బట్టతల వచ్చేసిందే బాలా – 7

ఇలా అవమాన భారాలతో కుంగి కృశించి పోతున్న మా జీవితాలలో ఒక అపురూపమైన సంఘటన జరిగింది. అది మా పక్క అపార్ట్‌మెంట్‌కి ఒక తెలుగు కుటుంబం రాక. కుటుంబం అంటే ఏదో అల్లటప్పా కుటుంబం అనుకునేరు. కాదు సుమా! ఆ కుటుంబంలో ఇరవై రెండేళ్ళ మెరుపు తీగలాంటి అమ్మాయి కూడా ఉంది. పేరు ప్రవల్లిక.

ప్రవల్లికని చూడగానే మా అందరి గుండెల్లో వెయ్యి సితార్లు మోగాయి. పాపారావు గాడి గుండెల్లో ఇంకొన్ని ఎక్కువ మోగినట్టున్నాయి. ఆ సౌండ్ పొల్యూషన్‌కి పాపారావు గాడి నెత్తిన ఉన్న మూడు పీచుల్లో ఒకటి ఊడి పడింది కూడా.

“హాయ్! మేము నిన్నే మీ పక్క అపార్ట్‌మెంట్‌లో అద్దెకి దిగాం,” అంది ఆ అమ్మాయి మరుసటి రోజు మేము ఒకరికొకరం ఎదురు పడినప్పుడు.

“తెలుసు ప్రవల్లికా, తెలుసు,” అన్నాడు పాపారావు గాడు అదేదో పాత అడ్వర్తైజ్మెంట్‌లో “ఆపు శకుంతల ఆపు,” అన్నట్టు. నారాయణ్ కసిగా వాడి కాలు తొక్కాడు. సాధారాణంగా ఐతే పాపారావు కెవ్వుమని కేక పెట్టి ఉండేవాడే. కానీ ఆ రోజు అమృతం తాగిన దేవేంద్రుడిలా ఏ మాత్రం చెక్కు చెదరలేదు.

“అరే నా పేరు మీకు ఆల్రెడీ తెలుసా?” ఆశ్చర్యంగా చూసింది ఆ అమ్మాయి.

“అంటే నిన్న మీ నాన్నగారితో మాట్లాడాములెండి, ఆయన చెప్పారు,” సర్ది చెప్పాడు శేఖర్. నిజానికి మేము ఆ పేరు కనుక్కున్నది మా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ వాచ్‌మ్యాన్ దగ్గర.

అప్పుడే బయటకు వచ్చిన ప్రవల్లిక ఫాదర్, “ఎవరమ్మా వీళ్ళు?” అని అడిగారు.

“నీతో నిన్న మాట్లాడరట కద నాన్నా?” ఎదురు ప్రశ్నించింది ప్రవల్లిక.

“లేదే!” అన్నాడు ఆయన మమ్మల్ని వింతగా చూస్తూ. వెంటనే నారాయణ్ గాడు తెలివిగా, “ఈయనతో కాదులెండి, ఈయన లానే ఉన్న వేరే మనిషితో మాట్లాడాం. ఆయన్ని మీ నాన్నగారనుకున్నాం పొరపాటున,” అంటూ పరమ బేవార్సు వివరణ ఒకటి ఇచ్చాడు.

నా గుండెల్లో రాయి పడింది. మేము వొట్టి పోరంబోకు వెధవలం అని నిరూపించుకోవడానికి ఒక అంగుళం దూరంలో ఉన్నాం. అంతే!

ఎవరూ అనుకోని విధంగా మా పాపిగాడు మమ్మల్ని రక్షించాడు. “నాకు గోంగూర పచ్చడి కన్న కొత్త ఆవకాయ ఎక్కువ ఇష్టం,” అన్నాడు ప్రవల్లిక వైపు పిచ్చి చూపులు చూస్తూ. ఎప్పుడూ సగమే పని చేసే వాడి బ్రెయిన్, ప్రవల్లికని చూడగానే పది శాతం మాత్రమే పని చెయ్యడం మొదలెట్టిందని నాకు అర్థమయిపోయింది.

ఆ స్టేట్‌మెంట్ వినగానే వయొలెంట్‌గా రియాక్ట్ అయ్యారు తండ్రీ కూతురూ. “ఎంత మాటన్నారండి! గోంగూర ముందు వేరే ఏ పచ్చడైనా దిగదుడుపే,” అన్నారు ఒకే గొంతుతో.

దానితో సంభాషణ పక్క దారి, అదే పచ్చళ్ళ దారి, పట్టింది. అవకాశం వదులుకోకుండా అన్ని రకాల పచ్చళ్ళ గురించి అనర్ఘళంగా మాట్లాడేశాం మేమంతా ఒక అరగంట సేపు. ఆ రోజుకి అలా పొరంబోకు ముద్ర నుంచి తప్పించుకున్నాం.

చివరికి, ప్రవల్లిక నాన్నగారు, “ఈ రోజు సాయంత్రం భోజనానికి మా ఇంటికి వచ్చెయ్యండోయి,” అని ఇన్‌వైట్ చేశారు. అంతే కాకుండా, “మా ప్రవల్లిక బ్రహ్మాండంగా వండుతుంది!” అని కూడా జత చేశారు.

“తెలుసు అంకుల్ తెలుసు,” అని పాపారావుగాడు ఎక్కడ అంటాడొ అన్న భయంతో, వాడి నోరు గట్టిగా మూసేసి, “అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం,” అంటూ వాడిని అక్కడినుంచి లాక్కుపోయాం.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

9 Responses to బట్టతల వచ్చేసిందే బాలా – 7

 1. nagaprasad says:

  మీ టపాల పుణ్యమా అని నేను కూడా ఒక టపా రాయగలిగాను బట్టతల మీద. మీకు వందల నెనర్లు.

 2. Murali says:

  నాగప్రసాద్ గారూ,

  దీనికి థాంక్స్ ఎందుకండీ బాబూ. మీలాంటి బ్లాగర్ల ఆనందమే మా బరోడా బ్యాంక్. 🙂

  నేను మీ టపా ఆల్రెడీ చదివేశాను. కూసింత కాంట్రవర్షియల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. కాని చివర్లో disclaimer ఇచ్చారు కాబట్టి, ఫరవాలేదు.

  ఇక టపాల మీద టపాలు రాసుకుంటూ పొండి.

  బెస్ట్ అఫ్ లక్!

  -మురళి

 3. పార్వతి says:

  గుండెల్లో మోగే సితార్లకి …సౌండ్ పోల్యుషనా ? 😀 😀 నారాయణ ఇచ్చిన “పరమ బేవార్సు వివరణ ” భలే గా ఉంది ! 😀
  “ఆపు శకుంతల ఆపు,” టైపు లో , “తెలుసు ప్రవల్లికా, తెలుసు,” అనటం , ఏ అడ్వర్తైజ్మెంట్‌లో ఉందొ తెలియకపోయినా…బాగా నవ్వుకున్నాను ! అన్నట్టు, ప్రవల్లిక అనే పేరు చాల బాగుంది మురళి గారు ! మీ నాయికల పేర్లు అచ్చ గ్రాంధీకంలో, ముచ్చట గా ఉంటాయి !

 4. Pradeep says:

  Very good Blog … and very interesting Story… and very very good turning point…

 5. Wanderer says:

  ఈ అచ్చ గ్రాంధికం పేర్లకి ఇన్స్పిరేషను ఎవరో నేను అడగను గాక అడగను 😐

 6. పార్వతి says:

  wanderer గారూ , 😀 😀 😀

 7. Nanda Kishore p says:

  sir edi chadivi chala sepu navvanu sir….

 8. sujji says:

  hahahaaaaaaa…navvaleka chachanu..!! bhale raastunnaru.. !! too good..

 9. vsreenivas123 says:

  “మేము వొట్టి పోరంబోకు వెధవలం అని నిరూపించుకోవడానికి ఒక అంగుళం దూరంలో ఉన్నాం.”
  నవ్వలేక కుర్చీలోంచి కిందన బొక్క బోర్లా పడ్డాను… బాగుంది బాగుంది…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s