“నాన్నో” కార్

వంగదేశం! బెంగాల్! రవీంద్రనాథ్ టాగూర్, సుభాష్ చంద్ర బోస్, స్వామి వివేకానందుడు వంటి మహనీయులని భారతదేశానికి ఇచ్చిన పుణ్యస్థలం.

1977లో ఎర్ర పార్టీలన్ని కలిసి పశ్చిమ బెంగాల్‌లో తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పటినుంచి హీరోయిన్‌ని వదలని విలన్‌లా, ఎర్ర పార్టీలు బెంగాల్‌ని వదల్లేదు. గిట్టని వాళ్ళు దానికి కారణం వాళ్ళు చేసే systematic rigging అని అన్నా, అసలు కారణం మితిమీరిన ప్రజాభిమానం అని ప్రతి కమ్యూనిస్ట్‌కి తెలుసు.

ఐతే, 30 ఏళ్ళ పాలన తరువాత, ప్రతి సంవత్సరం “ఏబ్రాసి రాష్ట్రం” అన్న బిరుదు తెచ్చుకుని తెచ్చుకుని విసుగెత్తి, ఎర్ర పార్టీలు బెంగాల్ ఇమేజ్ ఎలాగయినా మార్చాలని నిశ్చయించుకున్నాయి. పైగా ఎర్ర పార్టీల ఆరాధ్య దైవం నైచా కూడా క్యాపిటలిస్ట్ సిద్ధాంతాలని పాక్షికంగా అమలు చేయడం చూసి, వీళ్ళకి కూసింత ధైర్యం వచ్చింది.

వెంటనే పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి బుద్ధావతారం దేశమంతా పర్యటనలు చేసి, వ్యాపారస్తులతో సమావేశాలు చేసి, పశ్చిమ బెంగాల్ industrializationకి సిద్ధంగా ఉంది అని ప్రకటించాడు.

కానీ వెంటనే ఎవరూ రాలేదు. బుద్ధావతారం చాలా మందికి పర్సనల్‌గా ఫోన్ చేశాడు. ఎందుకు రావట్లేదని ఎవరిని అడిగినా ఒకే మాట. “ఆ వస్తారు! మీ దగ్గర రోజుకి 5 గంటలు కరెంట్ ఉంటుంది. మాటి మాటికీ సమ్మెలు. ఎవరు మాత్రం వస్తారండి,” అని.

“అదేంటి బూర్జువాలు ఎక్కడ కొల్లగొట్టే అవకాశం ఉంటే అక్కడికి వచ్చేయాలి కద? వీళ్ళకేమయిందబ్బా?” అని బోలెడు ఆశ్చర్యపోయాడు బుద్ధావతారం. లాభం లేదు, కొంత రీసర్చ్ చేయాలనుకున్నాడు. ఫలితంగా చాలా పుస్తకాలు చదివాడు.

చివరకి “Capitalism for Dummies” పుస్తకం చదివాక వెలిగింది అతనికి. వెంటనే చక చకా పావులు కదిపాడు. కేంద్రంలో తాము సపోర్ట్ ఇచ్చిన గాంక్రెస్ ప్రభుత్వం ఆశీర్వాదంతో పశ్చిమ బెంగాల్‌లో కింగూర్ అనే చోట ఉన్న సెజ్ భూమిని వాడుకోవడానికి నిర్ణయించాడు.

ఆ తరువాత ప్రముఖ వ్యాపారవేత్తలైన “దాదా” వారిని పశ్చిమ బెంగాల్‌లో ఫ్యాక్టరీ పెట్టుకోమని ఆహ్వానించాడు. అప్పటికి దాదా వాళ్ళు “నాన్నో” అనే లక్ష రుపాయల కార్ తయారు చేసేందుకు సరైన ప్రదేశాలు వెతుకుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవని, దానికి తాను హామీ అని, ప్రామీస్ అని, కాల్గేట్ అని మొత్తానికి వారిని పశ్చిమ బెంగాల్‌కి రావడానికి ఒప్పించాడు.

అంతే కాకుండా తన పార్టీ వర్కర్లకు చాలా స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చాడు.

ఆ సంభాషణ ఇలా జరిగింది.

బుద్ధావతారం: రేపే దాదా వారు మన కింగూర్‌లో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం చేస్తున్నారు. మీరంతా ఏం చేయాలి?

ఎర్ర వర్కర్లు: తగిన శాస్తి చేయాలి. తరిమి తరిమి కొట్టాలి. రోజుకి ఐదు గంటలు కూడా కరెంట్ రాకుండా అక్కడ ఉన్న కరెంట్ పోల్స్ అన్నీ పీకెయ్యాలి.

బుద్ధావతారం: అందుకే నాకు బూతులు వచ్చేది. వాళ్ళు మన అతిథులు. వాళ్ళని ఎవరూ ఎలాంటి ఇబ్బందీ పెట్టకూడదు. సరేనా?

ఎర్ర వర్కర్లు: (తల బరుక్కుంటూ) అలాగే.

ఆ తరువాత ఏముంది. పనులు వడి వడిగా సాగిపోయాయి. లక్ష రూపాయల్లో “నాన్నో” కార్ రాబోతూంది అని మధ్య తరగతి కుటుంబాలు, కింద తరగతి వాళ్ళూ ఆనందంగా కోయ డాన్స్ చేయడం మొదలెట్టారు.

అప్పుడే సీన్‌లో ఎంటర్ అయ్యింది మడతా బెనర్జీ!

ఆవిడ చాలా పవర్‌ఫుల్ లీడర్. పశ్చిమ బెంగాల్‌లో ఎర్రోళ్ళు (అంటే ఎర్ర పార్టీలకు ఆమె ముద్దుగా పెట్టుకున్న పేరు లెండి), ఇలా బూర్జువాలని రానివ్వడమేంటి, ఒక మంచి ఎలెక్షన్ ఇష్యూని తనకి అప్పనంగా ఇవ్వడం ఏంటి అని ఎగిరి గెంతేసింది.

అంతే! పరిస్థితి కొన్ని నెలల్లో అంక ఛండాలం అయిపోయింది. సెజ్ భూమి కోసం ఆక్రమించుకున్న పంట పొలాలకు సరి ఐన నష్ట పరిహారం ఇవ్వలేదని కోపంగా ఉన్న రైతులని, మిగతా కార్యకర్తలని కూడగట్టుకుని మడతా బెనర్జీ కింగూరులోని దాదా ఫ్యాక్టరీ ముందు వీరంగం వేసింది.

దాదా ఫ్యాక్టరీ వోనర్ జతిన్ దాదాకి వొళ్ళు మండిపోయింది. ముఖ్యమంత్రి బుద్ధావతారానికి ఫోన్ చేసి, “ఏంటండీ ఇది, అసయ్యంగా? ఏ ఇబ్బందులూ ఉండవన్నారు! ఇప్పుడు చూడండి, బయట ఒక మూక, క్యాపిటలిస్ట్ పందుల్లారా కింగూర్ వదిలి మీ దొంగూర్‌కి వెళ్ళి పోండి అంటూ నానా యాగీ చేస్తున్నారు?” అంటూ అరిచాడు.

బుద్ధావతారం బెంబేలెత్తిపోయి, “అయ్య బాబోయి, వాళ్ళు మా మనుషులయి ఉండరు. ఆ మడతా బెనర్జీ చేస్తున్న కుట్ర ఇది. నేను అంతా సరి చేస్తాను, కొంత ఓపిక పట్టండి,” అని వేడుకున్నాడు.

“సరే కానివ్వండి, ఎక్కువ సమయం లేదు. ఇది మీ స్టేట్ బడ్జెట్‌లా కాదు, లోటు ఉన్నా ఫరవాలేదు అని సర్దుకుపోవడానికి . మా ప్రొడక్షన్ టార్గెట్స్ మాకుంటాయి. అవి చేరుకోలేకపోతే ఇక్కడ వ్యాపారం చేయడం దండగ,” అన్నాడు పచ్చి క్యాపిటలిస్ట్‌లా, జతిన్ దాదా.

బుద్ధావతారం సామ దాన భేద దండోపాయాలు అన్నీ ప్రయోగించాడు. ఐతే అవక తవకగా జరిగిన సెజ్ నియామకాల వల్లా, పంతం పట్టిన మడతా బెనర్జీ ధర్నాల వల్లా అవి ఏవీ పని చేయలేదు.

విసుగెత్తి దాదా వారు తట్టా బుట్టా సర్దుకుని బెంగాల్‌నుంచి చెక్కేశారు. మడతా బెనర్జీ గెలిచింది. పశ్చిమ బెంగాల్‌కి వచ్చిన కొత్త ఉద్యోగాలు ఊడాయి. కింగూర్ వాసులు మళ్ళీ సైకిల్ తొక్కుకుంటూ, పంక్చర్ వేసుకుంటూ పాత జీవితానికి అడ్జెస్ట్ అయిపోయారు.

ఎర్రోళ్ళంతా కలిసి శోకాలు పెట్టారు. “మేమేం చేతుమురో దేవుడో. ఈ పాడు మడతా బెనర్జీ మా సమ్మె టెక్నిక్ వాడి మా కళ్ళే పొడిచిందిరో తండ్రో,” అంటూ గొంతు చించుకున్నారు.

నీతి: ఎవరు తీసిన గోతిలో (వెంటనే పడకపోయినా) వాళ్ళే పడతారు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

24 Responses to “నాన్నో” కార్

 1. ప్రతివంశిని says:

  యధా ప్రక్రారం ఈ టపా కూడా బాగుంది ! నా లాగ రాజకీయాలు చదివి రాజకీయాలు చదివి, అసహ్యంతో చదవటం ఆపేసిన జనాలని కూడా చదివిస్తాయి మీ టపాలు! అభినందనలు ! బుద్ధావతారం, దొంగుర్ పేర్లు బాగున్నై. అలాగే సంభాషణలు కూడా మీ మార్క్ వ్యంగ్యం జోడించారు !
  ఎర్ర పార్టీ వాళ్ళు గోతిలో పడుంటారు కాని, ఎప్పటికీ అభివృద్ధి ని కోల్పోయేది మాత్రం సామాన్య ప్రజలే !ప్రతి సారి కోయ డాన్స్ వేయటం, ప్చ్ అనుకోటం అలవాటు చేసుకుంటున్నారు ! ఎర్ర పార్టీలు capitalism కి సై అన్నా, ఎర్ర పార్టీ principles మాత్రం రాజకీయం కాకుండా ఉండట్లేదు !

 2. purushotham says:

  gud

 3. శశాంక says:

  మడతా బెనర్జీ 🙂 ఎప్పటిలాగే… బాగుంది

 4. బాగుంది. మడతా బెనర్జీ పేరు కరక్టుగా సరిపోయింది :-))

 5. chaitanya says:

  అన్ని టపాల్లానే ఈ టపా కూడా అదిరింది. ఎర్ర పార్టీల పరిస్థితి ఇక్కడ రివర్స్ అయ్యింది పాపం !

 6. varma says:

  మీరు చెప్పింది అక్షరాలా నిజం. నిజంగా మడతా గారు పేదవాళ్ళ కడుపుల్ని కొట్టారు దాంతో పాటుగా దేశంలోని మధ్యతరగతి వాసులంతా ఆశగా ఎదురు చూస్తున్న నానోకీ గండి కొట్టారు. ఏం చేస్తాం నోరున్నవాళ్ళదే రాజ్యం అయ్యంది. ఫ్యాకటరీని కర్ణాటకు తరలించటం నిజంగా మంచి నిర్ణయం…..

 7. రిషి says:

  హహ..భలేగా రాసారు.

  ‘మడతా బెనర్జీ’..నిజంగానే ఈవిడ బెంగాల్ కి మడత పేచీ.

 8. suma says:

  :-)) great narration !

 9. భావకుడన్ says:

  ప్రతాప్ గారు,

  వావ్ అదిరింది…….మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండచ్చు కాని మీ రచనా పటిమను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను—ముఖ్యంగా ఆ పేర్ల మార్పిడి నిజంగా అదుర్స్.

  carry on ………..

 10. kamudha says:

  కాస్తంత పాపులారిటీ కోసం, కొండంత డబ్బు కోసం ఈవిడ ఎంతకైనా తెగిస్తుంది

 11. chilamakuru vijayamohan says:

  చాలా బాగుంది.

 12. Murali says:

  రాఘవేంద్ర గారూ,

  ధన్యవాదాలు. చిన్న సవరణ. నా పేరు మురళి, ప్రతాప్ కాదు. 🙂

  -మురళి

 13. అబ్రకదబ్ర says:

  ఏమైతేనేం, కారు చవక కారు రాక ఇంకొన్నాళ్లాలస్యం – మడతా బెనర్జీ పుణ్యాన. ఇప్పటికే కిక్కిరిసిన రోడ్లకి మరికొన్నాళ్ల తెరిపి.

  మీ వ్యంగ్యం బ్రహ్మాండం.

 14. Naga Muralidhar Namala says:

  చాలా బాగుంది.

 15. janardhan says:

  very good

 16. anamika says:

  adurs. Ramakrishna paramahamsa garini add cheyyatam marchipoyyaru.

 17. ప్రామీస్ అని, కాల్గేట్ అని.. :))

 18. భావకుడన్ says:

  నిజంగా పెద్ద నేరం ……క్షమించాలి మురళి. నా గూగుల్ ఐ జి లో కూడా అదే పెట్టుకున్నా ఎందుకో ……..మార్చేసాను ఇప్పుడు 😦

 19. నేనొప్పుకోను…:-) “మేథా(తా)”వుల ఆలోచనా విధానం అలవర్చుకుంటే ఆ ఒక్క ’మడత’ ప్రపంచ పర్యావరణానికి చేసిన సేవ అర్థం అవుతుంది…!
  హి..హి..హి…

  మేస్టారు…, ఈరోజే మీ టపాలన్నీ చదివా.., నాబోటి పామరులకు మీలాంటి “పామరులు” చెప్పే విషయాలు చాల చక్కగా అర్ధం అవుతున్నాయి…:-)

  చివరగా మీరు “మేధావి” గా మారరని, మారకూడదని, తిమ్మిని బమ్మిని చేసి తమ పబ్బం గడుపుకోవాలని చూసే “మేధావుల” కుయుక్తులను తెగడుతూ .., ఆ విధం గా ముందుకు పోవాలని.., తీర్మానించటమైనదని తెలియజేస్తున్నాము.
  ఇట్లు,
  నేను

 20. Kiran says:

  nice tapaaaaaaaa

 21. Murali says:

  *అనామిక గారూ*

  నాకు సంబంధించి రామకృష్ణ పరమహంసకి, వివేకానందుడికి తేడా లేదు. ఇద్దరూ ఒకటే.

  *నాగన్న గారూ,*

  బాగా గమనించారు. అది నాకు కూడా నచ్చిన పద ప్రయోగం. 😉

  *రాజ మల్లేశ్వర్ గారూ,*

  మితిమీరిన సోఫెస్టికేషన్ మనుషులని మేధావులుగా తయారు చేస్తుంది. మనం పామరులుగానే ఉందాం లెండి. 🙂

  *భావుకుడన్ గారూ,*

  మిమ్మల్ని క్షమించేశా! పేరు మార్చినా మంచి పేరే పెట్టారు లెండి.

  -మురళి

 22. Jyothi Reddy says:

  Murali ji,

  Madatha Benerji is simply superb. really hats off to you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s