బట్టతల వచ్చేసిందే బాలా – 12

పెళ్లి చూపులు:

మేము గంట ముందే వెళ్ళిపోయాం ప్రవల్లిక వాళ్ళింటికి. మాములుగా కూడా కాదు. పంచె, కండువాలో. ఈ ఐడియా నారాయణ్‌ది. ప్యాంట్ షర్ట్‌లో వెళ్తే మరీ అల్లా టప్పాగా కనిపిస్తాం. కాబట్టి పెద్దరికంగా ఉండాలంటే పంచె కట్టుకునే వెళ్ళాలి అని మమ్మల్ని ఒప్పించాడు.

మాకు తలుపు తీసిన ప్రవల్లిక నాన్నగారు, “రండి బావగారూ. చెప్పినదానికంటే ఒక గంట ముందే వచ్చారే? అమ్మాయి ఇంకా తయారు కాలేదు,” అని తరువాత మమ్మల్ని గుర్తు పట్టి, “మీరటోయి, ఈ డ్రెస్సేంటి?” అని బోలెడు ఆశ్చర్యపోయారు.

“అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అలా తయారు అవుతూ ఉంటామన్న మాట,” అన్నాడు నారాయణ్, చూశారా మనకు ఎంత పెద్దరికం వచ్చిందో అన్నట్టు మమ్మల్ని చూస్తూ కళ్ళెగరేస్తూ. మేం కూడా టీవీ యాంకర్‌లా మా బొటనవేళ్ళు పైకెత్తి చూపించాం.

“ప్రవల్లికని వాళ్ళ అమ్మ తయారు చేస్తుందోయి, మీరు కూర్చోండి,” హాల్‌లోకి దారి తీస్తూ అన్నారు ఆయన. హాల్ అంతా కొత్త కళ సంతరించుకుని ఉంది. అంతా నీట్‌గా సర్ది ఉంది. మూల ఉన్న టేబుల్ మీద రకరకాల తినుబండారాలు పేర్చి ఉన్నాయి.

పాపారావుగాడు వాటి వైపు ఆశగా చూడ్డం గమనించి, ప్రవల్లిక ఫాదర్, “ఏంటోయి కాస్త రుచి చూస్తావా?” అని అడిగారు.

“వద్దు అంకుల్. ఉతికితే చితకదు అంటారు కద,” అన్నాడు పాప్స్.

ప్రవల్లిక నాన్నగారు ప్రశ్నార్థకంగా మొహం పెట్టారు.

“అదే అంకుల్ పెళ్లి చూపుల్లో అంటారు కద అలా. పాత సినిమాల్లో చూశాను. సరిగ్గా గుర్తు రావట్లేదు. చితికితే బతకదు అనుకుంటా,” చెప్పాడు పాపారావు.

“కాదురా, అతికితే చితకదు అనుకుంటా,” అన్నాడు నారాయణ్.

“ఏడ్చినట్టు ఉంది. ఆ సామెత గతికితే అతకదు. అంటే ఏంటో మీకు తెలుసా?” ప్రశ్నించారు ప్రవల్లిక ఫాదర్.

“తెలీదు అంకుల్. నా తెలుగు అసలే వీక్,” అన్నాను నేను సిగ్గు పడుతూ.

“అంటే మగ పెళ్లివారు పెళ్లి చూపుల్లొ గతికితే, అంటే తింటే, సంబంధం అతకదు, అంటే కుదరదు, అని. ఈ మధ్య మగ పెళ్లివారే పాటించడం లేదు ఆ నియమాలు. మీకెందుకోయి ఆ పట్టింపులు,” అన్నారు ఆయన.

అంతలో ప్రవల్లిక బయటకు వచ్చింది. పట్టు చీర కట్టుకుని నగలు పెట్టుకుని చాలా ముచ్చటగా ఉంది. ఇలాంటి అందమైన దృశ్యాలు చూసినప్పుడు పాపారావుగాడు సాధారణంగా ఏం చేస్తాడో, ఈ సారి అదే చేయబోయాడు. అదే నోట్లో వేళ్ళు పెట్టి విజిల్ వేయబోయాడు. నేను వాడి చెయ్యి పట్టుకుని వెనక్కు విరిచాను.

“ఎలా ఉంది నా ముస్తాబు?” అడిగింది ప్రవల్లిక.

“You look gorgeous!” అన్నాడు నారాయణ్.

“మీరు పంచె కండువాతో ఉండి అలా ఇంగ్లీష్‌లో కాంప్లిమెంట్ ఇస్తే ఏం బాగాలేదు,” నవ్వింది ప్రవల్లిక.

“సరే అమ్మాయి, నువ్వు లోపలికి వెళ్ళు. వాళ్ళు రాగానే మీ అమ్మ తీసుకొస్తుంది. అది సాంప్రదాయం,” ఆర్డర్ వేశారు ప్రవల్లిక నాన్నగారు. ప్రవల్లిక లోపలికి వెళ్ళింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

14 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 12

 1. పార్వతి says:

  “ఉతికితే చితకదు ” దీన్లో various combinations 😀 … నాకైతే ఇక పైన ఆ సామెత వింటే, ఇది తప్పకుండా గుర్తొస్తుంది మురళి గారు !
  మేం కూడా టీవీ యాంకర్‌లా మా బొటనవేళ్ళు పైకెత్తి చూపించాం. 😀 ఈ మధ్య ఈ టీవీ యాంకర్స్ వేళ్ళు చూపించటం, తెగ కామెడీ ఐపోతోంది ! 😀
  “నోట్లో వేళ్ళు పెట్టి విజిల్ వేయబోయాడు.” 😀 పాపారావు ఆనంద భైరవి లో శ్రీలక్ష్మి అవతారం అన్న మాట !
  Hilarious …

 2. bharat says:

  ఓ సామెతతో ఇంత నవ్వించొచ్చా? సూపర్! 🙂

  విటమిన్ టబ్లెట్లలా రోజూ మీ హాస్య గుళికల్ని మాకలవాటు చేస్తున్నారు, మా ఆయుష్షు పెంచేస్తున్నారు… థాంక్స్!!

  -భరత్

 3. shiva says:

  రేపటి కోసం ఎదురుసూస్తూ ….:)

 4. Nanda Kishore p says:

  meku E sametalu baga vachu anukuta murali garu. maku kuda spl class tesukoni nerpinchakudadu…. once again cool….

 5. కల says:

  ఇది మొదట నుంచీ ఫాలో అవుతూనే ఉన్నా. ఇలా కొద్ది కొద్దిగా చదవటం కష్టంగా ఉంది. తొందరగా రాసెయ్యండి ప్లీజ్.

 6. teja says:

  మొదలుపెడితే వదల బుద్ది కావట్లేదండి.
  కెవ్వు కేక

 7. Madhu Janjur says:

  చాలా బాగా ఉందండి !! మీ బట్టతల భాగొతం..

 8. వినోద్ says:

  “ఉతికితే చితకదు” అసలు ఇలా అనాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు..సూపరో సూపర్!!!!!

  నేను నా ఫ్రెండ్స్ అందరికి ఈ లింక్ ఇచ్చేశా..:ద
  రేపటికోసం ఎదురు చూస్తూ.. 🙂

 9. purnaraju says:

  gatikite atakadu anedanni annrakaluga cheppavachhani telisi boldanta navvukunnmu bavundi chala

 10. viswanath says:

  అదుర్స్ సార్ మీ బట్ట తల టపాలు

 11. Jyothi Reddy says:

  Non stop ga Navvula golandi baboooi……

 12. lakshmi says:

  Murali garu,

  Ikkadaa next episode kosam waiting andi.

 13. Murali says:

  వినోద్ గారూ,

  ఎలా వచ్చింది అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో అలా వచ్చేస్తుందన్న మాట. I hope your friends like it too.

  -మురళి

 14. Murali says:

  Thanks Teja, Kala, Bharat, Madhu, Purnaraju and Viswanath. I appreciate your comments.

  -Murali

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s