పాద యాత్ర

“డ్యాడీ,డ్యాడీ!”

సీరియస్‌గా పని చేసుకుంటున్న వై.నో. రాజశేఖర్ రెడ్ది తలెత్తి చూశాడు. ఎదురుగా పుత్ర రత్నం వై.నో. జగన్ నిలబడి ఉన్నాడు.

“ఏరా, ఇంకా పడుకోలేదా? అసలే ఈ మధ్య పేపర్ నడుపుతున్నావాయె! విశ్రాంతి చాలా అవసరం. మొదటి సారి మెదడుకు సంబంధించిన పని చేస్తున్నావు. చూసుకో మరి!”

“పోండి డ్యాడీ. పేపర్ నడపడమంత కష్టమేమీ కాదు. ఐనా మన పేపర్ రాగానే, మిగతా పేపర్లన్నీ దొబ్బేశాయి కద, నేను చెప్పినట్టే!”

“అంతే అంటావా? మరి కొంతమంది మనము తక్కువ ధరకు అమ్మడం వల్ల కొనుక్కుంటున్నారు. ఎందుకంటే పాత పేపర్లు అమ్ముకుంటే డబ్బు వస్తుంది అన్న ఒకే కారణం వల్ల, అని అంటున్నారే?”

“గిట్టని వాళ్ళ గురించి మీకు తెలీనిదేముంది డ్యాడీ. మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని విమర్శించే వాళ్ళని పట్టించుకున్నారా? నాకూ అన్నీ మీ పోలికలే.”

పుత్ర వాత్సల్యం ఉప్పొంగుతుండగా జగన్ వైపు అప్యాయంగ చూశాడు పెద్దాయన.

“నిజమే! నువ్వే నా పేరు నిలబెట్టాలి. ఇంతకి ఏంటి విశేషం. ఏం కావాలో అడుగు నాన్నా!”
 
“డ్యాడీ, మరి మీ పేరు నిలబెట్టాలి అంటే, మీలానే క్రియాశీలక రాజకీయాల్లో రావాలి. లేకపోతే పూర్తిగా నిలబెట్టలేను.”

ఆలోచనలో పడ్డాడు పెద్దాయన.

“ఆల్‌రెడీ నేను నీకు చాలా పవర్ ఇచ్చానని బయట వారే కాదు, మన పార్టీలోనే అనుకుంటున్నారు. ఇప్పుడు నేనే నిన్ను పార్టీలోకి తీసుకొస్తే ఆ అసమ్మతి వర్గం మరింత గొడవ చేస్తుంది. కాబట్టి ఒక పని చేద్దాం.”

వై.నో. జగన్ ఆసక్తిగా తండ్రి చెప్పేది వినసాగాడు.

***

“అది విషయం,” చెప్పి రిలాక్స్ అవుతూ వెనక్కి వాలాడు వై.నో. రాజశేఖర్ రెడ్డి.

వై.నో. జగన్ యువసేన అధ్యక్షుడు అర్థమైనట్టు తల పంకించాడు.

“అలాగే సార్, అలాగే చేద్దాం. జగన్ అన్న అంటే మాకు ప్రాణం. ఆయన కోసం ఏమైనా చేస్తాము. రేపే రాస్తా రోకో చేసి బస్సులు తగలబెట్టాలా? జగన్ అన్న క్రియాశీలక రాజకీయాల్లో రావాలి అంటూ నినాదాలు చేస్తూ బస్సులని క్రియాశీలకంగా తగలబెడతాం.”

వొళ్ళు మండింది వై.నో. రాజశేఖర్ రెడ్డికి.

“అంతేనా! ప్రతి దానికీ రాస్తా రోకోలు, బస్సులు తగలబెట్టడాలేనా! అరే! ఇది ఆనందకరమైన విషయం. దీన్ని వేరే రకంగా డీల్ చేయాలి. ఎలా అయ్యావో ఏంటో యువసేన నాయకుడిగా!”

“జగన్ అన్నకి ‘మన పేపర్ రాగానే మిగతా పేపర్లన్నీ దొబ్బేయాలి’ అన్న డయలాగ్ ఇచ్చింది నేనే సార్. అది బాగా నచ్చే అన్న నాకీ పోస్ట్ ఇచ్చాడు,” సిగ్గు పడుతూ అన్నాడు యువ సేనాని. 

“అనుకున్నా. అలాంటిదే ఏదో అయి ఉంటుందని. సరే విను. నువ్వూ, నీ గాంగ్ అంతా సిటీ చుట్టూ పాద యాత్రలు మొదలు పెట్టాలి. మీరు పాద యాత్ర చేసేది జగన్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానించడం కోసం.” 

“ఓలప్పో! పాద యాత్రా? నాకు పది అడుగులు వేస్తే ఆయాసం వస్తుంది సార్!” ఆందోళనగా అన్నాడు యువసేనాని.

“ఐతే వీల్‌చైర్‌లో కూర్చుని చెయ్యండి,” ముంచుకొస్తున్న కోపం అణుచుకుంటూ అన్నాడు వై.నో.

“ఇదేదో బానే ఉంది సార్. ఒక వంద వీల్‌చైర్‌లకు ఆర్డర్ ఇచ్చేస్తా,” ఉత్సాహంగా అన్నాడు యువ సేనాని.

“ఛీ, నోర్మూయి! చచ్చినట్టు అందరూ పాద యాత్ర చేయండి. మధ్య మధ్యలో నినాదాలు చేయండి. ఆ తరువాత నాకు వచ్చి ఒక వినతి పత్రం సమర్పించండి. అప్పుడు నేను గత్యంతరం లేదు కనుక, జగన్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానిస్తా,” ప్లాన్ మరోసారి చెప్పాడు వై.నో.

ఇక తప్పదన్నట్టు నీరసంగా అక్కడినుంచి బయలుదేరాడు యువ సేనాని. 

*****

“నేడు రాజకీయాల్లో ఒక వెలితి ఏర్పడింది. అదేంటో మీకూ తెలుసు. అది వై.నో. జగన్ గారు లేకపోవడం వల్ల వచ్చిన లోటు. అందుకే వై.నో రాజశేఖర్ రెడ్డి గారిని ఒక తండ్రిలా కాకుండా, గాంక్రెస్ నాయకుడిలా ఆలోచించి, వై.నో. జగన్‌ని రాజకీయాల్లోకి ఆహ్వానించాలి అని విజ్ఞప్తి చేశాం,” చెప్తున్నాడు టీవీ క్యామెరాల ముందు నిల్చుని, యువ సేనాని.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

14 Responses to పాద యాత్ర

 1. కాముధ says:

  ఇది తర తరలుగా గాంక్రెస్ లొ వస్తున్న అచారం / అనాచరం
  -కాముధ

 2. chavakiran says:

  🙂

 3. berry says:

  website inkaa koncham baagaane design cheste baaguntundi.Recent posts loa oke sentense break chesi kinda raayadam valla adi vere topic anukunnanu.vishaam inka clear gaa undalante changes cheyali

 4. జరుగుతున్న తంతేకదా! పెద్ద ఆశ్చర్యపడే పరిణామం అయితే కాదు. టపా బాగుంది.

 5. purushotham says:

  good

 6. Chaitu says:

  ఇందులో కొత్తేముంది చెప్పండి…వాళ్ళకి ఇది వెన్న తో పెట్టిన విద్య కదా… 🙂

 7. Ravi says:

  Very straight but not direct

 8. గాంక్రెస్ నిందా సైకోఫాంట్ లే కదా, ధర్నాలేమి ఖర్మ దొమ్మీలు మర్డర్లు కూడా చేస్తారు

 9. phani says:

  భలే రాశారు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s