తప్పు కళాకారులదే

మా మిత్రవర్గంలో మేధావి ఐన రాజేష్‌తో ఆ రోజు “కళ-కళాకారులు” అనే టాపిక్ మీద డిస్కషన్ వచ్చింది. మేం రాజేష్‌గాడి ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూండగా ఈ సంఘటన జరిగింది.

“ఎందుకు గురూ, మన దగ్గర ఈ దిక్కుమాలిన సీరియల్స్, ఈ దరిద్రపుగొట్టు సినిమాలు మాత్రమే వస్తున్నాయి? ఎందుకు గురూ, మన వాళ్ళకి పుస్తక పఠనం మీద ఆసక్తి పోయింది? ఎందుకు గురూ, కళకు గౌరవం లేకుండా పోయింది? దీనికి కారణం అభిరుచి లేని నిర్మాతలూ, ప్రేక్షకులూ, పాఠకులే కద!” ఆవేశంగా అడిగాను నేను. నాకు చిన్నప్పటినుంచి ఆవేశం ఎక్కువ.

“పిచ్చి వాడా! కళకు గౌరవం ఎప్పుడూ పోదు. గౌరవం పోయింది కళాకారులకు మాత్రమే. దానికి కారణం వేరెవరో కారు. సాక్షాత్తు కళాకారులే. ఇది స్వయంకృతాపరాధం!” చిద్విలాసంగా అన్నాడు రాజేష్.

“ఏంటి నువ్వనేది, ఈ పరిస్థితికి కళాకారులా కారణం?” హాశ్చర్యపోయాను నేను.

“అవును. నిశ్చయంగా కళాకారులే. కళాకారులు తమ కర్తవ్యం మర్చిపోయారు. అందుకే ఈ పరిస్థితి వచ్చింది.”

“అంటే?”

“కళ అనేది కళ కోసం మాత్రమే. దాని ద్వారా ఇతరత్రా లాభాలు కూడా కలగవచ్చు. ఉదాహరణకు, ధన లాభం, కీర్తి, గుర్తింపు. కాని కళ పరమార్థం అది కాదు. అవి కేవలం సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే.”

“అంటే కళాకారులు డబ్బు సంపాదించుకోవలనుకోవడం, పేరు ప్రఖ్యాతులు గడించాలి అనుకోవడం తప్పంటావా?”

“కళ వల్ల కళాకారులకు డబ్బూ, పేరూ రావడం తప్పని నేనట్లేదు. ఐతే డబ్బు కోసం, పేరు కోసం కళని వాడుకోకూడదు అంటున్నా.”

“అబ్బా నువ్వు చెప్పేది చాలా తికమకగా ఉందిరా. మరి కళాకారులకు డబ్బెలా వస్తుంది కళ వల్ల కాకపోతే?”

“అలా అడిగావు బాగుంది. మన కళాకారులందరూ చేసే తప్పు ఒకటుంది.”

“ఏంటది?”

“కళతో పాటూ బ్రతుకు తెరువు సాగడానికి ఉపయోగపడే ఏదో ఒక పని నేర్చుకోకపోవడం.”

“ఏంటీ? కళే కాకుండా, ఇంకో పని కూడా నేర్చుకోవాలా? మా బాబే! ఏడ్చినట్టుంది నువ్వు చెప్పేది.”

“తప్పదురా. అప్పుడు కళాకారుడికి తన పొట్ట నింపుకోవడం కోసం అడ్డమైన వెధవలకు తన కళని అమ్మాల్సిన అవసరం ఉండదు. బ్రతుకు తెరువు సాగడానికి ఏదో ఒక పని వచ్చి ఉంటే, ఆత్మ గౌరవం కోల్పోయి కళని తాకట్టు పెట్టాల్సిన అవసరం రాదు. కేవలం డబ్బు ఒకటే తప్ప ఏ అర్హతా లేని నీచ్ కమీన్ కుత్తేలకి ఊడిగం చేయనక్కరలేదు.”

“ఐతే ఈ డబ్బుండి అభిరుచి లేని వారిది తప్పే కాదంటావు?”

“తప్పే. కానీ అది వారి సహజ లక్షణం. పంది బురదలోనే పొర్లుతుంది. అది తప్పైనా, అది దాని నైజం. ఉదాహరణకు పంది దగ్గర త్యాగరాజ కీర్తన పాడితే, అది దానికి నచ్చకపోతే, తప్పు పంది కంటే ఎక్కువ పాడిన వాడిది.”

“సరేరా, నువ్వు చెప్పింది నిజమే అనుకున్నా, కళాకారుడికి డబ్బు ఒకటే కాదు కద కావలిసింది! ఎదుటి వారినుంచి అప్రిసియేషన్ కూడా కావాలి. అది డబ్బున్న వాడిని ఆశ్రయిస్తేనే వస్తుంది. ఉదాహరణకు ఒక రచయితకు ఒక డబ్బున్న వ్యక్తి అండగా నిలిచి అతని పుస్తకం అచ్చు వేయిస్తేనే కద, ఆ రచయిత గురించి అందరికి తెలిసేది?”

“భేషుగ్గా అచ్చు వేయించనీ. కానీ ఆ డబ్బున్న పెద్ద మనిషి, రచయిత మీద ఏ రకంగానూ ఒత్తిడి చేయకూడదు. అప్పుడు ఓకే.”

“అదెలారా? అంత డబ్బు పెడుతున్నాడు కద, తనకి అంకితం ఇవ్వమనో, తన గురించి కాస్త గొప్పలు రాయమనో అడుగుతాడు. ఆ మాత్రం రచయిత కాంప్రమైజ్ కాకపోతే ఎలా?”

“కాంప్రమైజులు బిజినెస్‌లో బాగుంటాయేమో. పెళ్ళిలో బాగుంటాయేమో. యుద్ధంలో బాగుంటాయేమో. కాని కళలో బాగుండవు. మనసు చంపుకుని, విలువలు చంపుకుని, కళను కల్తీ చేసి, కొట్టించుకునే చప్పట్ల కంటే, కాంప్రమైజ్ కాకుండా ఏ చీమల ముందో, దోమల ముందో కళను ప్రదర్శించడం బెటర్!”

“అంటే శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రిలానా?”

“అవును.”

“ఎప్పటికీ కళాకారుడికి గుర్తింపు రాకపోతే?”

“నేను ముందే చెప్పాను. కళ అనేది కళ కోసమే. మిగతావి జస్ట్ సైడ్ ఎఫ్ఫెక్ట్స్. గుర్తింపు వచ్చినా రాకపోయినా కళని కల్తీ చేయలేదన్న తృప్తి ఉంటుంది. అది ముఖ్యం.”

“నువ్వు చెప్పినట్టు ఎవరూ ఉండర్రా!”

“ఎందుకుండరు? ఇప్పుడు నువ్వు చూస్తున్న కళాకారులే ప్రపంచంలో ఉన్న కళాకారులు అనుకుంటున్నావా? నిజంగా మిస్ వరల్డ్‌గా ఎంపికైన అమ్మాయే ప్రపంచ సుందరా? ఆమె కంటే అందగత్తెలే లేరనుకుంటున్నావా?”

“అవుననుకో. కానీ నువ్వు చెప్పినట్టు కాంప్రమైజ్ కాకుండా ఉండి, చరిత్రలో నిలిచిపోయినవారు ఒక్కరైనా ఉన్నారా?”

“లేకేం! మన బమ్మెర పోతన్న ఉన్నాడుగా! ఆయన తన కుటుంబ బాధ్యతలు ఎప్పుడూ విస్మరించలేదు. వ్యవసాయం చేసి తనవారిని పోషించాడు. ఎవరి మీదా భారం కాలేదు. అలా అని తన కళను చంపుకోలేదు. తీరిక వేళల్లో తన రచనా వ్యాసంగాన్ని సాగించాడు. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఆయన తరువాత తరాలకు భాగవతాన్ని అందించాడు. చరిత్రలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయాడు.”

“అంటే నువ్వనేది…”

“ప్రతి కళాకారుడు పోతన్నని ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు కళలూ నిలుస్తాయి. వాటిని ఆదరించేవారూ పుట్టుకొస్తారు. డబ్బు తప్ప ఇంకే అర్హతా లేని ఏబ్రాసి నాయాళ్ళు కళ ముందూ, కళాకారుల ముందూ ఓడిపోతారు. ఇదే మనందరం కళలకు ఇవ్వగలిగే అసలు గౌరవం!”

Advertisements
This entry was posted in సినిమాలు. Bookmark the permalink.

16 Responses to తప్పు కళాకారులదే

 1. రవి says:

  మురళి గారు, బావుంది + బాలేదు.

  ఇది మీరు రాసే మరో హాస్యగుళిక అయిన పక్షంలో బావుంది.

  ఇది సెటైర్ అయితే, మీ సెటైర్ ఎవరి మీద? కళాకారుల మీదా? కళను ఆదరించని వాళ్ళ మీదా? (… పంది దగ్గర త్యాగరాజ కీర్తన పాడితే)లేకపోతే ఉబుసుపోక కళాకారులని వాళ్ళపని చేసుకోకుండా వాళ్ళ పనిలో దూరి విమర్శించే వాళ్ల మీదా?

  నేను భుజాలు తడుముకోడానికి ఒక కారణం. ఎంత వద్దనుకున్నా నాకు అప్పుడప్పుడూ అడుసు తొక్కే దరిద్రపు అలవాటు ఉంది. 🙂 అప్పుడప్పుడూ అనవసర విమర్శలలో తల దూర్చి, తలనొప్పులు తెచ్చుకోవటం బాగా అలవాటయింది.

  మీ సెటైర్ ఈ కోణంలో అయితే బాలేదు.

  • Murali says:

   రవి గారు,

   ఇది నా స్టైల్‌లో రాసినా, సెటైర్ మాత్రం కాదు. కళా ప్రదర్శన కోసం, కళాకారులు తాము నమ్మిన విలువల గురించి కాంప్రమైజ్ కావడంకన్నా, ఆ కళను ప్రదర్శించకపోవడమే మంచిది అనే ఒక ప్రపోజల్. కళాకారులను exploit చేసే వారిని పందులతో పోల్చాను అంటే వారి మీద నాకున్న అభిప్రాయం మీకు అర్థం అయ్యే ఉంటుంది. 🙂

   -మురళి

 2. bujji says:

  correctee!!

 3. Pradeep says:

  Well Written analysis

 4. ప్రదీప్ says:

  మా బాగా చెప్పారు

 5. చంద్ర మోహన్ says:

  “అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిఖ, మాలిఖ, మాలిఖ” (రసికులుకానివారికి కవిత్వం వినిపించే ఖర్మ నా నుదుటన వ్రాయవద్దు, వ్రాయవద్దు, వ్రాయవద్దు) అని బ్రహ్మను ప్రార్థించాడు కాళిదాసు!

 6. Jyothi Reddy says:

  Murali Garu,
  Enti meeru cheppedhi,ippati kalakarulanu bammera pothana laga undamani antunnaraaa?ela sir kastam kadha cheppandi,ippati mana samajam lo ala veelu kadhu kadhaa..dabbu pradhana pathra vahinche eee rojullo western culture ki alavatu padina eee rojullo meee korika saraindhi kadhu kaanee kadhu…
  Ippudu evarainaa veedhi bahothanni chusthara cheppandi?

 7. bharat says:

  ఓ నిజమైన కళాకారుడికి మాత్రమే అర్ధమయ్యే చురక.

  కళాకారులందరికీ ఓ కనువిప్పు. ఉన్నతమైన పరిష్కారం.

  భరత్

 8. మీ అవిడియా ఆచరించడం అంత వీజీ కాదు గురూజీ!

  బీటెక్కులకీ హైటెక్కులకీ తప్ప ఉద్యోగాలు గగనమైపోతున్న ఈ రోజుల్లో మరీ కష్టం. ఎదో పబ్లిక్ సెక్టర్ కంపెనీలూ, ప్రభుత్వ కార్యాలయాలూ ఒకప్పుడు ‘ కలాపోసన ‘ చేసేవి; ఇప్పుడు అది కూడా లేదు.

  పోతన గారి విషయం అటు పక్కన పెడితే, వారానికి 48 గంటలు మాత్రమే (!) పనిచెయించుకునే ప్రైవేటు కంపెనీల్లో – అటువంటి కంపెనీ ఎక్కడైనా ఉంటే – ఉద్యోగం చేస్తూ, రోజూ 3-4 గంటలు బస్సుల్లో పడి తిరుగుతూ కూడా కళాసాధన చెయ్యాలంటే మామూలు మనుషులకు సాధ్యమా?

  మహారాజపోషకులు పోయాక, కళాకారుడికీ కంప్యూటర్ ప్రోగ్రామర్ కీ ఆట్టే తేడా లేదు. మనం రిక్వయర్మెంట్శ్ కి ప్రోగ్రాం వ్రాస్తాం, వాళ్ళు రిక్వయర్మెంట్శ్ కి పాటలో నాటకాలో వ్రాస్తారు.

  గొల్లపూడి మారుతీరావు గారన్నట్టు, మీరు పుచ్చు వంకాయలు కొంటే వాళ్ళు మంచి వంకాయలెందుకు పండిస్తారు? కష్టపడి ఎవడో ఒక నాబోటి గన్నాయి గాడు మచి వంకాయలు పండించినా, ధర వెచ్చించి కొనే వాళ్ళేరీ? కొనే వాళ్ళవరకు తీసుకుపోయే డిస్త్రిబ్యూటర్లేరి!

  మరి మనం లోపభూయిష్టమైన అప్ప్లికేషన్లు రిలీజ్ చేస్తాం కదా? అట్లాగే వాళ్ళు కూడా. రెంటికీ సంజాయిషి ఒకటే: కాస్ట్-బెనిఫిట్ అనాలిసిస్. వాళ్ళకీ పెళ్ళాం-పిల్లలని పోషించే బాధ్యత ఉంటుంది కదా!

  మనం జీతగాళ్ళమైనప్పుడూ వాళ్ళు మాత్రం మహర్షులవ్వాలని ఎందుకనుకోవాలి?

 9. budugu says:

  మురళీ గారు..

  మీరు చెప్పింది ఆచరణలో అంత సులభం కాకపోవచ్చు కానీ..
  తప్పు కళాకారులదే అనే పాయింటు కరక్టే అనిపిస్తుంది నాకు..

  దానికి ఈకాలంలో నాకు తెలిసిన perfect ఉదాహరణ సిరివెన్నెల సీతారామశాస్త్రి..
  నాకు తెలిసీ ఆయన నుంచి ఒక్క చెత్త పాట కూడా రాలేదు..
  (correct me if i’m wrong)

  ఓసారి “పాడాలని ఉంది” ప్రోగ్రాంలో బాలు సిరివెన్నెలని అడిగారు..

  నేను కూడా చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యి నాకు నచ్చని పాటలు పాడాను..
  మీరు మాత్రం ఇన్నేళ్ళలో ఒక్కసారి కూడా మీ స్టాండార్డ్ దిగి రాయలేదు..

  అదెలా కుదిరింది మీకు అని..

  దానికి ఆయన..
  “నేను ఓ పాట రాస్తే అది ఆ సిట్యుయేషన్ కి మాత్రమే తగ్గట్టుగా కాదు
  యూనివెర్సల్ గా ఉందా లేదా.. అని చూస్తా..”
  అని చెప్పారు..

  ఆయన కూడా ఈ హైటెక్ కాలం రచయితేగా??
  మరి ఆయన స్టాండార్డ్ తగ్గకుండా పాటలు ఎలా రాయగలుగుతున్నారు??
  మిగతా వాళ్ళు ఆ standards ఎందుకు మైంటైన్ చెయ్యలేకపోతున్నారు??

  • Murali says:

   మీరన్నది నిజం. నేను అందరు కళాకారులూ ఆత్మని అమ్ముకుని బతుకుతున్నారు అనడం లేదు. సిరివెన్నెల లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాని ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, కళాకారులకు జరుగుతున్న అవమానాలకు చాలా మటుకు వారే కారణం. And, I guess you got my drift there.

   -మురళి

 10. budugu says:

  //కాని ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, కళాకారులకు జరుగుతున్న అవమానాలకు చాలా మటుకు వారే కారణం.//

  నేను చెప్పిందీ అదే కదా మాష్టారూ..

  //తప్పు కళాకారులదే అనే పాయింటు కరక్టే అనిపిస్తుంది నాకు..//

  నేను చెప్పింది మీకర్ధం కాలేదా.. లేక మీరు చెప్తున్నదే నాకర్ధంకాటం లేదా???

  anyways..

  సున్నితమైన హాస్యంతో.. పదునైన పంచ్ లతో అద్భుతంగా అలరిస్తున్న మీ ఆర్టికల్స్ కి ముందు నా అభివాదాలు.. తదుపరి నా అభినందనలు 🙂

  • Murali says:

   We are both in agreement. 🙂 I am glad there are still exceptions to this rule.

   Thanks for the kudos.

   -Murali

 11. Naveen says:

  murali garu,

  oka rendu rojula kritham ma friend naku mee blog gurinchi cheppadu, appannunchi pantha pakkana pettimari caduvuthunna…… me rachanalu chala bagunnay, nenu time sarrigga manage cheyyalenu kadatti(naku kastha baddakam ekkuvanukondi) me anni rachanalaku comment rayaledu, kani ee kalakarulu.. chalabaga nachindi, naku hasya rachanalu cheyyalani vuntundi, kani mude cheppinattuga baddakam, migata panulanni chesesarike, prapamchanni mosanani feel avthunta, anyways……. kalla kallakaru ani chalagaga chepparu……… me inspiration to eedo okaroju nenu rayatam modalu pedthanu………thanx a lot for such a nice blog………… i wish u all the best………

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s