బట్టతల వచ్చేసిందే బాలా – 9

అంతా భోజనాలకు కూర్చున్నాక, ప్రవల్లిక వాళ్ళ అమ్మ గారూ, “అన్ని వంటకాలు ఇక్కడే ఉన్నాయి బాబూ. మీరేం తింటారో ఏం తినరో తెలీదు, కాబట్టి మీకిష్టమైనవి మీరే వడ్డించుకోండి,” అన్నారు.

మేము నలుగురం ముందే కూడబలుక్కున్నట్టు కాస్త అన్నం పళ్ళెంలో వేసుకుని, పెరుగు వొంపుకోబోయాం.

“అరే అదేంటి, అప్పుడే పెరుగు వడ్డించుకుంటున్నారు? కొంప తీసి బయట తిని వచ్చారా?” నొచ్చుకుంటూ అడిగారు ఆవిడ.

మూడోసారి మేము పోరంబోకులమనిపించుకునే పరిస్థితి వచ్చిందని నాకే కాదు, ఈ ఘనమైన ఐడియా ఇచ్చిన పాపారావుకి కూడా అర్థమయి పోయింది.

ఈ సారి నేను అడ్డు పడ్డాను. “ఆకలిగా లేదని కాదాంటీ. మేము ముందు పెరుగుతో మొదలు పెట్టి, ఆ తరువాత కూరలు, తరువాత పప్పు, ఆఖర్లో ఆవకాయా వేసుకుంటాం,” ఎక్స్‌ప్లెయిన్ చేసాను.

“ఎందుకలా?” విచిత్రంగా చూస్తూ అడిగారు ప్రవల్లిక నాన్నగారు.

అవును ఎందుకలా? నేను చాలా స్పీడ్‌గా ఆలోచించాను. “ఎందుకంటే ఒక సారి ఏదో చానెల్‌లో బాబా రాందేవ్ అలా తింటే మంచిది అని చెప్పడం విన్నాను. అప్పటినుంచి అలా చేస్తున్నామన్న మాట.”

“నేను ఆయన ప్రోగ్రాములన్ని చూస్తానే. ఇలా చెప్పడం ఎప్పుడూ వినలేదు,” ప్రవల్లిక ఫాదర్ ఇంకా ఆ టాపిక్‌ని వదల్లేదు.

“అబ్బా ఊరుకోండి నాన్నా! ఏదో ప్రోగ్రాంలో చెప్పే వుంటారులెండి,” అంటూ అప్పటికి మమ్మల్ని రక్షించింది ప్రవల్లిక.

దాని తరువాత నేను చెప్పిన వరుస ప్రకారం, నేనే కాదు, చచ్చినట్టు మా వాళ్ళంతా కూడా తరువాత వంకాయ కూర వడ్డించుకున్నారు. అసలే ఇంట్లో తెగ మేసి వచ్చామేమో, ఆ తరువాత పప్పు కూడా వేసుకుని తిన్నాక మా అందరి పొట్టలు పగిలే స్టేజ్‌కి వచ్చాయి.

ప్రవల్లికతో అండర్‌స్టాండింగ్ పెంచుకోవడం మాట దేవుడెరుగు, అసలు ఈ కుర్చీల్లోంచి లేచి నిలబడి స్టాండింగ్ చేయగలమా అన్న అనుమానం మొదలయ్యింది నాకు. సడన్‌గా నాకు తద్దినపు రోజు తినే బ్రాహ్మణుల మీద భక్తి గౌరవం విపరీతంగా పెరిగిపోయాయి. దీన్ని కెరియర్‌లా మార్చుకుని క్రమం తప్పకుండా తింటున్నారంటే వాళ్ళెంతటి మహనీయులయి ఉండాలి!

ఇంకా ఏం అనుకునే వాడినో తెలీదు కాని, ప్రవల్లిక లోపలినుంచి చిన్న బాటిల్ పట్టుకొచ్చింది. దానిలో చూడగానే కళ్ళు భైర్లు కమ్మించే ఎరుపు పదార్థం ఒకటుంది.

“ఏంటది?” భయంగా అడిగాడు నారాయణ్. “అదే, మీరు ఆవకాయతో భోజనం ముగిస్తారు కద, దాన్నే పట్టుకొచ్చా. ప్రశస్థమైన గుంటూరు ఆవకాయ,” చెప్పింది ప్రవల్లిక.

“గుంటూరు ఆవకాయ. మీది గుంటూరా?” అడిగాడు శేఖర్. “అవును బాగా కారం దట్టించి చేసింది అమ్మ,” నవ్వుతూ చెప్పింది ప్రవల్లిక. మా పై ప్రాణాలు పైనే పోయాయి.

ఆ ఆవకాయతో మా భోజనం “ముగించాక” మా పరిస్థితి దయనీయంగా ఉంది. మొహాలనుండి ఆవిర్లు వస్తున్నాయి. నలుగురం శరవేగంగా పెరుగు గిన్నె వైపు చేతులు కదిపాం.

“అదేంటి, మళ్ళీ మొదటికి వచ్చారు. మీ భోజనం అయిపోయింది కద,” అన్నారు ప్రవల్లిక నాన్నగారు. “హి హి అవును కదూ, అయిపోయింది. కాస్త నీళ్ళు ఇవ్వండి ఆంటీ,” రిక్వెస్ట్ చేశాను.

“మరి మీ ఈ కొత్త డయిట్‌లో ఆఖర్లో మంచి నీళ్ళు తాగచ్చా?” సైంధవుడిలా అడ్డు పడ్డాడు ప్రవల్లిక ఫాదర్.

“మా భేషుగ్గా తాగచ్చు,” క్రూరంగా అన్నాడు నారాయణ్ ప్రవల్లిక అమ్మగారు అందిస్తున్న మంచినీళ్ళ గ్లాస్ తీసుకుంటూ. మిగతా ఇద్దరూ నా వైపు క్రూరంగా చూశారు.

“ఈ భోజనాల తరువాత ఏ వీధి అరుగు మీదో వెళ్ళి పడుకోవడం బెటర్. ఇంటికి వెళ్తే ఈ ముగ్గురూ నన్ను ఖండ ఖండాలుగా చీల్చేస్తారు,” అనుకున్నాను నాలో నేను.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

16 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 9

 1. పార్వతి says:

  కత్తి తో కాదు రా, కథలతో నవ్వించి చంపేస్తా !!! అన్నట్టు రాసారు మురళి గారూ ! లైన్ లైన్ కి , ఆపకుండా నవ్వేసాను … 😀

  ఈ “నేను” పరిస్థితి పాపం, ఏదో రక్షించాలని ఏదో చెప్పి…మళ్ళీ వీధి అరుగుల మీద పడుకోవాల్సి రావటం…పాపం ! 😀

 2. laxmi says:

  Adbhutam… kompateesi meeru ee hasya cinemalako dialogue writer kaadu kada 🙂 poddu poddune manchi tonic lanti mee post tho naa work start chestunna. Great post 🙂

 3. Murali says:

  Laxmi గారూ,

  నాకూ, సినిమా ఇండస్ట్రీకీ ఏ సంబంధ బాంధవ్యాలు లేవని బ్లాగుముఖంగా తెలియజేయడమైనది. 🙂

  నేను అనుకునేది ఇది చదువుతున్నప్పుడు బాగా పండే హాస్యం. దీన్ని తెర మీదికి తర్జుమా చేస్తే ఫలితం వేరే రకంగా ఉండవచ్చు.

  -మురళి

 4. laxmi says:

  emo naku matram achamaina Jandhyala mark comedy kanipistondi mee postullo. Andulo mee paparao character male version of Sri lakshmi laga undi. Hasyam matram 101% pandindi 🙂

 5. వినోద్ says:

  అదిరింది..!!!:)

 6. Wanderer says:

  I can imagine Naresh playing the “nenu” role.

 7. Wanderer says:

  ante…. saamaanlanni katta katti daaba meeda padesaam anna maata….

  ante… edurinti vaalla daaba meeda padesaamanna maata… meeru koodaa padesi choodandi saar, chaala baavuntundi…

 8. lakshmi says:

  me blog chadavtam na daily activities lo part ayipoyindi.Chala rojula tarvata manchi hasyam enjoy chestunnanau.

 9. Jyothi Reddy says:

  Muraliji,

  Ivvala Navvaleka chachipoyyanu. Gonthu thadi aaripoi neellakosam parigethanu. Idhi emaina baga undha?

 10. పార్వతి says:

  wanderer గారూ, సరైన ఉపమ ! ( ఉపమ as in ఉపమాలంకారం ) 😀

 11. Raj says:

  బాగుంది.

 12. sujji says:

  navvi navvi kadupu noppi vachestundandi babu..!!

 13. Murali says:

  సుజి గారూ,

  వద్దు. నవ్వి నవ్వి కడుపు నొప్పి తెచ్చుకోకండి. మళ్ళీ బాబా రాందేవ్ డయిట్ పాటించాల్సి వస్తుంది.

  -మురళి

 14. srujana says:

  murali gaaru, kadupu noppi kaadu kaani manasu nindi poyindi. thank you.

 15. Sujatha says:

  “ఎందుకలా?” విచిత్రంగా చూస్తూ అడిగారు ప్రవల్లిక నాన్నగారు. అవును ఎందుకలా? నేను చాలా స్పీడ్‌గా ఆలోచించాను,”

  and ““హి హి అవును కదూ, అయిపోయింది. కాస్త నీళ్ళు ఇవ్వండి ఆంటీ,” రిక్వెస్ట్ చేశాను.”

  ee rendemiti chala scenes lo venkatesh natisthe bramhandanga vuntundandi. kani meeru annattu

  “నేను అనుకునేది ఇది చదువుతున్నప్పుడు బాగా పండే హాస్యం. దీన్ని తెర మీదికి తర్జుమా చేస్తే ఫలితం వేరే రకంగా ఉండవచ్చు.”

  Bahusa meeru cheppindi kuda correct kavachu kani naku chala chotla aprayathnaga “venki”gurthuku vasthunnaru ayanatho patu……..SUNIL,SHIVA REDDY AND VENU MADHAV GARLU vunte e scenes chala baga panduthayi anipisthondi meeru veella thoti oka Play try cheyaludadhuuuuuuuuu???????? …hi hi hi…hah….hah…hah….

 16. Murali says:

  సుజాత గారూ,

  నేను చెప్పింది అసలు హాస్యమే ఉండదని కాదు. కాని రచనలో, ఆ వర్ణనల్లో ఉండే హాస్యం యదాతథంగా తర్జుమా కాకపోవచ్చు. P.G. Wodehouse పుస్తకాలు చదివితే మీకు అర్థం అవుతుంది. I never found the TV episodes based on Wodehouse’s work as amusing as the writings themselves.

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s