యమాస్ “విజయ” యాత్ర

ఇది జంబూ ద్వీపం దగ్గరలో ఉన్న రెండు రాజ్యాలకు సంబంధించిన కథ. వాటి పేర్లు పెరుగుస్తీనా, ఈజీరైల్. పెరుగుస్తీనా రాజ్యంలోని బాజా రాష్ట్రాన్ని యమాస్ అనే పార్టీ పాలిస్తూంది. అందరికీ తెలుసు. యమాస్ ధ్యేయం ఈజీరైల్‌ని సముద్రంలో కలిపి వేయడమేనని.

ఏదో వీలు కాలేదు కాబట్టి ఊరుకుంది కాని, తగిన మంది మార్బలం ఉంటే ఈజీరైల్‌ని ఈ పాటికి దుంప నాశనం చేసుండేది కూడా. అప్పుడు మిగతా దేశాలు అన్నీ, “చొచ్చొచ్చో, ఎంత పని జరిగింది?” అని ఒక నిట్టూర్పు వదిలి ఊరుకునేవారు తప్ప పెద్దగా ఏమీ ఉద్ధరించి ఉండేవారు కాదు.

ఈజీరైల్‌కి ఈ సంగతి తెలుసు కాబట్టి, మొహమాటం లేకుండా, ప్రపంచ మేధావుల మనోభావాలు దెబ్బ తింటాయేమో అన్న జంకు లేకుండా, తన ఉనికిని ఎలా ఐనా రక్షించుకోవడానికి అహర్నిశలు సిద్ధంగా ఉండేది. కావలిసిన చర్యలు తీసుకునేది కూడా.

ఈజీరైల్ పక్క దేశం ఇకరాను. ఇకరానుకి ఈజీరైల్ అంటే వొళ్ళు మంట. ఐతే ఇంతకు ముందు ఒక మూడు సార్లు ఈజీరైల్ చేతిలో చావు దెబ్బలు తింది కాబట్టి ప్రత్యక్ష యుద్ధం కనక చేస్తే తమ పరిస్థితి పాతాళభైరవి అవుతుందని గ్రహించి, యమాస్ లాంటి వెర్రి బాగుల గ్రూపులకు రహస్యంగా సాయం చేయడం మొదలెట్టింది. అడపా దడపా యమాస్‌కి ఇంకో దేశం చిరాకు నుంచి కూడా కూసింత హెల్ప్ ఉండేది.

గోచీ పాత అంతున్న ప్రదేశం కోసం ఇంత గొడవేంటి అని మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఈ సంకుల సమరానికి సహజీవనం కంటే సంఘర్షణకే పెద్ద పీట వేసే సంస్కృతి అసలు కారణం. అది ఇంకో ఇంటర్‌నెట్ మజిలీ కథ అనుకోండి. ఇంకెప్పుడైనా చెప్పుకుందాం.

ప్రస్తుతం కథకు వస్తే ఇకరాను నుంచి ఒక ప్రతినిధి యమాస్‌కి బహుమతులు పట్టుకొచ్చాడు. యమాస్ నాయకులు అల్-బషీర్ మరియు అల్-ఫకీర్ వాటిని చూసి ఉత్సాహ పడ్డారు.

“భలే భలే, రాకెట్లలా ఉన్నాయి. వీటితో ఏం చేయొచ్చు?” అడిగాడు అల్-బషీర్.

“వీటిని దూర ప్రదేశాల మీదకు పంపించవచ్చు. అక్కడ పడి టపాకాయల్లా పేలుతాయి,” చెప్పాడు ప్రతినిధి, తన వేలిని ఈజీరైల్ వైపు చూపిస్తూ.

“ఐతే ఇచ్చేయ్యి. మాక్కావాలి. వూ, వూ, మాక్కావాలి,” గునిశాడు అల్-ఫకీర్.

“ఇస్తా, కానీ మీకొక చిన్న పజిల్. మీరిద్దరు ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నారు. మీకొక గొడ్డలి దొరికింది. ఏం చేస్తారు దానితో?” ప్రశ్నించాడు ప్రతినిధి.

“ఇదీ ఒక పజిలా! మేము కూర్చున్న కొమ్మని నరుక్కుంటాం!” వెంటనే సమాధానమిచ్చాడు అల్-ఫకీర్.

“మరి అది నరికితే, మీరు కింద పడి నడ్డి విరగ్గొట్టుకుంటారు కద?” సందేహం వెలిబుచ్చాడు ఇకరాను ప్రతినిధి.

“ఐతే ఏంటట?” ఒకేసారి అన్నారు అల్-ఫకీర్, అల్-బషీర్.

ప్రతినిధి తృప్తిగా తలాడించాడు. “ఇప్పుడు నాకు నచ్చారు. ఈ రాకెట్లు మీవే. దూర ప్రదేశాల మీద వేయండి. (మళ్ళీ చూపుడు వేలు ఈజీరైల్ వైపు చూపించాడు.) అయిపోతే చెప్పండి. ఇంకా తెచ్చి ఇస్తా,” అన్నాడు వాళ్ళని ముద్దుగా చూస్తూ.

“అయ్యి, ఎన్ని రాకెట్లో. ముందు రాకెట్ నేనే వేస్తానోచ్,” అంటూ కొన్ని రాకెట్లని చంకలో పెట్టుకుని దౌడు తీశాడు అల్-బషీర్. వెనకాలే అల్-ఫకీర్ పరిగెత్తాడు.

“బుజ్జి కన్నలు. ఎంత ముద్దొస్తున్నారో,” వాళ్ళని చూస్తూ మెటికలు విరిచాడు ప్రతినిధి.

***

ఆ తరువాత అల్-బషీర్, అల్-ఫకీర్ ఈజీరైల్ మీద బోలెడు రాకెట్లు వేశారు. ఈజీరైల్ అదృష్టమో, లేక వీళ్ళ చేతకాని తనమో తెలీదు కాని, అవి పేలినా ఎక్కువ నష్టం కలిగించలేదు.

ఈజీరైల్ మొదట్లో ఓపిక పట్టింది. కానీ యమాస్ వీరులు అది ఈజీరైల్ చేతకానితనంగా భావించి రాకెట్లు ఆపకుండా వేశారు. ప్రపంచ దేశాలు ఈజీరైల్ మీద పెద్దగా సానుభూతి చూపించలేదు. పై పెచ్చు “తాము దారిద్ర్యంలో ఉండి, పక్క దేశం అలా వెలిగిపోతూంటే, ఎవరికి మాత్రం కడుపు మండదు. పాపం పెరుగుస్తీనా ప్రజలు!” అన్నారు.

ఐతే ఈజీరైల్ ఆ ప్రాంతాన్ని బంగారు భూమిగా చేయడానికి ముందు అది వొట్టి బంజరు నేల అని, అక్కడ పెరుగుస్తీనా ప్రజలు కూడా ఉండడానికి ఇష్టపడేవారు కాదు అని, గట్టిగా మాట్లాడితే పెరుగుస్తీనా అన్న దేశం ఎప్పుడూ లేదూ, అన్న విషయాన్ని అందరూ కన్వీనియంట్‌గా మరిచిపోయారు.

సహనం చచ్చి ఈజీరైల్ వీరంగం తొక్కింది. ముందు విమాన దాడులూ ప్రారంభించింది. ఐనా యమాస్ రాకెట్లు వేయడం మానలేదు. వందలమంది చచ్చారు. ఐనా యమాస్ రాకెట్లు వేయడం మానలేదు. చివరకి ఈజీరైల్ తన సైన్యాన్ని బాజాలోకి పంపించింది. ఆ సైన్యం విమాన దాడుల వల్ల సర్వనాశనమై కొద్దిగా మిగిలి ఉన్న మొండిగోడలని కూల్చి, పగిలిపోయి ఉన్న శిథిలాలని ఇంకొంత పేల్చి బాజాని ఒక మోత మోసేసింది. చనిపోయిన వారి సంఖ్య వెయ్యి పై చిలుకు అయ్యింది. ఐనా యమాస్ ఈజీరైల్ మీద రాకెట్లు వేయడం మానలేదు.

ఆఖరికి ప్రపంచదేశాల జోక్యం వల్ల తాత్కాలిక సంధి కుదిరింది. ఇరువైపులా కాల్పులు ఆగిపోయాయి. అల్-బషీర్, అల్-ఫకీర్లకు ఇంక రాకెట్లు ఈజీరైల్ వైపు విసరకూడదని ఖచ్చితమైన ఆదేశాలు వెళ్ళాయి.

“కానీ మేము కూర్చుని ఉన్న కొమ్మ ఇంకా విరిగిపోలేదుగా?” అభ్యంతరం చెప్పారు అల్-బషీర్, అల్-ఫకీర్.

“మీ కొమ్మ బాగుందేమో నాయనల్లారా, ఇక్కడ బాజలో చెట్లే ఎగిరిపోయాయి,” అని తిరుగు సమాధానం వచ్చింది. అల్-బషీర్, అల్-ఫకీర్ తిరిగి బాజా జన జీవన స్రవంతిలోకి వచ్చేశారు.

వెంటనే గుంటల్లోనూ, రాళ్ళకుప్పల వెనకాలా దాక్కుని ఉన్న పెరుగుస్తీనా ప్రజలని కూడగట్టుకుని వారిని విజయ యాత్రకు సిద్ధం కమ్మన్నారు.

“విజయ యాత్రా? యాత్ర మీద వెళ్ళడానికి రోడ్డు ఉండాలి కద?” సందేహపడ్డాడు ఒక పెరుగుస్తీనా ముసలాయన.

“రోడ్డు లేకపోతే గుంతల మీదుగా వెళ్తామండి! ఈ యుద్ధంలో మన అపూర్వ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలా వద్దా? బయట ప్రపంచంలో అంతా ఇది మన గెలుపూ, ఈజీరైల్ ఓటమి అంటున్నారు, వినలేదా?” కోపంగా అన్నాడు అల్-ఫకీర్.

ఆ మాటలకి సిగ్గు పడి, నడిచే పొజిషన్‌లో ఉన్న పెరుగుస్తీనీయులంతా విజయ యాత్ర మీద బయలుదేరారు.

Hamas declares victory in rallies across Gaza

Advertisements
This entry was posted in భూగోళం. Bookmark the permalink.

9 Responses to యమాస్ “విజయ” యాత్ర

 1. name says:

  very nice!

 2. Dreamer says:

  Meeru pette perlu mathram super!! perugustina, ikaranu, chiraku…. kevvO kevvu…

 3. చంద్ర మోహన్ says:

  ఈజీరైల్ అనుభవాలనుండి మన సంఝౌతా ఎక్స్ ప్రెస్ వారికి ఏమైనా సమఝయ్యేది ఉందా!

 4. పార్వతి says:

  మీ శైలి, ఎప్పటిలానే, హాస్యభరితంగా బాగుంది ! 😀 ఎలాంటి అంశాన్ని అయినా మీరు నవ్విస్తూ చెప్పేస్తారు ! 😀

  ఈ టపా అంశం తో సంబంధం లేని ఒక చిన్న సవరణ ! జంబు ద్వీపంలో భారత దేశం ఉంటుంది. కానీ మనది ద్వీపం కాదు, కాబట్టి బహుశా మొత్తం ఆసియా ఖండాన్ని జంబు ద్వీపం అన్నారు పెద్దలు ! తెలుగు వికీ లో కూడా తప్పుగా చెప్పబడింది. భారత దేశం ఇంకో పేరే జంబు ద్వీపం అని.

  జంబు ద్వీపే, మేరొహ్ దక్షిణ భాగే ….( ఆ తర్వాతవి తప్పు తెలుగు వికీ లో ! సరిగ్గా గుర్తు లేదు నాక్కూడా ! )అని సంసృతంలో , భారత దేశం ఎక్కడుందో చెప్పారు పెద్దలు.జంబు ద్వీపం లో, మేరు పర్వతం దక్షిణ దిక్కున ఉందట భారత దేశం ! కాబట్టి రెండూ ఒకటి కాదు ! 🙂

 5. పార్వతి says:

  తెవికీ లో, ఎంచక్కా , సంధ్య లో చెప్పే సంకల్పం చెప్పారు,భారత దేశం ఎక్కడుందో చెప్పటానికి ! సంకల్పం లో, మనం ఎక్కడ ఉన్నామో చెప్తాం … మనం తెలుగు వాళ్ళం కాబట్టి, జంబు ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరొహ్ దక్షిణ దిగ్భాగే, శ్రీసైలస్య ఉత్తర భాగే (
  శ్రీశైలంకి మనం ఏ దిక్కున ఉంటే ఆ దిక్కు) , కృష్ణ గోదావరి మధ్య లో ఉంటే మధ్యన ఉన్నాం అని .. ఇది ఆంధ్ర దేశం లో ప్రాంతాల్ని సూచిస్తుంది ! ఏదేమైనా ఇది ఖండం నుంచి దేశం, రాష్ట్రం etc గా జరిగిన విభజన ! ఆసియా లో ఇండియా లో, శ్రీశైలం కి ఉత్తరాన , …అలా చెప్పటం !

  “వర్షం” (దేశం) సముద్రానికి ఉత్తరాన ఉన్న, హిమములతో కూడిన పర్వతాలకు దక్షిణాన గల, దీనిని భారతం అని, ఇక్కడ భారత సంతతి నివసిస్తుంది.” — తెవికీ లో విష్ణు పురాణం నుంచి ఎత్తుకొచ్చిన ఈ లైను కరెష్టే ! Sorry for cluttering your blog space ! 🙂

 6. Sreenivasulu K says:

  Eppudooo eenadulo vachina mee blog link bookmark chesi pettukunnanu. bookmarks chustu mee blog teesi chuddamani oka post chadivanu. anthe ika mottam ayye varaku appalanipinchaledu. Manasara navvukune hasyanni panchinanduku chala chala krutagnatalu.

 7. భలే నవ్వించారండీ !!

 8. Bhaskar says:

  Very nice post..congrats!

 9. sri says:

  chaala baaga, saradaaga raasaru. Anthaa vimarsinche Eesirael ni support chestoo dhairyam ga raasaru. Mee view correct.. eppudoo ee prapancha desaloo.. ee Medhavulu (..!) Eesirael ni tappu paduthuntaaru ilaanti samayaallo. Ee “Yamaas” chese vedhava panulani ugravaadamani o peru pettesi.. okintha saanubhootini kuripinchesi marchipotaru. Ade vaallameeda Eesirael tiragabadithe adi Perugustheena saarvabhoumatvam meeda Eesirael daadiki tegabadinattata..!

 10. Jyothi Reddy says:

  Mualiji,
  Mee dhairyaniki na Joharlu…Keep Goin sir

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s