బట్టతల వచ్చేసిందే బాలా – 23

నారాయణ్‌గాడు మరుసటి రోజు దిగాలుగా కనిపించాడు. ఏం జరిగిందో అడగడానికి మాలో ఎవరికీ ధైర్యం చాల్లేదు. ఆఖరికి ఉండబట్ట లేక పాపారావే అడిగేశాడు, “ఏరా నారాయణ్? నువ్వు ప్రాక్టీసు చేసుకున్న డయలాగులు ప్రవల్లిక మీద ప్రయోగించావా?” అని.

కొన్ని కొన్ని విషయాలు వినడానికి బాగుండవు. మరి కొన్ని చూడ్డానికి బాగుండవు. అలాంటి వాటిలో ఒకటి, చెట్టంత మగాడు కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకోవడం. పాపారావు ప్రశ్నకి నారాయణ్ అలానే రియాక్ట్ అయ్యాడు. మేమందరం ఇబ్బందిగా మెలికలు తిరిగాం.

“చ, ఊరుకోరా. అలా ఏడవకు. అఫ్ కోర్స్, ఏడుస్తున్నావు అంటే మాకు ఒక రకంగా శుభ వార్తే అనుకో. ఐనా ఏడవకు పాపం,” జాలిగా అన్నాడు శేఖర్. వాడి వైపు కొర కొరా చూశాడు నారాయణ్.

“అవునురా, ఏడ్చే మగాడిని నమ్మకూడదు అని అంటారు,” లేని మెచ్యూరిటీని తన గొంతులో పులుముకుని ప్రవచించాడు పాప్స్. నారాయణ్‌కి ఓపిక ఉన్నట్టు లేదు. గొంతు నులుముతా అన్నట్టు ఒక చిన్న సైగ మాత్రం ఇచ్చాడు.

“అసలేం జరిగిందిరా?” అనునయంగా అడిగాను నేను. నారాయణ్ కళ్ళు తుడుచుకున్నాడు.

నారాయణ్ చెప్పిన ఫ్లాష్‌బ్యాక్:

“హల్లో ప్రవల్లిక! నా మాట విని ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్!” అన్నాడు నారాయణ్. వాళ్ళిద్దరూ “బుంకోగిర్రా” అనే కాఫీ షాప్‌లో కూర్చుని ఉన్నారు. ( ఆ పేరుకి అర్థం ఏంటో పెట్టిన ఓనర్‌కి కూడా తెలీదు. ఐతే “శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్” అని పేరు పెడితే ఇప్పటి యువత రారు అని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఈ పేరు సెలెక్ట్ చేశాడు.)

“సర్లే కానీ ఇంత దూరం ఎందుకు నారాయణ్? మా ఇంట్లోనే మాట్లాడుకోవచ్చుగా?” అడిగింది ప్రవల్లిక.

“ఇది మీ ఇంట్లో మాట్లాడే విషయం కాదులే. ఐనా మీ ఇంటికి వస్తే మీ ఫాదర్ భూగోళాసనం వేద్దాం రమ్మంటారు,” బదులు చెప్పాడు నారాయణ్.

“మరి వేయొచ్చు కద. అసలు ఆ ఆసనాన్ని మా నాన్నకు ఇంట్రడ్యూస్ చేసింది మీరే కద!” నవ్వింది ప్రవల్లిక.

“ఇప్పుడా ఆసనం సంగతి ఎందుకులే. ఏదో క్షణికావేశంలో జరిగిపోయిన సంఘటన అది. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి,” ఊపిరి పీల్చుకున్నాడు నారాయణ్. చెప్పండి అన్నట్టు కళ్ళెగరేసింది ప్రవల్లిక.

“పాపారావుగాడికి చిరు అంటే ఎంత ఇష్టం ఉందో, మన దేశంలో అంత కరప్షన్ ఉంది,” మార్దవంగా గొంతు పెట్టి అన్నాడు నారాయణ్.

కన్‌ఫ్యూజ్ అయ్యింది ప్రవల్లిక. “ఈ విషయమా మీరు నాతో చెప్పాలని ఇక్కడికి రమ్మంది?”

“కాదు కాదు! నేను చెప్పాలనుకున్నది, సముద్రంలో ఎంత నీరుందో, మన మూసి నదిలో అంత మురికి ఉంది అని,” అన్నాడు నారాయణ్ ఖంగారుగా.

“మీరు భలే సరదాగా మాట్లాడుతారండి! అందుకే మీ రూంమేట్స్ అంటే అంత ఇష్టం నాకు,” విరగబడి నవ్వుతూ అంది ప్రవల్లిక.

***

“ఆ తరువాత ఏమయ్యింది?” ఆసక్తిగా అడిగాడు పాపారావు.

“ఏమవుతుంది. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో నీ తల మీద అంత జుత్తు ఉంది అని చెప్పుంటాడు. విషయం అర్థం కాలేదా? ఇలానే కాసేపు అర్థం పర్థం లేకుండా మాట్లాడి ముగించి ఉంటాడు. అంతే కదరా?” అన్నాను నేను నారాయణ్ వైపు తిరిగి.

అవునన్నట్టు నీరసంగా తలూపాడు నారాయణ్.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

9 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 23

 1. laxmi says:

  నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో నీ తల మీద అంత జుత్తు ఉంది అని చెప్పుంటాడు.
  ha ha ha 🙂 ROFL man 😀

 2. Sujatha says:

  papam narayan!!!!!!!!!!!

 3. Yours Lovingly says:

  Bunko Girraa…adurs

 4. JYOTHI says:

  Murali ji,

  “పాపారావుగాడికి చిరు అంటే ఎంత ఇష్టం ఉందో, మన దేశంలో అంత కరప్షన్ ఉంది,” haha nenu oppukonu.
  నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో నీ తల మీద అంత జుత్తు ఉంది.Kathi comedy kadha assalu great.

 5. Wanderer says:

  దేశంలో కరప్షన్ విషయం అంత మార్దవంగా చెప్పాడా నారాయణ్? భలే భలే… విషయం ఏదైనా చెప్పే టోన్ మాత్రం చాలా ముఖ్యం అన్న నీతిని తెలుసుకున్నా.

 6. బాపు says:

  మురళి గారు బావుందండి.ఇలాగే కంటిన్యు చేయండి.

 7. రవి says:

  బుంకో గిర్ర లో కాఫీ ఎంతం మురళి గారు ? ఓ యాభై రుపాయలుంటుందా?

 8. durgeswara says:

  mee mail teliyaka vraastunnaanu.ikkada

  lalita sahasranaama yaagam praarambhamavutunnadi

  vivaraalu durgeswara.blogspot.com lo choodamdi

 9. కిరణ్ says:

  Kevvu Keka …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s