బట్ట తల వచ్చేసిందే బాలా – 5

బట్టతల గురించి ఆధ్యాత్మికంగా ఆలోచించడం కాసేపు పక్కన పెడితే దాని వల్ల నిజ జీవితంలో జరిగే అవమానాలు ఎన్నెన్నో.

ఉదాహరణకు ఈ సంఘటన వినండి. మీకే కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరుగుతాయి. 

మేము నలుగురం “స్టాలిన్” సినిమా చూస్తున్నాం. తెర మీద చిరంజీవి సామాజిక బాధ్యతలేని జనాలని తిడుతున్నాడు. “ఎంతసేపూ ఉద్యోగానికి వెళ్ళడం, రావడం, తలుపులేసుకుని ఇంట్లో కూర్చోవడం, చుట్టు పక్కలేం జరుగుతూందో పట్టించుకోక పోవడం. ఛీ ఛీ,” అంటూ. ఉత్సాహంగా ఆ సీన్ చూస్తున్న నన్ను వెనకనుంచి ఒక ముసలాయన భుజం మీద తట్టాడు.

“ఉండండి సార్! సామాజిక బాధ్యత గురించి తెలుసుకుంటున్నా,” అన్నాను నేను తెర మీద నుంచి కళ్ళు తిప్పకుండా.

“అది కాస్త ఆలస్యంగా తెలుసుకున్నా ఫరవాలేదు నాయనా. ప్రస్తుతం ఒక చిన్న ఫేవర్ చేయండి. మీరు పక్క సీట్లకు మారితే మాకు సినిమా బాగా కనిపిస్తుంది,” అన్నాడు ఆయన.

“ఓహ్, సారీ సారీ, మీకు అడ్డం వస్తున్నామా, అలాగే జరుగుతాము,” అంటూ లేచి నిలబడ్డాను నేను, అప్పటికప్పుడు నా సామాజిక బాధ్యత నిర్వర్తించడానికి సిద్ధమైపోతూ.

“తప్పుగా అర్థం చేసుకున్నావు నాయనా. అడ్డం వస్తూంది వీళ్ళు నలుగురు. వాళ్ళ స్థానంలో మీరు కూర్చుంటే మాకు క్లియర్‌గా కనపడుతుంది,” వివరించాడు ఆయన. నేను ఆ నలుగురిని చూశాను. కాలేజీ కుర్రాళ్ళలా ఉన్నారు, హిప్పి కటింగ్ మొహాలూ వాళ్ళూనూ. పొడుగాటి జుత్తు వేసుకుని.

సడన్‌గా నా మనసు ఏదో కీడుని శంకించింది. “మేం కూర్చుంటే మాత్రం ఎలా క్లియర్‌గా కనిపిస్తుంది?” అడిగాను.

“అంటే వాళ్ళ క్రాపులే ఎంతో ఎత్తుగా ఉండి స్క్రీన్ బ్లాక్ చేస్తున్నాయి, బాబూ. మీతో ఆ ప్రాబ్లం లేదు కద,” విన్నవించుకున్నాడు ఆయన. నాకు దు:ఖం ముచ్చుకొచ్చింది. రాముడు ఇంకోసారి అగ్ని ప్రవేశం చేయమన్నప్పుడు, సీతాదేవి పరిస్థితి ఏంటో అర్థమయ్యింది. ఆ స్క్రీన్ చీలి నన్ను మధ్యలోకి లాగేసుకుంటే ఎంత బాగుండు అనిపించింది. ఇంకా ఏమనిపించేదో తెలీదు, ఎందుకంటే వెనక వరుసలో కూర్చుని ఉన్న ఒక కాలేజీ అమ్మాయి, “ప్లీజ్ అంకుల్, కూర్చోండి,” అంది. ఆ తరువాత ఏం జరిగిందో నాకు గుర్తు లేదు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

11 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 5

 1. పార్వతి says:

  మురళి గారూ, Hilarious ! 😀 మరో సారి జేజేలు చెప్పేస్తున్నా !

 2. laxmi says:

  haha 🙂 ultimate

 3. laxmi says:

  ఇంకొక సంగతి, మా వారు పెళ్ళైన కొత్తలో అందరితో గొప్పగా చెప్పుకునేవారు, మా ఆవిడ నా జుట్టు చూసి నన్ను పెళ్ళి చేసుకుంది అని. ఇప్పుడు ఎకరాలెకరాలు ఎగిరిపొయింది… ఏదో పేరుకి కాస్త మిగిలింది, అలా అని మా పెళ్ళి ఏ పాతికెళ్ళ క్రితమో జరిగింది అనుకోవద్దు… పెళ్ళైన 3 ఇయర్స్ కే ఈ గతి పట్టింది…. జుట్టు చూసి చేసుకుని ఉంటేఎ నేను ఇప్పుడు ఏమి చెయ్యాలబ్బా

 4. 🙂 🙂 “..ఆ స్క్రీన్ చీలి నన్ను మధ్యలోకి లాగేసుకుంటే ఎంత బాగుండు..” – సూపర్!

 5. లచ్చిమి says:

  నిజమే ఈ రోజుల్లో అబ్బాయిలు చేస్తున్న కేశ సంరక్షణ చిట్కాలు చాల వరకు అమ్మాయిలకి తెలియవంటే అతిశయోక్తి కాదేమో
  ఈ రోజుల్లో హెయిర్ స్టైల్(ముఖ్యం గా అబ్బాయిల హెయిర్ స్టైల్ ) జీవితాన్ని నిర్దేశించే అంశాల్లో ఒకటి కావడం శోచనీయం
  కాని ప్లే గ్రౌండ్ మీద జోక్స్ చాల ఫేమస్ (బట్ట తల మాస్టార్లు క్షమించాలి 🙂 )
  ఇక పాట మొదలెట్టండి మాస్టారు
  ” అంటా భ్రాంతి యేనా???జీవితానా జుట్టింతేనా ??? ”
  “క్రాపు కాస్తా పోయేనా !! బట్టతలే ఇక మిగిలేనా ??????? :):)”

 6. Wanderer says:

  Absolute scream! (telugulo cheppaalanTE, kEka)

 7. Jyothi Reddy says:

  HAHA….It is really a great post Murali ji.

 8. Nanda Kishore p says:

  supreeeeeee………….
  Excelent………
  inthakann na daggra words levu

 9. chinni says:

  నవ్వినవ్వి అలసట …..చాల బాగా రాస్తున్నారు , చాల ఆలస్యంగా వచ్చాను .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s