బట్టతల వచ్చేసిందే బాలా – 16

“జుత్తు దేవో భవ అన్న మాట మరిచాను! క్రాపు దేవో భవ అన్న సూక్తి విడిచాను! నా పైనే నాకెంతో ద్వేషంగా ఉంది మమ్మీ! హెయిర్ ఆయిల్ అసయ్యంగా ఆదా చేశా డ్యాడీ!” అని పాడుకుంటూ షేవ్ చేసుకుంటున్నాడు పాపారావు. వాడికి పొద్దున షేవ్ చేసుకునే ఓపిక లేదు. కాబట్టి రాత్రే కానిచ్చేస్తూంటాడు.

“ఒరేయి, అర్జెంట్‌గా పాట మార్చకపోతే, ఆ రేజర్‌తోనే నీ పీక కోస్తా,” క్రూరంగా అన్నాడు శేఖర్.

“పది మందితో chat చేసినా, అది అంకితమెవరో ఒకరికే! Buddy listలో ఎన్ని పేర్లు ఉన్నా, mailకి నోచుకునేది నూటికి ఒకటే,” అంటూ ప్లేటు ఫిరాయించాడు పాప్స్.

“అవునురా, ప్రవల్లిక ఆ పెళ్లికొడుకుని ఎందుకు రిజెక్ట్ చేసిందంటావు?” సాలోచనగా అడిగాడు నారాయణ్.

“చెప్పిందిగా లీడర్‌షిప్ క్వాలిటీస్ అస్సలు లేవని,” అన్నాను నేను.

“నా బొంద. అక్కడికి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఎంతమందికి ఉంటాయని? ఏదో ఉంది. Something is there,” గెడ్డం గీక్కుంటూ అన్నాడు నారాయణ్.

షేవింగ్ ముగించి అక్కడికి వచ్చిన పాపారావు గాడు, “ఒరే నారాయణ్, గెడ్డం గీక్కుంటున్నావు కద. బాడీ లాంగ్వేజ్‌లో దీని అర్థం ఏంట్రా?” ఆసక్తిగా అడిగాడు.

“త్వరలో ఎవడిదో గెడ్డం పగలగొట్టబోతున్నాను అని,” మృదువుగా అన్నాడు నారాయణ్. పాపారావు ఏదో పని గుర్తొచ్చినట్టు వాడి రూంలోకి వెళ్ళిపోయాడు.

“ఆ అమ్మాయికి అప్పుడే పెళ్లి ఇష్టం లేదేమోరా. వాళ్ళింట్లో పోరు పడలేక పెళ్లిచూపులకు ఒప్పుకుందేమో?” సందేహం వ్యక్తం చేశాడు శేఖర్.

“ఏదైతేనేం! ఆ సంబంధం తప్పిపోయినట్టే. ఇంకా కొన్ని రోజులు ఢోకా లేదు,” ఆనందంగా అన్నాను నేను.

“ఈ అవకాశాన్ని మనం సక్రమంగా వాడుకోవాలి,” మెల్లగా అన్నాడు నారాయణ్.

“అంటే ఏంటి నీ ఉద్దేశం?” ఇద్దరం ఒకటే సారి అడిగాం.

“ఆ అమ్మాయి పట్ల మన ప్రేమని వ్యక్త పరచడమే,” నారాయణ్ గొంతు గంభీరమయ్యింది.

“ఏంటీ అందరమా?”

“అందరూ ఒకేసారి అని కాదు. వంతులు వేసుకుందాం. ఒక ఆర్డర్‌లో ఒకరి తరువాత ఒకరం మన ఇష్టాన్ని తెలియజేద్దాం. ఆమె ఎవర్ని ఒప్పుకుంటే మిగతా అందరం డ్రాప్ అయిపోదాం,” తన ఐడియాని వివరించాడు నారాయణ్.

“ఇదేదో లక్కీ లాటరీ స్కీంలా ఉందిరా,” అసంతృప్తిగా అన్నాను నేను.

“మనం ఏ లోపాలూ లేకుండా ఈ భూమ్మీదకి ఊడిపడ్డం నుంచి ఎలా చనిపోతామో వరకూ, అంతా లక్కీ లాటరీనే బ్రదర్. ఇది మాత్రం ఎందుకు కాకూడదు?” ప్రశ్నించాడు నారాయణ్.

నేను ఖంగు తిన్నాను. నారాయణ్ గాడిలో ఇంత డెప్త్ ఉందనుకోలేదు నేను. శేఖర్ వైపు చూశాను. వాడు అంగీకారంగా తలాడించాడు.

“సరేరా, అలాగే కానీ,” అన్నాను నేను.

ఎప్పుడు వచ్చి మా మాటలన్ని వింటున్నాడో, పాపారావు ఆనందంగా, “నాక్కూడా నచ్చిందిరా. కాణీ ఖర్చు లేకుండా విషయం తెలిసిపోతుంది. పక్కింటి అమ్మాయే కద. ఫోన్ బిల్ ఉండదు, రెస్టారెంట్లకి తీసుకెళ్ళడాలు ఉండవు. ఏదో ఒకటి తెలిస్తే నేను కొత్త పాటలు ప్రాక్టీసు చేసుకుంటాను,” అన్నాడు.

మేం ముగ్గురం బాధగా నిట్టూర్చాం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

6 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 16

 1. పార్వతి says:

  😀 పాపారావు పాటలు భలే ఉన్నాయి ! 😀
  ఇక్కడితో end ఆ ఈ భాగం ? noooo 😦

 2. sudheer says:

  anna
  keka puttinchavanna

 3. Ram says:

  too good… we couldnt control lau’ng with pap songs (Paparao songs, not pop songs)

  lageraho murali bhai

  “జుత్తు దేవో భవ అన్న మాట మరిచాను! క్రాపు దేవో భవ అన్న సూక్తి విడిచాను! నా పైనే నాకెంతో ద్వేషంగా ఉంది మమ్మీ! హెయిర్ ఆయిల్ అసయ్యంగా ఆదా చేశా డ్యాడీ!”

 4. Nanda Kishore p says:

  Nenu kuda aa batch lo okadiga vuntey bagunnu ani pestundi sir…. bcoz comedy bagundi..

 5. Wanderer says:

  మృదువుగా చెప్పాడా నారాయణ? మీరసలు కత్తి.

 6. Jyothi Reddy says:

  “మనం ఏ లోపాలూ లేకుండా ఈ భూమ్మీదకి ఊడిపడ్డం నుంచి ఎలా చనిపోతామో వరకూ, అంతా లక్కీ లాటరీనే బ్రదర్. ఇది మాత్రం ఎందుకు కాకూడదు?”

  “నాక్కూడా నచ్చిందిరా. కాణీ ఖర్చు లేకుండా విషయం తెలిసిపోతుంది. పక్కింటి అమ్మాయే కద. ఫోన్ బిల్ ఉండదు, రెస్టారెంట్లకి తీసుకెళ్ళడాలు ఉండవు. ఏదో ఒకటి తెలిస్తే నేను కొత్త పాటలు ప్రాక్టీసు చేసుకుంటాను,”

  Hats off to you…LOL…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s