గజనీ ఎఫెక్ట్!

ఆఫీసులో నా క్యూబ్‌లో కూర్చోగానే వెంటనే రకరకాల న్యూస్ సైట్స్ ఓపెన్ చేశాను. అంతా పాత న్యూసే! నవంబర్‌లో జరిగిన ముంబాయి దాడుల గురించి విచారణ జరిపే ముందు పాకిస్తాన్ వాళ్ళు, అసలు భారతదేశం ఏసియాలోనే ఉంది అని ఋజువు చేయమన్నారట. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలూ అందరికీ ఉచిత విద్యుత్, మరియు రుపాయికే నెలకు సరిపడే వంట సరుకు, ఇంకా ఒక పైస వడ్డీకే రుణాలూ ఇస్తామని వాగ్ధానాలు చేశాయి. దాని తరువాత అంత కంటే వరాలు ఇవ్వడానికి ఇంకా ఏం లేకపోవడంతో అందరూ నోట్లో చెంగులు కుక్కుకుని కుమిలిపోతున్నారట.

విసుగు పుట్టి సినిమా న్యూస్ చదువుదామని ఈ మధ్య పుంఖానుపుంఖాలుగా వస్తున్న వెబ్ సైట్స్లో ఒక దానికి వెళ్ళా. ఆమీర్ ఖాన్ నటించిన గజని సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యిందట. విచిత్రమైన కథ. హీరోకి గత పదిహేను నిముషాలు తప్ప ఇంకేమీ గుర్తుండదట. ఒకప్పుడు తమిళంలో వచ్చిన సినిమానే. పక్క క్యూబులో ఉన్న రమణ గాడికి చెప్పాను దాని గురించి.

“ఆ, అందులో పెద్ద వింతేముంది గురూ, నాకూ అంతే, ఏమీ గుర్తుండదు. ఆఖరికీ మా ఆవిడ పేరు కూడా! నీ పేరు నేం ప్లేట్ మీద ఉంటుంది కాబట్టి బాగా గుర్తు. కానీ, నా కథ సినిమాగా తీస్తే ఎవరూ చూడరు,” అంటూ తేల్చేశాడు వాడు.

“ఇది అలాంటి మతి మరుపు కాదురా. ఇందులో హీరోకి జస్ట్ గత పదిహేను నిముషాలు మాత్రమే గుర్తుంటుంది. అంతకు ముందువేవి గుర్తుండవు,” చెప్పాను నేను.

“ఓ, ఐతే కష్టమే. సాయంత్రం ఇంటికెళ్ళకుండా ఈ ఆఫీసులోనే పడుండే ఛాన్స్ ఉంది. మన బాస్‌కి తెలిస్తే నాతో పగలూ రాత్రిళ్ళు పని చేయిస్తాడు,” భయంగా అన్నాడు రమణ.

నిజమే కద అనిపించింది నాకు. ఇంతలో నా సెల్ ఫోన్ మోగింది. ఎత్తితే, మా ఫ్రెండ్ సురేందర్ వాళ్ళ ఆవిడ. “మీరు త్వరగా రావాలి అన్నయ్య గారు. ఈయన చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నారు,” అంది. వెంటనే బయలు దేరాను. సురేందర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. 20 ఏళ్ళనుంచి తెలుసు. బొద్దుగా ముద్దుగా ఉంటాడు. కొంచెం తిండి పుష్టి ఎక్కువ. అంతా వాడిని గణేష్ అని పిలిచేవారు. బొజ్జ గణపయ్యలా ఉంటాడని.

గణేష్ గాడు, అదే, సురేందర్ గాడింటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ ఎదురొచ్చింది. “పొద్దున్నుంచి పిచ్చి చూపులు చూస్తూ కూర్చుని ఉన్నారన్నయ్యా. ఎవరినీ గుర్తు పట్టట్లేదు. పైగా ఒక పెన్ తీసి వొళ్ళంతా రాసుకుంటున్నారు,” ఏడుస్తూ చెప్పింది.

సురేందర్ గాడు ఒక కుర్చీలో కూర్చుని శూన్యంలో చూస్తున్నాడు. వాడిని చూడగానే నాకు కళ్ళలో నీళ్ళొచ్చాయి. ఎలాంటి వాడు ఎలా అయిపోయాడు?

“ఒరే సురేందర్, ఏంట్రా ఈ వాలకం?” అడిగాను నేను. “ఎవరు నువ్వు?” ఎదురు ప్రశ్న వేశాడు వాడు. షాక్ తిన్నాను నేను. “అసలేమయ్యిందమ్మా?” అడిగాను వాడి భార్యని.

“నిన్న రాత్రే గజని సినిమాకి వెళ్ళి వచ్చాం అన్నయ్య గారూ. అసలు ఇంటికొచ్చేప్పుడే కాస్త పరధ్యానంగా ఉన్నారు. ఆసిన్‌ని చూడ్డం వల్ల తన పాత కాలేజ్ డేస్‌లోకి వెళ్ళి పోయారేమో అని సరిపెట్టుకున్నా. కాని పొద్దున్న లేవగానే ఇదిగో ఇలా అయిపోయారు. ఎవరినీ గుర్తు పట్టడం లేదు. మా పెళ్ళి ఆల్బం చూపించి నా మంగళ సూత్రం చూపించాకా నేను ఆయన భార్యను అని నమ్మారు. కానీ అదేం విచిత్రమో ఆ ముదనష్టపు సినిమాలోలానే ప్రతి పదిహేను నిముషాలకూ అన్నీ మర్చిపోతున్నారు. మాటికి మాటికి చెప్పిందే చెప్పి, చూపిందే చూపి, నాకు మతి పోతూంది,” అంటూ ఆక్రోశించింది ఆవిడ.

ఇంతలో మా వాడు నన్ను చూసి మళ్ళీ, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. “నేనురా నీకు ఇరవై ఏళ్ళనుంచి ఫ్రెండ్‌ని,” అని నా పేరు చెప్పాను. వెంటనే ఒక దబ్బనం లాంటిది తీసుకుని నా వైపు వచ్చాడు వాడు.

నేను ఉలిక్కిపడి ఒక గెంతు వెనక్కి గెంతాను. “మతి మరుపుతో పాటూ వీడేమన్నా హింసాత్మక చర్యలు కూడా చేస్తున్నాడా?” అడిగాను వాడి భార్యని.

“కాదండీ, ఆ దబ్బనంతో మీ పేరు మీ వొంటి మీద చెక్కుతారు. మళ్ళీ ఆయనకు అంతా మరపుకు వస్తుంది కద!” ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఆవిడ.

“దబ్బనంతో చెక్కడం ఎందుకుమ్మా? కావాలంటే ఎన్ని సార్లు అడిగితే అన్ని సార్లు నా పేరు చెప్తాను. అయినా గజని సినిమాలో హీరో అంతా తన వొంటి మీదే రాసుకుంటాడు కద? ఇలా వేరే వాళ్ళ వొంటి మీద దబ్బనంతో గుచ్చడం, బ్లేడుతో చెక్కడం చేయడే?” సందేహం వెలి బుచ్చాను నేను.

“అంతా సినిమాలోలానే ఎలా జరుగుతుంది అన్నయ్య గారూ! ఐనా, ముందు ఆయన వంటి మీదే రాసుకున్నారు. ఇంక స్థలం లేక వేరే వాళ్ళ మీద పడ్డారు. కావాలంటే చూడండి” అంటూ మా వాడు వేసుకున్న ఫుల్-హ్యాండ్ షర్ట్ తీసేసింది ఆవిడ.

ఆశ్చర్యం! మా వాడి వొంటి మీద అంతా గ్యాప్ లేకుండా అక్షరాలతో నిండి పోయి ఉంది. కొంచెం పరీక్షగా చూద్దును కద. అన్నీ తిండి పదార్థాలే. “నాకు అరిసెలు ఇష్టం”, “పెరుగు పచ్చడి మరీ మరీ ఇష్టం,” “గులాబ్ జామూన్ అంటే ఎంత ఇష్టం అంటే దానికోసం మర్డర్లు కూడా చేస్తాను”, ఇలాంటి వాక్యాలతో నిండి పోయింది మా వాడి ఉపరి భాగం అంతా.

నా కళ్ళల్లో కదలాడుతున్న ప్రశ్న గమనించినట్టుంది, “లేచినప్పటి నుంచి, ఆకలి ఆకలి అని ఒకే గొడవ అన్నయ్య గారూ! ఏదన్నా చేసి పెడితే తినేయడం, ఆ వంటకం పేరు తన వొంటి మీద రాసుకోవడం. మళ్ళీ అంతా మరిచిపోగానే, ఆకలి అంటూ గోల చేయడం. మళ్ళీ నేనేదో వండడం, అది తినేయడం, ఆ వంటకం పేరు తన వొంటి మీద రాసుకోవడం. ఇదీ వరుస!” వెక్కిళ్ళు పెడుతూ చెప్పింది ఆవిడ.

నా మనసేదో కీడు శంకించింది. “ఈ మధ్య మా వాడికేమైనా తిండి కట్టడి చేశావామ్మా?” అడిగాను సురేందర్ ఆవిడని.

“అవును అన్నయ్య గారూ. సుగర్, బీపీ, కొలస్ట్రాల్ అన్నీ ఉన్నాయి అని డాక్టర్ చెప్తే గత ఆరు నెలలనుంచి కాస్త పథ్యంగా భోజనం పేడుతున్నా. ఏమిటి, అలా అడిగారు సడన్‌గా?” అంది ఆవిడ.

“కారణం ఉండే అడిగానమ్మా,” అని నేనంటున్నండగానే, మా వాడు, “ఆకలి, ఈ సారి నాకు బాదం హల్వా కావాలి,” అని డిమాండ్ చేశాడు. వాడి భార్య వంటగది వైపు బయలుదేరుతూ ఉంటే నేను ఆపేసి, “ఆగమ్మ నాకు ఒక్క అవకాశమివ్వు,” అని మా వాడి వైపు తిరిగి, “నేనెవరో గుర్తు పట్టావా?” మళ్ళీ అడిగాను.

“లేదు. అందుకే కద నీ పేరు నాకు గుర్తుండడానికి నీ వొంటి మీద దబ్బనంతో చెక్కబోయా!” సమాధానమిచ్చాడు వాడు.

“నేను ఎవరో గుర్తు లేకున్నా, నా వంట గుర్తు ఉండే ఉంటుంది,” మృదువుగా అన్నాను నేను. సురేందర్ గాడి కళ్ళల్లో ఒక క్షణం భయం కనిపించింది. వెంటనే మళ్ళీ నిర్లిప్తంగా అయిపోయాడు.

దానికి కారణం ఉంది. మా కాలేజ్ రోజుల్లో నా వంట అంటే అందరికీ హడల్! నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నాలుగే సార్లు వండాను. మొదటి సారి ఐతే ఏదో అనుకోవచ్చు, కాని ఒక సారి నా వంట రుచి చూశాక కూడా మళ్ళీ తినడానికి సాహసం చేసిన కక్కూర్తి బ్యాచ్‌లో సురేందర్ గాడు ఒకడు. మూడు సార్లు హాస్పిటల్ పాలయ్యాక వాడికి చివరికి బుద్ధి వచ్చింది. మరి నా వంట అనగానే భయపడక ఏం చేస్తాడు?

“సో సూటిగా పాయింట్‌కి వచ్చేస్తానురా! మీ ఆవిడ ఈ స్ట్రెస్ తట్టుకోలేకుండా ఉంది. ఒక నెల రోజులు పుట్టింటికి వెళ్తుందట. ఈ నెల రోజులూ, నీ తిండి తిప్పలు చూడబోయేది నేనే. అసలే నా వంట తినే వాళ్ళు ఈ మధ్య కరువయ్యారు. కాబట్టి నీకు ఈ నెలంతా నా వంటే!” అనౌన్స్ చేశాను నేను.

మీరు అపరిచితుడు సినిమా చూశారో లేదో నాకు తెలీదు. కాని అందులో హీరో విక్రంలా మా వాడి ముఖ కవళికలు వెంటనే మారి పోయాయి.

ఒక సారి తల విదిలించి, “ఏంట్రా, ఇలా వచ్చావు?” అడిగాడు నన్ను.

“ఏమండి, మీరు బాగైపోయారా?” ఆనందంగా అంది వాడి భార్య.

“బాగు కావడమేంటి, అసలు ఆఫీసుకి వెళ్ళకుండా నేను ఇంట్లో ఉన్నానేంటి,” అమాయకంగా అడిగాడు వాడు.

“మీకు తెలీదండి పొద్దున్నుంచీ నన్ను ఎంత భయపెట్టారో! అన్నయ్య గారు రావడంతో సరి పోయింది. ఆయన మన ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. మీరు వెళ్ళి ఆ రాతలు కడుక్కుని శుభ్రంగా స్నానం చేసి రండి, నేను మీ ఇద్దరికి లంచ్ వడ్డిస్తాను,” అంది ఆవిడ ఆనందంగా. మా వాడు దబ్బనం పడేసి బాత్‌రూంలోకి వెళ్ళాడు.

“మీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలీట్లేదండి!” గద్గదమైన స్వరంతో అంది ఆవిడ.

“ఏం ఫర్లేదమ్మా! ఇలా వీడు గజని ఎఫ్ఫెక్ట్ చూపించినప్పుడంతా నాకు కబురు చేయి. నేను నా ఎఫెక్ట్ చూపిస్తాను వాడికి,” ఆమెకి హామీ ఇచ్చాను.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

29 Responses to గజనీ ఎఫెక్ట్!

 1. sravya says:

  ha ha ha 🙂

 2. కేక! చదవగానే “మర్చిపోదగ్గ” టపా మాత్రం కాదు.

 3. హ్హ..హ్హ..హ్హ..

  “గజనీకి విరుగుడు, అపరిచితుడు అని వీడు కనిపెట్టాడు ప్రభూ!”

  “ఎవరూ కనిపెట్టకపోతే అసలు కొత్తవి అంటూ ఎక్కడనుంచీ పుట్టుకొస్తాయ్! వెయ్ రెండు వీరతాళ్లు!!”

  🙂

 4. gireesh says:

  హహహ…మై గాడ్! నా నవ్వు విని, ఆఫీసులో అందరూ అనుమానంగా చూస్తున్నారు!! చాలా బగుందండీ!

 5. శ్రీ says:

  భలే ఉంది

 6. హ..హా గజిని 🙂

 7. name says:

  very funny!

 8. laxmi says:

  Ahha 😀 eppatilage chinchesaru

 9. Karthik says:

  ha ha ha
  super. meeru sAmAnyulu kAdanDI bAbu.

  -Karthik

 10. Bhaskar says:

  అదరగొట్టేసారు…

 11. Aruna says:

  తట్టుకోలేక నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకు నవ్వుతున్నా, భుజాలు ఎగిరిపడటం, వీపంతా కదలడం చూసి అందరూ నావంక అనుమానం గా చూస్తూ వెళుతున్నారు. మీరు కనిపిస్తే ఫైన్ వెయ్యాలి మీకు, ఇలా అందరి ముందూ నవ్వించి నా పరువు తీసేస్తున్నారు. ఇక నుండి ఆఫీసులో చదవను బాబోయి మీ టపాలు. 🙂

 12. gangabhavani says:

  చాలా బాగుంది.
  నవ్వలేక చచ్చాను.

 13. హి హి హి.. కేకో కేక 🙂

 14. Amun says:

  Excellent murali garu

 15. నేను నా ఎఫెక్ట్ చూపిస్తాను వాడికి 🙂

 16. Murali says:

  అరుణ గారు,

  మీ కామెంట్‌లో మీరు నవ్విన విధానం వర్ణన చదివి నాకు ఇక్కడ అంతే నవ్వొచ్చింది. 🙂

  -మురళి

 17. jagdish tummala says:

  it.s, very good.after long time i enjoy it.
  h
  thank you murali

 18. lachhimi says:

  ha ha ha ha :D:D:D

 19. Seetha says:

  చాలా బాగుంది. నవ్వించారు. సినిమా చూసాక అసలు హీరో పేరు మరిచిపోయా, సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారు అని ఆలోచించా.
  మతిపరుపు వచ్చినంత పనయ్యింది.
  మీ “గజిని” చదివి నవ్వి , గజిని లాగ 17 సార్లు దండయాత్ర చేసా నా ఆలోచనల మీద , ఆ సినిమా నేను చూడనేలేదని .
  విజయం సాధించా , “గజిని” లాగ వెనుతిరగకుండా .

 20. Murali says:

  సీత గారు,

  నాకు మీరు చెప్పింది సరిగ్గా అర్థం కాలేదు. మొత్తానికి మీరు గజని సినిమా చూసినట్టా లేదా?

  ఇంతకీ ఆ సినిమాకి గజని అన్న పేరు ఎందుకు పెట్టారో అర్థమయ్యిందా? 🙂

  -మురళి

 21. prasad says:

  Abba Kathhi Super Turum KeKA Chinchesaru

  Entha navvanu ante abba … too much ga navvanu

  Excellent comedy

 22. Jyothi Reddy says:

  Murali Garu,
  Nenu andari mundhu pichidhanila navvuthunna mee comedy gurthuku vachi,maree samaya sandharbham lekunda gurthuku vasthundhi sir,kastha dose ekkuvayindhi murali garu…haha

 23. kishore reddy says:

  చాలా బగుందండీ!

 24. Rajiv says:

  మురళి గారూ

  ఇలా మీరు రాస్తు ఉంటె కొంచెం మేము రిసెషన్ ఉన్న సంగతి మర్చిపొతాం

 25. sujata says:

  Caution : Dont read this post at work !

  ha ha ha ha ha ! Well done sir

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s