బట్టతల వచ్చేసిందే బాలా – 20

ఆర్డర్ లేనంతమాత్రాన మేము పోటుగాళ్ళ మల్లె మా ప్రేమని హడావుడిగా ప్రవల్లికకు తెలియజేసే పరిస్థితిలో లేమని మాకు అండర్‌స్టాండింగ్ అయిపోయింది.

అపరిచితుడు సినిమాలో విక్రం, “ప్రేయసి కళ్ళల్లోకి సూటిగా చూసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగిన వాడు దేవుడి కంటే బలవంతుడు,” అని ఎందుకన్నాడో నాకు ఇప్పుడు అర్థమయ్యింది.

అలా అని చెప్పకుండా కూడా ఉండలేము. ఎలాగోలా, ఎప్పుడో ఒకప్పుడు చెప్పి తీరాలి. ఎందుకంత తప్పని సరిగా చెప్పాలి అంటే మరి నా దగ్గర సమాధానం లేదు. గాలి ఎందుకు వీస్తుంది? మన తెలుగు చానెల్స్ ఎందుకు దిక్కుమాలిన సీరియల్స్ ప్రసారం చేస్తాయి? మన అసెంబ్లీలో ఎం.ఎల్.ఏలు ఎందుకు కల్లు కాంపౌండ్‌లో జనం కంటే బేవార్సుగా బిహేవ్ చేస్తారు? అలానే మేమూ చెప్పి తీరాలన్న మాట.

****

సాయంత్రం. టీవీలో న్యూస్ చూస్తున్న పాపారావుగాడు ఒక్కసారి ఘొల్లుమన్నాడు. వాడికి అంత కష్టమేమొచ్చిందో అని మేం పరిగెట్టాం.

“ఒరే పాపిగా! ఏమయ్యిందిరా?” అడిగాడు నారాయణ్.

“చూడండ్రా చిరు టాలీవుడ్‌లో కింగులా ఉండేవాడు. అలాంటిది ఈ రాజకీయాల్లో చేరాక, అడ్డమైన ప్రతి వెధవతో మాటలు పడుతున్నాడు. అదలా ఉంచు. ఈ రోజు ఎవరో కోడిగుడ్లు కూడా విసిరారంట. అన్నయ్యకేంటి ఈ ఖర్మ?” అంటూ బావురుమన్నాడు.

“ఒరేయి, కొన్ని మంచి పనులు చేయాలంటే కొన్ని కష్టాలు పడాల్రా. చిరు సినిమాలు అన్ని చూశావు. ఇదేనా నువ్వు అర్థం చేసుకుంది?” ప్రశ్నించాడు శేఖర్.

అర్థం కానట్టు మొహం పెట్టాడు పాపారావు.

లోపలికి వెళ్ళి టేప్ రికార్డర్ పట్టుకొచ్చాడు శేఖర్. మీట నొక్కగానే పాట మొదలయ్యింది.

“ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే రాలగా…”

“ఇప్పుడీ పాటెందుకు పెట్టావు?” అడిగాడు పాపారావు.

“ఈ లైన్లు విను. నీకే తెలుస్తుంది,” చెప్పాడు శేఖర్.

“మహరాజు కాలి సమిధల్లె మారి నిలువెల్లా వెలిగెరా
భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా
జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరే హోమజ్వాలలుగా”

బల్బు వెలిగింది పాపారావుకి. కళ్ళు తుడుచుకున్నాడు.

“అదన్న మాట. జనంకోసం ఈ కష్టాలు తప్పవు,” వివరించాడు శేఖర్.

As usual ప్రవల్లిక టక్కున మా అపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయ్యింది.

“హయ్యి, ఇంద్రా పాట! నేను ఇరవయి సార్లు చూశాను ఈ సినిమా,” చెప్పింది ఆనందంగా.

“నేను అన్నయ్య సినిమా ఏదీ పాతిక సార్ల కంటే తక్కువ చూడలేదు,” గర్వంగా చెప్పాడు పాపారావు.

నారాయణ్ చానెల్ మార్చినట్టున్నాడు. సడన్‌గా “మన్మధా మన్మధా మామ పుత్రుడా,” అంటూ టాగూర్ సినిమాలో పాట స్టార్టయ్యింది.

చిరు స్టెప్స్ మొదలు కాగానే, ఆనందంగా మేమంతా డ్యాన్సు చేయడం మొదలెట్టాం. పాట మధ్యలో, “ఏందివయా ఇది, మల్ల దుంకులాడ బట్టిర్రు,” అన్న అరుపు వినిపించింది. వెనక్కు తిరిగి చూస్తే కింద ఫ్లోర్‌లో ఉండే యాదగిరి. మా పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. ప్రవల్లికకి యాదగరి సంగతి తెలీదు కాబట్టి తను డ్యాన్సు కంటిన్యూ చేస్తూ ఉంది.

మేం నలుగురం ఆగిపోగానే పాట వినిపించినట్టుంది. యాదగిరి ఆనందంగా విజిల్ వేశాడు. “మన మెగాస్టార్ పాట! బొంబాట్ డ్యాన్సు చేస్తున్నడులే,” అంటూ యాదగిరి కూడా చిందెయ్యడం మొదలెట్టాడు. ఒక్కసారి ఊపిరి పీల్చుకుని, మేం కూడా అతన్ని జాయిన్ అయ్యాం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

17 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 20

  1. ఇక్కడ నేను కూడ డాన్స్ మీ సిరీస్ అన్ని భల్లే ఉన్నాయి. చదివే వాళ్ళాలో నేనొకడిని 🙂

  2. ravindra says:

    “మన అసెంబ్లీలో ఎం.ఎల్.ఏలు ఎందుకు కల్లు కాంపౌండ్‌లో జనం కంటే బేవార్సుగా బిహేవ్ చేస్తారు? “.. super 😀

  3. పార్వతి says:

    😀

  4. sudheer chowdary says:

    చాలా బాగా వ్రాస్తున్నారు , అభినందనలు , కానీ నాటకీయత కొంచం ఎక్కువ కాకుండా జాగ్రత్థ వహిం చమని మనవి, అలాగె బట్ట తల రాకుండా టీసుకొవలసిన జాగ్రత్థ లు తెలుపండి , మీకు తెలిస్తె , కానీ చాలా బాగా వ్రాస్తున్నారు , ఇదె టెంపొ కొనసాగించండి ,

  5. sudheer chowdary says:

    endukandee meeru always praising chiranjeevi
    it seems on u r in an illusoin that no other actor is in telugu,

    always praising chiru, may be he is a good actor but that doesn’t mean he is tha only actor

    please stop this propaganda

  6. Jyothi Reddy says:

    Mee jokes ki nenu veerabhimaninandi,

    “ఘల్లు ఘల్లుమని సిరిమువ్వల్లే చినుకే రాలగా…”

    “ఇప్పుడీ పాటెందుకు పెట్టావు?” అడిగాడు పాపారావు.

    “ఈ లైన్లు విను. నీకే తెలుస్తుంది,” చెప్పాడు శేఖర్.

  7. Murali says:

    సుధీర్ గారూ,

    నేనెప్పుడూ చిరంజీవి తప్ప వేరే యాక్టరు లేడు అనలేదు. ఐతే, మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యమైన మాస్ హీరోలు ఇద్దరే అని నా అభిప్రాయం. 1. ఎన్.టి.ఆర్ 2. చిరు. (నేను ఎన్.టి.ఆర్ పాత సినిమాలకి, పౌరాణికాలకి కూడా పెద్ద ఫ్యాన్‌ని.)

    నేను “చిరు” చిత్రాలు చూస్తూ పెరిగి పెద్దవాడయ్యాను. నాకు సంబంధించి సూపర్ స్టార్ ఐనా మెగా స్టార్ ఐనా అతనే. అలా అని నేను వేరే ఎవరి సినిమాలు చూడలేదని కాదు, వాళ్ళని ద్వేషిస్తాను అని కాదు.

    నా లానే నా సీరియల్‌లో ఆ నలుగురికి చిరు అంటే అభిమానం. అందులో తప్పేముంది?

    నేను ఎక్కడ చిరుని మోతాదు మించి పొగడలేదు. చిరుకి ఉన్న మాస్ ఇమేజ్‌ని కొన్ని సార్లు ప్రస్తుతించాను అంతే. రాజకీయంగా చిరు అవక తవకలు చేయడం మొదలుపెడితే నా అభిమాన నటుడు కదా అని ఏ మాత్రం వదిలిపెట్టను.

    ఇంకోటి. ప్రాపగాండా అంటే నిజానిజాలతో సంబంధం లేకుండా ఊదరగొట్టే ప్రచారం చేయడం. నా 140+ టపాలలో, చిరు గురించి ఓ నాలుగో ఐదో టపాలలో మాత్రమే రాశాను. అది ఏ రకంగానూ ప్రాపగాండ కిందకి వస్తుందని నేను అనుకోను.

    -మురళి

  8. మురళి గారూ మీరు స్వేచ్చగా వ్రాయండి . చదివే వాళ్ళం మేమున్నాం.

  9. పార్వతి says:

    Ditto to shiva garu !

  10. Sujatha says:

    Murali garu,
    chala chakkaga answer chesaru..,as a writer mee abhimananni athiga chatukunte bahusa thappemogani,mee rachanallo ekkada adi mithi meeraledu so don’t worry please carry on….moreover chiranjeeviki nenu goppa fan..KHAIDI cinemalo oka scenelo bladetho chathi meeda kostharu,adi cinema ayinappatiki chusthe thattukolenantha badha, villain meeda antha kopam vasthundi,antha pichi “chiru” ante.so na varaku…meerentha pogidina ok.. ala ani kakapoyina “meeru limit cross chesi mathram rayatam ledu I am very sure about that..”ika pothe NTR anna anthe abhimanam kadu aradhana kadu kadu bhakthi kadu kadu…cheppalenu…indulo na abhiprayalu meetho ekeebhavinchinanduku chala happy.why bcuz IAM GREAT FAN OF YOU ALSO NOW A DAYS.ika BANDARU SHIVA garu cheppinattu meeru swechaga rayandi…….ippatike ekkuvayindi vuntanu waiting for next episode..chala eagerga…

  11. Sujatha says:

    deto to shiva and parvathi,we are here to read with great interest.

  12. bhaskar says:

    Baabu,

    I am reading all your articles with great feeling that you have good understanding on the currect burning issues. (I am preparing for civils in Brain Treee institute. and i used to tell my frnds abt u.)

    But after seeing recent articles it clearly shows that you are aslo a POLITICALLY motivated BLOGER. mammalni ilaa champe kante, aa sodi concept lu kadhalo rayaku baabu. If I hurt you I sincerely aplogise for that, but its my OWN feeling and My OWN observation.

    Anyway its a good serial of stories. All the best for your future articles.

  13. Murali says:

    Bhaskar baabu,

    Firstly, thanks for the nice words. I appreciate it.

    I AM a politically motivated blogger definitely in the sense, my leanings are right-wing and I firmly oppose pseudo-secularists and communists.

    I AM NOT a politically motivated blogger as far as promoting Praja Rajyam Party or Chiru is concerned. I like Chiru as an actor primarily, and all the references I make about him are regarding the image he enjoys in masses.

    Just because my characters like Chiru, it doesn’t mean I endorse everything Chiru does. You have to understand this crucial difference. 🙂

    -Murali

  14. bhaskar says:

    Thank you man,

    You have shown your maturity in answering. Actually i wrote this comment just to test your intentions/maturity. ( I may crossed my LIMITS in doing so). Dont keep it in mind.

    All the best man,

  15. lachhimi says:

    enti ikkada koodaa pareekshalu chestaraa manshulni
    emitooooooooooooooooooooooo

    kaani murali gaaru meeru kekaa ans ichharandeee

  16. Murali says:

    అశ్విన్ గారూ: జాగ్రత్త. డ్యాన్సు చేసే ముందు కింద యాదగిరి ఉన్నాడేమో చూసుకోండి.

    రవీంద్ర & పార్వతి & శ్రావ్య: థాంక్స్!

    శివ & సుజాత & లచ్చిమి: నేనెలాగూ నేను రాయాలనుకున్నది రాస్తాను. ఐతే హద్దులు దాటకుండా చేసే విమర్శలకు వీలైనంతవరకు సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తాను. అలా అని విమర్శించడమే పనిగా పెట్టుకున్నవారికి ప్రతి సారి సమాధానం చెప్పను.

    -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s