బట్టతల వచ్చేసిందే బాలా – 26

చివరికి నేనొక్కడినే మిగిలాను. మిగతా ముగ్గురి అనుభవాలు విన్నాక, నాకు శక్తులుడిగిపోయాయి. ఏం తోచాక టీవీ ఆన్ చేశా. టీవీలో, “మాదీఫల రసాయనం విత్ మదన్” ప్రోగ్రాం వస్తూంది. ఇందులో మదన్ అనే ఆయన, వివిధ రంగాలనుండి ప్రముఖులని ఆహ్వానించి మాదీఫల రసాయనం తాగుతూ (తాగిస్తూ) కబుర్లు చెప్తాడు.

జెనరల్‌గా ఆ మాదీఫల రసాయనం తాగాక అందరి నోటి నుంచి నిజాలు తన్నుకుంటూ వస్తాయి. కాబట్టి ఆ సంభాషణలు చాలా రసవత్తరంగా ఉంటాయి. ఒకాయన ఐతే తన స్విస్ బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా చెప్పేశాడు. ప్రస్తుతం ఉన్న గెస్ట్ ఒక పెద్ద వ్యాపారవేత్త. మదన్ ఆయన్ని, “మీకు పెళ్ళయింది కదా, మీ మాజీ ప్రేయసులతో టచ్‌లో ఉంటారా?” అని అడిగాడు. దానికి ఆయన తన జేబులోంచి ఒక చిన్న నోట్‌బుక్ తీసి, తన ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌ల ఫోన్ నంబర్లు చదవడం మొదలు పెట్టాడు. అదీ మాదీఫల రసాయనం ఎఫెక్ట్!

ఎందుకైనా మంచిది పడుంటాయి అని, ఆ ఫోన్ నంబర్స్ రాసుకోవడానికి పెన్నూ పేపరూ వెతుకుతూంటే, ప్రవల్లిక ఎప్పటిలానే సుడిగాలిలా మా అపార్ట్‌మెంట్‌లో ఎంటర్ అయ్యింది.

రాగానే, “పదండి బుంకోగిర్రాకి వెళ్దాం. మీతో అర్జెంటుగా మాట్లాడాలి,” అంది.

మాములుగా ఐతే నాకు ప్రవల్లిక మాట్లాడింది సంధి ప్రేలాపనలా అనిపించి ఉండేది. కానీ బుంకోగిర్రా అనే ఒక కాఫీ షాప్ ఉంది అని తెలుసు కాబట్టి, నేను ఖంగారు పడలేదు. పైగా తనని ఎలా అప్రోచ్ కావాలా అని ఎలాగూ ఆలోచిస్తున్నాను కాబట్టి మొహమాటం లేకుండా ఒప్పేసుకున్నాను. ఒక అరగంటలో మేం బుంకోగిర్రాలో ఉన్నాం.

“ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు,” అంటూ సంభాషణ బిగిన్ చేసింది ప్రవల్లిక. నేను ఉలిక్కి పడ్డాను. ఇదేంటి, నేను చెప్పాల్సిన డయలాగులు ఈ అమ్మాయి చెప్తూంది?

నేను ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకునేంత లోపల, “చాలా రోజులనుంచి మధన పడుతున్నాను, మీకు చెప్పాలా వద్దా అని. కానీ చెప్పేయడమే బెటర్ అనిపించింది,” అంది.

నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. వెధవ గుండె, కొంచెం సందర్భం వస్తే చాలు, టకటకా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. “పర్లేదు చెప్పేయి, ఒక పని అయి పోతుంది,” అన్నాను నేను.

“ఇందుకే మీకు చెబ్దామనుకున్నది, మీ సెన్స్ అఫ్ హ్యూమర్ అంటే నాకెంతో ఇష్టం,” నవ్వింది ప్రవల్లిక. అంతలోనే సీరియస్‌గా, “నాలాంటి అమ్మాయి ఎవరినైనా ఇష్టపడ్డం తప్పా, చెప్పండి?” అడిగింది.

“అస్సలు తప్పులేదు. ఇన్ ఫాక్ట్, పడకపోవడమే తప్పు, చెప్పు ఎవరా అదృష్టవంతుడు?” అడిగాను నేను, నా ఆత్రుత బయటకు కనపడనీయకుండా.

ఆల్‌రెడీ నా ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఈ విషయం విన్నాక నారాయణ్, శేఖర్, పాపారావు ఎలా రియాక్ట్ అవుతారో? బహుశా మాస్ హార్ట్ అటాక్ వస్తుందేమో వెధవలకి. ఐనా చిన్నప్పుడే మా నాయనమ్మ చెప్పింది, “నీది మహర్జాతకంరా. నువ్వు ఏది కోరుకుంటే అది దొరుకుతుంది,” అని.

ప్రవల్లిక గొంతు సవరించుకుంది, “ఆ విషయం గురించే కద మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది. నా ప్రేమ గురించి చెప్పాలనే,” అని ఒక్క క్షణం ఆగింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

11 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 26

 1. sarath says:

  అబ్బ ఏం సస్పెన్స్ లో ఆపారండీ!
  కమాన్ సర్ కంటిన్యూ.

 2. sthotakura says:

  super..

 3. Sravya says:

  మాదీఫల రసాయనం విత్ మదన్ 🙂 🙂 🙂 super

 4. venu says:

  aha….. ఏం సస్పెన్స్ …. waiting for the next episode..:)

 5. lachhimi says:

  నేను మీ జట్టు కట్టిఫ్ అసలుకే ప్రతీ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ వుంటాం
  అలాంటిది ఆ సస్పెన్స్ ఇలాంటి చోట ఆపితే ఎలా అండీ
  అవును కాని పాపరో ఎలా వున్నారు :):):)

 6. Aruna says:

  I guessed, what Pravallika is going to say. [:)]

 7. Karthik says:

  ఈ సస్పెన్స్ అన్యాయం..అక్రమం.ఇది మీకు భావ్యం కాదు. 🙂 🙂 🙂

 8. Arun says:

  So did I. I know what girls are VERY good at.

 9. Jyothi Reddy says:

  pravallika kshanam agindhi. meerenti mari 24 gantalu theesuknnaru,thoraga rayandi sir……LOL

 10. Wanderer says:

  ఈ టెన్షన్ నేను తట్టుకోలేను…. మీకు మాదీఫల రసాయనం తాగించాల్సిందే… ఏదీ, ఎక్కడ బాటిల్?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s