బట్టతల వచ్చేసిందే బాలా – 25

ఐతే పాపారావుగాడు శేఖర్‌లా నెత్తిన గుడ్డేసుకోలేదు. ఏకంగా హాస్పిటల్ పాలయ్యాడు. ప్రవల్లిక నుంచి నాకు కాల్ వచ్చింది, “తొందరగా కట్ట మైసమ్మ హాస్పిటల్‌కి రండి. పాపారావుగారికి రోడ్డు ప్రమాదం జరిగింది,” అని. ఫస్ట్ పాపారావుగారు అంటే నాకు వెంటనే వెలగలేదు. తరువాత అర్థమయ్యింది మా పాపిగాడని.

నేను హడావుడిగా కట్ట మైసమ్మ హాస్పిటల్‌కి చేరుకున్నా. చాలా అధునాతనమైన హాస్పిటల్ అది. అమెరికాలో ఇరవయ్యేళ్ళు ప్రాక్టీస్ చేసి వచ్చిన ఒక తెలుగు డాక్టర్ కట్టించాడు. ఆయన తను డాక్టర్ కావడానికి కట్ట మైసమ్మ చలువే కారణం అని నమ్ముతాడు కాబట్టి, ఎవరినీ లెక్ఖ చేయకుండా ఆ పేరు పెట్టాడు.

అప్పటికే నారాయణ్, శేఖర్ వచ్చేశారు. ప్రవల్లిక మమ్మల్ని లాబీలో కలిసింది. అందరం కలిసి పాపారావు ఉన్న రూంకి వెళ్ళాం.

పాప్స్ ఎడమ కాలు పైకి వేలాడదీసి ఉంది. వొంటి మీద అక్కడక్కడ చిన్న చిన్న బ్యాండేజులు వేసి ఉన్నాయి. మమ్మలని చూడగానే ఒకసారి బాధగా మూలిగాడు.

“ఏం అయ్యిందిరా పాపారావు?” ముగ్గురం ఒకేసారి అడిగాం వాడిని.

“ఆటోలోంచి పడ్డా,” నీరసంగా చెప్పాడు వాడు.

“ఆటోలోంచా? నీ బండేమయ్యింది. ఐనా ఆఫీసుకి వెళ్ళలేదా నువ్వు ఈ రోజు?” ప్రశ్నించాను నేను.

“ఈ రోజు సెలవు పెట్టలే. ప్రవల్లిక షాపింగ్‌కి వెళ్దాం రమ్మంది. ఇద్దరం ఆటోలో బయలుదేరాం,” అని ఆపేశాడు వాడు.

“ఆ తరువాత?” సస్పెన్స్ భరించలేక అడిగాడు నారాయణ్.

పాపారావు దీనంగా ప్రవల్లిక వైపు చూశాడు.

“నాకూ సరిగ్గా తెలీదు, ఎందుకు దూకారో. ముందు కిరాణా స్టోర్‌కి వెళ్ళి రెండు, మూడు సరుకులు కొన్నాం. తరువాత బయలుదేరి వెళ్తూంటే, నెక్స్ట్ స్టాప్ ఏంటీ అని తను అడిగితే, ఒక రాఖీ కొనాలి, అక్కడికి వెళ్దాం అని చెప్పగానే, ఒక పెద్ద కేక పెట్టి ఆటోలోంచి బయటకు జంప్ చేశారు! రోడ్డు పక్కన పెద్ద గొయ్యి ఉంది. అందులో పడి బాగా దెబ్బలు తగిలాయి,” వివరించింది ప్రవల్లిక.

మాకు విషయం వెంటనే అర్థమయ్యింది. అలాంటి పరిస్థితిలో ఎవరున్నా ఖంగారు పడడం సహజం. ఐతే మా వాడు కొంచెం కావాలిసినదాని కంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాడు అంతే.

“అసలు రాఖీ కొనడానికి ఎందుకు వెళ్దామనుకున్నావు?” అడిగాడు శేఖర్ ప్రవల్లికని.

“ఎందుకేంటి, ఈ శుక్రవారమే రాఖీ కద! మా పెద్దమ్మగారి అబ్బాయి ప్రతి సంవత్సరం కంపల్సరీగా నాతో రాఖీ కట్టించుకుని ఒక ఐదు వేలో, పది వేలో ఇస్తాడు,” చెప్పింది తను.

“ఓ! ఆ రాఖీ మీ కజిన్‌కా?” నోరెళ్ళబెట్టాడు పాపారావుగాడు.

“మరి! ఐనా మీ రూంమేట్స్ అంతా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు గత కొద్ది రోజుల నుండి. ఎనీ వే, నేను వెళ్ళాలి ఇక. మీరొచ్చేశారుగా. నేను బయలుదేరుతాను,” అంటూ బయటకు నడిచింది ప్రవల్లిక.

పాపారావు దిండు గలీబుని నోట్లో కుక్కుకుని బావురుమన్నాడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

11 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 25

 1. పార్వతి says:

  “నాకూ సరిగ్గా తెలీదు, ఎందుకు దూకారో. ” 😀
  “ఐనా మీ రూంమేట్స్ అంతా చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు గత కొద్ది రోజుల నుండి. ”
  హింత అమాయకురాలా ప్రవల్లిక ?
  “కట్ట మైసమ్మ చలువే కారణం అని నమ్ముతాడు కాబట్టి, ఎవరినీ లెక్ఖ చేయకుండా ఆ పేరు పెట్టాడు. ” — 😀 😀 !

 2. Jyothi Reddy says:

  Murali ji,

  Mee hasyam lo vishayam chala undhandi eesari.
  Telugu doctor,katta maisamma chala bagundi.
  Hasyaniki hasyam + mana dhesham meedha prema

  ….really good

 3. KRISHNA says:

  katta maisamma hospital
  excellent…

 4. బాపు says:

  జాగ్రత్త మురళి గారూ! తరువాత మీ వంతే. మీరేం చేస్తారోనన్న ఉత్కంతతతో ఉన్నాను. మీకు వీలయితే నా బ్లాగ్ ఒకసారి చుడండి.
  http://chandamama-muchatlu.blogspot.com

 5. Jyothi Reddy says:

  మురళిగారు మీ తరువాత ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నాము ……

 6. name says:

  next episode please!

 7. Kanth says:

  మురళిగారు

  మీ పాత బట్టతల బ్లాగులు (link under Categories) వరుస క్రమములో లేవు. (1 నుంచి కాక 25 నుంచి మొదలవుతున్నాయి). లింకు ఎవరికైనా పంపాలన్నా, పాతవి వారు చదువుకోవాలన్న కొంచం కష్టమవుతోంది. దయచేసి కొంచం సరి చేయగలరా? ధన్యవాదములు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s