నీకు నూటయాభై ఏళ్ళ ఆయుష్షు!

(సైన్స్ శరవేగంతో మన జీవితంలోని అన్ని అంశాల మీద ఎలా తన ప్రభావం చూపిస్తూందో, అదే రకంగా త్వరలో మానవుడి సగటు ఆయుష్షు కూడా ఇంకో రెందు మూడు దశాబ్దాలలో పెంచబోతూంది. ఉదాహరణకి ఒక 150 ఏళ్ళకి అనుకుందాం. సాధారణంగా 70-75 ఏళ్ళ జీవిత కాల వ్యవధికి అలవాటు పడిన మనుషులు, ఈ కొత్త పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తారు అనే ఊహ ఈ కథకు ఆధారం.)

“చంటీ! ఒరే చంటీ!” గట్టిగా పిలిచాడు సదానంద్. “వస్తున్నా నాన్నా!” అన్న పిలుపును ఫాలో అవుతూ తన గదినుంచి బయటకి వచ్చాడు చంటి.

చంటికి దాదాపు ముప్ఫై ఏళ్ళు ఉంటాయి. టీ-షర్ట్, నిక్కరు వేసుకున్నాడు.

“నిన్ను మద్యాహ్నం వెళ్ళి కూరగాయలు తెమ్మన్నానా? ఎందుకు తేలేదు? ఎప్పటికి తెలిసి వస్తుందిరా నీకు బాధ్యత? నువ్వేమన్నా ఇరవయ్యి ఏళ్ళ కుంక అనుకుంటున్నావా?” కాస్త చిరాకుగా అన్నాడు సదానంద్.

“మరే, ఈ నిక్కర్ వేసుకుని బయటకి వెళ్ళాలి అంటే సిగ్గుగా ఉంది నాన్న, మా ఫ్రెండ్స్ అందరూ ప్యాంట్స్ వేసుకుంటారు. నేనొక్కడినే ఇలా..” గొణిగాడు చంటి.

“ఎన్ని సార్లు చెప్పానురా అన్నయ్యకు కూడా నలభై ఏళ్ళు వచ్చేవరకు ప్యాంట్లు కొనివ్వలేదు. నీకు అప్పుడే ఏం తొందర?” అరిచాడు సదానంద్.

“అంతేలే నాకెప్పుడు యాభై ఏళ్ళు వస్తాయో, ఎప్పుడు మెజారిటీ వస్తుందో?” ఉక్రోశంగా అన్నాడు చంటి.

“దానికి ఇంకా ఇరవయ్యి ఏళ్ళుంది కాని. ఆ పట్టు నిక్కరు తొడుక్కుని మార్కెట్‌కి అఘోరించు,” ఆర్డర్ వేశాడు సదానంద్.

***

సదానంద్ కుటుంబం అంతా డిన్నర్ చేస్తున్నారు. సదానంద్ భార్య సునీత, చంటి, పెద్ద కొడుకు బంటి, కూతురు చేమంతి సదానంద్‌కి కంపెనీ ఇస్తున్నారు. బంటీకి అరవయ్యి ఏళ్ళు. చేమంతికి డెబ్భయి ఉంటాయి.

“నాన్నా, ఫీజు కట్టడానికి ఎల్లుండే ఆఖరి రోజు. అసలే మా కాలేజ్ వాళ్ళు బాగా స్ట్రిక్ట్. మరిచిపోకుండా రేపిచ్చెయ్యండి,” అన్నాడు బంటి వాళ్ళ నాన్నని ఉద్దేశించి.

“నీ పీ.హెచ్.డీలకి ఫీజు కట్టలేక చస్తున్నానురా. ఈ పదో పీ.హెచ్.డీ తరువాతైనా ఏదన్నా ఉద్యోగం వెతుక్కుంటావా? ఎప్పుడు చేతికి అందొస్తావురా?” విసుగ్గా అన్నాడు సదానంద్.

“పోదురు, మీది మరీ బడాయి. అరవయ్యి ఐదుకి కద మీకు ఉద్యోగం వచ్చింది. బంటి గాడిని ఎందుకు తొందర పెడతారు, పాపం. ఐనా వాడిని చూస్తే, ఎవ్వరూ అరవయ్యి అనుకోరు. లేతగా యాభయి ఏళ్ళ వాడిలా ఉంటాడు,” మురిసిపోతూ చెప్పింది సునీత.

“నీ కంటికి వాడెప్పుడు పద్దెనిమిదేళ్ళ పసిగుడ్డులానే ఉంటాడు. మా నాన్నకు బాగా ఆస్తి ఉండేది కాబట్టి, పెళ్ళైన పాతికేళ్ళ వరకూ ఇంట్లో పెట్టుకుని మేపాడు. నాకు అంత ఓఫిక లేదు. ఇప్పటికే నాకు ఓ రెండొదల ఏళ్ళు వచ్చినట్టు అనిపిస్తూంది,” చిరాగ్గా అన్నాడు సదానంద్.

“అదేంటి డ్యాడీ? మీకు ఇంక నూట పన్నెండే కద?” బుజ్జగిస్తున్నట్టు అంది చేమంతి.

“ఆ ఏదో మా కాలంలో ఇంకా బాల్య వివాహాలు ఉండబట్టి నలభై ఏళ్ళకే పెళ్ళి చేసుకున్నాను కాబట్టి, ఇంకా నూట పన్నెండే. కాని ఈ బాధ్యతల వల్ల దాదాపు దానికంటే రెండింతల వయసు ఉన్నట్టు అనిపిస్తూంది ఈ మధ్య,” అన్నాడు సదానంద్ విచారంగా.

“అలా దిగులు పడితే ఎలా అండీ? ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మన చేమంతిని చూడ్డానికి మగ పెళ్ళివారు ఈ శనివారం వస్తున్నారు. గుర్తుందా ఆ విషయం?” అడిగింది సునీత.

ఆ మాటలు వినగానే చిటికెన వేలు నోట్లో పెట్టుకుని మెలికలు తిరిగిపోయింది చేమంతి.

“నాన్నా అక్కయ్య చూడు! స్వీట్ ఫార్టీ-సిక్స్‌లా ఎలా సిగ్గు పడుతూందో?” ఉత్సాహంగా అన్నాడు బంటి.

“అందరికి నీకు మల్లే సిగ్గు లేకుండా ఉంటుందా? పిల్లలు పిల్లల్లా ఉండాలి. ఇలాంటి అడల్ట్ డయలాగులు వేస్తే నాకు వొళ్ళు మండిపోతుంది,” కసిరాడు సదానంద్.

ఆ తరువాత ఎవ్వరూ ఏం మాట్లడలేదు.

***

పెళ్ళి చూపులు.

చేమంతి పూర్తిగా ముస్తాబై తల దించుకుని కూర్చుని ఉంది. వచ్చిన పెళ్లి కొడుకు సోఫాలొ కాలు మీద కాలు వేసుకుని కూర్చుని అలవోకగా చేమంతినే చూస్తున్నాడు.

“అమ్మాయికి కుట్లు అల్లికలు నేర్పించారా వదిన గారూ?” పెళ్ళి కొడుకు తల్లి సునీతని అడిగింది.

“నేను చెప్పకూడదు కానీ, అమ్మాయి ఎక్స్‌పర్ట్ వదిన గారు. సూట్ల నుంచి షామియానాల వరకు అన్నీ బ్రహ్మాండంగా కుడుతుంది,” గర్వంగా చెప్పింది సునీత.

“మరి సంగీతం?”

“హిందుస్తానీ, కర్ణాటకాలు పూర్తిగా నేర్చుకుంది. ఈ మధ్యే ర్యాప్ మ్యూజిక్ నేర్చుకోవడం మొదలు పెట్టింది,” చెప్పింది సునీత.

“డ్యాన్సు వచ్చా?” ఇది పెళ్లికొడుకు.

“భరత నాట్యం, బ్రేక్ డాన్సు, కూచిపూడి, కథక్ నేర్చుకున్నానండి,” మొదటి సారి తలెత్తి చెప్పింది చేమంతి.

“ఓ! మణిపురి రాదా? అది నా ఫేవరెట్!” నిరాశగా అన్నాడు పెళ్లి కొడుకు. చేమంతి తల్లి వైపు బేలగా చూసింది.

“పెళ్లయ్యాక మీరు ఏది నేర్చుకోమంటే అది నేర్చుకుంటుందిలే బాబూ,” సర్ది చెప్పింది సునీత.

“అమ్మాయికి ఈ మధ్యే సంబంధాలు చూడ్డం మొదలు పెట్టారా వదిన గారూ?” ప్రశ్నించింది పెళ్లికొడుకు తల్లి.

“మరే వదిన గారూ! నాకు దీని వయసులో సగం ఉన్నప్పుడే పెళ్లయ్యింది. ఈ కాలం పిల్లలు అలా ఒప్పుకోరు కద. ఓ పదిహేనేళ్ళయినా ఉద్యోగం చేస్తే కానీ పెళ్లి చేసుకోనని కండిషన్ పెట్టింది మా అమ్మాయి,” నవ్వుతూ చెప్పింది సునీత.

“మగపెళ్లి వారు బాగా కలుపుగోలుగా ఉన్నారు. ఈ సంబంధం కుదిరితే బాగుండు,” తనలో తాను అనుకున్నాడు సదానంద్.

***

ముప్ఫై ఏళ్ళ తరువాత.

“చంటి గాడు ఒకటే గుర్తు వస్తున్నాడండి. అసలు ఇల్లు వదిలి ఎప్పుడూ వెళ్ళలేదు. కాలేజ్ కూడా ఈ ఊర్లోనే చేర్పించాం. మనకు దూరంగా ఉండకూడదని. అలాంటిది, రెండేళ్ళు అయ్యింది వాడిని చూసి,” దిగులుగా అంది సునీత.

“అడ్డాల నాడు బిడ్డలు కానీ, గడ్డాల నాడు కాదు అన్న సామెత వినలేదా సునీత. నూటా నలభయి నిండే లోపల అన్ని బాధ్యతలు నెరవేర్చుకోవాలి అనుకున్నాను. ఆ తృప్తి ఐనా మిగిలింది నాకు,” నిర్వికారంగా అన్నాడు సదానంద్.

“పైకి మీరు కఠినంగా ఉంటారు కానీ, చంటి బంటి చేమంతులని మీరు మిస్ కావడంలేదా చెప్పండి?” ప్రశ్నించింది సునీత.

“భగవద్గీత ఒక వెయ్యి సార్లు చదివాక అర్థమయ్యింది సునీతా, కొన్ని విషయాలు మన చేతుల్లో లేవని,” బదులు చెప్పాడు సదానంద్.

“మొన్న మాధవి కాల్ చేసినప్పుడు చెప్పింది. కొత్తగా ఏజ్-బూస్టర్ ప్లస్ అన్న ప్రొసీజర్ వచ్చిందట. అది చేయించుకుంటే ఇంకో యాభై ఏళ్ళు బతకచ్చట. నీకు ఇంటరెస్ట్ ఉందా అని అడిగింది. మా ఆయనన్ని కనుక్కుంటాను అని చెప్పా తనకి” అంది సునీత.

“ఇంకా టైం ఉంది కద! ఆలోచిద్దాంలే,” తేలికగా అన్నాడు సదానంద్.

Advertisements
This entry was posted in కథలు. Bookmark the permalink.

10 Responses to నీకు నూటయాభై ఏళ్ళ ఆయుష్షు!

 1. gangabhavani says:

  మీకెంత మంచి ఐడియాలు ఎలా వస్తాయండీ!
  టపా చాలా బాగుంది.
  సైన్స్ ఎంత వేగంగా పరిగెట్టినా, అమ్మాయిలకు పెళ్ళిచూపులూ, కుట్లూ, అల్లికలూ, నాట్యాలూ తప్పవన్నమాట.

 2. Aruna says:

  అయ్య బాబోయి. నూట యాభై సంవత్సరాలా. అంతకాలం బతకలేక చచ్చి వూర్కుంటాను. ఇరవైల్లోనే విసుగు వచ్చేసింది.

 3. Murali says:

  అలానే ఉంది చూడబోతే… 🙂 ఐనా ఇది జస్ట్ ఊహ మాత్రమే. నిజంగా పరిస్థితి ఎలా ఉంటుందో…

  -మురళి

 4. shravan kumar says:

  abhinandanalu. chala bagundhi.

 5. amun says:

  nice post

 6. name says:

  Very funny and interesting!

 7. prasad says:

  Good One 150 years means too much to live

 8. Jyothi Reddy says:

  Muraligaru,
  Really Superb కొత్తగా ఏజ్-బూస్టర్ ప్లస్ అన్న ప్రొసీజర్ వచ్చిందట. అది చేయించుకుంటే ఇంకో యాభై ఏళ్ళు బతకచ్చట.If it is really possible its good kadha..kompadheesi meeru gani kanipettara sir cheppandi memu konukkuntamu mee dhaggara(entha dabbau aina parvaledhu sir oka bottle book cheyyandi na kosam)check payment aina parvaledhu cash payment aina parvaledhu…Indian money aina parvaledhu eee country courancy aina parvaledhu….Emantaru Muraligar…..LOL

 9. vani says:

  idea chala bagundi.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s