బట్ట తల వచ్చేసిందే బాలా – 2

మా నలుగురికీ ఒక మంచి అలవాటుంది. అదేంటంటే పగలంతా ఎక్కడ ఎలాంటి తిరుగుళ్ళు తిరిగినా రాత్రి అందరం పడుకునే ముందు ఒక గంట పిచ్చాపాటీ మాట్లాడి ఒకరి యోగ క్షేమాలు ఇంకొకరం విచారించుకుంటాం.

ఈ పధ్ధతిలోనే భాగంగా శేఖర్ పాపారావుని అడిగాడు. “అవునురా గత వారం పెళ్లి చూపులని మీ ఊరెళ్ళావు కద . ఏమయ్యింది?” అంటూ.

“ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నాయి,” మెల్లగా అన్నాడు పాపారావు.

“గుడ్ న్యూసే చెప్పు. బ్యాడ్ న్యూస్ ఎలాగూ మామూలే కద,” అన్నాను నేను. ఇది పాపారావు 212వ పెళ్లి చూపులు.

“వెరైటీగా ఉంటుందని ఈ సారి నేనే ముందు వెళ్ళాను. లోపల వెళ్ళగానే పెళ్ళి కూతురు ఎదురయ్యింది. తన ఫోటో చూశాగా. గుర్తు పట్టాలే. ఐతే తనే నా ఫోటో సరిగ్గా చూడనట్టుంది. ‘రండి మావయ్య గారూ రండి. మీరే ఇంత చార్మింగ్‌గా ఉన్నారంటే, మీ అబ్బాయి ఇంకెలా ఉంటాడో’ అంది,” చెప్పాడు పాపారావు.

“ఇది గుడ్ న్యూసా?” నోరు తెరిచాను నేను.

“కాదేటి? నేను అందంగా ఉన్నాను అని రికగ్నైజ్ చేసింది కద?” ఆనందంగా అన్నాడు పాప్స్ ఉరఫ్ పాపారావు.

“మరి బ్యాడ్ న్యూస్ ఏంటి?” అయోమయంగా అడిగాను నేను.

“నన్ను చూసి మా నాన్ననుకుంది. బ్యాడ్ న్యూస్ అంటూ వేరేగా చెప్పాలా?” కొర కొరా చూస్తూ అన్నాడు పాపారావు.

“ఓహ్, ఐతే నీ బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్ రెండూ ఒకటేనన్న మాట,” సాలోచనగా అన్నాను నేను.

“మరి ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం?” అడిగాడు నారాయణ్.

“ఈ బట్ట తల వల్ల అడ్డంగా దొరికిపోయా గురూ. లేకపోతే నా ఫేస్ బ్యూటి ఏం తక్కువ కాదు అని ఆ అమ్మాయి తేల్చేసింది కద. ఇది ఎలాగైనా సాల్వ్ చేయాలి,” అన్నాడు పాపారావు.

“ఐతే నీకు శ్రమ తెలియకుండా ఒక సలహా ఇస్తాను విను,” అన్నాడు గంభీరంగా నారాయణ్.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in బట్టతల. Bookmark the permalink.

4 Responses to బట్ట తల వచ్చేసిందే బాలా – 2

 1. ramani says:

  హ హ హ.. ఊ కొడ్తుంటే మధ్యలో అలా ఆపేసేరెంటి? అయినా బట్ట తల అన్నది అంత పెద్ద సమస్యగా చిత్రీకరించేస్తున్నారెందుకో అర్ధం కావడం లేదు. పెళ్ళికూతురు “మావయ్యగారు” అన్న సంభోదన సూపర్

 2. Jyothi Reddy says:

  Murali ji,

  HAHA. Ila meeru rasthey amricalo unna 25% It unmarried guys mee list loki vastharu. Be careful. lol.

 3. పార్వతి says:

  మురళి గారు, మీ పేరడి పాటలు మాత్రం సూపర్ హిట్ అండి ! మంచి పంచ్ తో నడుస్తోంది కథ ! 😀 చాలా సార్లు నవ్వుకున్నా, కొన్ని డవిలాగులు, పేరడి పాటలకి !” కష్ట దశ తెచ్చేసిందే చాలా ! ఒకటే రాగం, ఒకటే ట్యూనూ — ఇక నుంచి ఈ పాటలు ఇలాగే పాడుకుంటానేమో అని భయంగా ఉంది !
  నిజమే, కొన్ని సార్లు వింటే, మూస పోసినట్టు ఉంటాయి ఆనంద్ పాటలు, దాన్ని సరదాగా రాసారు ! మీ మార్కు కామెడి నాకు భలేగా అనిపిస్తుంది,గుర్తొచ్చి మళ్ళీ మళ్ళీ నవ్వుకునే కామెడి ! “అమెరికాలో ఆపసోపాలు” తరువాత మరో సీరియల్ కథ మొదలు పెట్టారు,చాలా ఆనందం గా ఉంది !తరువాయి భాగం కోసం ఎదురు చూపులతో …

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s