హిందూనా? ఐతే ఓకే!

పీ.టీ.అలీ! పేరు చూస్తే ముస్లిం అనుకునేరు. ఇతని అసలు పేరు పైడి తల్లి. ఆ పేరు నచ్చక ఇలా సెటిల్ అయిపోయాడు. ఒక ఆరు నెలల కిందే ఇతనికి అమెరికాలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దానికి సెక్యూరిటీ క్లియరెన్స్ కావాలి. అసలే ఉగ్రవాదం ఎక్కువైన ఈ రోజుల్లో ఆ క్లియరెన్స్ దొరకడం మరీ కష్టమైపోయింది.

ఇంకో ఐదు నిమిషాల్లో అతనికి ఇంటర్‌వ్యూ ఉంది. ఎఫ్.బీ.ఐ వాళ్ళు చేస్తారు. గతంలో అతను నింపిన అప్ప్లికేషన్‌లో ఉన్న అన్ని వివరాలని తిరగతోడి అతను చెప్పింది నిజమో కాదో ఒకటికి వంద సార్లు పరిశీలించి అతనికి ఎలాంటి ఉగ్రవాదులతో గానీ, ఉగ్రవాద సంస్థలతో గానీ సంబంధం లేదని నమ్మాకే, ఆ క్లియరెన్స్ ఇస్తారు. అందుకే పైడి తల్లి కాస్త టెన్షన్‌గా ఉన్నాడు.

అప్పాయింట్‌మెంట్ టైం దగ్గర పడింది కాబట్టి అప్పటి దాకా తాగుతున్న సిగరెట్‌ని ట్రాష్ క్యాన్ మీదున్న యాష్‌ట్రేలో నలిపేసి లోపలికి వెళ్ళాడు అతను.

ఆ రూంలో ఏకంగా నలుగురు కూర్చుని ఉన్నారు. అందరూ సూట్లు ధరించి ఉన్నారు. మొహాలు కందగండల్లా ఉన్నాయి (కోపమొచ్చి కాదులెండి, అందరు తెల్ల వాళ్ళు కావడం వల్ల సహజంగానే అలా ఉన్నాయి). అంత మందిని చూసి కంగారు పడ్డాడు పైడి తల్లి. అర చేతుల్లో చెమట్లు పట్టాయి. బలవంతాన మొహం మీద నవ్వు పులుముకుని వాళ్ళ ముందు కూర్చున్నాడు.

ఒకాయనకి బట్టతల ఉంది. ఇంకో ఆయనకు పొడుగు ముక్కు (మన హీరో గోపిచంద్‌లా). మూడో అతనికి కాస్త మెల్లకన్ను ఉంది. నాలుగో అతను బాగా పొట్టి. తనకు తెలీకుండానే మనసులో వాళ్ళకు “బట్టతల, పొడుగు ముక్కు, మెల్ల కన్ను, పొట్టాయన” అని నామకరణం చేసేశాడు పైడి తల్లి.

సంభాషణ అంతా ఆంగ్లంలో సాగుతూంది.

ముందు కుశల ప్రశ్నలు, ఆ తరువాత కొంత వెరిఫికేషన్ అయ్యాక బట్టతల అడిగాడు, “మీ దగ్గర చుట్టాల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఎవరైనా ఉగ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నట్టు మీకు తెలుసా? కనీసం అనుమానం ఉందా?” అని.

అడ్డంగా తలూపాడు పైడితల్లి. వాళ్ళ మామయ్య ఒకతను రామ జన్మ భూమిలో కట్టబోతున్న మందిరానికి చందాలు వసూలు చేశాడు అంతే. అది ఉగ్రవాద చర్య కిందకి వస్తుందా? ఏమో, ఎందుకొచ్చిన గొడవ. చెప్పకపోతేనే మంచిది.

“మీరు అల్లాని ఎంత వరకు నమ్ముతారు? అల్లా కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తారా?” అడిగాడు పొడుగు ముక్కు.

పైడి తల్లి ఖంగారు పడ్దాదు. కొంప తీసి తను తప్పు ఇంటర్‌వ్యూకి రాలేదు కద? అంతలో తమాయించుకుని, “నేను అల్లాని నమ్మను. అహ! అంటే అసలు నమ్మనని కాదు. అందరు దేవుళ్ళనూ నమ్ముతాను. అందులో అల్లా ఒకడు. కానీ అల్లా మా దేవుడు కాడు,” అన్నాడు గజిబిజిగా.

“అదేంటి? మీ పేరు అలీ కద?” అన్నాడు మెల్లకన్ను.

బల్బ్ వెలిగింది పైడి తల్లికి. “లేదు లేదు నా పేరు పైడి తల్లి. షార్ట్ కట్‌లో పీ.టీ. అలీ అని పిలుస్తారు,” వివరించాడు.

“ఐతే మీరు..” ఆపేశాడు పొట్టాయన.

“నేను హిందూని,” చెప్పాడు పైడి తల్లి.

ఆ నలుగురు ఒక్క సారి పెద్దగా ఊపిరి వదిలి వెనక్కు వాలి రిలాక్స్ అయ్యారు.

“ఓ, హిందూనా? ఐతే ఓకే. అనవసరంగా నలుగురం వచ్చాము. ఈ సంగతి ముందే తెలుసుంటే మొక్కుబడిగా ఎవరో ఒకరం వచ్చుండే వాళ్ళంగా?” కొంత చిరాకుగా అన్నాడు బట్టతల.

“యా, యా! మిమ్మల్ని ఇన్ని ప్రశ్నలు అడిగే వాళ్ళమే కాదు అసలు. ఐనా పాపం మీరేం ఉగ్రవాదం చేస్తారు లెండి. మిమ్మల్ని ఊచకోత కోస్తూంటేనే పాపం మీరు ఎదురు తిరగరు,” జాలిగా చూస్తూ అన్నాడు పొడుగు ముక్కు.

పైడితల్లికి వొళ్ళు మండింది. “మాకూ బోలెడు పౌరుషం ఉంది. మా దేశంలోనూ చాలా వయొలెన్స్ జరుగుతుంది,” గట్టిగా అన్నాడు.

“జరుగుతుంది లెండి. కులాలు అని వర్గాలు అని ఫ్యాక్షన్లు అని, కొట్టుకు చస్తారు. మాకు తెలుసు. బలవంతుడు బలహీనుడిని హింసించడం అనేది మామూలే. మేమనేది, మీ జాతిని కబళించే ప్రమదం ముంచుకు వచ్చినా మీరు ఎదుర్కోరూ అని. పైగా దేశంకోసమో, మీరు నమ్మిన విలువలకోసమో, అతి కొద్ది మంది తప్ప, మీరు ప్రాణ త్యాగాలు చేయరు. మాకు కావల్సింది ఆ పాయింట్ మాత్రమే,” ఎక్స్‌ప్లేయిన్ చేసాడు మెల్ల కన్ను.

పైడి తల్లికి ఏమనాలో తెలీలేదు. ఇంతలో పొట్టాయన, “మరే, మొన్నే చూశాం కద, వీళ్ళ ముంబాయి నగరంలో జరిగిన దాడి. అదే కాదు అంతకు ముందు ఒకసారి పార్లమెంట్ మీద కూడా అటాక్ అయ్యింది. అయినా వీళ్ళు చలించలేదు. గంగిగోవుల్లాంటి వాళ్ళు,” అంటూ తాఖీదు ఇచ్చాడు.

పైడి తల్లికి అతను పొగుడుతున్నాడో తిడుతున్నాడో అర్థం కాలేదు.

“ఓకే మిస్టర్ పీ.టీ. అలీ, ఐ మీన్, పైడి తల్లి, మీకు క్లియరెన్స్ వచ్చేసినట్టే! కంగ్రాచులేషన్స్!” అంటూ కరచాలనం చేశాడు బట్టతల.

“పదండి లంచ్‌కి వెళ్దాం. నేను చెప్పిన రెస్టారెంట్‌లో బీఫ్ భలే రుచిగా ఉంటుంది,” అన్నాడు పొడుగు ముక్కు.

వాళ్ళు పైడి తల్లిని తన మానానికి తనను వదిలేసి, బయటకు నడిచారు.

“బీఫ్ అంటే ఆవు మాంసం. పాపం వెర్రి గోవులు. ఏం చేస్తాయి. తమని తాము కాపాడుకోలేవు కద. వీళ్ళకి ఇలా బలయిపోతాయి,” అనుకుంటూ తను కూడా బయలుదేరాడు పైడి తల్లి.

War is an ugly thing, but not the ugliest of things. The decayed and degraded state of moral and patriotic feeling which thinks that nothing is worth war is much worse. The person who has nothing for which he is willing to fight, nothing which is more important than his own personal safety, is a miserable creature and has no chance of being free unless made and kept so by the exertions of better men than himself.

– John Stuart Mill

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

29 Responses to హిందూనా? ఐతే ఓకే!

 1. మంచి సెటైర్. ఎప్పటిలగే మీ శైలి (మాత్రం) బాగుంది.

 2. బాబు says:

  హా,హా,హా…బాగుంది.

 3. sravya says:

  baagaa cheppaaru

 4. గురువు గారు భలే సెటైరండి. మీ స్టైల్ లో అదుర్స్.

 5. bollojubaba says:

  its me that pydithalli

 6. రవి says:

  ఇది సెటైర్ అయితే, మీ శైలి గురించి చెప్పాల్సిందేమి లేదు. (నేను మీ అభిమానిని కూడా). మీరు అది కాక ఏమైనా చెప్పదలుచుకుంటే, కాస్త అర్థమయ్యేట్టు చెబితే నా లాంటి మట్టి బుర్రలకు అర్థం అవుతుంది.

 7. laxmi says:

  P.T.Ali, paidi talli…adiripoindi. naaku maa collegue okadu gurthuku vachadu. vadiperu Y.S.Lu. vadiperento decode cheyyatanaki try cheyyandi

 8. Murali says:

  ఎద్దు మైలారం శ్రీనివాసులా? 🙂

 9. Murali says:

  రవి గారూ,

  సూటిగా చెప్పాలంటే, గంగి గోవు ఎంత శ్లాఘించదగ్గ జంతువు ఐనా అది తనను తాను కాపాడుకోలేదు కాబట్టి, క్రూర మృగాలకు లోకువే. మిగతా జంతువులు కూడా, “అయ్యో పాపం” అంటాయేమో కానీ, గంగి గోవుకి ఆ సానుభూతి వల్ల ఒరిగేదేం లేదు.

  ఇక్కడ గంగిగోవు ఎవరో, క్రూర మృగాలు ఏవో కూడా చెప్పాలంటారా?

  -మురళి

 10. రవి says:

  🙂 గంగి గోవు గా ఉండటం అన్ని వేళలా పనికి రాదని భావం. అంతే కదా? అంతకంటే ముందు మందలో కొన్ని గోముఖ వ్యాఘ్రాలను గుర్తించి వాటి పీడ వదిలించుకోవాలి ఎలాగోలా.

 11. బాపు says:

  మురళి గారు! మీ బ్లాగ్ ఆలోచింపజేసేదే కాదనను. కానీ… మన ఈ స్థితికి కారణం అనైక్యత అని నా అభిప్రాయం. మనం ఎన్నుకొన్న నేతలే ( ముస్లిం) మైనారిటీ ఓట్ల కోసం, కుళ్ళిన మాంసం కోసం కొట్టుకు చచ్చే నక్కల్లా దేబిరిస్తుంటే, బయటినుంచే కాదు, దేశంలోనే కన్నతల్లికి ద్రోహం చేసే వాళ్ళు ఎందుకు తయరవ్వరు చెప్పండి? మన మంచితనాన్ని చేతగాని తనంగా భావించే ఆ నా కొడుకులకి సరైన సమాధానం చెప్పాలంటే ముందు మన దేశ రాజకీయాలు మారాలి. ప్రతి ఉగ్రవాద చర్యకు వెంటనే ప్రతిచర్య చూపించాలి. దొరికిన ఉగ్రవాదులను విడిచి పెట్టడం లాంటి చారిత్మాత్మక తప్పిదాలు చేయకూడదు. లేదంటే ఆ వరాహముఖ వ్యఘ్రాలకు మనదేశ గంగి గోవులు బలి అవుతూనే ఉంటాయి. ఏమంటారు?

 12. బాగా చెప్పారు సుమండీ 🙂

 13. sujji says:

  laxmi garu.. aa peru saidulu kaavachu.. correctena?

 14. Murali says:

  బాపు గారూ,

  మీరు చెప్పినవన్నీ కరక్టే. కానీ వీటన్నిటికి మూలం హిందువులు సమర్థవంతంగా తమ జాతికీ, దేశానికీ ముంచుకొస్తున్న ముప్పుని ఎదుర్కోలేక పోవడమే. మనం ఎందుకు ఇలా నిర్వీర్యమయిపోయామో, ఎంత శోధించినా అర్థం కాని విషయం. (ఎన్నో వందల ఏళ్ళ బానిసత్వం, వక్రీకరించిన కుల వ్యవస్థ, మెట్ట వేదాంతం, గాంధేయ వాదం, తమ కాళ్ళు తామే నరికేసుకునే సూడో సెక్యూలరిస్టులు ఇలాంటివి ఎన్నో కారణాలు ఉండి ఉండవచ్చు. ఐనా ఇవేవి మన మతానికి పట్టిన స్తబ్దతను పూర్తిగా ఎక్స్‌ప్లేయిన్ చేయలేవు.)

  మన దేశం దౌర్భాగ్యానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనందరం కారకులమే. ఇందులో నన్ను నేను కూడా మినహాయించుకోవడం లేదు. బహుశా మనకు మరో స్వాతంత్ర్య సంగ్రామం కావాలేమో!

  -మురళి

 15. నవ్వించారు. అంతలోనే “ఆ వెధవ నవ్వాపు, ఇది నవ్వుకొనే విషయం కాదు” అని అంతర్లీనంగా చెప్పినట్టనిపించింది నాకైతే..

  నాకూ ఎంత ఆలోచించినా అర్ధం కావటం లేదు ఈ “స్తబ్దత” కి కారణమేమయ్యుండొచ్చు అనేది. మనలాగా స్తబ్దుగా ఉండే దేశాలేమైనా ఉన్నాయా అని ఆలోచించా కాసేపు. నాకైతే ఏమీ తట్టలేదు.

 16. nkumartel says:

  భలే వాళ్ళే బాపు గారూ,
  We have to kill the “mind set” of the terrorists, not the terrorists themselves అనీ,
  When we launch the war on terror, we are creating more terrorists than killing them అనీ,
  We have to get into their in minds and win their hearts అనీ
  ఇలాంటి నీతి సూత్రాలు చుట్టూ వినుకుంటూ కూడా మీరలాంటి మాటలు మాట్లాట్టం ధర్మమా..హన్నా..ఎంత ధైర్యం?

 17. రిషి says:

  చాలా బాగా వ్రాసారు.

  ప్రపంచంలోని మతాలన్నిటికీ ‘హిందువంటే’ ఒక వాజమ్మ. హిందూ దేవుళ్ళు కేవలం పిచ్చి చిత్రకారులు గీసే పిచ్చి గీతలుగానే కనిపిస్తారు, ఇంకా పాస్చాత్య దేశాల పబ్బులు,డిస్కోల గోడలమీదకూడా కనిపిస్తారు.

  అలాగే ప్రపంచంలో వున్న అన్ని దేశాలో ఏమీచేతకాని ప్రజాస్వామ్య,లౌకిక,సామ్యవాద దేశం ‘ఇండియా’…
  టెర్రరిస్టులు ఎక్కడినుంచో వచ్చి ముంబైలో జనాల్ని పిట్టల్నికాల్చినట్టు కాల్చేసి ఏం పీక్కుంటారో పీక్కోండి అని చాలెంజ్ చేసాకా కూడా..ఏమీ చేయలేని మన ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడాలి.

 18. Jyothi Reddy says:

  Murali ji,

  Chala vishayalu samayanukoolanga chala baga vimarshincharu, “meeku meere sati uthiki areyadamlo”….meeru rasthooney undandi eee system change ayeentha varaku.

  Jaihind

 19. రవి says:

  మురళి గారు, మీరన్న స్తబ్ధత కు నాకు కనిపించిన కారణం ఇది. జంబూ ద్వీపం, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, సహజ ఒనరుల దృష్ట్యా, స్వయం సమృద్ధమైనది. మనిషికి కనీస అవసరాలు కూడు- గూడు- గుడ్డ అయితే, ఇక్కడ దేశంలో అడుక్కు తినే వాడికి కూడా ఏదో లాగ నాలుగు వేళ్ళు లోనికి వెళతాయి. గూడు విషయానికి వస్తే, ఏ చెట్టు కిందో గడిపేయగలడు. అలానే గుడ్డ. శీతల దేశాలు, ఎడారి దేశాల్లో జీవనం అంత సులువు కాదు. అక్కడ బయటకు వెళితే చలికాచుకోవాలి, ఎండకు మాడాలి. గుడ్డలకు కూడా ఇబ్బంది. శతాబ్దాలుగా, కనీస అవసరాలు తీరడం వల్ల స్తబ్ధత వచ్చిందని నా ఊహ. They are subtle reasons for Indian’s mildness apart from many other influences.

  అయితే, కీలక సమయాల్లో కొన్ని పొరబాట్లు చేయటం (చాచా హెన్రూ షాక్మీర్ విషయంలో …ఇలా..), గాంధేయవాదం వల్ల వచ్చి పడిన చిక్కులు (ఉదా : ముస్లిం లీగ్ వ్యవహారంలో దివాళా కోరు తనం), 1857 లో జరిగిన పొరబాట్లు, వాటిని ఆయా సమయాల్లో సమర్థంగా ఎదుర్కోలేక పోవటం, ఇవి మనకు శాపంగా పరిణమించాయి.

  ఇప్పటికి నాకనిపించేది, మనకు కావలసినది ఓ సమర్థమైన నాయకుడు (కాస్తో కూస్తో సంజయ్ గాంధి గుర్తుకొస్తాడు నాకు, తన గురించి పూర్తిగా తెలియకపోయినా), కొన్ని విషయాల్లో ధైర్యం తో తప్పో వప్పో ముందడుగు వేయటం మొదలైనవి. అది ఎప్పుడు జరుగుతుందో కాలమే చెప్పాలి.

 20. Jyothi Reddy says:

  Dear All,

  Salary & Govt. Concessions for a Member of Parliament (MP)

  Monthly Salary : 12,000
  Expense for Constitution per month : 10,000
  Office expenditure per month : 14,000
  Traveling concession (Rs. 8 per km) : 48,000 ( eg.For a visit from kerala to Delhi & return: 6000 km)
  Daily DA TA during parliament meets : 500/day
  Charge for 1 class (A/C) in train: Free (For any number of times) (All over India )
  Charge for Business Class in flights : Free for 40 trips / year (With wife or P.A.)
  Rent for MP hostel at Delhi : Free
  Electricity costs at home : Free up to 50,000 units
  Local phone call charge : Free up to 1 ,70,000 calls.
  TOTAL expense for a MP [having no qualification] per year : 32,00,000 [i.e . 2.66 lakh/month]

  TOTAL expense for 5 years : 1,60,00,000

  For 534 MPs, the expense for 5 years :
  8,54,40,00,000 (nearly 855 crores)

  AND THE PRIME MINISTER IS ASKING THE HIGHLY QUALIFIED, OUT PERFORMING CEOs TO CUT DOWN THEIR SALARIES�..

  please meeru mee abhiprayalu rayandi dheeni gurunchi…

 21. Wanderer says:

  ఎంత గంగివోవైనా లేగదూడకి ఆపద కలుగుతోందంటే కొమ్ము విసురుతుంది. ఏం జరుగుతున్నా పట్టించుకోని స్తబ్దత పోవాలంటే, పరిస్థితులు ఇప్పుడున్నట్లు కొనసాగితే తమ పిల్లల కాలానికి దేశం,మతం,సంస్కృతి,స్వేఛ్ఛ ఇవేమీ మిగలవు అన్న ఙ్ఞానమో భయమో కలగాలి. అలాంటి ఆపదకి కూడా స్పందన రానివాళ్ళు, they deserve it. పోరాడకపోతే extinction తప్పదు.

 22. బాపు says:

  @మురళి గారూ! దేశం ఈ స్థితిలో ఉండడానికి కారణం మనమందరం ఎంతోకొంత కారకులమే కాదనను. కానీ మనలో ఎవరైనా తీవ్రవాదాన్ని అంతమొందించే కోణంలో ఒక్క అడుగైనా ముందుకు వేస్తున్నారా? లేదు. కారణం వర్గ వైషమ్యాలు. ఘటన జరిజిన కొత్తలో హడావిడి, కొంతకాలానికి ఇది తెరమరుగై మరో కొత్త సమస్య. ఇందుకు మీడియా కూడా అతీతం కాదు. మళ్ళీ మన దైనందిన జీవితంలో మనం బిజీ.

  ఆనాటి స్వతంత్ర సంగ్రామంలో ఆస్తి, ధనం చివరకు ప్రాణం కుడా తృణప్రాయంగా త్యజించిన మహానుభావులు వంటి వారు మనలో ఉన్నారా? ( నేను కూడా అతీతుణ్ణి కాదు.) త్యాగం, ధైర్యం, తెగింపు లేనిచోట నవసమాజ నిర్మాణం సాధ్యం కాదని నా అభిప్రాయం. ఇవేవీ లేకపోయినా ఫరవాలేదు. “స్వార్ధం” అనే జాడ్యం వీడితే చాలు.

  తీవ్రవాదం అంతర్జాతీయ సమస్య. కానీ నష్టపోయేది మనలాంటి (అబివృద్ధి చెందుతున్న )దేశాలే. దొరికిన తీవ్రవాదుల్ని ఎంతమందిని మనం శిక్షించాం (గలిగాం) చెప్పండి?

  చివరగా… బొంబాయి వంటి ఘటనని ఆరేస్సేస్సో లేదా భజరంగ్ దలో పాకిస్తాన్లో చేసాయనుకోండి? ఇప్పుడు మనం చెప్పుకొనే అంతర్జాతీయ సమాజం, పాకిస్తాన్ చేతులు కట్టుకున్టాయంటారా? మరి మనమెందుకు ఆ దేశ “వరాహాల” రాక్షసానందాన్ని భరించాలి. ఇవన్నీ ఎవరికీ వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు. వీటికి సమాధానాలు లభిస్తే మనం నిర్వీర్యం కావటానికీ, మన స్తబ్దతకు కారణాలు దొరికినట్లే.
  @ nkumartel:
  మీరన్నది నిజమే. నేను చాలా ధైర్యం చేశాను. ఎవడైనా మన చెంపపై కొడితే అది కొట్టినవాడి తప్పు కాదు. మనది. ఎందుకంటే మనమేం చేయలేమని ( … ఏం…… ఈకలేమని) వాడి ధైర్యం. కాదంటారా?
  @ రవి:
  మీతో ఏకీభవిస్తాను. కొన్ని సందర్భాల్లో ఫలితమేదైనా ముందడుగు వేయటమే ఉత్తమం.
  @ జ్యోతిరెడ్డి:
  మీ శోధనా పత్రం అద్భుతంగా ఉంది. కానీ… వారి అక్రమార్జన సంగతో? అది బయటకు వస్తే రాష్ట్రం, దేశం రెండూ సస్యశామలమవుతాయని నా అభిప్రాయం. రజనీకాంత్ “శివాజీ” చూసారానుకుంట!
  @ wonderer:
  భయం జ్ఞానాన్ని డామినేట్ చేస్తుంది. వారికి మదర్సాల్లో నేర్పించే సాహిత్యం అంతు చుస్తే ఉగ్రవాద కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పడినట్లే. కానీ మనకు ఆ ధైర్యం ఉందా అని.

 23. రాజు says:

  నేను wandererతో ఏకీభవిస్తాను.

 24. Jyothi Reddy says:

  Bapugaru,

  Thanks for the coment. ounu mee abhiprayamtho ekeebhavisthanu, kani valla akrmarjanaku manamu kooda karakulamey kadha. manamuuu marali. mana vallanu marchali.

  Corruption leni vyavasthanu chuudagalamo ledho eee janmaloo. Emi cheyaleni paristhithi mounanga rodhinchadam thappaa. Kaani avakasham vasthey kasthaina marchalaney thapathrayamuuu and na vanthu krushi cheyalaney thapanaaa….

 25. India the coward..India the bold..India the terrible.

  మనం మొదటి దశకే పరిమితమై పోయాము. అవసరాన్ని బట్టి మిగతా రెంటిని కూడా ప్రకటించగలగాలి.

 26. bharat says:

  ప్రపంచ వ్యాప్తంగా వున్న తీవ్రవాదుల్లో 95% పైగా ఇస్లామిక్ తీవ్రవాదులే. ఈ ఉగ్రవాదుల్ని నిర్మూలించినత మాత్రాన ఉగ్రవాద సమస్య పరిష్కారమవుతుందా?
  మూలాల్ని మర్చాలి. సామన్యుడికి కూడా అర్ధమయ్యే సత్యం ఇది.

  ప్రపంచ వ్యాప్తంగా వున్న ఇస్లామిక్ టెర్రరిజం పై అమెరికా అధ్యక్షుడికి పెంటగాన్ ఇచ్చిన రిపోర్టులోనూ అదే వుంది.

  ఇస్లామిక్ టెర్రరిజానికి మూల కారణం:ఖురాన్ లోని హింసా వాక్యాలు.

  శాశ్వత పరిష్కారం:ఖురాన్ లోని హింసా వాక్యాల్ని (మాత్రమే) తొలగించడం.

  కానీ, దాన్ని అమలుపరచడం సాధ్యమా? ముస్లింలను, కుహనా లౌకికవాదుల్నీ ఒప్పించగలగాలి. మిగతా సభ్య ప్రపంచానికి అంత ధైర్యం వుందా?

 27. ఈ ఖండనలు ,ఏకీభవించటములు మాని/ఆపి , మీలో ఎంతమంది మీ పిల్లల్లో రాజకీయ చైతన్యం నింపి వారిని భావిభారత రాజకీయనాయకులుగా చేయలనే తలంపుతో వున్నారు.(నేను సైతం…మరి మీరు కూడా అయితే నన్ను బలపరచగలరు).

  “Be The first to change , If you aspire to see some change in your mob.”

  P.S :No Negatives in the blog
  Healthy Criticism are welcome.
  🙂

 28. Hyma Sagi says:

  Our politics are muddy and it is one of the contributing factors for the current situation. We all agree with it. So let us start cleaning it. How many of the middle class educated people vote? It is less than 30%. How will politics and politicians change if we think its a waste of time electing the right candidate. Get involved, motivate others to vote and contest in elections.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s