బట్టతల వచ్చేసిందే బాలా – 11

“ప్రవల్లికకి పెళ్లిచూపులు ఈ రోజు,” క్యాజుయల్ గా అన్నారు వాళ్ళ నాన్నగారు ఒక రోజు మాతో. మాకెందుకో ఆ మాట రుచించలేదు. అక్కడికి ప్రవల్లిక మాలో ఎవరితోనో పీకల దాకా ప్రేమలో పడిందని కాదు. కాని మాలో కొత్త ఉత్సాహం నింపిన ప్రవల్లిక పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుందేమో అని ఒక ఫీలింగ్ అనుకుంటా.

“అప్పుడే పెళ్ళేంటి అంకుల్,” అన్నాడు పాపారావు.

“అంటే ఎప్పుడు చేస్తే బాగుంటుందంటారు సార్?” కాస్త కోపంగానే అడిగాడు ఆయన.

“ఇంకా ఇన్ని రోజులు అని అనుకోలేదండి. కాని ఇప్పుడే మాత్రం వద్దు,” అన్నాడు పాప్స్.

పోరంబోకు – పార్ట్ 4 పరిస్థితి నుంచి తప్పించడానికి, ఈ సారి నేను కలగజేసుకున్నా. “ప్రవల్లిక ఏజ్ ఎంత అంకులు?” అంటూ.

“23. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది,” అన్నాడు ఆయన.

ఇప్పటికే ఆలస్యం అయి పోయిందా! మరి 30కి దగ్గర పడుతున్న మేమేమనుకోవాలి?

“అబ్బాయి వాళ్ళు రేపు చూసుకోవటానికి వస్తున్నారు. అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. Infomiss అనే కంపెనీలో పని చేస్తాడు. వయసు 28. ప్రవల్లికకి ఈడూ జోడూ,” అన్నారు ఆయన ఆనందంగా.

“అదేంటో విచిత్రంగా మేమందరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లమే. మా వయసులు 28-30 మధ్యలో ఉంటాయి,” అన్నాను నేను లోపల బాధ పడుతూ.

“ఆ వివరాలు ఇప్పుడెందుకు నాకు?” డేంజరస్‌గా చూస్తూ అన్నారు ఆయన.

నేను నాలుక కర్చుకున్నాను. పోరంబోకు – 5 సినేరియో వచ్చేసింది. వెంటనే తడుముకోకుండా, “అంటే మేమూ, పెళ్లి కొడుకూ సేం టు సేం కాబట్టి  అతని గుణగణాలు కనిపెట్టచ్చన్నమాట,” అన్నాను ఏ మాత్రం సిగ్గు లేకుండా.

ఆయన మొహం వికసించింది. “నిజమేనోయి, రేపు మీరు నలుగురూ కూడా పెళ్ళి చూపులకు వచ్చేయండి. కనిపెడుదురు గానీ,” అన్నాడు.

ఆయన వెళ్ళిపోయాక మిగతా ముగ్గురూ నన్ను వాయించేశారు, “ఓరి దరిద్రుడా నీ వల్ల, పెళ్లి కాక ముందే మగ పేరంటాళ్ళలా ఎవడివో పెళ్ళి చూపులకు వెళ్ళాల్సిన ఖర్మ పట్టింది,” అంటూ.

“ఏమో, ఇదీ ఒకందుకు మంచిదే,” అన్నాను నేను.

వాళ్ళు కూడా నా వైపు సాలోచనగా చూశారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

14 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 11

 1. shivaspeaks says:

  బావుంది డైలీ సీరియల్

 2. Nanda Kishore p says:

  Sri E Serial tho me fan ayepoya sir… really excelnt. nenu chala kadalu chadiva kani intha eppdu navvaledu… super….

 3. Murali says:

  థాంక్స్ నంద కిషోర్ గారూ,

  మీ అభిమానానికి కృతజ్ఞతలు.

  -మురళి

 4. lakshmi says:

  me story chadiveppudu ne navvatam chusi ma room lo vallu alreday naku pichi ani fix ayyela unanru. Too much of laughing is injurious to health anipisthondi 😉

 5. another_old_timer says:

  Good stuff. Just unearthed your “Senior”. I suggest you add it to your “recent posts section” for the benefit of fellow readers.

 6. పార్వతి says:

  పోరంబోకు పార్ట్-4 లో పాపం అమాయక పాపారావు ఇరుక్కుపోయాడు ! 😀 Infomiss ఆ ? 😀
  మగ పేరంటాళ్ళు :-))

 7. Murali says:

  లక్ష్మి గారూ,

  ఆ సామెతలు పట్టించుకోకండి. ఏడ్చే మగాణ్ణి నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అని కూడా అంటారు. కాని మన చుట్టూ జీవితమే ఇంత క్యామెడీ అందిస్తున్నప్పుడు నవ్వకుండా ఎలా ఉండగలం? 🙂

  -మురళి

 8. Murali says:

  Old Timer gaaroo,

  I will implement your suggestions. Thanks.

  -Murali

 9. Murali says:

  శివ గారూ,

  ఇది డైలీ సీరియల్ అనుకుని రాయడం మొదలెట్టలేదు, కానీ ఎందుకో అలానే తయారయ్యింది. 🙂

  -మురళి

 10. madhu says:

  good writeup …

 11. Jyothi Reddy says:

  Murali ji,

  “అదేంటో విచిత్రంగా మేమందరం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లమే. మా వయసులు 28-30 మధ్యలో ఉంటాయి,”

  Same range lo americalo CHALAA mandi unnaru. vallandariki mee hasyam cheralani korukontunnanu.

  OMG inka navvakunda undalekapothunnanu. Gurthuku vachinappudalla navvadamey inka.

 12. M. Rajasekhar says:

  చాలా బావుందయ్య మళ్ళి మళ్ళి చదవాల నిపించె మంచి హస్యం మి రచనల్లొ చుస్తుంటా ము మీకు ఆ భగవంతుండు మంచి ఆరొగ్యం ప్రసాదించాల ని కొరుకుంటూ – frm mrajasekhar mrajagopal and familys rayagada orissa

 13. Murali says:

  రాజశేఖర్ గారూ,

  మీ అభిమానానికి చాలా పెద్ద థాంక్స్! నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం అన్నారు జంధ్యాల గారు. మీకు ఆ భోగాన్ని ఇచ్చినందుకు నాకూ ఆనందంగా ఉంది.

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s