ఇది చాలా హాట్ గురూ!

“ఈ రోజు పేపర్ చదవలేదోయి!”

“ఏం ఫర్లేదు! నేను చదివానులే.”

“ఏంటో విశేషాలు?”

“అన్నీ తాజా వార్తలే!”

“చెప్పు చెప్పు ఐతే!”

“విషరాజ్ పాటిల్ హోం మంత్రిగా కొనసాగుతాడట. ఆయన సామర్థ్యం మీద తమకు పూర్తిగా నమ్మకము ఉందని, గాంక్రెస్ పార్టీ ప్రకటించింది.

* గుజరాత్‌లో, మహరాష్ట్రాలో సరి కొత్తగా పేలుళ్ళు. పీకిస్తాన్ వీటిని తీవ్రంగా ఖండించింది.

*ఇష్టారాజ్యం పార్టీలో గాంక్రెస్, తెగులుదేశం పార్టీలనుండి వలసలు ఎక్కువయ్యాయి.

*ఇది ఇష్టారాజ్యం నీతి బాహ్యతకు నిదర్శనమని, తాము ఎన్నడూ అలాంటి పనులు చేసి ఎరగమని, ఒట్లు పెట్టుకున్న గాంక్రెస్ తెగులుదేశం నాయకులు.

*తమకు సినీ గ్లామర్ అవసరంలేదంటున్న వై.నో.

*ఒకప్పటి సూపర్‌స్టార్ కిట్నా, వాళ్ళబ్బాయి ఉమేశ్‌కి ఎన్నికల ప్రచారంలో పెద్ద పీట వేయాలన్న గాంక్రెస్ అధిష్టానం నిర్ణయం.

* గొప్ప సెక్యూలర్ విద్యార్థి సంస్థ ‘విమీ’ని బహిష్కరించారని ముభావం సింగ్ యాదవ్ ఆక్రోశం.

*హ్యాపీగా మతం మార్పిడి చేసుకుంటున్న క్రిస్టియన్ మిషనరీలపై అమానుషమైన దాడులకు పాల్పడుతున్న హనుమంత్ దల్‌ని కూడా బహిష్కరించాలని ఆయన డిమాండ్.”

“అగాగు. ఇవన్ని నిన్నటి న్యూస్‌పేపర్‌లో వార్తల్లా లేవు?”

“అవును కదూ!”

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

11 Responses to ఇది చాలా హాట్ గురూ!

 1. దాక్షాయణి says:

  >ఇష్టారాజ్యం పార్టీ, 😀 పేరు గొప్పగా అతికింది !
  >కిట్నా, వాళ్ళబ్బాయి ఉమేశ్‌కి, 😀
  >హ్యాపీగా మతం మార్పిడి చేసుకుంటున్న క్రిస్టియన్ మిషనరీలపై 😀
  మురళి గారు, క్లుప్తంగా మూడు ముక్కల్లో చెప్పారు,(నిన్నటి న్యూస్‌పేపర్‌లో వార్తలైనా) ఇది చాల హాట్ గురూ అని !
  మీ టపా భలేగా ఉంది ! 😀

 2. ముగ్ధ says:

  ముభావం సింగ్ ! 😀 మీ పేర్ల సృజనాత్మకత భలేగా ఉంటుందండీ !

 3. chilamakuru vijayamohan says:

  చాలా బాగుంది.మీరు పెడుతున్న పేర్లు మాత్రం బ్రహ్మాండం.అభినందనలు.

 4. రవి says:

  కొంత కాలం క్రితం, US నుండి ఎవడో రావడం, మొదట పీకిస్తాన్ కు వెళ్ళి, కాశ్మీర్ సమస్య ను UN ద్వారా పరిష్కరించాలి అనడం, తర్వాత ఇక్కడకు వచ్చి, నేను అలా అన్నే అన్లేదు, కాశ్మీర్ ఎప్పటికీ భారద్దేసం లో అంతర్భాగమే అనడం బాగా అలవాటై ఉండేవి. అప్పుడు పేపర్లలో అదే న్యూసే రోజూ…

 5. reddygal says:

  Nice one,great, keep goin murali…..

 6. amar says:

  it is very humorous.

 7. Satish Reddy says:

  Chritians are contributing a lot for the developemnet on India with their Prayers,Education,Health Services.

 8. Chandu says:

  It is really very funny.

 9. cbrao says:

  మీ వేగు (e-mail) చిరునామా తెలుపుతూ నా కో ఉత్తరం రాస్తారా? మీకో ఆహ్వానం పంపవలసి ఉంది.

  cbraoin at gmail.com
  San Jose, CA.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s