బట్టతల వచ్చేసిందే బాలా – 21

సాయంత్రం. పాపారావుగాడు ఇంకా రాలేదు. నేనూ, శేఖర్, నారాయణ్ ఏదో ఇంగ్లీష్ సస్పెన్సు థ్రిల్లర్ చూస్తున్నాం. నారాయణ్‌గాడు ఎక్కడినుంచో డీవీడీ పట్టుకొచ్చాడు. చాలా ఆసక్తిగా ఉంది సినిమా. ఒక శ్రీమంతుడు తన భవంతిలో హత్యకు గురి అవుతాడు. ఆయన చనిపోయిన సమయానికి ఇంట్లో చాలా మంది ఉన్నారు. చుట్టాలూ, స్నేహితులు, నౌకర్లు. కాని ఎవరు చంపారో తెలీదు. ఒకటే ఉత్కంఠ. మేం ముగ్గురం గోళ్ళు కొరుక్కుంటూ మరీ చూస్తున్నాం.

“కాసేపు సినిమా ఆపండ్రా. నా గోళ్ళు అన్నీ అయిపోయాయి. కొరకడానికి ఇంకా ఏం మిగల్లేదు,” రిక్వెస్ట్ చేశాడు శేఖర్. మా గోళ్ళు కూడా దాదాపు అయిపోయాయి కాబట్టి, నేను సినిమా టెంపరరీగా ఆపేశా.

“పొద్దున మీ నాన్న కాల్ చేసినట్టున్నాడు?” నేను శేఖర్‌ని అడిగాను. “అవున్రా చేశాడు. ఏదో పనుందంట, వచ్చే వారం సిటికి వచ్చి నన్ను కలిసి వెళ్తాడట,” చెప్పాడు శేఖర్.

వెంటనే విజిల్ వేశాడు నారాయణ్. “వెరీ గుడ్. ఐతే పనిలో పనిగా మీ నాన్నతో పూతరేకులు, కారప్పూసా లాంటివి తెప్పించు. మీ మదర్ భలే చేస్తారు అవి.”

“చేస్తారు, కాని రెండు నెలలకింద పంపించిన వంద కజ్జి కాయలు నువ్వు పాపారావుగాడు కలిసి సగం సగం లాగించి ఒక్క రోజులో ఖాళీ చేశారని తెలిసాక, మా అమ్మ మనసు విరిగిపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి కడుపాత్రంగాళ్ళకి ఉద్దరగా చిరుతిండ్లు పంపించనని మా ఊరి మైసమ్మ గుడి ముందు వొట్టు వేసిందట,” కోపంగా చెప్పాడు శేఖర్.

చాలా డీప్‌గా హర్ట్ అయ్యాడు నారాయణ్. “కడుపాత్రం అని ఆంటీ తిట్టచ్చు. తప్పు లేదు. పెట్టే చేయికి తిట్టే హక్కు కూడా ఉంది. కాని సగం సగం తినడమేంటి? ఇలాంటి నీలాపనిందలు నేను భరించలేను. నేను తిన్నవి నలభయి తొమ్మిదే, పాపిగాడు యాభయి ఒకటి తిన్నాడు,” అన్నాడు బాధగా.

“ఏడ్చావు. మీ కక్కూర్తికి నేను బలయిపోయాను. నాకోసం ఏమన్నా పంపుదామన్నా, అది నా దాకా రాకుండా మీరే మెక్కేస్తారని మా అమ్మకు గట్టి అభిప్రాయం ఏర్పడిపోయింది,” మెటికెలు విరిచాడు శేఖర్.

అర్గ్జెంట్‌గా ఈ టాపిక్ మార్చకపోతే ప్రమాదమని గ్రహించినట్టున్నాడు, “సరే సినిమా కంటిన్యూ చేద్దాం, ఎవరు హంతకుడో తెలుసుకోవాలని నాకు తెగ కుతూహలంగా ఉంది,” అంటూ ప్లే బటన్ నొక్కాడు నారాయణ్.

సినిమా మొదలు కాగానే మేమంతా మళ్ళీ అందులో నిమగ్నమైపోయాం. కథ దాదాపు క్లైమాక్స్‌కి వచ్చింది.

ఇంతలో, “పడ్డానండి బురదలో మరి, ఎద్దేవా చేసింది చిన్నది. నిజంగా, నిజంగా! ఈ రోజే జారానుగా!” అని పాడుకుంటూ పాపారావుగాడు ఎంటర్ అయ్యాడు.

“ఒరేయి వస్తే వచ్చావు గాని, కాళ్ళూ చేతులకు అడ్డంపడకుండా కాస్త సైలెంటుగా కూర్చో,” హెచ్చరించాడు నారాయణ్.

పాపారావు టక్కున పాట ఆపేశాడు. ఒక రెండు నిముషాలు తనూ కూడా సినిమా చూసి, “భలే ఉంది కద ఈ సినిమా? నేను కూడా మొదటి సారి చూసినప్పుడు చాలా టెన్షన్‌గా ఫీల్ అయ్యాను. వాళ్ళింట్లో పనమ్మాయే మర్డర్ చేసిందనీ, ఆమెనే హంతకురాలనీ, నేను అసలు గుర్తు పట్టలేక పోయా,” అన్నాడు.

ఈ సారి పాపారావుని పీక నొక్కడానికి ముందుకు దూకిన నారాయణ్‌ని గానీ, శేఖర్‌ని గానీ నేను ఆపలేదు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

7 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 21

 1. lachhimi says:

  nenu kooodaa aaapanu caryyy on :):):)

 2. bapu says:

  baagundi… paddanandi buradalo mari… premante buradaa?

 3. రవి says:

  ఈ ధారావాహిక మీరు మొదలెట్టినప్పుడు ఎలానో మిస్ అయాను. అన్నీ అయిన తర్వాత ఒకేసారి చదవొచ్చు అనుకున్నా.

  ఇప్పుడెందుకో సడన్గా మొదటి ఎపిసోడ్ చూస్తే, చచ్చేలా నవ్వించారు. hats off!!!

  నిదానంగా మొత్తం చదువుతా..

 4. VJ says:

  మరి మీ బ్యాచ్ కి ఆర్ధిక మాంద్యం తగలలేదా??

 5. బద్దకపు వీరుడు says:

  As usual, another excellent episode!

 6. పార్వతి says:

  😀 As usual, పాపారావు పాట భలే ఉంది ! ఈ కథ లానే !

 7. Murali says:

  లచ్చిమి: మీకెందుకండి పాపారావు అంటే అంత ద్వేషం!

  బాపూ గారూ: ఒక రకంగా చూస్తే ప్రేమ బురదలాంటిదే. ఐతే జనాలు రకరకాలుగా చూస్తారు లెండి.

  రవి గారూ: నా అభిప్రాయంలో సీరియల్ రాయడం/చదవడంలో ఉన్న ఆనందం వేరు.

  వీజే గారూ: మా వాళ్ళు బట్టతలతో పడుతున్న బాధలు చాలు. వాళ్ళకు కొత్త సమస్యలు ఎందుకు లెండి.

  వీరుడు & పార్వతి: థాంక్స్!

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s