బట్టతల వచ్చేసిందే బాలా – 19

నేను గొంతు సవరించుకున్నాను.

“ఏరా, కొత్త ఐడియా ఏమైనా వచ్చిందా?” నెమ్మదిగా అడిగాడు నారాయణ్.

“అవునురా వచ్చింది. ఎలా తెలిసింది నీకు?” బోలెడు హాశ్చర్య పోయాను నేను.

“వస్తుందిరా! ఎందుకు రాదూ. ఏ దిక్కు మాలిన ఐడియా ఇచ్చినా పాటించే ఏబ్రాసి గాళ్ళం ఉన్నాం కద ఇక్కడ,” ఉక్రోశంగా అన్నాడు శేఖర్.

నేను విపరీతంగా ఫీల్ అయిపోతున్నట్టు మొహం పెట్టాను.

“అంత ఓవరాక్షన్ వద్దు. ఇంక నుంచి ఈ పరీక్షలు చెత్తా ఏం లేవు. అంతా ఫ్రీ ఫర్ ఆల్. ధైర్యే సాహసే ప్రవల్లికా,” అన్నాడు నారాయణ్.

“అంటే ఒక ఆర్డర్ లేకుండా ఎవరు పడితే వాళ్ళు తమ ప్రేమని వెళ్ళడిస్తారా ప్రవల్లికతో?” ఆవేశంగా అన్నాను నేను. నాకు చిన్నప్పటినుంచి ఆవేశం ఎక్కువ.

“యా!” అన్నారు వాళ్ళు ముగ్గురు నాకంటే ఆవేశంగా.

ఎవరో తలుపు తట్టారు. తీసి చూస్తే ప్రవల్లిక. “హలో! ఏం చేస్తున్నారు?” అంటూ సుడిగాలిలా లోపలికి వచ్చేసింది.

మేమందరం శరవేగంగా రియాక్ట్ అయ్యాం. ఎలాంటి ఆర్డర్ లేదు కాబట్టి, ఎంత ముందు మా మనసులో మాట చెప్తే అంత మంచిదని డిసైడ్ అయ్యి, “ప్రవల్లిక నిన్నొకటి అడగాలి,” అన్నాం ముక్తకంఠంతో.

ఏంటి అన్నట్టు నడుము మీద చేతులు వేసుకుని కళ్ళెగరేసింది ప్రవల్లిక. ఆ ఫోజుకి మాకు గొంతులో తడారిపోయింది.

“నీకు పంతొమ్మిదో ఎక్కం వచ్చా ప్రవల్లికా?” అడిగాడు పాపారావుగాడు ఇకిలిస్తూ.

“Silly question!” అంది ప్రవల్లిక నవ్వుతూ.

“అవును చాలా సిల్లీ! భూగోళాసనం మీద నీ అభిప్రాయం?” అన్నాను నేను.

“ఆ ఆసనం గురించి నాన్నకు చెప్పింది మీరేనా మహాశయా! ఈ మధ్య ఆయన ఎక్కడ పడితే అక్కడ ప్రాణాచారం పడిపోతూ, మాకు కాళ్ళకూ చేతులకూ అడ్డం పడుతున్నారు. ఏమన్నా అంటే బాబా రాందేవ్ చెప్పాడు అంటారు,” విసుగ్గా అంది ప్రవల్లిక.

“మీ ఇంట్లో ఏవైనా తెలుగు పుస్తకాలు ఉన్నాయా?” నసిగాడు శేఖర్.

“ఓ, బోలెడు ఉన్నాయి. మను చరిత్రం, శృంగార నైషధం, కళా పూర్ణోదయం, వసు చరిత్ర, విజయ విలాసం,” చెప్పుకొచ్చింది ప్రవల్లిక.

“మధుబాబు రాసిన షాడో బుక్స్ ఏం లేవా?” ఆ పేర్లను మొదటి సారి వినడం వల్ల భయపడి అడిగాడు శేఖర్.

“షాడో బుక్సా. మీరు అవి తప్ప ఇంకేం చదవరా?” ఆశ్చర్యపోయింది తను.

“ఎందుకు చదవం. అవన్నీ చిన్నప్పుడే చదివేశాం. ఇప్పుడు ఇంక తెలుగులో మిగిలింది షాడో బుక్సే,” కోశాడు నారాయణ్.

“Wow! మీరు ఆ రోజు మీ కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ గురించి మాట్లాడుతున్నప్పుడే అర్థమయ్యింది నాకు మీరు అందరిలాంటి అబ్బాయిలు కారని. కానీ నా దగ్గర షాడో బుక్స్ లేవండీ! సారీ!” బాధగా అంది ప్రవల్లిక.

ఒక్క క్షణం ఆగి, “ఇవేనా మీరు నన్ను అడగాలనుకున్నవి?” అంది కొంచెం అనుమానంగా.

“ఇవే!” అన్నాం మేము ఎప్పటిలానే ముక్త కంఠంతో.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

5 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 19

 1. laxmi says:

  :))
  oka order lekunda andaru okesari premanu velladinchatam…. ultimate
  aina inta delay cheste ela andi mee tapa posting, nenu daily enta busy ga unna kudali okka saraina check chestunna sequel vachinda ani… keep rocking

 2. Wanderer says:

  ఈ ప్రవల్లిక అచ్చం వీరేంద్రనాథ్ హీరోయిన్ లాగే బిహేవ్ చేస్తోంది… లేకపోతే ఇంట్లో తెలుగు పుస్తకాల పేర్లు చెప్పమంటే ప్రబంధ కావ్యాల పేర్లు చెప్తుందేంటి? 😛

 3. మాకు ఈ ఎపిసోడ్లు రోజూ కావాలి. లేకపోతే ధర్నా! 🙂

 4. pappu says:

  ఇప్పటికే రెండుపక్కలా గోదావరి గట్లు కొసేసినట్లు అయిపోయింది(మేట వేసేసింది)జుట్టు. సీరియల్ అయ్యేటప్పటికి “తిరపతేనేమో”?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s