 🙂

 7. sarath says:

  విరగ శాంతి, వాజశేఖర్, కూజా
  మీ పేర్లకు పారడీలు భలే ఉంటాయండీ. 🙂

 8. Murali says:

  Motorolan గారూ,

  ఎందుకైనా మంచిది! ఇప్పుడు ఇంక సేఫ్ కదా అని, చిరంజీవి ఫాన్స్ ఉన్న చోట నోరు పారేసుకోకండి, ఫ్రెండ్‌షిప్ కొద్దీ చెప్తున్నా 😉

  -మురళి

 9. ఎవరి బాధలు వారివి…పాపం.

 10. Motorolan says:

  మురళీగారు, కొంపతీసి మీరు ఫ్యానా??
  బాబూ, నాకేం తెలీదు, నేనిక్కడ ఏమీ వాగలేదు, ఎన్నికల తర్వాత కలుద్దాం!
  (ముఖ్యమంత్రిని విమర్శించడం ఈజీ, ప్రతిపక్షనాయకుణ్ణైతే మరీ వీజీ :P)

 11. Murali says:

  Motorolan గారూ,

  భలే నవ్వుకున్నా మీ సమాధానం చూసి. నేనేమి కరడు కట్టిన ఫ్యాన్‌ని కాదు కానీ, కానీ ఈ విషయంలో ఆ ముగ్గురూ పరమ బేవార్సుగా ప్రవర్తిస్తున్నారు. అందుకు రాశాను.

  ఇక మీకిచ్చిన సలహా నిజంగా ఫ్రెండ్‌షిప్ కొద్దే! అసలె చిరు ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నారు. మీరు అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని నా భావం.

  -మురళి

 12. newBlogger says:

  Motoroloan

  chiranjeevi aina ntr aina janalu gentese paristhithi vachina taravta ne vacharu……aa craze unte ne kadha vastaru lekha Tarak ratna, Tarun vastara politics loki..

  hehehehe

  This is my first blog ever

  Kind regards

 13. Karthik says:

  baga chepparandi.

 14. chaaaaaaaaaala bavundi…viragabadi..navvukunnam…

  really we’ve enjoyed alotttttttttttt.
  thanks for giving this wonderful blog…

  regards,
  pinky.

 15. sathish says:

  hai friend nijamaina hero ante evvadaithe jenaniki seva chesthado vade andi….murali garumeeru chiru pan na ayya babo nenu emi analedh naku emi theliyadandi………manalo mana mata chiru raju ntr lo evvaru nijamaina hero no…………

 16. Vamsi says:

  అది పరంజీవి అయినా లేక కోజా ,శాంతి, శేకర్ అయినా
  ఈ సినీరాజకీయ నాయకులతో ఒక చిక్కు వుందండీ…

  నటిస్తున్నారో…జీవిస్తున్నారో తెలుసుకోలేము….:(

  –వంశీ

 17. Sujatha says:

  really e blog chala bagundandi,naku chala nachindi,moreover nenu chiru fan,chiru khachithanga CM kavalani korukuntunnanu.I wish him all the success ayana ipudunna sahanam thone eppatiki evariki thalavanchaka,vimarsalaki atheethanga sagipovalani korukuntunnanu.Murali garu mee articles kuda chala bagunnayi.nenu meeku kuda fan ayipoyanante nammandi.

 18. ponnaganti says:

  Hai

  I seen add in the recent news paper. Today i saw above and with this.

  warm regards

 19. anon says:

  Goncress, tegulu deesam; mee paarady super. Goncress kanna dongrees antee baguntundeemo

 20. Jyothi Reddy says:

  Chala baga chepparu Murali ji. Chiranjeevini gelipinchadaniki try cheyyandi mari.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s