బట్టతల వచ్చేసిందే బాలా – 22

పొద్దున్నే నాలుగు గంటలకు నాకు మెలుకువ వచ్చింది. నా జీవితంలో అప్పుడప్పుడు నాలుగు గంటలకు పడుకోవడం తటస్థించింది కాని, చిన్నప్పుడు పరీక్షల టైంలో కూడా నేను ఎప్పుడూ ఇంత పొద్దున లేవలేదు. మరి ఇప్పుడు ఎందుకు లేచాను?

ఏవో మాటలు లీలగా వినిపిస్తున్నాయి. అందుకే మెలుకువ వచ్చినట్టుంది. నేను లేచి కళ్ళు నులుముకుంటూ హాల్లోకి వచ్చాను. పాపారావుగాడూ, శేఖర్ కూడా అప్పుడే హాల్లోకి వస్తున్నారు. మేము ముగ్గురం ఒకరి మొహాలు ఒకరం చూసుకున్నాం.

నారాయణ్‌గాడి రూం నుంచి వస్తున్నాయి సౌండ్స్. మేం ముగ్గురం మెల్లగా అటు వైపు వెళ్ళాం. తలుపు సగం తెరిచే ఉంది. నారాయణ్ అద్దం ముందు నిలబడి మాట్లాడుతున్నాడు.

“రెండు మూడు రోజులనుంచి కాస్తా తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. పూర్తిగా మెంటల్ ఎక్కిందంటావా?” నా చెవిలో గుసగుసలాడాడు పాపారావు.

“ష్. విన్నాడంటే మనకు మెంటల్ ఎక్కిస్తాడు,” కసురుకున్నాను నేను.

“అసలు వాడేం మాట్లాడుతున్నాడో విందాం,” మెల్లగా అన్నాడు శేఖర్. మేం చెవులు రిక్కించాం.

కాస్త ఫోకస్ వచ్చాక మాకు వాడు మాట్లాడే మాటలు వినపడసాగాయి. “సముద్రంలో ఎన్ని నీళ్ళుంటాయో, నా మనసులో నీ మీద అంత ప్రేమ ఉంది,” అన్నది మాకు మొదట వినవచ్చిన మాట. మేం ఉలిక్కిపడ్డాం.

“నిజమేరోయి, నువ్వన్నట్టు పిచ్చే ఎక్కినట్టుంది,” అన్నాను నేను. “ష్,” అన్నాడు శేఖర్. నేను సైలెంట్ అయిపోయాను.

“ఇన్ ఫాక్ట్, సముద్రంలో నీళ్ళకంటే కూడా ఎక్కువ,” కన్‌ఫర్మ్ చేశాడు నారాయణ్. “నిజానికి, నిజానికి, ఆ! మన దేశంలో ఉన్న కరప్షన్ కన్నా ఎక్కువ.”

మళ్ళీ మేం మొహమొహాలు చూసుకున్నాం. మా అందరికి ఒక్కసారే వెలిగింది. “వీడు ప్రవల్లికతో చెప్పాల్సిన డయలాగులు ప్రాక్టీసు చేస్తున్నాడు!” ఆశ్చర్యంగా అన్నాడు పాపారావు.

నాకు పెద్దగా నవ్వు వచ్చింది. అది ముందే ఊహించినట్టు నా నోరు మూసేశాడు శేఖర్. లోపల నారాయణ్‌గాడు మళ్ళీ నోరు చేసుకున్నాడు.

“చీ! కరప్షన్ అన్నానా! నీచమైన పోలిక. సముద్రంలో నీళ్ళకే సెటిల్ అయిపో. ఐతే నీకో అనుమానం రావచ్చు. మేం నలుగురం ఉన్నాం కదా, నన్నే ఎందుకు ప్రేమించాలి అని,” అక్కడ లేని ప్రవల్లికని ఉద్దేశించి అన్నాడు నారాయణ్.

నిజం చెప్పొద్దూ! వాడి సోషలిస్ట్ దృక్పధాన్ని చూసి నాకు ముచ్చటేసింది. అంతలో మళ్ళీ వాడే అన్నాడు, “నీకు వాళ్ళు నచ్చరు. ఎందుకంటే వాళ్ళూ వెధవలు, నాకు తెలుసు,” డ్రమాటిక్‌గా ఆగాడు వాడు.

నాకు వొళ్ళు మండింది. మరి ఎంత నిజమైనా మొహమ్మీదే చెప్తే ఎవరికైనా మండుతుంది.

“నిజానికి నేనూ వెధవనే,” కన్‌ఫెస్ చేశాడు నారాయణ్. నాకు మళ్ళీ వాడి మీద అభిమానం ముంచుకొచ్చింది.

“ఐతే ఒక చిన్న తేడా! నేను మనసున్న వెధవని. కాబట్టి నా ప్రేమనే నువ్వు ఒప్పుకోవాలి,” పరవశంగా అన్నాడు.

“బాగుందిరా. కొత్త సిన్మాకు టాగ్ లైన్‌లా భలే పనికొస్తుంది. ‘ నారాయణ్ – ఐతే వీడు మనసున్న వెధవ ‘ అంటే సరిపోతుంది,” ఇక అక్కసు ఆపుకోలేక గట్టిగా అన్నాను నేను.

ఉలిక్కిపడి వెనక్కు తిరిగి మమ్మల్ని చూసి షాక్ తిన్నాడు నారాయణ్. అంత మసక వెలుతురులోనూ వాడి మొహం ఇంద్ర ధనుసులా రంగులు మారడం మాకు క్లియర్‌గా కనిపించింది.

“మమ్మల్ని వెధవలంటే అన్నావు కానీ, ఇలాంటి డయలాగులు కొడితే ఏ పిల్లరా నిన్ను ప్రేమించేది?” ప్రశ్నించాడు శేఖర్.

“అంటే చెప్పే డయలాగుల్లో కొంత నిజాయితీ ఉంటే అమ్మాయిలకు నచ్చుతుంది అని ఒక పుస్తకంలో చదివాను,” సిగ్గు పడుతూ చెప్పాడు నారాయణ్.

“అది కొన్ని కత్తిలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు కొంత నిజాయితీ చూపినా బాగుంటుంది. నిలువెల్లా ఏబ్రాసి లక్షణాలతో నిండి ఉన్న మనకు ఆ ఫార్మూలా వర్క్ఔట్ కాదు,” చెప్పాను నేను.

“అంతేనంటావా?” దిగులుగా అన్నాడు నారాయణ్.

“అవును అంతే. ఇక పోతే నీ వరస చూస్తూంటే ప్రవల్లికకు నీ ప్రేమ గురించి చెప్పబోతున్నావు అని అర్థమవుతూంది. ఆల్ ది బెస్ట్. ఐతే ఇవి కాక ఇంకేవైనా చెప్పు. ఏం గుర్తుకు రాకపోతే మన పాపిగాడి సాంగ్స్ అన్నా పాడు పర్లేదు. కానీ ఈ డయలాగులు మాత్రం వద్దు. నీ ప్రేమే కాదు, నీకు రూంమేట్స్ ఐనందుకు మా ప్రేమలు కూడా ఆం ఫట్ అవుతాయి,” అని చెప్పి నేను నిద్ర పోవడానికి బయలుదేరాను. మిగత ఇద్దరూ కూడా నన్ను ఫాలో అయ్యారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

11 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 22

 1. పార్వతి says:

  Liked this episode a lot, Interesting twists and turns, and funny at the same time ! 😀

 2. bapu says:

  two days nundi mee post kosam every one hour ki okasari chusthunna. motthaniki ippudu chadivaa. mee inspiration tho nenu kuda blogudamanukuntunnanu. thwaralone modalu pedamanukontunnaa… meeku veelaithe adi chadivi mee viluvaina salahalu, suchanalu istharani aashisthuuuu….
  mee paatakudu,
  bapu.

 3. ఏమయ్యా ఇరవై రెండు భాగాలు రాసేదాకా తీరిక దొరకలేదా అని మీరు అనకపోతే ఒక విషయం: ఇప్పుడే మొదటినించి చదివాను. మీ శైలి చాలా బాగుంది. మల్లిక్‌లాగ కొంచెం వెటకారం, అంతలోనే జంధ్యాల లాగ హాస్య సంధర్భాలు, అంతలోనే త్రివిక్రంలా మాటల గారడీలు.. అడపదడప రమణలా ఇంటలెక్టువల్ హాస్యం. మీకు ఇరవై రెండు వీర తాళ్ళు… అభినందనలు.

 4. sagar says:

  nenu chadivina modati telugu blog mide..americalo apasopalu ane tapa chadivanu…mee battatala vachhesinde kachitamga chaduvutanu…u r simply superb and i feel u can try as a story writer

 5. Sujatha says:

  Ayyoyyoh…entidi meeru(NENU CHARACTER),kasepu agithe NARAYAN inka ememi dialogues cheppevado thelisediga..,appude addukunnaru.NARAYAN dialogues chala interesting ga vunnayi..,wish you good luck NARAYAN…

 6. bapu says:

  చాలా బాగా వ్రాశారండి. మీరూ, తోట రాముడు (గౌతం ) గారు బాగా నవ్విస్తున్నారు. కృతజ్ఞతలు.

 7. JYOTHI says:

  Muraliji,
  Happy thanksgivng day and waiting for “morning coffee” lanti mee comedy story kosam kaaani nirashani migilincharu entandi…

 8. JYOTHI says:

  Emayyindheeee….rest mode lo unnaraa?24th inka raledhu!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s