బట్టతల వచ్చేసిందే బాలా – 10

ఓ వారం రోజులు మా వాళ్ళ కంట పడకుండా తిరిగి, వాళ్ళ కోపం చల్లారాక మళ్ళీ మా గూటికి చేరుకున్నా.

శనివారం వచ్చింది. ఆ రోజు మా అందరికి సెలవు. పెద్దగా ప్రోగ్రాం ఏమీ లేదు. అందరం ఇంట్లోనే ఉన్నాం. శేఖర్ తన రూంలో గోడపై నిండుగా జుత్తున్న తన ఇంటర్మీడియెట్ ఫోటోని చూస్తూ, కళ్ళ నీళ్ళు కారుస్తూ, “జానే కహా గయె వో దిన్? (ఆ రోజులు ఎక్కడ పోయాయి)” అని వీలైనంత వరకు ముఖేష్‌ని అనుకరిస్తూ పాడుతున్నాడు.

ఐతే మేము పాపారావు మీద కూకలు వేసినట్టు శేఖర్ మీద వెయ్యలేదు. ఎందుకంటే శేఖర్ ఎప్పుడో గానీ ఇలాంటి మూడ్‌లో ఉండడు. వచ్చాడంటే ఓ పట్టాన బయటకు రాడు. వాడి జుత్తు అలా మాటి మాటికీ దువ్వుకుంటూ కన్నీళ్ళు కారుస్తూ ఉంటాడు. వాడిని కాసేపు వదిలేస్తే వాడే తేరుకుంటాడు.

పాపారావు తేజా చానెల్‌లో వస్తున్న విజయకాంత్ డబ్బింగ్ తమిళ్ సినిమా చూస్తున్నాడు. వాడు విజయకాంత్‌కి పెద్ద ఫ్యాన్. ప్రపంచంలో ఏ యాక్టరూ విజయకాంత్ వేసినన్ని రోల్స్ వేసి ఉండడని వాడి అభిప్రాయం. వాడిప్పుడు చూస్తున్న సినిమాలో విజయకాంత్ డిగ్రీ స్టూండెంట్ పాత్ర వేశాడు. కాలేజీ ప్రిన్సిపాల్‌తో, “నేను చదువుకుని పెద్దవాడిని అయ్యాక అమెరికాకి వెళ్ళను సార్. ఇక్కడే ఉండి దేశ సేవ చేస్తాను,” అంటున్నాడు లిప్ మూవ్‌మెంట్స్ కలవని మాటలతో. పాపారావుగాడు ఆ డవిలాగుకి ఒక పెద్ద ఈల వేశాడు.

నేనూ నారాయణ్ లోకల్ రాజకీయాల గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నాం. మా లోకల్ ఎం.ఎల్.యే కంటే మా లోకల్ ఎం.పీ.నే ఎక్కువ త్రాష్టుడు అని నేనూ, కాదూ అని నారాయణ్ వాదించుకుంటున్నాం.

అప్పుడే ప్రవల్లిక మా అపార్ట్‌మెంట్‌లోకి ఎంటర్ అయ్యింది. ప్రవల్లిక రాగానే మొత్తం వాతావరణం మారిపోయింది. అప్పటివరకు గ్లిజరిన్ లేకుండా ఏడుస్తున్న శేఖర్ గాడు టక్కున ఏడుపాపి, దువ్వెన జేబులో పెట్టుకుని, తన ఫోటో పక్కనే ఉన్న వినాయకుడి పటానికి దండం పెడుతూ తనలో తాను ధ్యానం చేయడం మొదలెట్టాడు. .

పాపారావుగాడు తేజా నుంచి డిస్కవరీ కి చానెల్ మార్చేశాడు. చాలా సీరియస్‌గా బుల్లి తెర మీద చూపిస్తున్న ఒరాంగ్ వుటాన్ల అలవాట్లు ఆచారాలను తదేక దీక్షతో చూడ్డం మొదలెట్టాడు.

నేను నారాయణ్ గాడూ సడన్‌గా మేము ఇద్దరం పని చేసే కంపెనీది ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేశాం.

ప్రవల్లిక మమ్మల్ని చూసి ముచ్చట పడిపోయింది. “అబ్బా మీరు చాలా డిఫరెంట్. ఇంతకు ముందు మేమున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో మా పక్క అపార్ట్‌మెంట్‌లో ఉన్న బ్యాచిలర్స్, ఎప్పుడు చూసినా అద్దం ముందు నిల్చుని తల దువ్వుకోవడమో, తేజా చానెల్‌లో ఆ దిక్కుమాలిన విజయకాంత్ సినిమాలు చూడ్దమో, లేదా లోకల్ పాలిటిక్స్ డిస్కస్ చేయడమో చేసేవారు. మీరు అలా కాదు,” అంది సంబరంగా.

“అలాంటి వాళ్ళు కూడా ఉంటారా?” అడిగాం మేము నలుగురూ ఒకే సారి. ఇంతలో మాకు రోజూ పేపర్ వేసే కుర్రవాడు వచ్చాడు. పాపారావుని చూసి, “అంకుల్! లాస్ట్ మంత్ బిల్ కోసం వచ్చిన,” అన్నాడు.

ప్రవల్లిక వెంటనే, “అంకుల్ ఏంటి, అంకుల్? సరిగ్గా కళ్ళు కనపడ్డం లేదా? ఆయన పట్టుమని పాతికేళ్ళు ఉంటాయేమో. కొంచెం వెనకా ముందు చూసుకో,” అంటూ గద్దించింది.

వాడు, “సారీ సార్, మరి నా బిల్,” అంటూ పాపారావు వైపు చూసి నసిగాడు. పాపారావు వాడి చేతిలో ఒక ఐదొందల రూపాయల నోటు పెట్టాడు. “ఇంతక్కర్లేదు సార్. నా తాన చేంజ్ కూడా లేదు,” అన్నాడు వాడు. “ఫర్లేదు ఉంచుకో. నెక్స్ట్ మంత్‌కి అడ్జస్ట్ చేసుకో,” అన్నాడు గద్గదమైన స్వరంతో పాపారావు. వాడు తల బరుక్కుంటూ వెళ్ళిపోయాడు.

ఒక్క పాపారావు పరిస్థితే కాదు, మా ముగ్గురిది కూడా చాలా ఎమోషనల్‌గా ఉంది. అంకుల్ అని మమ్మల్ని పిలవక పోవడమే కాకుండా, అంకుల్ అన్న వాడికి బుద్ధి చెప్పిన ప్రవల్లిక మా అందరి దృష్టిలో ఎంతో ఎదిగి పోయింది.

“అయిగిరి నందిని నందిత మేదిని,” అని పాడుతూ పాపారావుగాడు ప్రవల్లిక చుట్టు రౌండ్ వేయబోయాడు.

ఇటువైపు నుంచి నారాయణ్, అటువైపు నుంచి శేఖర్ ఒక దూకు దూకి వాడి నోరు మూసేశారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

9 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 10

 1. sagar says:

  chala bagundi…

 2. లచ్చిమి says:

  viswa vinodini nandanuteeee

  ha ha ha ha ha ha

  enti maastaaru never endingaaa
  antelendi batta tala never ending kadaaa
  through entire life kadaaaa

 3. Murali says:

  అవును లచ్చిమి గారూ,

  బట్టతల కథ అనంతం. కానీ ఎప్పుడో ఒకప్పుడు ముగించాలిగా! 🙂 జాతస్యహి ధ్రువో మృత్యుః

  -మురళి

 4. Bhaskar says:

  I am a big fan your blog. Americalo AApasopala tharuvatha Batta thala addiripothunnadi. Inka kanisam 10 episodlu kavaalani korika.

  -Bhaskar

 5. పార్వతి says:

  😀 😀 😀 నేను మాత్రం ఈ కథకి ఇప్పట్లో ముగింపు ఉండకూడదు అని కోరుకుంటున్నా అధ్యక్షా ! అమృతం సీరియల్ లాగ, రోజు ఎదురుచూడటం,నవ్వుల విందు చేస్కోవటం, బహోత్ అచ్చా హై !

 6. Wanderer says:

  aigiri nandinaa…. enta araadhanaa bhaavam….. 😀

  Vijayakaant ni kooDaa vadallEdugaa meerasalu? Super!

 7. శ్రీధర్ says:

  boss nuvvvu mariii too much chestunnaav. inta comedy itee kastammm yaar…

  “అయిగిరి నందిని నందిత మేదిని,” అని పాడుతూ పాపారావుగాడు ప్రవల్లిక చుట్టు రౌండ్ వేయబోయాడు.

  Emtidi cheppu? konchem control lo raayi, leka pote nenu sucide note lo ni peru raasi, jebulo pettukuni kaani nii bloga chadavanu.

  KHABADDAAAAAR.

 8. Jyothi Reddy says:

  Sridhar garu antha pani cheyyakandi papam

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s