బట్ట తల వచ్చేసిందే బాలా – 29

“పదమూడు మాస్టర్స్ చేశారా? ఎందుకు సార్?” అడిగాడు పాపారావు.

“అదొక పెద్ద కథ. నేను చెప్పేదానికంటే ఎవరైనా నా కథ రాస్తే బాగుంటుంది. మీరు చదువుకోవచ్చు,” నిట్టూర్చాడు రమణరావు.

“ఇంతకీ మీరు ప్రేమలో ఫెయిల్ ఐనా బాపతా?” మళ్ళీ తానే అడిగాడు మిత్ర బృందాన్ని.

“అంటే ఎగ్జాక్టుగా కాదనుకోండి. మేము ప్రేమించాము. తను ప్రేమించలేదు,” చెప్పాను నేను.

“ఓహో, వన్‌వే లవ్ అన్న మాట, ఐనా చాలా ప్రేమలు వన్‌వేనే అనుకోండి,” రహస్యం చెప్తునట్టు మెల్లగా అన్నాడు రమణరావు.

“అవును సార్. టూవే లవ్ ఐతే ఇలా బార్‌కెందుకొస్తాం?” కొంచెం విసుగ్గా అన్నాడు పాపారావు.

చిన్నగా నవ్వాడు రమణరావు. “సో ఈ అమ్మాయి ఎవరో, ఆమె ప్రేమ దొరకలేదు కాబట్టే, మీరు ఇంత బాధలో ఉన్నారు, అవునా?”

“అవును, అవును, అవును, అవును,” అన్నాం మేము నలుగురం ఒకే సారి.

“కాని ఒక సారి ఆలోచించండి. మీరు బాధ పడుతూంది ఆమె ప్రేమ దొరకనందుకా, లేక ఆమె ప్రేమ దొరకాలి అన్న కోరిక తీరనందుకా?”

“ఏంటి సార్, ఎంత పదమూడు మాస్టర్స్ చేస్తే మాత్రం ఇలా అర్థం కాకుండా మాట్లాడాలా? రెండిటికి తేడా ఏంటి?” అడిగాడు నారాయణ్.

“చాలా ఉంది. ఉదాహరణకు నీకు ఒక యాపిల్ తినాలనిపించింది అనుకో…”

“నాకు యాపిల్ ఇష్టం లేదు సార్! నేనెందుకు తినాలి అనుకుంటాను?” అడ్డం పడ్డాడు నారాయణ్.

“అనుకో ఒక్క నిముషం.”

“నేను అనుకోను సార్. నాక్కొంచెం వ్యక్తిత్వం ఎక్కువ.”

“కాస్త మీ ఫ్రెండ్‌ని అనుకోమనండయ్యా!”

“పోనీ అనుకోరా! ఆయన అంతగా అడుగుతున్నాడు కద,” మేం ముగ్గురం నచ్చ చెప్పాం.

“సరే,” అన్నాడు రిలక్టెంట్‌గా నారాయణ్.

“గుడ్,” అన్నాడు రమణరావు. “సో, నీకు యాపిల్ తినాలి అనిపించింది. కానీ యాపిల్ దొరకలేదు. అప్పుడు నువ్వు బాధ పడతావు. ఐతే బాధ యాపిల్ దొరకనందుకు కాదు. తినాలన్న కోరిక నెరవేరనందుకు. అంటే, నువ్వు యాపిల్ తిని ఉంటే నీకు గొప్ప ఆనందం వచ్చేదో లేదో తెలీదు. కానీ, నీకు బాధ కలిగింది మాత్రం దీనికి. నువ్వు ఒకటి కోరుకున్నావు. అది నీకు దొరకలేదు. అసలు బాధ అది. ఒక వేళ నువ్వు జామకాయ కోరుకుని, అది దొరక్కపోతే కూడా ఇంతే బాధ పడిండేవాడివి. అర్థమయ్యిందా?”

“అర్థమయ్యింది. నాకు నిజంగా జామకాయ అంటే ఇష్టం. దొరక్కపోతే బాధ పడతాను కద!” అన్నాడు నారాయణ్.

తల పట్టుకున్నాడు రమణ రావు. “పోనీలే మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా అర్థం అయ్యింది అని ఆశిద్దాం. తరువాత వాళ్ళు నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు.”

నాకర్థమయ్యింది. ప్రవల్లిక స్థానంలో ఇంకొక అమ్మాయి ఉండి మాకు మొండి చేయి చూపించినా మా పరిస్థితి ఇలానే ఉండేది. దీని బట్టి తెలిసేది ఏంటంటే మాకు ప్రవల్లిక అంటే ఉన్నది గొప్ప ప్రేమ కాదు. జస్ట్ ఇష్టం. మా మీద మాకున్నది అసలు ప్రేమ! మాలాంటి వాళ్ళం ఏదో కోరుకున్నాము. అది మాకు దొరకలేదు. ఎంత అవమానం, ఎంత అన్యాయం, ఎంత నామర్దా!

“ఓకే మరి. ఇంక నేను వస్తాను. బెస్ట్ అఫ్ లక్.” అక్కడి నుండి లేచాడు రమణరావు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

11 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 29

 1. Motorolan says:

  Well… You’ve hit the nail !!!

 2. Jyothi Reddy says:

  Muraliji,
  Ego ni chala smooth ga baga point out chesaru,nice one sir…..

 3. రవి says:

  ఇంతా రాసి, చివరకు ఇలా ఫిలసాఫికల్ ట్విస్ట్ ఇవ్వడం ఏమి బాగాలేదు మురళీజీ 🙂

 4. sagar says:

  naaku kuda apple ishtam ledu..kani ee post baga nachhindi…

 5. మీ logical reasoning చాలా బావుంది.
  వాస్తవాన్ని చాలా సరళంగా, చక్కగా చెప్పారు 🙂
  Keep going..!

 6. Sumna says:

  Murali gaaru.. waiting for your post.. please tondaraga.. Christmas vacation start chesara?

 7. Jyothi Reddy says:

  Murali ji,
  Enti sir busy na inka 30th one post cheyyaledhu inkaaa….

 8. bapu says:

  murali gaaruu! waiting for your next post…

 9. Jyothi Reddy says:

  Merry Christmas Muraliji,emaindi 30th Episode

 10. Wanderer says:

  “నేను అనుకోను సార్. నాక్కొంచెం వ్యక్తిత్వం ఎక్కువ.” ఈ లైన్ అదిరింది 😀 😀

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s