రాజశేఖర చరిత్ర


త్రిలింగ దేశాన్ని వై.నో. రాజశేఖరుడు పాలించేవాడు. ఆయన గొప్ప రాజకీయ నాయకుడు. ప్రతిపక్ష భయంకరుడు. ఎంతటి గట్టివాడంటే ఆయనతో ఎవరు యుద్ధానికి దిగినా, చిత్తుగా ఓడిపోయి, తమ తల్లి కడుపున పుట్టకుండా ఉంటే బాగుండేది అనుకునే వారు.

ఒక సారి రాజశేఖరుడికి చాలా విపత్తు వచ్చింది. ఆయన అబ్బాయి వై.నో. జగనశేఖరుడు అడవుల్లో తిరిగే పెట్రోమాక్స్ లైట్లకు దొరికి పోయాడు.

పెట్రోమాక్సులు వై.నో. జగన్‌ని ప్రాణాలతో విడిచిపెట్టడానికి 20,000 కోట్లు అడిగారు. (తొడుక్కునేవి కాదు సుమా!) పుత్ర వాత్సల్యంతో రాజశేఖరుడు తను కబ్జాలూ దొమ్మీలూ చేసి సంపాదించినదంతా పెట్రోమాక్స్ లైట్లకు ధారాదత్తం చేసి కొడుకును విడిపించుకున్నాడు.

ఆస్తి పోయిన రాజశేఖరుడి ఇంటినుండి అష్ట లక్ష్ములు నిష్క్రమించ సాగారు. ముందుగా బుగ్గ మీద పులిపిరి కాయతోక్రూరంగా చూస్తూ వెళ్తున్న ఒక లక్ష్మిని ఆపి, “నువ్వు ఎవరు తల్లీ?” అడిగాడు రాజశేఖర్.

“నేను కబ్జా లక్ష్మిని నాయనా, కష్టపడి కబ్జాలు చేసి సంపాదించుకున్న డబ్బంతా ఎప్పుడు ఖర్చు పెట్టావో, అప్పుడే నా మనసు విరిగి పోయింది. నన్ను ఆపకు,” అంటూ ఆవిడ గడప దాటింది. రాజశేఖరుడు నిశ్చలంగా అలా చూస్తూ ఉండి పోయాడు.

తరువాత వెళ్తున్న లక్ష్మి, “నేను దొమ్మీ లక్ష్మిని, నాకు కీర్తనల కంటే, ఎదుటి వాళ్ళ బుర్రలు రామకీర్తన పాడించడం ఎక్కువ మక్కువ, అన్న రహస్యం తెలిసిన వాడివని, ఇన్ని రోజులు నిన్ను అంటి పెట్టుకుని ఉన్నా. ఇక నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు,” అని వెళ్ళిపోయింది. రాజశేఖరుడు చెక్కు చెదరలేదు.

ఇలా ఒకరి తరువాత ఒకరు వెళ్ళిపోయాక, ఆఖర్లో వెళ్తున్న లక్ష్మిని, “అందరి కంటే చివర వెళ్తున్నావు, నువ్వెవరు తల్లీ?” ప్రశ్నించాడు రాజశేఖర్.

“నేను బేషరం లక్ష్మిని నాయనా! నేను ఎవరి దగ్గర ఉంటానో వారికి సిగ్గూ లజ్జా ఉండవు,” అని సమాధానమిచ్చింది ఆవిడ.

అంతే! వెంటనే ఆవిడ కాళ్ళ మీద వాలి పోయి బావురుమన్నాడు రాజశేఖరుడు. “ఎవరు వెళ్ళిపోయినా దిగులు పడలేదు, కానీ నువ్వు లేకుండా నేనెలా ఉంటాను తల్లీ? నీ వల్లే కదా నాకు మిగతా లక్ష్ముల కటాక్షం కూడా లభించింది. నువ్వున్నావన్న ధైర్యంతోనే వాళ్ళు వెళ్ళిపోతున్నా పట్టించుకోలేదు,” అని ఘొల్లుమన్నాడు.

అతని భక్తిని మెచ్చిన బేషరం లక్ష్మి, “నీలాంటి భక్తుడిని వదిలి నేనెక్కడకి పోగలను నాయనా! ఎవరు ఏమన్నా, ఆఖరికి మొహాన ఖాండ్రించి ఉమ్మేసినా, దున్నపోతు మీద వాన పడినట్టు ఉంటావు కాబట్టే నువ్వు నాకు ప్రియ భక్తుడవైనావు. లే! నిర్భయంగా ఉండు. నా స్థానం నీ ఇంట్లోనే,” అని హామీ ఇచ్చింది.

ఆ తరువాత రాజశేఖరుడు బేషరం లక్ష్మి అండ దండలు తనను వెన్నంటి వుండగా, మళ్ళీ కొత్తగా దోపిడీలూ, దొమ్మీలూ, కబ్జాలూ, మర్డర్లూ, మానభంగాలూ చేసి తన పూర్వ వైభవం తిరిగి పొందాడు.

నీతి: సిగ్గు లేని వారు ఏదైనా సాధించగలరు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

20 Responses to రాజశేఖర చరిత్ర

 1. రాజశేఖరా నీపై “మోజు” తీరలేదురా అంటూనే ఆయన సంచి దులిపేస్తున్నారు.

 2. maha says:

  idi oka sari andrajyothi sunday magazine lo chadivaanu . adi kudaa vraasindi meerenaa?.

 3. gangabhavani says:

  superb.

 4. vamsi says:

  ae politician matram takkuva tinnaadu??

 5. sujata says:

  Super.. wonderful.. marvellous, brilliant.. inkaa alaantivanneenoo.

 6. ఇది మీ బ్లాగులోనే ఇంతకుముందోసారి చదివినట్టు గుర్తు. ఇప్పుడు చదువుతూ వుంటే ఇంకా బాగుంది. “ఫలానా భూమిని ప్రైవేటువారికి కేటాయించారు” అనే మాటను వార్తల్లో విన్నప్పుడల్లా కడుపు మండుతుంది. తన అధికారం ముగిసేలోగా రాష్ట్రం మొత్తాన్నీ కేటాయించేసి కమీషన్లు సంపాదించి తనతోపాటు పట్టుకుపోయేట్టున్నాడు.

 7. berry says:

  andari gurinchi raasaaaru.
  kottagaa vacchina parties gurinchi kooda raayocchugaa?

 8. Murali says:

  *రానారె గారూ,*

  ఇది నేను దాదాపు ఒకటిన్నర సంవత్సరం కింద రాసిన పాత టపా. కొత్తగా సినీ నటుడు రాజశేఖర్ చెలరేగిపోవడంవల్ల, మన ముఖ్య మంత్రి గారి పేరు కూడా అదే కావడం వల్ల, వాజశేఖర్ పేరు ఇద్దరికి వాడలేని సంక్షోభం ఏర్పడింది. 🙂

  కావున ఇకనుంచి ముఖ్యమంత్రి గారిని వై.నో. అని, రాజశేఖర్ గారిని వాజశేఖర్ అని వ్యవహరించడం జరుగుతుంది.

  దాని కోసమని, పైగా ఈ టపా అప్పట్లో ఎక్కువమందికి చేరలేదని, తిరిగి కొద్ది మార్పులతో ప్రచురించడం జరిగింది.

  *మహా గారూ,*

  ఇక ఆంధ్రజ్యోతి సన్‌డే మ్యాగజైన్‌లో వచ్చింది నా కథో కాదో నాకు తెలీదు. ఒకవేళ అచ్చు గుద్దినట్టు ఇలానే ఉంటే మాత్రం నా కథే. మొన్నే ఈనాడు వారు కూడా నా బ్లాగులోని ఒక టపాని ప్రచురించారు. ఎవరో చెప్పేంతవరకూ నాకూ తెలీలేదు. కాబట్టి ఆంధ్రజ్యోతి విషయంలో కూడా అలా జరిగి ఉండవచ్చు.

  *బెర్రి గారూ,*

  నా ఫోకస్ రాజకీయపరంగా మాత్రం, ఎక్కువగా అధికారంలో ఉండి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ లేదా ప్రజలని దోచుకుంటున్న వారి గురించే.

  కొత్తగా వచ్చిన పార్టీలగురించి రాయాల్సిన సందర్భం వస్తే తప్పకుండా రాస్తాను. ఎవరినీ వదిలేది లేదు. 🙂

  -మురళి

 9. chaitanya says:

  murali gaaru naa blog lo mee blog ku link ichukovacha. permission istara plz .

 10. Murali says:

  చైతన్య గారూ,

  నిరభ్యంతరంగా ఇచ్చుకోండి. ఐనా పబ్లిక్ డొమైన్‌లో ఉండే వాటికి ఎవరి పర్మిషన్ అక్ఖర్లేదనుకుంటా.

  -మురళి

 11. berry says:

  I’m also interested to maintain such a blog
  How sholud I proceed.

 12. V Saravana Reddy says:

  YS agarbha Sreemanthudu meeki theliyada????
  meeru andhra Jyothi & eenadu pakshapathiva???? leka CM ki shathruvaa????????
  mari Neeti Projects, Arigya Shree, uchitha Vidyuth laanti pathakamula goorchi rayarem????
  Raithulu sukamgaa vundatam istam leda???????
  gatha CM kalamlo kaneesam varshalu kooda sarigga padaledu deeni pi me abhiprayam???????

 13. Murali says:

  శరవణ రెడ్డి గారూ,

  ఆయన ఆగర్భ శ్రీమంతుడు కావచ్చు. కానీ, నాలుగేళ్ళ పాలన తరువాత మరింత శ్రీమంతుడయ్యాడన్నది మాత్రం నిర్వివాదాంశం.

  ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాసే ప్రతి వారూ ఆటోమ్యాటిక్‌గా ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ల పక్షపాతులు కారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వర్గానికి తప్పని సరిగా చెందాల్సిందేనా?

  మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధారణంగా ప్రవేశ పెట్టే populist పథకాలే. సబ్సిడీలు, రుణాల మాఫీలు, ఉచిత “ఇది”, ఉచిత “అది” పథకాల వల్లే మనం ఈ పరిస్థితిలో ఉంది. ఆయన ప్రవేశపెట్టిన “ఆరోగ్య శ్రీ” పథకానికి మాత్రం కొన్ని మార్కులు లభిస్తాయి. But as they say in English, “One swallow doesn’t make a summer.”

  ఇక ఈయన ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే వరుణదేవుడు కరుణించి వానలు కురిపిస్తున్నాడు అని మీరు నమ్మితే నేను చెప్పేదేమీ లేదు.

  -మురళి

 14. Murali says:

  బెర్రి గారూ,

  మీకు బ్లాగు మొదలు పెట్టడానికి చాలానే సైట్లు ఉన్నాయి. నాకు తెలిసి wordpress, blogger సైట్లపై ఎక్కువమంది తమ బ్లాగులు ప్రచురిస్తారు. ఇంకా చాలా ఉన్నాయి.

  తెలుగు text కోసం నేను http://lekhini.org సైట్‌కి వెళ్తాను. అక్కడ క్రియేట్ చేసే తెలుగు textని మీరు మీ టపాలో నేరుగా paste చేయొచ్చు.

  -మురళి

 15. reddygal says:

  Idhi mathram Kathi Guru,keep goin murali…

 16. Suresh says:

  kevvu…. kEka….

  edainaa abhipraayaanni maamoolugaa cheppatam kannaa ilaa vyangyam gaa cheppithe janaalloki baagaa veluthundi…

  idi andarikee kudire pani kaadu. anduke meeku naa vandanaalu.

  chinnappudu vinna raju gaari kadhaloni dhairya laxmini….
  mana reddi raaju gaari kadhalo besharam laxmini…

  polchukunte Great…

  keep it up

 17. venkat chilla says:

  మురళిగారు, ఈ కధకి రాజశేఖర్ రెడ్డి place lo చంద్ర బాబు, కే.సి.ర్, రాఘవులు, నారాయణ లేక చిరంజీవిని పెట్టినా కధకు ఏమి లోపం రావటం లేదు….గమనించగలరు.

 18. Murali says:

  వెంకట్ గారు,

  సిగ్గుకి సంబంధించినంత వరకూ కె.సీ.ఆర్ మరియు చంద్ర బాబు కొంత వరకు ఆ పాత్రకు న్యాయం చేయగలరేమో, కానీ రాఘవులు, నారాయణ, అంత దిగజారలేదు. వాళ్ళకు చెడ్డదో మంచిదో, ఏదో ఒక సిద్ధాంతం ఉంది. చిరంజీవికి ఇంకా రాజకీయాల్లో మొదటి స్టేజ్‌లోనే ఉన్నాడు. కాబట్టి తను కూడా ఈ పాత్రకి పనికి రాడు.

  మీరు చెప్పాలనుకున్నది రాజకీయ నాయకులంతా వెధవలే అని ఐతే, అది చాలా మటుకు నిజం. కానీ అందులో కూడా హెచ్చు తగ్గులున్నాయి.

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s