బట్టతల వచ్చేసిందే బాలా – 17

ప్రవల్లికకి మా ప్రేమ తెలియపరచడానికి ఒక వరుసలో వెళ్దామనుకున్నాం కాబట్టి, అది నిర్ణయించే సమయం వచ్చింది.

“చాలా సింపుల్. అందరం పది దండాలు తీద్దాం. ఎవరు ముందు ముగిస్తారో వాళ్ళు ప్రవల్లికతో ముందు మాట్లాడతారు. తరువాత ముగించినవాడు ఆ తరువాత మాట్లాడతాడు. అలా అన్న మాట. రెడీనా?” అడిగాను నేను. అందరూ తలూపారు.

కొద్ది క్షణాల్లో నలుగురం పుష్-అప్స్ చేసే పొజిషన్లో ఉన్నాం.

“ఒకటి,” లెక్క మొదలు పెట్టాడు నారాయణ్.

అందరం చాలా ఉత్సాహంగా మొదటి పుష్-అప్ పూర్తి చేశాం.

“రెండు.”

“చచ్చాన్రోయి,” పాపారావుగాడు అరిచాడు. బహుశా, కండల్లో (అంటే వాడికి కండలు ఉన్నాయని కాదు. కాని కండలు ఉండాల్సిన ప్రదేశంలో) ఏదో నరం పట్టేసినట్టుంది. వాడు అలాగే నేలను కరుచుకుని ఉండిపోయాడు.

“మూడు.” నారాయణ్ గాడి గొంతు వణికింది. ఆ పుష్-అప్‌తో వాడు కూడా ప్రాణాచారం పడ్డాడు.

“నాలుగు.” నేలను అంటిపెట్టుకునే తరువాతి నంబర్ చెప్పాడు నారాయణ్.

ఈ సారి నా వికెట్ డౌన్ అయ్యింది. భూమాతా జిందాబాద్ టైప్‌లో నేను కూడా అడ్డం పడ్డాను.

“ఐదు.” దబ్ అనే శబ్దం వినవచ్చింది. అంటే శేఖర్ గాడు ఔట్ అన్న మాట.

అలా పదికి ఇంకా చాలా దూరం ఉండగానే మేం ఆల్-ఔట్ అయిపోయాం.

“ఏంటి అందరూ ఇలా అడ్డంగా పడుకున్నారు?” ఒక గొంతు ప్రశ్నించింది. లేచే ఓపిక లేదు కాబట్టి మేమంతా జస్ట్ తలెత్తి చూశాం. ప్రవల్లిక ఫాదర్. మా అపార్ట్‌మెంట్ ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నారు.

మాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఐతే ఒకటి. ఈ సారి పాపారావుగాడికి అవాకులు చెవాకులు పేలడానికి ఓపిక లేదు. అసలు ఆ అరుపు తరవాత వాడు ఏమీ మాట్లాడలేదు. కాబట్టి మేం ప్రస్తుతానికి సేఫ్.

ఇంతలో ఆయనే అన్నాడు, “ఈ ప్రోగ్రాం కూడా నేను మిస్ అయినట్టున్నా. బాబా రాందేవ్ గారు చెప్పిన ఇంకో చిట్కానా?”

“అవునంకుల్, దీన్ని భూగోళాసనం అంటారట. ఇలా అడ్డంగా పడి కాసేపు ఉంటే రక్త వృద్ధి కలగడం, మెదడు పదునెక్కడం లాంటి చాలా ఉపయోగాలట,” అన్నాను నేను.

“లోపలికి రండంకుల్,” లేవబోయాడు నారాయణ్.

“అహహా! వద్దు బాబూ. మీ ఆసనాలను డిస్టర్బ్ చేయదల్చుకోలేదు,” అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారయన.

“అందరికంటే నేనే ఎక్కువ చేశా. కాబట్టి గెలుపు నాదే!” అన్నాడు శేఖర్.

“కుదర్దు. మనం అనుకున్నట్టు కనీసం పది చేయాలి. అందరం ఓడిపోయినట్టే,” ఫైనల్‌గా గొంతు విప్పాడు పాపారావు.

నేనూ, నారాయణ్ అవును అన్నట్టు తలాడించడానికి ప్రయత్నించాం. కానీ నేల మీద వాలి ఉండడం వల్ల, నుదుటిని ఫ్లోర్‌కి కొట్టుకున్నామంతే.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

7 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 17

 1. Wanderer says:

  భూగోళాసనమా? రక్తవృధ్ధా? బాబా రాందేవ్ చెప్పారా? నేను కూడా ట్రై చేస్తా 😀

 2. పార్వతి says:

  😀 😀 మురళి గారూ, నేను రోజూ religious గా చూస్తున్నాను కథ కోసం ! ఈ దండాల పోటీ ఏదో బానే ఉన్నట్టుంది,ఈ సారి బొమ్మ బొరుసు బదులు, నేను ఇలా ట్రయల్స్ వేస్తా! 10 తీయగలిగితే బొమ్మ, లేకపోతే బొరుసు ! 😀
  Wanderer గారూ,డైట్ ఫాలో అయితేనే , ఈ ఆసనాలు వేస్తే ఫలితం అట (ష్! ఇదీ బాబా రాందేవ్ గారే చెప్పారు ) మరి మనం పెరుగన్నం తిందామా ముందు ? 😉

 3. laxmi says:

  Ultimate 🙂 bhoogolasan hahaha :))

  I’m desparately waiting for your further sequels.

 4. indiradevi says:

  murali gaaru, mee america kathalu chaalaa nachuthunnayy ivanni kontha varaku practical gaa kuda vntunnayy.30+pellikodukulu chaalaamande vnnaru.vaallaki paniki vasthundemo chuddam.best of luck.

 5. Sujatha says:

  eagerly waiting for next episode.System mundu kurchogane “battathala e stagelo vundo chusi gani munduku sagadam ledu.mothaniki chala tensionga vundi papam first…..love express cheyadaniki evariki chance vasthundo ani…all the best for those four guys……

 6. Jyothi Reddy says:

  “అవునంకుల్, దీన్ని భూగోళాసనం అంటారట. ఇలా అడ్డంగా పడి కాసేపు ఉంటే రక్త వృద్ధి కలగడం, మెదడు పదునెక్కడం లాంటి చాలా ఉపయోగాలట,”

  Awesome Murali ji!

 7. బద్దకపు వీరుడు says:

  భూగోళాసనమా!!! Oh my god! That is hilarious!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s