బట్టతల వచ్చేసిందే బాలా – 13

ప్రవల్లిక అలా లోపలికి వెళ్ళిందో లేదో, మగ పెళ్లి వారు వేంచేశారు. ఈ సారి ప్రవల్లిక ఫాదర్ ఎందుకైనా మంచిది అని వాళ్ళని ఒకటికి రెండు సార్లు తేరిపారా చూసి, “రండి బావగారూ రండి. కరెక్ట్‌గా టైంకి వచ్చారు. అమ్మాయి దాదాపు తయారయిపోయింది,” అంటూ వారిని ఆహ్వానించారు.

మేం లోపలికి వచ్చిన గుంపుని గమనించాం. మొదట పెళ్ళి కొడుకు తండ్రి, తరువాత అతని తల్లి, ఆ తరువాత పెళ్లి కొడుకు అడుగు పెట్టారు.

పెళ్లి కొడుకు మాకు నచ్చలేదు. (అసయ్యంగా తలనిండా జుత్తు ఉంది.) ఐతే ఇది అంత పెద్ద సమస్య కాదు. సమస్య ప్రవల్లికకు నచ్చాడా లేదా అని. ఇక్కడికి రావడానికి ముందే అర్జెంట్‌గా గుడికి వెళ్ళి, పాపారావుగాడూ నేనూ, పెళ్లికొడుకు ప్రవల్లికకు నచ్చకూడదు అని స్పెషల్ పూజ చేయించి మొక్కుకుని వచ్చాం కాబట్టి, కొద్దిగా ధైర్యంగానే ఉన్నాము.

అసలు ఆ గుడి సంఘటన తలుచుకుంటేనే కాస్త ఎంబరాసింగ్‌గా ఉంది.

****

నేనూ పాపారావు గుడికి వెళ్ళి పూజారిని కలిశాం. గుడి మా ఇంటికి చాలా దగ్గరే. పూజారి మమ్మల్ని గుర్తు పట్టలేదు. ఎలా పడతాడు లెండి. మేము గుళ్ళూ గోపురాలూ సందర్శించే బాపతు కాదు కద!

“ఏం కావాలి బాబూ?” అన్నాడాయన ప్రసన్నంగా. “ఈ రోజు ఒక అమ్మాయి పెళ్లి చూపులు జరుగుతున్నాయి పూజారి గారూ. అవి చెడిపోవాలి. అలా పూజ చేయించండి,” అన్నాడు పాపారావు తడుముకోకుండా. నేను తల పట్టుకున్నా.

“అదేం దిక్కు మాలిన కోరిక నాయన. అలాంటి పూజలు నేను చేయించను,” అన్నాడాయన నిఖ్ఖచ్చిగా. ఆల్‌రెడీ ఆయన మమ్మల్ని చూసే తీరు మారింది.

నేను పాపారావుగాడి నోరు మూసి, “అలా కాదులెండి పూజారిగారూ. పోనీ మాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరగాలని కోరుకుంటూ పూజ చేయించొచ్చా?” అని అడిగాను.

“అది పరవాలేదు,” అన్నాడు ఆయన. సడన్‌గా డౌట్ వచ్చిందేమో, “ఆ అమ్మాయికి ముందే పెళ్లైపోలేదు కద?” అడిగాడు అనుమానంగా.

నేను బాగా హర్ట్ అయినట్టు మొహం పెట్టాను. “ఎంత మాటన్నారు పూజారి గారూ, వీడు వెధవే. ఒప్పుకుంటాను. కానీ వీడితో తిరిగే వాళ్ళందరూ, అంటే నేనన్నమాట, వెధవలం కాదండి. ఎలా అనుకున్నారు అంత తుఛ్ఛమైన కోరిక కోరుతాను అని?” అన్నాను నేను కాస్త ఆవేశంగా.

“మీ మిత్రుడు ఇంతకు ముందు అడిగిన దాని మీద బేస్ అయి అలా అనుకున్నానులే నాయనా. సరే మీ పేరు, గోత్రం?” అడిగాడు ఆయన.

****

“అమ్మాయికి ఇంటి పనులు, వంటా బాగా వచ్చు,” అన్నారు ప్రవల్లిక అమ్మ గారూ. “మా వాడికి కూడా బాగా వచ్చు, హాస్టల్‌లో ఉండి చదువుకున్నాడు కద,” గర్వంగా చెప్పింది పెళ్లికొడుకు తల్లి. పెళ్లికొడుకు వాళ్ళ అమ్మవైపు గుర్రుమంటూ చూశాడు.

“ఎందుకురా అలా చూస్తావు? అన్ని పనులు చేసుకోవడం వస్తే నువ్వే కష్టపడవు అని దగ్గరుండి మరీ మీ నాన్నతో వంటా గింటా అన్నీ నేర్పించాను కద?” కొంచెం కూడా స్లో డౌన్ కాకుండా అంది ఆవిడ. ఈ సారి పెళ్లికొడుకు తండ్రి కూడా ఆమె వైపు గుర్రుగా చూశాడు.

పెళ్లికొడుకు టాపిక్ మార్చడం బెటర్ అని డిసైడ్ అయిపోయి, “మీరు పెళ్లయ్యాక ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారా?” అని ప్రవల్లికని అడిగాడు.

ప్రవల్లిక ఏదో చెప్పేంతలోపల, పెళ్లి కొడుకు తల్లి, “చేస్తుందిలేరా, నీకిష్టమైతే చేస్తూంది. లేకపోతే చేయదు,” అంటూ ప్రవల్లిక వైపు తిరిగి “సంగీతం ఏమైనా నేర్చుకున్నావామ్మ?” అడిగింది.

“సంగీతం నేర్చుకోలేదు కాని డ్యాన్స్ వచ్చండి,” చెప్పింది ప్రవల్లిక.

“అబ్బో డ్యాన్స్ అంటే మాకెంతో ఇష్టం. ఏది కాస్త సాంపుల్ చూపెట్టు,” అన్నాడు పాపారావుగాడు.

“ఎలా చూపించను పాపారావు? హాలంతా నిండి పోయి ఉంది. అస్సలు ఖాళీ లేదు,” అంది ప్రవల్లిక కాస్త బాధగా.

“వీళ్ళెవరు?” అప్పటిదాక మమ్మల్ని ఉత్సవ విగ్రహాల కింద జమ కట్టిన పెళ్లికొడుకు అడిగాడు.

“మా పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటారు బాబూ. చాలా మంచి కుర్రాళ్ళు. అందరు మీలానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. పైగా బాబా రాందేవ్‌కి ఏకలవ్య శిష్యులు. పెరుగుతో మొదలుపెట్టి ఆవకాయతో భోజనాన్ని ముగిస్తారు,” వివరించారు ప్రవల్లిక ఫాదర్.

ఇంత ఇన్‌ఫర్మేషన్ పెళ్ళికొడుకు హ్యాండిల్ చేయలేకపోయాడనుకుంటా. కళ్ళు మిటకరించి ఏమీ మాట్లాడలేదు.

“కాస్త ఈ చక్కిలాలూ స్వీట్సూ తీసుకోండి అన్నయ్యగారూ,” అంటూ తినుంబండారాలతో నిండిన పళ్ళాలు పెట్టి ఉన్న ట్రేని ముందుకు చాపారు ప్రవల్లిక అమ్మగారు.

“వద్దులెండి! అతికితే బతకదు అంటారు కద!” గంభీరంగా అన్నాడు పెళ్లికొడుకు తండ్రి.

“అతికితే బతకదు కాదంకుల్. గతికితే అతకదు!” అన్నాం మేము నలుగురం కోరస్‌గా. మాకు తెలిసిన ఒకే ఒక సామెతని ఆయన అలా ఖూనీ చేస్తూంటే మేము తట్టుకోలేకపోయాం.

నలుగురం ఒకే టైంలో మాట్లాడ్డం వల్ల కొంచెం సౌండ్ పెద్దగా వచ్చినట్టుంది. ఆయన ఒక్కసారి ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు.

“ఐనా ఆయనకు తన వంట తప్పితే ఎవరి వంటా నచ్చదులెండి వదినగారూ. ఇక మేమెళ్ళొస్తాం,” పెళ్లికొడుకు తల్లి కూడా లేచి నిలబడింది.

ఇక తప్పదన్నట్టు పెళ్లికొడుకు కూడా లేచి నిలబడ్దాడు.

“సరే అన్నయ్యగారూ, త్వరలోనే ఏ విషయం తెలియజేస్తాం,” అంది పెళ్లికొడుకు తల్లి తలుపు వైపు దారి తీస్తూ. మగంగులు ఇద్దరూ ఆవిడని ఫాలో అయ్యారు.

ప్రవల్లిక ఫాదర్ వాళ్ళని కిందవరకూ దింపడానికి తోడు వెళ్ళారు.

“హమ్మయ్య! ఇప్పుడు హాల్ ఖాళీ అయిపోయింది. ఒక డ్యాన్స్ వేసుకో ప్రవల్లిక,” అన్నాడు పాపారావు ఆనందంగా.

ప్రవల్లిక అమ్మగారూ ఏదో కోపంగా అనబోయెంతలో, నేను, “వాడిని పట్టించుకోవద్దు ఆంటీ. ఇక మేమెళ్ళొస్తాం,” అంటూ మా వాళ్ళతో పాటూ బయట పడ్డా.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

7 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 13

 1. అద్భుతంగా హాస్యం పండిస్తున్నారు.
  బట్టతల అంత “చిన్న” !? విషయం తీసుకుని మాంచి కామెడీ అల్లుతున్నారు.

 2. పార్వతి says:

  😀 గుళ్ళో పూజ ప్రహసనం భలే గా ఉంది ! 😀
  “మా ” పాపారావు ని మరీ బఫ్ఫూన్ ని చేసేస్తున్నారు ! అయితే హీరో “నేనే” అన్న మాట ! 😀

 3. Nanda Kishore p says:

  Ok.. coolllllllll……. Murali Garu…..Next Eppdu…..

 4. Murali says:

  Praveen:

  Thanks! baTTatala is a big deal. Ask paapaaraavu. 🙂

  Nanda Kishore: It will be out soon. I am on a misson here. 🙂

  Parvati: Never under-estimate paaps.

  -Murali

 5. ramu says:

  hi murali,
  i used to read many telugu sites.I didnt laugh this much just by reading a story.Generalga naku baddakam chala ekkuva.Chadavatame kani reply ivvatam undadhu.Inthaga navvinchina meeku kuda reply ivvakapothe naaku mee stories chadive arhatha undademo anipinchindi.U r really great,Murali garu.

 6. Murali says:

  Thanks Ramu,

  You really made my day!

  -Murali

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s