దేవ రహస్యం

“నాకు ఎప్పటికీ తీరని సందేహాలు రెండున్నాయోయి, మూర్తి,” అన్నాడు రాజేష్. మా మిత్ర బృందంలో వాడే అందరి కంటే మేధావి అన్న విషయాన్ని నేను మీకు ఇదివరకే మనవి చేసి ఉన్నాను.

ఏంటన్నట్టు చూశాడు మూర్తి.

“ఒకటి. అసలు ఈ సృష్టి ఎలా మొదలయ్యింది? ఎందుకు మొదలయ్యింది? మనమిక్కడ ఏం చేస్తున్నాం? రెండు. రజనీ కాంత్ సినిమాలు జపాన్‌లో ఎందుకంత బాగా ఆడతాయి? జపాన్ వాసులు ఈలలు వేస్తూ గోలలు చేస్తూ జపనీస్ సబ్ టైటిల్స్ వేసుకుని మరీ ఏ రకంగా చంద్రముఖి లాంటి సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు?”

పెదవి విరిచాడు మూర్తి. “రాజేష్, కావాలంటే సృష్టి రహస్యం కనుక్కోవచ్చేమో కానీ, రజనీ కాంత్ మిస్టరీ మనం సాల్వ్ చెయ్యలేం వాయి.”

“ఏం ఎందుకు కనుక్కోలేం. ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది,” ఆవేశంగా అన్నాను నేను. చిన్నప్పటినుంచి నాకు ఆవేశం ఎక్కువ.

“నీకు తెలీదులే, సృష్టి రహస్యమే వీజీ,” ఖచ్చితంగా చెప్పాడు మూర్తి.

“సరే ఐతే దాని గురించే మాట్లాడుకుందాం మరి,” అన్నాడు రాజేష్. “ఏదో ఒక మిస్టరీ సాల్వ్ అయినా ఈ రోజు గిట్టుబాటు ఐనట్టే.”

“నాకు తెలుసు, నాకు తెలుసు. సృష్టి బిగ్ బ్యాంగ్‌తో మొదలయ్యింది. ఆ తరువాత హైడ్రోజెన్, హీలియం ఏర్పడ్డాయి, ఆ తరువాత..” అని ఉత్సాహంగా చెప్తున్న నన్ను మధ్యలోనే కట్ చేశాడు రాజేష్. “బిగ్ బ్యాంగ్ ఎందుకు సంభవించింది?” అడిగాడు.

“బిగ్ బ్యాంగ్ తరువాత ఏం జరిగింది, ఎలా జరిగింది అని సైన్సు వివరించగలదు. కాని బిగ్ బ్యాంగ్‌కి ముందు ఏమీ లేదు. బిగ్ బ్యాంగే సృష్టికి నాంది,” బింకంగా అన్నాను నేను.

“కరక్టే, కానీ బిగ్ బ్యాంగ్ ఎప్పుడైతే సంభవించిందో అప్పుడే ఎందుకు సంభవించింది? శూన్యం నుంచి పదార్థం ఎలా వచ్చింది?” ఇది మూర్తి.

నాకు ఉక్రోషం ముంచుకొచ్చింది. “అంటే ఇదంతా దేవుడు ఒక రోజు సృష్టించాడంటావా?” అరిచాను.

వాళ్ళిద్దరూ నా వైపు జాలిగా చూశారు. “నువ్వు చెప్పినట్టు బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి నుంచి సైన్సు explanation ఇస్తుంది. అక్కడ మాకు సందేహం లేదు,” డ్రమాటిక్‌గా ఆగాడు రాజేష్.

“ఐతే బిగ్ బ్యాంగ్ జరిగేలా చేసింది దేవుడంటావా?” అడిగాను నేను.

“అదీ చెప్పలేం. ఒక వేళ దేవుడు బిగ్ బ్యాంగ్ జరిగేలా చేసి ఉంటే అప్పటి వరకు ఎందుకు ఆగాడు? ఇంకా ప్రాథమికమైన ప్రశ్న, అసలు దేవుడిని ఎవరు సృష్టించారు? ఒక వేళ ఎవరైనా సృష్టించి ఉంటే ఆయన్నో/ఆవిడనో ఎవరు సృష్టించారు?” అలా దూసుకెళ్ళిపోటున్న రాజేష్‌ని ఆపి, “అర్థమయ్యింది,” అన్నాను నేను నీరసంగా.

అందరం కాసేపు తల పట్టుకుని కూర్చున్నాం. ఆ తరువాత నేను వారికి కాఫీ చేసిచ్చి ఇద్దరికీ చెరేసి రెండు తల నొప్పి మాత్రలు కూడా ఇచ్చి, రెండు నేనూ వేసుకున్నాను.

“సరే! అది ఎలాగూ తేలట్లేదు. మరి రజనీ కాంత్ సినిమాలు జపాన్‌లో ఎందుకు బాగా ఆడుతాయో విశ్లేషిద్దామా?” అడిగాను నేను.

ఇద్దరూ ముక్త కంఠంతో, “అమ్మో వద్దు! ఆ టాపిక్ మొదలెడితే, ఈ తలనొప్పి మాత్రలు కూడా పని చేయవు,” అన్నారు.

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

5 Responses to దేవ రహస్యం

  1. రవి says:

    బహుశా రజనీకాంత్ ద్వారా బిగ్ బ్యాంగ్ థియరీ కి మూలాలు దొరుకుతాయన్న ఆశేమో జపానోళ్ళకు. అందుకే రజనీ కాంత్ సినిమాలకు ఎగబడుతుండచ్చు.

  2. పార్వతి says:

    మురళి గారు, భలే ! 😀

  3. Jyothi Reddy says:

    Nice one muraliji…LOL

  4. Chandu says:

    Chala bagundi.

  5. budugu says:

    హెహెహె.. నైస్ వన్ మాష్టారు.. 🙂

    రజనికాంత్ మూవీస్ అంటే ఓ forwarded జోక్ గుర్తొస్తుంది.
    On “Why Newton committed suicide?”

    http://gleez.com/articles/humor/fun/why-newton-committed-suicide

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s