బట్టతల వచ్చేసిందే బాలా – 18

“సరే, అందరం కలిసి సరిగ్గా పది దండాలు వేశాం కద. వర్క్ ఔట్ కాలేదు. తరువాత ఏంటి? బస్కీలా?” ఉత్సాహంగా అడిగాడు పాపారావు.

“రెండొ పుష్-అప్‌కే పడి పోయావు. నీకేంట్రా అంత తొందర?” అడిగాడు శేఖర్, చిన్నగా మూలుగుతూ.

“ప్యార్! ఇష్క్! కాదల్! అదే నా ఉత్సాహం వెనక ఉన్న రహస్యం,” చెప్పాడు పాపారావు.

“మరి ఇంత సిన్సియర్ ప్రేమికుడివి. ఇంకా సక్సెస్ లేదెందుకురా?” అడిగాడు నారాయణ్.

“నేను శ్రీదేవి, మాదురీ దీక్షిత్‌ల నుండి, మన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉన్న కన్యామణుల వరకూ, అందరినీ సిన్సియర్‌గానే ప్రేమించా. ఎటొచ్చి, వాళ్ళే నన్ను ప్రేమించలేదు,” దిగులుగా అన్నాడు పాప్స్.

ఆ లాజిక్‌కి తిరుగులేదు కాబట్టి ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు.

“ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం?” ప్రశ్నించాను నేను.

“ఇంకో పోటీనే! కానీ ఈ సారి శరీరం దెబ్బ తినకుండా మెదడుకి సంబంధించినది ఏదన్నా పెడితే బెటర్‌రా,” రిక్వెస్ట్ చేశాడు శేఖర్.

“ఐతే పంతొమ్మిదో ఎక్కం చెప్పుకుందాం. ఎవరు కరెక్ట్‌గా ముందు ముగిస్తారో, వాళ్ళే ఫస్ట్,” సజెస్ట్ చేశాడు పాపారావు.

“ఛీ ఛీ! ఎలా దిగజారిపోతున్నాం మనం! పవిత్రమైన ప్రేమని తెలియ చేయడానికి ఇవా మనం పెట్టుకునే పోటీలు?” బాధగా అన్నాడు నారాయణ్.

“నీకు పంతొమ్మిదో ఎక్కం రాదని చెప్పమ్మా! అది దాచిపెట్టడానికి ఇలా భారీ డయలాగులు కొడుతున్నావు,” వెక్కిరించాడు పాపారావు నాలుక బయట పెట్టి.

ఈ సారి నారాయణ్‌గాడి చేతుల్లోంచి పాపారావుగాడి పీక విడిపించడానికి నాకూ శేఖర్‌కూ ఒక ఐదు నిమిషాలు పట్టింది.

“ఊరికే ఆవేశపడకురా. పాపిగాడు చెప్పింది నిజమే. పరీక్ష ఏదైనా పరీక్షే. కొండ మీదనుంచి కోతిని దించి తీసుకొస్తే మాత్రమే అది పవిత్ర ప్రేమవుతుందా? కాన్సెప్ట్ రెండిట్లో ఒకటే కద,” నచ్చచెప్పాను నారాయణ్‌కి నేను. ఈ సారి నా డెప్త్‌కి నారాయణ్‌గాడు కళ్ళు తేలవేశాడు.

“నాక్కూడా పంతొమ్మిదో ఎక్కం రాదు. ఏదన్నా కొత్త పోటీ పెట్టండి,” అన్నాడు శేఖర్ జాలిగా.

నాకొక ఐడియా వచ్చింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

14 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 18

 1. పాపారావు సిన్సియర్ ప్రేమ చూస్తుంటే, చివరికి ప్రవల్లిక పాపారావునే పెళ్ళి చేసుకునేటట్లుందే.. 🙂

 2. పార్వతి says:

  😀

 3. బద్దకపు వీరుడు says:

  super! 19వ ఎక్కం ఎక్కడవరకూ చెప్పాలో చెప్పనేలేదు!:-)

 4. nomi says:

  మీరు ఈ మధ్య సమకాలీన రాజకీయాల ఫై టపాలు రాయటం లేదు. వాటి కోసం ఎదురు చూస్తున్నాం

 5. Sujatha says:

  aha emi potilandi babu chinna pillalu melemo,19th ekkam poti idea chala bagundi.Really suddenga evaraina e ekkam cheppamani adigithe answer cheyadam kastha kastame….ayina mana mithrabrindam thelivithetalu amogham, adbhutham.I WISH ALL THE BEST FOR FOUR OF THEM.

 6. Kiran says:

  Nice comedy story…eagerly waiting for next part 19.

 7. Jyothi Reddy says:

  19 Ekkam… Mee idea super andi….. Eagerly waiting for next one.

 8. lachhimi says:

  ohhhh superb 19 ekkam
  asalu ee idea elaa vachhindi meeku

  19 ekkam annaru kaabatti 9 or 19 or 29 etc ekkam gurinchi naaku telsina vishaym okati
  ee ekkalllo observe cheste
  last numbers in results will follow some order
  for example
  19 38 57 76 95 114 133 152 171 190
  see the last digidts in these numbers
  9 8 7 6 5 4 3 2 1 0
  idi koodaa oka trick ee ekkallu gurtu vunchukovadaaniki 😉

 9. పార్వతి says:

  lachhimi, bhale bhale … good trick !

  one more thing … see first digits …

  1 3 5 7 9 11 12 15 17 19

  9 8 7 …

  adee lekkha ! bhale !

 10. lachhimi says:

  ayyyyyyiii bhale bhale

  ilaaa ite panthommido ekkam chalaa veesi gaa cheppeyochhu kadaa parvathi gaaru

  manam paparao gaariki cheppedddama ee trickuuuu :):):):):)

 11. పార్వతి says:

  నాకు పెద్దగా పరిచయం లేదు లచ్చిమి గారూ ! మీరే చెప్పేయండి పాపారావు గారికి ! 😉

  first digits చూస్తే అవి కూడా బేసి క్రమం లో భలే గా ఉన్నాయే అనుకున్నా ! అన్ని ఎక్కాలు ఇలాగే ఉంటె, ఎంత బాగుండు ! 😉

  sorry typo, 1 3 5 7 9 11 13(12 ani raasaanu)…Everyone must have noticed anyway !

 12. name says:

  మిగతా parts కూడా తొందరగా వ్రాయండి, మహాప్రభో!tension తట్టుకోలేకున్నాం!

 13. కిరణ్ says:

  కథ అద్బుతంగా ఉంది .. ఛల రోజులు తరువాత ఒక మంచి హస్య కథ చదువుతున్నాను ..కాని నకు 18 వ భాగం నుండె దొరికింది. దాని ముందు భాగలు దయచెసి కొంచం చెపుతార …

 14. Murali says:

  You can go to this link for all the parts of “batta thala vachchesinde baala.” Howver, only five posts will be displayed per each page and so you would have to navigate back to see all the parts. Also, The numbering is in reverse order. So on this page, it will be posts,
  5,4,3,2,1 and on the next page, it will be 10,9,8,7,6 etc.

  https://tetageeti.wordpress.com/category/సీరియల్స్/బట్టతల/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s