బట్ట తల వచ్చేసిందే బాలా – 6

ఏంటి? ఇది విని కూడా మీకు కన్నీళ్ళు రాలేదా? సరి ఐతే ఈ విషయం కూడా చిత్తగించండి! ఇది వింటే మీకు కళ్ళనీళ్ళు పిల్ల కాలువలా ప్రవహిస్తాయి.

ఆ రోజు ఆదివారం. మేమంతా చాలా ఆలస్యంగా లేచి, ఇంకా ఆలస్యంగా పళ్ళు తోముకుని, మరింత ఆలస్యంగా కాఫీ తాగుతూ కూర్చున్నాం. ఆ తరువాత ఏం చేద్దామా అనుకుంటూంటే నారాయణ్ హెయిర్ కట్‌కి వెళ్దామన్నాడు. వెళ్ళి మూడు నెలలయ్యింది కదా అని నేనూ, శేఖర్ కూడా వాడితో బయలుదేరాం.

“ఆలెగ్జాండర్ కట్స్” అని మా అపార్ట్‌మెంట్ దగ్గరే ఉన్న సెలూన్. ముగ్గురం లోపలికి వెళ్ళి కూర్చున్నాం. బాగా రష్‌గా ఉంది. ఆదివారం కదా మరి!

ప్రతి సెలూన్‌లో మల్లే ఇక్కడ కూడా పాటలు జోరుగా నడుస్తున్నాయి. ఉదిత్ నారాయణ్ ఏదో పాట పాడుతున్నాడు. “హిందీలో గొప్ప సింగర్. లక్కీగా మన తెలుగులో కూడా పాడుతున్నాడు,” చెప్పాడు శేఖర్. ఏం పాడుతున్నాడా అని విందామని ప్రయత్నించాను. ఆ పాట ఇలా సాగుతూంది. “ఏమెట్టి చేశాడే బ్రహ్మ! యాభైకే జీలమందారం, యాభైకే జీలమందారం,” అంటూ.

“నీకు జీలమందారం అనే పువ్వు గురించి తెలుసా?” అడిగాను నేను శేఖర్‌ని. “తెలీదు గురు. అసలే నా తెలుగు వీక్,” చెప్పాడు శేఖర్.

“వీక్ నీ తెలుగు కాదు. ఉదిత్ నారాయణ్‌ది! జీలమందారమా నా బొందా! అతను అంటున్నది యాభై కేజీల మందారం అని,” ఎక్స్‌ప్లెయిన్ చేశాడు నారాయణ్.

ఇంతలో ఆ సెలూన్‌లో పని చేసే ఒక బార్బర్ వచ్చాడు మా దగ్గరికి. “హెయిర్ కట్,” అన్నాము మేము ముగ్గురం ముక్తకంఠంతో.

“మీకు పెద్ద హెయిర్ కట్ అవసరం లేదు సార్. కావాలంటే ఆ సైడ్స్‌లో కొంచెం కట్ చేస్తా,” అన్నాడు అతను జాలిగా.

“ఏం నీకు బిజినెస్ వద్దా?” ఉక్రోషంగా అడిగాడు నారాయణ్.

“బిజినెస్ కావాలి కాని, ఇలా అవసరం లేకుండా కస్టమర్లని మభ్యపెట్టి చేసే బిజినెస్ విషంతో సమానమని మా అయ్య చెప్పాడు సార్.”

“మీ అయ్య ఇంకా ఏం చెప్పాడు?” పళ్ళు కొరుకుతూ అడిగాడు శేఖర్.

“కస్టమర్ల ఆనందమే మన ఆంధ్రా బ్యాంకు అని కూడా చెప్పాడు సార్.”

“మరి చెప్పాడు కద! కస్టమర్లం, మేము ఆనందంగా అడుగుతున్నాం. చెయ్యి మాకు హెయిర్ కట్!” గద్దించాడు నారాయణ్.

అతనికి తప్పలేదు ఇంక. హెయిర్ కట్ అయ్యాక భారీగా టిప్ కూడా ఇచ్చి వచ్చాం.

అరెరే ఏడవకండీ అలా. ఏదో మాట వరసకు అన్నాను కాని మా కష్టాలు చెప్పి మీతో నిజంగా కంట తడి పెట్టించాలని కాదు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

8 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 6

 1. Wanderer says:

  “Saibaba Hair Saloon” was the old joke. “Alexander Hair Cuts” is brand new joke….

  jeelamandaaram yaabhaike akkaDa? maa vooLLO aite renDondalu peTTinaa raavaTledu 😛

  super.

 2. Jyothi Reddy says:

  Superb Muraliji,

  LOL…..Keep going waiting for next one.

 3. పార్వతి says:

  😀 😀 😀 and so on ….. అంతే !

 4. Pingback: TOP 10 « దిల్ సే …

 5. శ్రీధర్ says:

  దీనికే ఏడుస్తారా? సరే నా కథ విను.
  ఒక ఆదివారం క్షవరం కని బయం బయం గా saloon (అంటే తెలుగులో నరకం)కి వెళ్ళా. వాడికెందుకో నేనంటే చులకన. నా తర్వాత వచ్చిన “HIPPY” గాడిని HAPPY గా ఆహ్వానించి, ఆదరించి, కూర్చోబెట్టి ఆనందంగా మంచి cinema కబుర్లు చెబుతూ (థూ…SORRY అది నేను) గంట చేశాడు. వాడు ఇంకోక అరగంట అద్దం లో చూస్తూ (నన్ను ఊరిస్తూ), అటు కెలికి, ఇతు కెలికి, ఇదిలించి, అదిలించి, సకిలించి…..ఒక 10 రూపాయలు వాడి మీదకి విసిరి, చక్కా పోయాడు.

  వీడు, ఇంక బేరాల్లేక, తప్పదన్నట్లు రమ్మని సైగ చెసి, నన్ను ఉద్దరించాడు. cell తీసి ఎవడితోనో రాజకీయాలు మాట్లాడుటూ, cell bill ఎక్కువ వస్తుందేమో అని 5 mins లో నాపని కానిచ్చాడు. “ఏంత” అని ఆడిగితే, బూతులు విన్నట్లు మోహం పెట్టి, 50 అన్నాడు. “అదేంటి?”
  “అంతే”
  “మరి ఇందాక 10 యే తీసుకున్నావ్?”
  “అదివేరు, ఇది వేరు..”
  “ఎలా”
  “అక్కడ ONLY CUTTING, మీకు searching + cutting”
  ……….

  (ఇక లాభం లేదని నిర్ణయం తీసుకున్నా…ఏదో పాటలో చెప్పినట్లు,,,,
  అవసరమైనప్పుడల్లా “తిరుపతి” వెళ్ళాలని)

  ఆ తాడు ఎందుకు?….ఎహ ఇది వట్టి joke…

 6. Murali says:

  Searching and cutting: భలే phrase ఇచ్చారు శ్రీధర్ గారూ!

  -మురళి

 7. vivek says:

  Mama lolli rastunnav kadaa…
  annattu aa song padindi udit narayan kaadu mana telugu singer …udit style lo padadamani try chesi patani khuni chesaadu..
  keep going bro

 8. Murali says:

  వివేక్,

  ఓహొ! ఈ విషయం నాకు తెలీదు. ఉదిత్‌కి ఏకలవ్య శిష్యులు కూడా తయారయ్యారన్న మాట. శుభం!

  -మురళి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s