ఉచిత సలహా

ఒక్క సారి నేను నిద్ర లేచి కూర్చున్నా. సుబ్బలష్మి ముగ్గులు వేయడానికి లేచిందనుకుంటా. బాబాయి హడావుడిగా లేచి నా కాలు తొక్కి మరీ బయటకు పరిగెత్తాడు. ఈ బాబాయిలందరూ ఇంతే. ఎదురింటి సుబ్బలష్ములు పక్కింటి సీతలూ కనిపిస్తే, మనల్ని అస్సలు పట్టించుకోరు. అదే ఉంకో అప్పుడు అనుకో, “బుడుగు, బుడుగు, బంగారు తండ్రి కద, సుబ్బ లష్మికి ఈ ఉత్తరం ఇచ్చి రా ఏం? నీకు చేగోడీలు కొని పెడతా,” అంటారు.

కాని మనం అస్సలు నమ్మకూడదన్న మాట. ఎందుకంటే ఈ బాబాయిలు పని పూర్తి కాగానే మనల్ని మరిచిపోతారు. చేగోడీలు ఏవీ బాబాయి అని అడిగితే, “ఛీ వెధవ కానా! వీపు చీరేస్తా,” అంటారు. అందుకే మనం వాళ్ళు చెప్పిన పనులు చేయకూడదు. ఈ విషయంలో నేను కుంచెం సలహాలు ఇస్తాను. సలహా అంటే అబిప్రాయం. అంటే నాకు తెలీదు. ఇప్పుడు నీకు సలహా కావాలా వద్దా? కావాలి కద! మరయితే విను.

మీ బాబాయి మిమ్మల్ని ఇంకొసారి సుబ్బలష్మికో, రాధకో, రెండు జెళ్ళ సీతకో ఉత్తరం ఇమ్మంటే, సగం డబ్బులు ముందస్తుగానే అడిగేయాలి. దీన్ని అడ్వాంసు అంటారు. అంటే పండగ వచ్చినప్పుడు మా అమ్మ, “ఒరే గోపాళం, బుడుగుకి బట్టలు కొనిపెట్టాలి. మీ బాసు దగ్గర అడ్వాంసు తీసుకోండి,” అంటుంది చూడు? అదన్న మాట.

ఏం? బాబాయి అడ్వాంసు చచ్చినట్టు ఇస్తాడు. ఎందుకంటే మరి ఇవ్వకపోతే మనం ఉత్తరం రెండు జెళ్ళ సీతకి ఇవ్వం కద! వాడికి ఇవ్వాలంటే బయం. ఎందుకంటే సీత వాళ్ళ తాతయ్య వసారాలోనే కూర్చుని వుంటాడు. బాబాయి అటుకేసి గానీ వెళ్తే, “పోరంబోకులా తిరగకపోతే, చదూకోకూడదూ?” అంటాడు.

పోరంబోకు అంటే జులాయి. అంటే నాకు తెలీదు. అప్పుడప్పుడు మా అమ్మ కూడా “ఉరేయి గోపాళం, బుడుగు వట్టి పోరంబోకులా తయారు అయ్యాడు,” అంటుంది. అదన్న మాట.

అమ్మో! మాటల్లో ఘడియారం చూసుకోలేదు. లేచి తయారు అయ్యి స్కూలుకి వెళ్ళాలి. లేకపోతే మా నాన్న నాకు ప్రైవేటు చెప్పేస్తాడు. మరి ఉంటానే?

Advertisements
This entry was posted in బుడుగు. Bookmark the permalink.

5 Responses to ఉచిత సలహా

 1. Rajiv says:

  బావుంది

  ఇంతకు మీరు బుడుగా లేక బాబాయా ????
  🙂 🙂 😀

 2. Jyothi Reddy says:

  Muraliji,
  Chala rojula tharuvatha manasuku haaini kaliginchey vishayalu chadhivina feeling,Chakkani pelletoori telugu bashani chala chakkaga rasaaru meeku meere saati sir..abhinandaneeyulu meeru

 3. mahesh says:

  chaala bagunnadi

 4. Muralikrishna says:

  It’s very nice. After invent of Internet I think BUDUGUs lost their snacks/pocket money…Papam Budugulu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s