బట్టతల వచ్చేసిందే బాలా -15

ప్రవల్లికకు సంబంధం తప్పిపోయింది అన్న ఆనందంలో నలుగురం మా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్ళాక కోయ డ్యాన్స్ చేశాం కాసేపు. కాసేపయ్యాక తలుపు చప్పుడయ్యింది. తీసి చూస్తే కింద ఫ్లోర్‌లో ఉండే యాదగిరి.

“నమస్తే యాదగిరన్నా,” అన్నాను నేను.

“నీ నమస్తే పాడుగానూ. గట్ల కోతుల్లెక్క దుంకులాడుతున్నరేందివయా?” కోపంగా అడిగాడు యాదగిరి.

“అవునా! మరీ కోతుల్లా ఎగిరామా?” అమాయకంగా మొహం పెట్టి అడిగాడు నారాయణ్.

“కోతులు కాకపోతే గుడ్డెలుగుల్లెక్క. గా సౌండ్ విని ముందు నేను ఒసామా గాడు మన అపార్ట్‌మెంట్ ట్విన్ టవర్ల మీదకి ఇమానాలు పంపించిండేమో అనుకున్నా. ఐనా అంత ఘనం డ్యాన్సు చేసే నౌబత్ ఏమొచ్చిందివయా?” విసుగ్గా అనాడు యాదగిరి.

“పక్కింటి ప్రవల్లికకి సంబంధం….” అని చెప్పబోతున్న పాపారావుగాడి నడ్డి మీద గట్టిగా తన్నాడు శేఖర్. దానితో వాడు, ప్రవల్లికకి సంబంధం తప్పిపోయిందీ, అందుకే మా ఈ ఎలుగ్గొడ్డు డ్యాన్సూ అని చెప్పడం మర్చిపోయి, “వెనకనుంచి నడ్డి మీద తంతావురా, ఘూట్లే!” అని తిట్టాడు శేఖర్‌ని.

“ముందు నుంచి తన్నే అవకాశం ఉంటే అలానే తన్నేవాడు. వాడు నోరు తెరిస్తే, ఇంకోటి తన్నరా శేఖర్,” అని యాదగిరి వైపు తిరిగాను, మొహంలో మర్యాద నింపుకుని.

“పెళ్ళి సంబంధం ఏంది?” యాదగిరి మొహంలో అనుమానం కనిపించింది.

“అదే అన్నా! పక్కింటి అమ్మాయి ప్రవల్లిక లేదు? ఆమెకి మంచి సంబంధం వచ్చింది. కుర్రవాడు చాకులా ఉంటాడు. పైగ తలనిండా జుత్తు. ఆ అమ్మాయికి త్వరలో పెళ్ళి కుదరబోతూందని ఆనందంతో కాస్తా మోతాదు మించి స్టెప్పులు వేశాం,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు నారాయణ్.

అంతే! యాదగిరి బావురుమన్నాడు. మేము ఖంగారు పడిపోయాం. యాదగిరిని ఎప్పుడూ భీకరంగా చూడ్డమే కానీ ఈ యాంగిల్‌లో ఎప్పుడూ చూడలేదు కాబట్టి ఎలా రియాక్ట్ కావాలో అర్థం కాలేదు మాకు.

“మీ నలుగురిది ఎంత మంచి మనసు తమ్మి. పక్కోడు పచ్చగా ఉంటే గిట్ల స్టెప్పులేసే లాంటోల్లు మీరుండబట్టే, ఇంకా ఈ దునియాలో జర ధర్మం న్యాయం ఉన్నాయి,” కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.

మేం కాస్త రిలాక్స్ అయ్యాము. ప్రమాదం తప్పినట్టే ఉంది అనిపించింది నాకు.

అంతలో యాదగిరే మళ్ళీ అన్నాడు, “గదే నేను మీ లెక్క ఉన్నప్పుడు మా కాలనీలో ఏ పోరికి పెళ్ళి కుదిరినా ఏం చేసెటొడినో ఎరికేనా?”

“బహుశా ఆ అమ్మాయికి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళేందుకు సారె పెట్టే వాడివేమో, కదన్నా?” తగినంత గౌరవాన్ని గొంతులో పలికిస్తూ అన్నాను నేను.

“నేను గంత మంచోన్ని కాను తమ్మీ! గుండెలు బాదుకుంటూ శోకాలు పెట్టెటోడిని. ఏడ్చేడ్చి ఊరుకున్నాక, మళ్ళ సాయంత్రం ఏడ్చేటోడిని,” చెప్పాడు యాదగిరి.

“ఎందుకన్నా? మళ్ళీ గుర్తొచ్చా?” అడిగాడు శేఖర్.

“కాదు తమ్మీ. మా నాయన ఇంటికి రాగానే మా అమ్మ నా హర్‌కతులన్నీ చెప్పెడిది. మా నాయన పిచ్చ కొట్టుడు కొట్టి నారలు తీసెటోడు,” వివరించాడు యాదగిరి.

“అయ్యయ్యో!” అన్నాము మేము ముగ్గురం కోరస్‌గా. పాపారావుగాడు నడ్డిని నిమురుకుంటూ సైలెంట్‌గా ఉండిపోయాడు.

“ఫికర్ లేదులే. గట్ల కొట్టి కొట్టి నా బాడీ సాలిడ్ అయినది. ఇప్పుడు ఎవడెంతకొట్టిన ఫరక్ పడదు. గదే నేను కొట్టిన్ననుకో ఒక్క దెబ్బకు ఎసొంటోడైనా నెత్తురు కక్కాల్సిందే,” ఆనందంగా అన్నాడు యాదగిరి. మేము గతుక్కుమన్నాం.

“సరే తమ్మి, నే పోతా ఇంక. గీ సారి గిట్ల మీ దిల్ ఖుష్ అయితే జర బాల్కనీలో చిందేయుండ్రి. లేకపోతే నా నిద్ర ఖరాబవుతది. నిద్ర ఖరాబైతే ఎవడెదురుగుంటే ఆడిని గుద్దుదం అనిపిస్తది. నేను గుద్దిన్ననుకో …”

“… ఎసొంటోడైనా నెత్తురు కక్కాల్సిందే,” వినమ్రంగా అన్నాం మేమంతా.

“బాగా ఎరుక బట్టిండ్రు. ఇగ నేనొస్తా,” అంటూ బయలుదేరాడు యాదగిరి.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

15 Responses to బట్టతల వచ్చేసిందే బాలా -15

 1. లచ్చిమి says:

  ha ha ha h ah ha ha ah

  enta manchi mansulo meeevi kadooooo

 2. laxmi says:

  హహహ 🙂 అమ్మో మీరు కత్తితో కాదు కామెడీ తో చంపేసేలా ఉన్నారు కదా

 3. sagar says:

  super andi..telangana basha chala baga vundi….

 4. Aruna says:

  I am curious. What happened next??

 5. tejashreyus says:

  yadigiri iragesadu..

 6. Murali says:

  శివ గారూ, అరుణ గారూ,

  తరువాతేమవుతుందో నాకే తెలీదు. Whether you believe it or not, my story writes itself. I am just a facilitator. 🙂

  సాగర్ గారూ, తేజా గారూ, లక్ష్మి గారూ, లచ్చిమి గారూ

  థాంక్స్. నేను కూడా తెలంగాణా వాడినే. అందుకే ఆ మాండలికంలో రాయడం పెద్ద కష్టం కాలేదు.

  -మురళి

 7. పార్వతి says:

  😀 నా తెలంగాణా కోటి రత్నాల వీణ ! చాలా రోజుల తర్వాతా యాస వింటుంటే బాగుంది ! మీ క్రికెట్ కామెంటరీ నాటిక తర్వాత మళ్ళీ అలాంటి హ్యుమరసం ఉన్న టపా ! 🙂
  ఈ కామెడీ విలన్ యాద్గిరి మస్తుగున్నడు లే !

 8. వీరుడు says:

  అదిరింది!

 9. bharat says:

  అన్నో…తెలంగాణల ఎక్కడ్నే? వరంగలా ఖమ్మమా?

  -భరత్

 10. Murali says:

  Bharat,

  Mahboobnagar.

  -Murali

 11. Jyothi Reddy says:

  “కాదు తమ్మీ. మా నాయన ఇంటికి రాగానే మా అమ్మ నా హర్‌కతులన్నీ చెప్పెడిది. మా నాయన పిచ్చ కొట్టుడు కొట్టి నారలు తీసెటోడు,” వివరించాడు యాదగిరి.

  Muraliji,

  Nice to know that you are from Telangana….
  Madhi Telangana…Meedhi Telangana

 12. bharat says:

  బట్టతలపై టపాలు రాసి, రాలిన వెంట్రుకలకన్నా ఎక్కువ అభిమానుల్ని సంపాదించేసుకొంటున్నారు. 🙂

  మీ బ్లాగాభిమానులు మిమ్మల్ని కలుసుకోవాలంటే ఎలా? అంటే…ఎప్పుడు , ఎక్కడ , ఎలా? అని.

  -భరత్

 13. Nanda Kishore p says:

  Murali garu chala bagundi. enata mabchi valloooo….
  anna amata chala bagundi….. nenu kuda anta manchi vadiney telusa……….. meku telangana basha vacha………

 14. Murali says:

  భరత్ గారూ,

  You can find me sometimes on google talk: murali.tetageeti is my id.

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s