బట్టతల వచ్చేసిందే బాలా – 8

సాయంత్రం ప్రవల్లిక వాళ్ళింట్లో భోజనం కాబట్టి మా ప్రిపరేషన్స్ మద్యాహ్నం నుంచే మొదలయ్యాయి.

అందరం ఒకడిని మించి ఇంకొకడు బాగా తయారయి ప్రవల్లిక దగ్గర మార్కులు కొట్టేసే ప్రయత్నంలో మా సరంజామా మొత్తం తీశాం. అంటే పర్‌ఫ్యూములు, జుత్తు వొత్తుగా కనిపేంచేందుకు హెయిర్ జెల్స్, వగైరా వగైరా.

పాపారావుగాడు వెరయిటీగా మద్యాహ్నం నుంచే ఏది కనపడితే అది మేయడం మొదలెట్టాడు. ఎందుకురా అని అడిగితే, “నేనక్కడికి వస్తూంది తిండికోసం కాదు, తన కోసం. మీరంతా లేకిగా ఫుడ్ లాగిస్తూంటే నేను ఆ టైంలో ప్రవల్లికతో మాట్లాడి మాంచి అండర్‌స్టాండింగ్ పెంచేసుకుంటా,” అని సెలవిచ్చాడు.

“ఓరి పాపిగా! ఏమో అనుకున్నా కానీ నీ బుర్ర కూడా బాగానే పని చేస్తుందిరా! ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా పని చేయదు. ఈ ఐడియా బయటకు చెప్పకుండా ఉంటే బాగుణ్ణు. ఇప్పుడు మేమన్నా తక్కువ తిన్నామా, తక్కువ తింటామా?” అంటూ వికటాట్టహాసం చేశాడు నారాయణ్. పాపారావుగాడు నాలుక కరుచుకుని బిక్కమొహం వేశాడు.

సాయంత్రం రానే వచ్చింది. మేము పాత సినిమాల్లో రాజనాలలా తయారయ్యి (మణికట్టు దగ్గర మల్లె దండ ఒకటే తక్కువ), పక్క అపార్ట్‌మెంట్ తలుపు ముందు గుమి గూడాం. కాలింగ్‌బెల్ నొక్కగానే, ప్రవల్లిక వాళ్ళ అమ్మ గారు తలుపు తెరిచారు. మేము మొహం చేటంత చేసుకుని, “హలో ఆంటీ,” అంటూ ఒక్క అడుగు ముందుకు వేశాం. ఆవిడ ఒక్క సారి ముక్కు ఎగ బీల్చి, “ఏంటయ్యా ఈ వాసన? దార్లో ఏదైనా తొక్కి వచ్చారా ఏంటి?” అడిగింది మమ్మల్ని అనుమానంగా చూస్తూ.

అది మా నలుగురి పర్‌ఫ్యూములు కలవడం వల్ల వస్తున్న దుర్వాసన అని నాకు అర్థమయ్యింది. “అందుకే చెప్పాను ఆ ఫుట్‌పాత్ మీద అమ్మే పర్‌ఫ్యూములు కొనకురా అని,” పాపారావుగాడి చెవిలో కర్కశంగా అన్నాను. వాడు నన్ను అసలు పట్టించుకోలేదు.

ఇంకోసారి మేము పరమ పోరంబోకులు అని ముద్ర పడేంతలో శేఖర్, “మిమ్మల్ని ఈ చీరలో చూస్తూంటే మా అత్తయ్య గుర్తొస్తూంది ఆంటీ,” అన్నాడు సిని ఫక్కీలో.

ఆవిడ ఖంగారు పడి, “లేదు బాబూ, ఈ చీర నేను కొనుక్కున్నదే. పైగా మీ అత్తయ్య ఎవరో నాకు తెలీదు కూడా!” అంది.

“అహహా నా ఉద్దేశం అది కాదు ఆంటీ. మీరు మా అత్తయ్యలా ఉన్నారు అని,” సర్ది చెప్పాడు శేఖర్. “ఏదో నీ అభిమానం బాబూ, రండి మంచి ఆకలి మీద ఉన్నట్టున్నారు,” అంటూ లోపల హాల్లోకి దారి తీసింది. ఆ రకంగా మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యింది.

లోపల ప్రవల్లికా, వాళ్ళ నాన్నగారూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని ఉన్నారు. “రండి రండి,” అంటూ మమ్మల్ని ఆహ్వానించారు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

6 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 8

 1. వినోద్ says:

  మురళి గారు..ఏది ఏమైనా మీ “బట్టతల వచ్చేసిందే బాలా ” మాత్రం నిజంగా సూపర్బ్ అండీ..
  నవ్వు ఆపుకోలేక పోతున్నాం అసలు..నేను జల్లెడ లో ఒక సారి ఈ పోస్ట్ చూడగానే ఇంక మీ బ్లాగ్ కి భీకరమైన ఫ్యాన్ అయిపోయా..నేనే కాదు మా కోతి మూక అంత మీ బ్లాగ్ కి ఫాన్స్ అయిపోయాం..

 2. వినోద్ says:

  ఇంకో విషయం..మేము నవ్వు ఆపుకోలేనిది ఆ కష్టాలను చూసి కాదు..

 3. Murali says:

  వినోద్ గారూ,

  మీవి పెద్ద మనసులు కాబట్టి వీళ్ళ కష్టాలు చూసి నవ్వట్లేదు. కానీ బట్టతల ఉన్న ఒక మగవాడిని చూసి గేలి చేసి నవ్వేవారు చాలా మందే ఉన్నారు. ప్చ్. ఏం చేద్దాం! 🙂

  -మురళి

 4. పార్వతి says:

  నీ బుర్ర కూడా బాగానే పని చేస్తుందిరా! ప్రాబ్లం ఏంటంటే పూర్తిగా పని చేయదు. 😀 పాపం, అమాయక పాపారావు ! 😀

  ఎందుకో అందర్లోకి హీరో పాపారావు ఏమో అని అనిపించేస్తోంది మరి ! ( కాపోతే రాజేంద్ర ప్రసాద్ లా, కామెడి హీరో ఏమో అని ! )

 5. Jyothi Reddy says:

  Muraliji,
  Meeru batta thala vallani maree ila bayatiki lagatam bagaledhu papam. Pch..Pch. I pity them.

 6. శ్రీధర్ says:

  superb….
  “లేదు బాబూ, ఈ చీర నేను కొనుక్కున్నదే. పైగా మీ అత్తయ్య ఎవరో నాకు తెలీదు కూడా!”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s