ది ఎలెవెన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ అఫ్ ఇండియా

1. నిస్పృహ

అన్నిటి కంటే భయంకరమైనది నిస్పృహ. సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడిని నిర్వీర్యుడిని చేసి, ఆలోచన సైతం స్తంభింప చేసే చలిలా, ఈ నిస్పృహ మనల్ని అచేతనులను చేస్తుంది. ఏం చేసినా చేయకపోయినా ఫలితం ఒక్కటే అనే నిరర్థకమైన వేదాంత ధోరణి అలవాటు చేస్తుంది. ప్రస్తుతం మన దేశం ఉన్న పరిస్థితి చూసి చాలా మంది ఈ నిస్పృహని ఆశ్రయించారు.

ఈ నిస్పృహ మనకు తరతరాల బానిసత్వం నుండి వచ్చింది. మన దేశ సంస్కృతిని గౌరవించడం మానేయడం వల్ల వచ్చింది. పరిస్థితులు మారవు అన్న నైరాశ్యం వల్ల వచ్చింది. కానీ విషాదకరమైన విషయం ఏంటంటే ఇది ఒక విష వలయం. పరిస్థితి విషమించిన కొద్ది నిస్పృహ పెరుగుతుంది. నిస్పృహ వల్ల ఏమీ చేయకుండా కూర్చుంటే పరిస్థితి మరింత విషమిస్తుంది.

2. సోషలిజం

నెహ్రూ ఆమాత్యుడు వృద్ధిలోకి తీసుకుని వచ్చిన రాజకీయ సిద్ధాంతం. ఆయనెప్పుడో పోయాడు కదా, ఇంకా ఆయన మీద పడి ఏడవడం ఎందుకూ అంటారా? “పిల్ల పోయినా పురిటి వాసన పోలేదు” అనే నానుడి వుంది. ఆ రకంగా ఆయన లేకపోయినా, ఆయనగారి పార్టీ ఐన కాంగ్రెస్, 1991 వరకూ ఈ failed ideologyని కొనసాగించింది. ఇప్పటికీ ఎన్నో “పేదల” పార్టీలు, సోషలిస్ట్ అన్న పదాన్ని తమ పార్టీ పేర్లకు జోడించి, సోషలిజం అనే నినాదాన్ని ఇంకా వెలువరిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం కలగ చేసుకుని సబ్సిడీలూ, రుణాలూ, రాయతీలూ ఇచ్చి ప్రజలలో సమానత్వం స్థాపించాలనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వల్ల మన దేశానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.

ఇదేంటి కమ్యూనిజాన్ని వదిలేశాడు అనుకుంటున్నారా? సోషలిజం అంటే వేరే ఏదో కాదు. కమ్యూనిజం యొక్క అక్రమ సంతానమే!

3. సూడో సెక్యూలరిజం

మిగతా మతాలకు, ముఖ్యంగా మైనారిటీ మతాలకు పెద్ద పీట వేసి, వాటిని కావలసిందానికంటే ఎక్కువగా గౌరవిస్తూ, మెజారిటీ మతాన్ని మాత్రం, అయిన దానికీ కాని దానికీ దుమ్మెత్తి పోయడం. తద్వారా సదరు మైనారిటీలలో అభద్రతా భావాన్ని మరింత పెంపొందించడం, ఆ రకంగా వాళ్ళనుంచి వోట్లు దండుకోవడం. ఐతే ఈ ప్రహసనంలో మైనారిటీ నాయకులది కూడా చాలా పెద్ద పాత్రే ఉంది. ఈ “ఉభయకుశలోపరి” విధానాన్ని తుంచడం చాలా ముఖ్యం.

4. కాశ్మీర్ సమస్యని మొగ్గలోనే తెంపి వేయకపోవడం

దీనికి మళ్ళీ మన పూజ్య నెహ్రూని తలుచుకోక తప్పదు. గోటితో పోయే సమస్యని అనవసరంగా పెంచి ఇప్పుడు గొడ్డలితో కూడా పరిష్కారం కాని స్థితికి తెచ్చిన ఘనత ఏలినవారిదే. ఆ తరువాత 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో సంపూర్ణ విజయం సాధించి కూడా, ఆ ఆధిక్యతతో కాశ్మీర్ సమస్యని మళ్ళీ లేవనెత్తకుండా చేయగలిగిన సువర్ణావకాశాన్ని జార విడుచుకోవడం ఇంకొక historical blunder. అప్పుడు మన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నది నెహ్రూగారి పుత్రికా రత్నం ఇందిరమ్మ అని అందరికీ తెలిసిన విషయమే.

5. అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ మొదలగు పనికి మాలిన చట్టాలు

ఈ పని కూడా మన నెహ్రూ పుత్రి ఇందిరమ్మదే. పైగా దీనికి ఎర్ర మేధావుల మద్దతు కూడా పూర్తిగా ఉంది.

Urband Land Celing Act ప్రకారం ఎవరి దగ్గరన్నా ఒక పరిమితికి మించి ఎక్కువ భూమి ఉంటే (ఈ పరిమితి రాష్ట్రాన్ని బట్టి మారుతుంది; మహారాష్ట్రాలో ఇది 5,382 చదరపు గజాలు ఉండేది), ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పక్కా ఇళ్ళు కట్టడానికి ఉపయోగించవచ్చు. ఐతే దీని వల్ల పక్కా ఇళ్ళ మాట దేవుడెరుగు, భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. పైగా ఎన్నో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటు పడ్డాయి. 1999లో కేంద్ర ప్రభుత్వం దీని వైఫల్యాన్ని అంగీకరించి ఈ చట్టం ఎత్తివేసింది.

6. కాంగ్రెస్‌ని వదిలించుకోలేకపోవడం

1977లో కాంగ్రెస్‌ని గద్దె దించిన జనతా పార్టీ 1979లో పతనమయ్యింది. ఇది కాంగ్రేసేతర పార్టీలు భారత దేశానికి చేసిన క్షమించరాని ద్రోహం. చావు తప్పి కన్ను లొట్ట పోయిన కాంగ్రెస్ భూస్థాపితం కావడానికి బదులు జనత పార్టీ వైఫల్యం వల్ల తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ దేశాన్ని మహమ్మారిలా పట్టుకునే ఉంది.

7. మత మార్పిడులని అరికట్టకపోవడం

మన రాజ్యాంగంలో నిషేధించినప్పటికీ, భారీ ఎత్తున జరిగే మతం మార్పిడులని ప్రభుత్వం, వోటు బాంక్ రాజకీయల వల్ల అరి కట్టకపోవడం. స్వచ్ఛందంగా మతం మారడం వేరు. డబ్బూ ఇతర ప్రలోభాలూ చూపించి మూకుమ్మడిగా మతాలు మార్చడం వేరు. ఈ కొత్త మతస్తులు అందరు వెంటనే భారతదేశ ద్వేషులు అవుతారు. దీనికి కారణం ఉంది. హిందు మతాన్ని ద్వేషిస్తూ, భారతదేశాన్ని ప్రేమించడం కష్టం. ఈ మతం మార్పిడులు హిందూ మతం మీద ద్వేషం ప్రాతిపదికగా జరుగుతాయి కాబట్టి, ఈ భారతదేశంపై ద్వేషం కూడా తప్పని సరిగా జరిగే ఒక side effect. ఇది భారతదేశం ఉనికికే ప్రమాదం.

8. కులానికి ప్రాధాన్యత ఇవ్వడం

కులం మనని వదలకుండా పీడిస్తున్న జాడ్యం. కులం కంటే సంస్కారం గొప్పది అన్న విషయం అర్థం చేసుకోలేనంత వరకూ మనం వెనుక పడే ఉంటాం. దీని అర్థం నిమ్న కులాల వారంతా మంచివారూ, అగ్ర కులాల వారంతా చెడ్డవారూ అని కాదు. దీని అర్థం కులానికీ సంస్కారానికీ సంబంధం లేదూ అని మాత్రమే.

కులం ప్రభావం రాజకీయల మీద చాలా ఉంది. ఇప్పటికీ పార్టీలు ఎన్నికలలో నిలబడే అభ్యర్థులని ఆ నియోజక వర్గంలో ఏ కులం వారు ఎంత మంది ఉన్నారో అన్న దాన్ని బట్టే నిర్ణయిస్తాయి. కొన్నేళ్ళ కింద బీహార్‌లో జరిగిన ఎన్నికల సంగ్రామంలో రాష్ట్రీయ జనతాదల్ స్లోగన్స్‌లో ఇదొకటి. “న ఫూల్ చాహియే, న సడక్ చాహియే, హమే తో లాలూ జైసా మర్ద్ చాహియే.” (మాకు బ్రిడ్జులూ వద్దు, రోడ్లూ వద్దు, మాకు లాలూ లాంటి మగాడు కావాలి.) ఎందుకు? లాలూ వాళ్ళ కులం వాడు కాబట్టి.

9. కుల నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వడం

కులాన్ని నిర్మూలిస్తే సమ సమాజం దానంతట అదే వచ్చి పడుతుందని కొందరి నమ్మకం. కులాన్ని నిర్మూలించడంకంటే కులం అప్రస్తుతం (irrelevant) అయ్యే వాతావరణం సృష్టించాలి. అందరికి చదువుతో పాటూ సంస్కారం నేర్పడం ఒక్కటే దీనికి మార్గం. ఎప్పుడైతే మనిషి ఔన్నత్యాన్ని అతని గుణాన్ని బట్టి కొలిచే సంప్రదాయం వస్తుందో, అప్పుడు కులం యొక్క ప్రభావం దానంతట అదే అదృశ్యం అవుతుంది.

అంతే కానీ చదువుల్లో, ఉద్యోగాల్లో, ఆఖరికి ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇచ్చి సామర్థ్యం ఉన్న వాళ్ళ కడుపు కొడితే కులం “పోదు”. పైగా కుల తత్వం మరింత ఎక్కువవుతుంది. ఎవరిది ఏ కులమో ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. కుల ప్రాతిపదిక మీద జీవితంలో పైకి వచ్చిన వాళ్ళ మీద చిన్న చూపు మరింత ఎక్కువవుతుంది.

ఇవి మన రాజకీయ నాయకులకు తెలీక కాదు. కానీ మొదటి పద్ధతి కంటే రెండోది సులభం. వోట్లు రాబట్టుకోవడం ఈజీ. ఇది ప్రజలు గుర్తించనంతవరకూ ఇలాగే నిరాటంకంగా సాగుతుంది.

10. Non-aligned movement

చాలా రోజుల వరకూ అలీన సిద్ధాంతం మన foreign policyని నిర్దేశించింది. దీని అర్థం అమెరికా కూటమి కానీ రష్యా కూటమి కానీ దేనిలోనూ చేరకుండా తటస్థంగా ఉండడం. ఇది కూడా చాచా నెహ్రూ అద్భుత ఆలోచనే. తటస్థంగా ఉన్నామని మనం అనుకున్నాం. రష్యా తొత్తులని West అనుకుంది. చిన్న తేడా, అంతే. దీని వల్ల మన తరువాత అతి పెద్ద ప్రజాస్వామ్యిక దేశమైన అమెరికాతో చాలా రోజుల వరకూ మనకు సరైన సంబంధ బాంధవ్యాలు లేవు. మనం ఇంకా సోషలిజంలో మగ్గడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం.

11. Paliamentary democracy

అమెరికాలో ప్రజలు తమ నాయకుడిని నేరుగా ఎన్నుకుంటారు. తరువాత ఆ నాయకుడు తన క్యాబినెట్ సభ్యులని వివిధ రంగాలనుంచి ఎన్నుకుంటాడు. ఇది presidential democracy. దీనిలో సౌలభ్యాలు రెండు. 1. ఎక్కువ మంది మార్బలం లేని ఒక గొప్ప నాయకుడికి ఎన్నిక కాగలిగే అవకాశం. (Of course, దీనికి multi party system ఉండాలనుకోండి. అది ఎలాగూ మన దగ్గర ఉంది.) 2. తనని ఎప్పుడు తన వాళ్ళే కుర్చీ నుంచి లాగేస్తారా అన్న భయం సదరు నాయకుడికి ఉండకపోవడం. కాబట్టి పరిపాలన మీద దృష్టి పెట్టగలగడం.

రాజీవ్ గాంధి 400 పై చిలుకు సీట్లు గెలిచి కూడా తన హయాంలో ఆఖరి రెండు సంవత్సరాలు ఎక్కడ తన పార్టీ ఎం.పీలే తనను పదవీచ్యుతుణ్ణి చేస్తారో అన్న భయంతో ఏమీ చేయలేకపోయాడు. ఇక సంకీర్ణ ప్రభుత్వాల గురించి చెప్పేది ఏముంది?

ఇంకా ఎన్నో ఉన్నప్పటికీ ఈ పదకొండు మాత్రం నా దృష్టిలో “ద డిజెనరేషన్ అఫ్ ఇండియా”కి ముఖ్య కారణాలు.

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

20 Responses to ది ఎలెవెన్ కాజెస్ ఫర్ ది డిజెనరేషన్ అఫ్ ఇండియా

 1. independent says:

  WOW..KUDOS MURALI JI..

  I am in a hurry here, I can’t type long, but let me just tell you, I agree with the most part. NOT ALL though..

  Every cell in my body hates SOCIALISM AND COMMUNISM. There is no bigger EVIL in the world than COMMUNISM(SOCIALISM), and I mean every word.

  I speak from my self-experiences and all my travelling across world and all that I read from various books.

  That is one reason why I hate some(most) democrats in this country. I changed my mind and decided to vote for McCain, although he is going to loose the election.

  ‘Pseudo-Secularism’ is causing all kinds of unintended consequences. We have the same kind of idiots in America too..so called ‘secular progressives’ who want to dilute the culture and provide the cushion for non-sense ideas in the name of ‘multi-culturisms’ and thereby helping the destruction of America and the World.

  Hats Off..

 2. “కులాన్ని నిర్మూలించడంకంటే కులం అప్రస్తుతం (irrelevant) అయ్యే వాతావరణం సృష్టించాలి”-Perfect. కులాన్ని నిర్మూలించటానికి ప్రయత్నించే కొద్దీ అది మరింత బలపడుతుంది. దాన్ని బలహీనపరచటమొక్కటే మార్గం.

 3. శీర్షికను బట్టి హాస్యం/వ్యంగ్యం ఉంటుందనుకున్నా!
  దాదాపుగా అన్నీ నాకూ ఆమోదయోగ్యమే.

 4. మంచిటపా. చాలా వివేకవంతమైన విశ్లేషణా ప్రయత్నం. కాకపోతే అక్కడక్కడా మీ political ideology ని ప్రతిఫలించే విషయాలు తప్పలేదు..బహుశా తప్పకూడదుకూడా..ఎంతైనా మీరు మీరేకదా!

  1.నిస్పృహ అనేది మధ్యతరగతి జాఢ్యం. అది అందరికీ ఆవరించిందని నేను అనుకోను. అన్ని వర్గాలలో కొంత నిరాశ ఉన్నమాట వాస్తవమేగానీ,articulation possibility ఉన్న మధ్యతరగతి, దేశ పరిస్థితిని తమ (American)aspirations తో పోల్చుకుని తీవ్ర నిస్పృహకు లోనౌతూ, అదే మూసకు ప్రచారం కల్పిస్తున్నారు. 70% ప్రజలు నివసించే పల్లెల్లో కనబడే రాజకీయ చైతన్యం మన vibrant democracy కి ఒక మంచి ఉదాహరణ. There is still hope and they are living on it.

  2.సోషిలిజం (సమసమాజం) అనే ఆలోచనలో ఎటువంటిలోపం లేదు. మనదేశంలో దాన్ని అమలు పరిచే విధానంలో కొన్ని లోపాలున్నమాట మాత్రం వాస్తవం.
  “సబ్సిడీలూ, రుణాలూ, రాయతీలూ ఇచ్చి ప్రజలలో సమానత్వం స్థాపించాలనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం. దీని వల్ల మన దేశానికి జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.” అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇస్తున్నంత రాయితీలూ,రుణాలూ,సబ్సిడీలూ నిజానికి మనదేశంలో ఇవ్వడంలేదు. సమాజిక ఆర్థిక తేడాలూ లోయల్లా ఉన్న మనదేశంలో సబ్సిడీ,క్రాస్ సబ్సిడీ లేకుంటే “సంక్షేమం” అంతసులువుగా అవుతుందని నేననుకోను. వీటికి alternative model మీదగ్గరుంటే చెప్పగలరా? ముఖ్యమైన సమస్య వీటి అమలులోని లోపాలేతప్ప Socialism per se కాదేమో!
  3.మీరు కులానికి చెప్పిన ‘making it irrelevant’ సిద్దాంతం ఇక్కడా వర్తిపచెయ్యొచ్చుగా? కనీసం పబ్లిక్ స్థలల్లో మతాన్ని నిషేధిస్తే మంచిదేగా! కానీ మళ్ళీ మనకు ప్రజాస్వామ్యమే గుర్తొస్తుంది. మన వ్యక్తిగత హక్కులు జ్ఞాపకమొస్తాయి.

  అయినా,సెక్యులరిజం అనేది ఎలాగూ మన రాజ్యాంగంలొ వివరించబడిందికదా,మరి దానికి కట్టుబడి ఉండటంలో తప్పేమిటి? మైనారిటీలకు వేసిన “పెద్దపీట” ఏమిటో చెబుతారా..రాజకీయ lip-service తప్ప.
  4.కాశ్మీర్ సమస్యపై చరిత్రను తిరగదోడితే,మూలం నెహ్రూ అయినా,ఇప్పటివరకూ ఢిల్లీలో రాజ్యం చేసిన అందరూ ఇంతోకోంతో ఇంకా ఈ సమస్య ఇలాగే ఉండటానికి కారణాలుగా కనబడతారు. ఇప్పుడెలాగూ ఈ “మొగ్గ” పుష్పించి కాయలు విరగ్గాస్తోందిగనక దాన్నెలా పెకిలించాలో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే,ఇదే మనకున్న పెద్ద సమస్యల్లో ఒకటా? అంటే మాత్రం కొంచెం సందేహమే! Don’t We have much more serious issues like poverty,hunger and malnutrition to deal with?

  5&6. కాంగ్రెస్ బ్యాషింగ్ చెయ్యడం చాలా సులభం ఎందుకంటే, దాదాపు 40 ఏళ్ళ ప్రజాస్వామిక పాలనలో కాంగ్రెస్ స్థానంలో దేవుడ్ని కూర్చోబెట్టినా తప్పులుచెయ్యకుండా ఉండలేడు. After all కాంగ్రెస్ పార్టీ ఎంత. ప్రస్తుతం మన దేశానికి పట్టిన దుర్గతికి కారణం కాంగ్రెస్ పార్టీ అని నేను ఒప్పుకుంటే, జరిగిన అభివృద్ధికి కూడా వారికే పట్టంకట్టాల్సివస్తుంది.దానికి మీరు ok అంటే నేను మీతో ఏకీభవిస్తాను. Running India needs a miracle and it happened…

  7.మతమార్పిడుల్లో “భారీ”తనం ఎక్కడొచ్చిందో నాకు అర్థం కావడం లేదు. లెక్కలు ఖచ్చితంగా నాకు తెలీదుగానీ,క్రైస్తవనికి మారిన హిందువుల శాతం నగణ్యం అని నాకు అనిపిస్తుంది.
  “హిందు మతాన్ని ద్వేషిస్తూ, భారతదేశాన్ని ప్రేమించడం కష్టం.” ఇంతకు మించిన irresponsible statement ఇంకోటి ఉంటుందని నేననుకోను. అంటే మీ ఉద్దేశం ముస్లింలు,క్రైస్తవులూ,సిక్కులు,బౌద్దులు,జైనులూ,జొరాష్ట్రియన్లూ భారతదేశాన్ని ప్రేమించడం లేదనా?

  “ఈ మతం మార్పిడులు హిందూ మతం మీద ద్వేషం ప్రాతిపదికగా జరుగుతాయి” హమ్మో అంతలో మరో స్టేట్ మెంట్…నమ్మకాన్నిబట్టి లేక కొన్ని సామాజిక అవసరాల ప్రాతిపదిక మీద జరిగిన మతమార్పిడులు నాకు తెలుసుగానీ హిందూ మతం మీద ద్వేషంతో మాత్రం..ఆలొచించదగిన విషయమే!
  హా..హిందూ మతంలో ఉండటంవలన తమకు అవమానం,అణచివేతాతప్ప ఇంకేమీ మిగల్లేదన్న నిస్పృహ కారణంగా,తమ జీవితల్లో శాంతిని ఆహ్వానిస్తూ జరిగిన మతమార్పిడులు మాత్రం తెలుసు. ఇందులో హిందూ మతం మీద ద్వేషంకన్నా, హిందువుల మూర్ఘత్వంపైన నిరసన,అర్థరహిత విధానాల మీద పోరాటం నాకు కనిపిస్తాయి.
  8&9. మీ ఆశయాలు నాకు అంగీకారమే అయినా, మీరు ప్రతిపాదించిన ప్రాతిపదిక కొంచెం తికమకగా ఉంది.
  10.Non-aligned movement was a moral high ground at that point in time. అంతేకాక,అప్పుడే స్వతంత్ర్యం సాధించుకున్న దేశాలు,అగ్రరాజ్యాల cold war బారినపడకుండా, కొంత అభివృద్ధి సాధించుకోవడం దాని ఆశయం. అది మూర్ఖత్వమయ్యుంటే అన్ని దేషాలు కలిసివచ్చేవేకావు…అది అప్పటి అవసరం..ప్రస్తుతం అది దాదాపు irrelevant అయ్యిందికాబట్టే, మనం అమెరికాతో భారీగా దోస్తీకి సిద్దమయిపోతున్నాం.

  11.మీరు చెప్పినదానికన్నా, నాకు జయప్రకాష్ నారాయణ్ చెప్పే political reforms అర్థవంతంగా అనిపిస్తాయి.

 5. శ్రీధర్ says:

  ఎంతొ కొంత డిగ్రీలొ మీరు చెప్పిన అన్ని విషయాలు ఒప్పుకొక తప్పదు. కానీ, టైటిల్ మాత్రం తప్పు. భారత దేశం డిజెనరేట్ అయ్యింది లేదా అవుతోంది అంటే ఎలా ?

  ఏన్ని రంగాలలో ఎంత మంది చిన్నా పెద్దా “నేను సైతం…” అన్న రీతిలో తమవంతు కృషిని చేయకపోతే, మన దేశం కూడా అంతర్యుద్ధంతొ రగులుతున్న ఏ ఆఫ్రికా దేశం లానో రావణకాష్టం ఐయి ఉండేది.

  “ది ఎలెవెన్ కాజెస్ దట్ ఆర్ హొల్డింగ్ బాక్ ఇండియా” – ఇది ఎలా వుంది ?

 6. Hari says:

  I agree with Mahesh Kumar. 🙂

 7. Wanderer says:

  మహేష్ గారు,

  మీరు భారతదేశం లోనే ఉంటారా? ఆంధ్ర ప్రదేశ్ లోనే ఉంటారా? మత మార్పిడులు శాంతి కోసం, సమానత్వం కోసం చేసుకుంటున్నారా అది చేసుకునేవాళ్ళు? మీరు అలా నమ్మదలుచుకుంటే మిమ్మల్ని మరోలా కన్విన్స్ చెయ్యలేను కానీ, ఒకమారు అలా కోస్తా జిల్లాల్లో పల్లెటూళ్ళలోకి వెళ్ళి వాళ్ళ చర్చిల్లో కూర్చుని వినండి వాళ్ళు చెప్పేది. రాజకీయ ప్రయోజనాలు, హిందు మతం పట్ల నిరసన భావం, ద్వేషం కలిగించే మాటలు ఎన్ని వినపడతాయో. మీరు ఆశ్చర్యపోతారు. మీరేదొ సత్యయుగంలో బ్రతుకుతున్నట్టుగా ఉంది. భారద్దేశంలో మతం తాలూకు డైనామిక్స్ బాగా మారిపోయాయి. మతం నైతికత కోసమో స్పిరిట్యువాలిటీ కోసమో కాదిప్పుడు. అదొక బ్రాండింగ్ టూల్.

  చుట్టూ పక్కల చూడరా చిన్నవాడా, చీకట్లో చూపు చిక్కుకున్న వాడా

  wanderer

 8. Wanderer says:

  శ్రీధర్ గారు,

  ఆ టైటిలు కన్యాశుల్కం తాలూకు ఇన్స్పిరేషను. It was meant as a comical title for a serious article. గిరీశం అంటాడొక చోట – నేను మొన్న ది ఎలివెన్ కాజెస్ ఫర్ ది డిజెనెరేషన్ ఆఫ్ ఇండియా మీద లెక్చర్ ఇచ్చేసరికి అందరూ డంగైపోయారు – అని. ఈ టైటిలు రిఫరెన్సు అదీ.

  wanderer

 9. Kiran says:

  I agree with Mahesh Kumar(manchi visleshaNa). Mee టపా ki Mahesh gari modifications chala avasaram. Leka pote mimmalni Congress dveshi gano leka maro — dveshi gano anukuntaru. మురళి garu ivi okasari Alochinchandi…………

  and Don’t hate Congress. Coz, don’t see half emptiness in the glass see its half fulled.

  శ్రీధర్ Garu annattu “ది ఎలెవెన్ కాజెస్ దట్ ఆర్ హొల్డింగ్ బాక్ ఇండియా” – Baవుంది ?

 10. @Wanderer : నేనుకాదు. మీరు ఆంధ్రప్రదేశ్ ని దాటి భారతదేశాన్ని చూడాలి. అంబేద్కర్ జయంతి,వర్థంతి రోజుల్లో నాగ్ పూర్ లో ఆయన స్మారకచిహ్నం సాక్షిగా, బౌద్దమతన్ని స్వీకరించే దళితుల సంగతి మీకు తెలియనట్లే ఉంది. ప్రస్తుతం అందరూ,క్రైస్తవమతం గురించి మాట్లాడుతున్నంత మాత్రానా, “మతమార్పిడులంటే అవే” అనే అపోహలో ఉండకండి.

  దళితులుగా బ్రతుకుతూ, జీవితంలో శాంతిని కోల్పోయి, సమానత్వంకోసం అలమటిస్తూ మతం మారుతున్న కొన్ని వేలమందిని మీరిక్కడికివెళ్తే కలుసుకోవచ్చు.అన్ని మతమార్పిడులనూ ఒకేగాటనకడుతున్న మీ హ్రస్వదృష్టికి, నాలాంటివాళ్ళు సత్యకాలంలో బ్రతుకుతున్నట్లు కనబడటంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు. నేను చీకట్లో ఉన్నాననుకునే మీ వెలుగు నాకైతే అక్కరలేదు.

 11. Wanderer says:

  మహేష్ గారు,

  మీకు తొందరగా కోపం వస్తుంది. మీ comments ని అందరూ విశ్లేషణగా భావించి మెచ్చుకోవాలి. వేరేవాళ్ళు రాసేది మాత్రం మీరు accept చెయ్యలేరు. మంచిది. గఛ్ఛ తాత యథా సుఖం.

  Wanderer

 12. Jyothi Reddy says:

  Murali ji,

  It is really nice criticism. I agree with Mr.Mahesh Kumar about “Degeneration”.
  How about “Regeneration” instead?

 13. bharat says:

  దాశరథి గారన్నట్లు….ఆ తెల్లవాడు మన దేశానికి, జాతికి చేసిన నష్టాలివి. మన చదువుల్ని, తద్వారా మన చరిత్రనీ, మూలాల్ని, మన అలోచనల్ని మార్చేసాడు. మనల్ని వెధవల్ని చేసి, మనం వెధవలం అనికూడా తెలుసుకోకుండా చేసాడు.

  ఆ చదువుల ప్రభావం వల్ల, ఒక్క నెహ్రూ మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ లోనూ, బయట కూడా ఎంతో మంది, దేశానికి, జాతికీ ప్రమాదకరమైన ఇలాంటి ‘ మేధావులు ‘ పుడుతూనే వుంటారు. ఒక్క మహేష్ గారే కాదు మనలో చాలామంది ఆ చదువులు చదువుకొన్న వారే. ఎంతో కన్విన్సింగ్ గా అనిపించే వారి వాదనలు ఈ దేశానికి తీరని నష్టం చేస్తూనే వుంటాయి.

  -భరత్

 14. @Wanderer: మీ వ్యాఖ్యల్నిబట్టే నా వ్యాఖ్యలు ఉన్నాయి.పాటలుపాడిమరీ ఎద్దేవాచేస్తే,దానికి తగ్గ ప్రతివ్యాఖ్య చెయ్యకుండా ఉండటానికి నేను మహాత్ముడ్నికాదు.మామూలు మనిషిని.

  ఇక నా వ్యాఖ్యల్ని విశ్లేషణలుగా మెచ్చుకొమ్మని నేను బోర్డుకట్టుకుని రాయటం లేదు. బాగుంటే అంగీకరిస్తారు, ఆదరిస్తారు ఒక్కోసారి మెచ్చుకుంటారు. అది నా వ్యాఖ్య స్థాయినిబట్టి ఉంటుంది.మీ వ్యాఖ్యస్థాయిని బట్టి మీకూ (తగిన) గౌరవం దక్కుతుంది.

 15. Murali says:

  మహేశ్ గారూ,

  మన మధ్య ఇంతకు ముందు జరిగిన చర్చలు కూడా,(మైనారిటీల గురించి కానీ, శివరాజ్ పాటిల్ గురించి కానీ), ఎప్పుడూ ఒక conclusionకి చేరుకోలేదు. చేరుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే political ideologyకి సంబంధించినంత వరకూ మన మధ్య common ground తక్కువ. ఇప్పుడు మీ ఆరోపణలకు ఒక్కొక్క దానికి జవాబు చెప్పుకుంటూ పోయినా పెద్ద తేడా ఏం ఉండదు. ఎందుకంటే మీరు ఏమీ తెలియని వారు కాదు. నేను గమనిస్తున్నవి అన్నీ మీరూ చూస్తూనే ఉన్నారు, చదువుతూనే ఉన్నారు. కాకపోతే విషయాన్ని వేరే రకంగా interpret చేస్తున్నారు అంతే.

  నా టపాలు ఎవరన్నా చదవచ్చనుకోండి కానీ నేను ముఖ్యంగా రాసేది సగటు పాఠకుల గురించి. తమ ముందు జరుగుతున్నవి చూస్తూ వాటిని పూర్తిగా అన్వయించుకోలేక, తమ frustrationని express చేయలేక సతమతమయ్యే వారి గురించి.

  మీరు నిరభ్యంతరంగా నా టపాల మీద కామెంట్ చేయండి. కాని నేను ప్రతి దానికీ స్పందించకపోతే ఎందుకో అర్థం కూడా చేసుకోండి.

  -మురళి

 16. telugabbai says:

  “కులాన్ని నిర్మూలిస్తే సమ సమాజం దానంతట అదే వచ్చి పడుతుందని కొందరి నమ్మకం. కులాన్ని నిర్మూలించడంకంటే కులం అప్రస్తుతం (irrelevant) అయ్యే వాతావరణం సృష్టించాలి.”
  అద్బుతమైన పాయింటు!

  మా ఇంటి పక్క ఒకామె.. భర్త పోయాడు ముందు… కొన్నాళ్ళకి (ఆర్నెల్ల లోపే) కొడుకు యాక్సిడెంట్ లో పోయాడు… తీవ్రమైన నైరాశ్యంలో ఉన్న ఆమెను, ఆమె కోడలిని…ఎవేవో స్నానాలూ, అవీ చేయించి.. నీ పరిస్థితి కి కారణం ఇదీ…. మారాలంటే, ప్రభువే దిక్కు అని నమ్మించి…ఇప్పుడామె తన పేరు కూడా మార్చుకుంది… దీన్నేమంటారో మరి…

 17. Gayathri says:

  sagatu patakuraliga samsyalanu realise ayyenduku mee tapa, daniki vachhina pratyuttarlu dohadam chestunnayi. Mee prayatnam abhinandaneeyam

  Meeru ee vishleshanalanu inkoka level ki tesuku velladaniki vediaka (ade lendi inkoka tapa 🙂 ) erpatu chesthe inka sagatu pathkulaku anvyayinchukovadaniki inka baguntundemo….

  Udaharanaku:

  #7 : kotta matastulu andaru ventane bharata desha dveshulu avutaru anna comment enta samanjasamo naaku teledu. Kani aa vyakhya pakkana petti, idi chuddam:

  mata marpidulu enduku jargutunnayi ?

  dabbu, itara pralobhalu ante ee rakamyna pralobhalu?

  gurtinchina pralobhalalo dabbu okati kada…dabbu pralobhaniki longutunnaru ante ee rakamyna paristhithullo unna vallu longutunnaru?

  meeru rajakeeyallo, prabhutvam lo unte em ivi arikattadaniki emi chestaru?

  rajakeeyallo, adhikaramlo lekunda toti poruluga manam em cheyagalam?

  etc..?

  Mahesh garu, Wandere garu..meeru kuda oka cheyyi vesthe santosham.

 18. రవి says:

  మురళీజీ, అద్భుతమైన టపా…నాకు వాదన ఇష్టం లేదు, పైగా సమాజాన్ని వాదనతో మార్చేంత గొప్పవాణ్ణీ కాదు కాబట్టి, ఏ పాయింట్ మీదా నా అభిప్రాయాలు చెప్పలేను.

  మీరు సమాజ పరంగా కాక వ్యక్తి పరంగా ఏం చేయవచ్చో ఓ సారి టపాయిస్తే చూడాలని ఓ అభిమాని (నేను) ఆశ.

 19. renu says:

  నేను భరత్ గారి వాదనతొ ఏకీభవిస్తున్నాను
  మహెష్ కుమర్ లా మతం మార్చుకొన్నవారు చేసే వాదనలొ పస లేదు, అయిన వారికి అసలయిన మతమార్పిడి కనిపించదు భరత్ అన్నట్టుగా వీరివల్ల నష్టంఎగాని ఉపయొగం వుండదు.

 20. Shilpa says:

  Murali garu,

  Mee vishleshana sootiga, chadavalanipinchela untundi. Naa lanti sagatu pathakula alochanalaku chakkani akshara roopam mee blogs.

  Ee roju Chiranjeevi gari oka prakatana chusaaka, mee style lo mee vishleshana chudalani undi. Hinudtava ninadam anedi cultural thing – not religious thing ani Advani gari website chusi naku chala anadam vesindi. Kaaranalu emynappatiki aa website chudaka mundu naaku BJP – matatava party ane natabadina abhiprayam undedi. Alage ee roju chusina Chiranjeevi gari prakatana lo – migata party lu anni kuhana loukikavada party lu ani chepparu – adi aayana abhiprayam ani vadilesthe, Nirudyoga muslim yuvakulaku Rs.1000 istamu prati nela anadam emi loukikavadam ? Venta ventane chebutu unna 2 lines lo tananu tanu contradict chesukutunna ane anta avagahaleni ayyana mana mundu prastutam unna alternate ani badha anipinchindi….but at the same time, I might be missing something here. Mee blog lo mee style lo ee item meda vishleshana ivvagaligithe santosham.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s