బట్ట తల వచ్చేసిందే బాలా – 3

“పూర్వం దక్షిణ భారత దేశంలో, హైదరాబాద్ అనే నగరంలో, గుర్నాథం అనే ఒక యువకుడుండేవాడు,” మొదలెట్టాడు నారాయణ్.

“ఆగు! సలహా అన్నావు! ఇదేదో కథలా ఉంది. అయినా పూర్వం అంటే ఎంత పూర్వం?” అడ్డు పడ్డాడు పాపారావు.

“అంటే 2007లో.”

“అది పూర్వమా? ఏడ్చినట్టుంది. లాస్ట్ ఇయరే కద!”

“నాకు తెలిసి కథలు అలానే మొదలెడతారు!” క్రూరంగా చూస్తూ అన్నాడు నారాయణ్.

“అబ్బా ఇప్పుడు ఫార్మాట్ అంత అవసరమా? మెసేజ్ ముఖ్యం. ముందు పూర్తిగా వినరా,” అరిచాడు శేఖర్.

“సరే సరే, గుర్నాథం ఉండేవాడు. తరువాత?” రాజీ పడిపోయి అడిగాడు పాపారావు.

“ఏముంది! చాలా రోజులు అలానే ఉన్నాడు. ఇన్ ఫ్యాక్ట్, నీలా బట్టతల వచ్చేవరకూ అలానే ఉన్నాడు. ఆ తరువాత ఉండలేక పోయాడు,”  కంటిన్యూ చేశాడు నారాయణ్.

“ఎందుకు ఉండలేకపోయాడు? నాలా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉండచ్చు కద,” మళ్ళీ అడ్డు పడ్డాడు పాపారావు.

ఈ సారి పాపారావు పీక నులమడానికి ముందుకు దూకిన నారాయణ్‌ని నేనూ, శేఖరూ లాగేశాం.

“మొత్తం విన్నాక ఇవ్వచ్చుగా నీ అమూల్యమైన ఫీడ్‌బ్యాక్? నీ పాటలు ఓపిగ్గా విని మేమందరం చప్పట్లు కొట్టట్లేదా?” కొర కొరా చూశాడు నారాయణ్.

“ఇంక అడ్దు పడడులేరా, నువ్వు కానివ్వు,” అన్నాను నేను.

“అలా గుర్నాథానికి బట్టతల వచ్చాక, ఉండబట్టలేక తిరిగి జుత్తు మొలిచే మార్గాలు అన్వేషించాడు. ఆఖరికి ఎవరో నాటు వైద్యుడు చెప్పాడని ఒక ఊర పిచ్చుక లేహ్యాన్ని గుండంతా పూసుకున్నాడు. కానీ ఏది పని చెయ్యలేదు. అప్పుడు గుర్నాథానికి ఎవరో చెప్పారు కేశానంద స్వామి గురించి.”

“కేశానంద స్వామా!” అప్రయత్నంగా అన్నాను నేను.

ఏ మూడ్‌లో ఉన్నాడో నారాయణ్ పట్టించుకోలేదు. “అవును కేశానంద స్వామే, మనలాంటి వాళ్ళకు కళ్ళు కుట్టేలా వొంటినిండా జుత్తే, బొటనవేలినుంచి బోడి గుండు దాకా. మన గుర్నాథం అంతేసి జుత్తు ఉన్న స్వామి వారిని చూసి సాష్టాంగ ప్రణామం చేశాడు. స్వామి వారు సంతోషించి ఒక పెద్ద సీసాడు హిమాలయ మకరంద తైలాన్ని ఇచ్చారు. ఒక నెల రోజుల్లో గుణం కనిపిస్తుంది అని చెప్పారు. మరుసటి రోజే ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయారు. గుర్నాథం ఠంచనుగా ప్రతి రోజు ఆ తైలాన్ని తలకి పట్టించాడు,” ఊపిరి తీసుకోవడానికి ఆగాడు నారాయణ్.

“ఆ తరువాతేమయ్యింది?” ఉత్కంఠగా అడిగాను నేను. పాపరావు గాడి గుడ్లు బయటకు వచ్చాయి టెన్షన్‌తో. వాడు మాట్లాడే పొజిషన్‌లో కూడా లేడు.

“నెల రోజుల తరువాత గుర్నాథం గుండు మీద, ముళ్ళపంది వొంటి మీద పొడుచుకొచ్చినట్టు ఒక లావాటి వెంట్రుకలు పది చోట్ల పొడుచుకొచ్చాయి. దానితో వాడి పరిస్థితి మరీ బ్యాడ్ అయిపోయింది. తైలం వికటించిందన్న మాట. ఆఖరికి మునుపటిలా బట్టతల తెప్పించుకోవడానికి లక్షలు పోసి ఆపరేషన్ చేయించుకుని వాటిని పర్మనెంట్‌గా పీకించుకున్నాడు,” కథ ముగించాడు నారాయణ్.

దబ్బని శబ్దం విన వచ్చింది. చూస్తే పాపారావు స్పృహ తప్పి పడిపోయున్నాడు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

8 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 3

 1. ramani says:

  హ్హ హ్హ హ్హ భలే ముగింపు ఇచ్చారు. బట్ట తల మంచి తెలివి తేటలకి నిదర్శనమండీ. హాస్యం అదిరింది.

 2. Murali says:

  రమణి గారూ,

  ఇంకా కథ ముగియలేదు. “అంతం కాదిది ఆరంభం” టైప్ అన్న మాట.

  -మురళి

 3. Jyothi Reddy says:

  Ha Ha Ha.

  great and really really complete humorous comedy!

 4. పార్వతి says:

  మురళి గారు,
  ఏంటండీ ? ఇంతలా నవ్వించేస్తారు ? మరీ లైను లైను కి పంచ్ లా ? 😀
  మా అభిమాన సీరియల్ తరువాయి భాగం కోసం షరా మామూలుగా ఎదురు చూస్తూ …

 5. Venu Aasuri says:

  Very nice, keep going.

  Looks like there is some hope after all (article in Eenadu)

  http://www.eenadu.net/story.asp?qry1=8&reccount=32

 6. శ్రీధర్ says:

  అవును తైలం రాసుకున్నాడు కదా?… చేతులు OK నేనా? కొంపదీసి అరచేతుల నిండా వెంట్రుకలు రాలేదు కదా? కొంచెం కనుక్కో. అవును హిమాలయాలకి ఎటు వెళ్ళాలి…? కొంచం చెప్పవూ?

 7. Murali says:

  శ్రీధర్,

  నేను విన్నంతవరకూ ఇలాంటి కేశసంవర్ధిని తైలాలు వాడితే నెత్తిన తప్ప అన్ని చోట్లా జుత్తు మొలుస్తుంది. కాబట్టి చేతుల మీద కూడా మొలిచే ఉంటుంది.

  -మురళి

 8. indira devi says:

  maruli gaaru, ee roju battathala tho navvi navvi kalallo neeru vachindandi. simple gaa vndi kaani heavy gaa vndi .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s