విజయానికి యాభై చెట్లు

“ఎలా ఉన్నావురా?” అప్పారావు గాడు నన్ను అడిగాడు. మేమిద్దరం వాడి ఇంట్లో కూర్చుని ఉన్నాం.

“ఏముందిరా! పెద్ద ప్రాబ్లంస్ ఏమీ లేవు కానీ, లైఫ్ అంతా డల్లుగా డిమ్ముగా ఉంది. ఏదో చేయాలని ఉంది. కానీ ఏం చేయాలో తెలీదు,” చెప్పాను నేను.

“తెలీకపోవడం ఏంటి, ఇన్ని వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఉండగా? వాటిని చదివి నీ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడమే!”

“ఏంటి తెలుగులోనే? వ్యక్తిత్వ వికాస గ్రంథాలే?”

“మరేమనుకున్నావు. ఇంగ్లీష్‌లో సెల్ఫ్-హెల్ప్ పుస్తకాలు ఉన్నట్టే మన తెలుగులోనూ ఉన్నాయి.”

“నువ్వే ఒక బుక్ సజెస్ట్ చేయొచ్చు కద!”

“ఐతే ఈ బుక్ ట్రై చెయ్యి. దీని పేరు, ‘ విజయానికి యాభై చెట్లు ‘.”

“విజయానికి యాభయి చెట్లా? అదేం టైటిల్ రా బాబూ?”

“విజయం అంత సులభంగా రాదు. ఎన్నో చెట్లూ, పుట్టలూ ఎక్కి అవతలకి చేరుకుంటే కానీ అని రచయిత భావం.”

“అలా అని నీతో చెప్పాడా?”

“పిచ్చి వాడా రచయితలు అలాంటి గుంభనమైన పేర్లు మాత్రమే పెడతారు. వాటిని ఇంటర్‌ప్రెట్ చేసుకునే బాధ్యత మన లాంటి పాఠకులదే!”

“ఓహో!”

“ఇంకా ఆలస్యం చేయకుండా వెళ్ళి ఆ పుస్తకం కొనుక్కో. నేర్చుకో….”, అన్నాడు మా అప్పారావు.

***

పుస్తకాల షాప్ వాడు నాకు “విజయానికి యాభై చెట్లు” అందించాడు. దాని ధర చూసి నాకు కళ్ళు తిరిగాయి. “ఇంత కాస్ట్లీనా?” అన్నాను అప్రయత్నంగా.

“మరి ఫ్రీగా విజయం రాదు కద సార్! ఐతే ఏ మాటకామాట చెప్పుకోవాలి. ఈ పుస్తకాలు ఒక పది సార్లు అచ్చు వేయించాక, రచయితకి మాత్రం ఏ చెట్లు ఎక్కకుండానే విజయం వచ్చేసింది,” అన్నాడు షాప్ అతను.

“అంతేలే, మా లాంటి వాళ్ళకు ఇదంతా అవసరం కానీ, ఆయన షార్ట్ కట్ తీసుకున్నట్టున్నాడు.” ముక్తాయించాను నేను.

***

ఇంటికి వెళ్ళగానే ఆసక్తిగా పుస్తకం చదవడం మొదలు పెట్టాను. పీఠికలోనే రచయిత నన్ను ఎక్కడో టచ్ చేశాడు. “మీ ఏబ్రాసి జీవితంతో విసుగు చెంది ఉన్నారా? ఐతే మీరు సరైన పుస్తకమే కొన్నారు. మీలాంటి ఏబ్రాసుల జీవితంలో వెలుగు నింపడం కోసమే నేను ఈ పుస్తకం రాశాను.” అంటూ మొదలయ్యింది.

చెప్పొద్దూ, నేను ఏబ్రాసిని అని నాకు తెలిసినా, అలా రచయిత డైరెక్ట్‌గా నన్ను సంబోధించడం నాకు నచ్చలేదు. ఐనా అవసరం నాది కదా అని నా ఉక్రోశాన్ని దిగమింగుకుని చదవడం కంటిన్యూ చేశాను.

“మీరు చేసే తొంభై శాతం పనులు దిక్కు మాలిన దరిద్రపుగొట్టు పనులే. ఈ పుస్తకం చదవడం ఒక్కటే ఈ మధ్య కాలంలో మీరు చేస్తున్న తెలివైన పని.

అసలు పనుల్లో నాలుగు రకాలు ఉంటాయి. అర్జంట్ మరియు ఇంపార్టెంట్ పనులు, అర్జంట్ కానివి కానీ ఇంపార్టెంట్ పనులు, ఇంపార్టెంట్ కానివి కానీ అర్జంట్ పనులు, ఇంపార్టెంట్ కానివే కాకుండా అర్జంట్ కూడా కానివి. మీ లాంటి ఏబ్రాసులు ముఖ్యంగా ఈ నాలుగో రకం పనులు చేస్తూ ఉంటారు.”

నాకు మళ్ళీ కోపం ముంచుకొచ్చింది. ఈ పుస్తకం చదివితే నా సెల్ఫ్-ఎస్టీం పెరిగే మాట అటుంచి, ఉన్నది ఊడే ప్రమాదం మెండుగా ఉంది. అంతలో నేను ఉలిక్కి పడ్డాను. ఈ వాక్యాలు యధాతథంగా ఏదో ఇంగ్లీషు పుస్తకంలో చదివినట్టు గుర్తు.

వెంటనే వెళ్ళి నా దగ్గరున్న ఒక నాలుగైదు పుస్తకాలు తిప్పి చూస్తే తెలిసింది ఆ చాప్టర్ అంతా “ద సెవెన్ హ్యాబిట్స్ అఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్” అనే పుస్తకంలోంచీ మక్కీకి మక్కీ కాపీ అని. వెంటనే అప్పారావు గాడికి ఫోన్ కొట్టాను.

“ఏరా, ఆ పుస్తకం చదవగానే నీలో ఆత్మ విశ్వాసం పెరిగింది కదూ? అది చెప్పడానికే కాల్ చేశావా?” అడిగాడు నన్ను.

“నీ బొంద. మన దగ్గర కూడా వ్యక్తిత్వ వికాస గ్రంథాలు ఉన్నాయి అన్నావు, ఇది ఒక ఇంగ్లీషు పుస్తకానికి వీర ఘోర కాపీ!”

“ఐతే తప్పేంటి?”

“తప్పేంటా? కాపీ కొట్టడం తప్పు కాదూ? అందులో అంత చక్కటి టైటిల్‌ని మార్చి అసయ్యంగా విజయానికి యాభై చెట్లు అని పెడతాడా ఈ దొంగ రచయిత?”

“మన దేశంలో ఎంత మందికి ఆ లెవెల్ ఇంగ్లీష్ అర్థమవుతుంది? అందరికి అర్థమయ్యేలా సరళమైన భాషలో అనువదించాడు. అది మాత్రం ఎంత మందికి చేతనవుతుంది? ఇక ఆ టైటిల్ అంటావా, అది నేటివిటీ కోసం పెట్టాడు. ”

“అలా ఐతే ఇది ఆ పుస్తకానికి అనువాదం అని రాసుకోవచ్చు కద?”

“ఎలా రాసుకుంటాడు? అప్పుడు ఒరిజినల్ రచయిత నుంచి అనువాద హక్కులు పొందండం లాంటి చీప్ పనులు చేయాల్సి వస్తుంది. అంతే కాకుండా ఆ పుస్తకం పూర్తిగా కాపీ కొట్టి రాసింది కాదు. ఆఖరి చాప్టర్ ఈయనే సొంతంగా రాశాడు. అలాంటి పరిస్థితుల్లో అనువాదం అనలేడు కద?”

“ఓహో!”

“ఇక ఆలస్యం చేయకుండా కంటిన్యూ అయిపో!” ఫోన్ పెట్టేశాడు అప్పారావు.

సరే ఈ రచయిత సొంత ప్రతిభ ఏంటో చూద్దాం అనుకుని, నేను డైరెక్ట్‌గా ఆ చాప్టర్‌కి వెళ్ళి పోయాను. అది ఇలా సాగింది.

“ఏబ్రాసులు అందరు చేసే ఒక పెద్ద తప్పు ఏంటంటే, ఒక పనిని ఒకే టైంలో చేయడం. అంటే ఒక పని పూర్తయ్యేవరకూ, ఇంకో పని చేయకపోవడం. దాని వల్ల బోలెడు సమయం వృధా అవుతుంది.

ఉదాహరణకు ఒక ఏబ్రాసి దినచర్య ఇలా ఉంటుంది. పొద్దున లేవగానే పళ్ళు తోముకోవడం. ఆ తరువాత కాఫీ పెట్టుకోవడం. అదయ్యాక దాన్ని ఆర్చుకుని ఆర్చుకుని తాగడం. ఆ తరువాత స్నానానికి బయలుదేరడం, బయటపడి విజిలేసుకుంటూ మెల్లగా తయారవ్వడం, తరువాత బట్టలు ఇస్త్రీ చేసుకోవడం, ఆ తరువాత టిఫిన్ తిని, బాక్స్ కట్టుకుని ఆఫీసుకి బయలుదేరడం. ఇవన్నీ ఇలా ఒక దాని తరువాత ఒకటి చేస్తే బోలెడు టైం వేస్ట్ అవుతుంది.”

నాకు అర్థం కాలేదు. నేను రోజూ అలాగే తయారు అవుతాను మరి. అందులో తప్పేముంది?

“మీ లాంటి ఏబ్రాసులకు ఇందులో తప్పేం కనిపించక పోవచ్చు.” ఇది నెక్స్ట్ లైన్. నేను పళ్ళు పట పటా కొరికాను.

“కానీ ఇదే ఇంకో రకంగా చేసి చూద్దాం. ఈ సారి పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకోవడానికి ముందే మీరు కాఫీ స్టవ్ మీద పెట్టి వెళ్తారు. మీరు పళ్ళు తోముకుంటూంటే ఇక్కడ కాఫీ మరుగుతూంటుంది. మీరు పళ్ళు తోముకుని రాగానే కాఫీ పెట్టేసుకోవచ్చు.

అదే టైంలో షేవింగ్ క్రీం గెడ్డానికి పూసుకుని లంచ్ బాక్స్ కట్టుకోవాలి. మధ్యలో కాఫీ రెండు గుటకలు వేయాలి. ఆ తరువాత వెంటనే బాత్‌రూంలో దూరి షేవ్ చేసుకుంటూ, మధ్య మధ్యలో మిగిలిన కాఫీ తాగాలి.

తరువాత ఐరన్ బాక్స్ ప్లగ్‌లో పెట్టి, స్నానానికి వెళ్ళాలి. బయటకు వచ్చేసరికి ఐరన్ బాక్స్ బాగా సెగలు పొగలు కక్కుతూంటుంది.

అప్పుడు టిఫిన్ ప్లేట్‌లో పెట్టుకుని తీసుకు వచ్చి బట్టలు ఇస్త్రీ చేసుకోవడం మొదలు పెట్టాలి. టిఫిన్ నములుతున్నప్పుడు బట్టలు ఇస్త్రీ చేయాలి. దీని వలన మీ టిఫిన్ అయ్యేసరికి ఇస్త్రీ కూడా పూర్తవుతుంది.

ఇలా చేస్తే మీకు దాదాపు 37 నిముషాలు కలిసొస్తాయి…”

పుస్తకం పక్కన పెట్టి నేను ఆలోచనలో పడ్డాను. నా మీద నాకే కూసింత అసయ్యం వేసింది. ఇలా లేచినప్పటినుంచి సమయాన్ని వృధా చేస్తున్నా అన్న మాట. ఐతే, నా పద్ధతి మరుసటి రోజు నుంచే మార్చేయాలని డిసైడ్ అయి పోయా.

***

మరుసటి రోజు లేవగానే తు.చ. తప్పకుండా కొత్త షెడ్యూల్ అమలులో పెట్టా. కాఫీ స్టవ్ మీద పెట్టి బ్రష్ చేసుకోవడానికి బాత్‌రూంలోకి వెళ్ళాను. నాలుక గీక్కుంటున్న టైంలో ఏదో బుస బుసా పొంగుతున్న సౌండ్ వచ్చింది. నాలుక బయట పెట్టి అలాగే కిచెన్‌లోకి పరిగెత్తా. పాలు పొంగిపోయి ఉన్నాయి.

నాకు నీరసం ముంచుకొచ్చింది. అదే టైంలో మా రూంమేట్ బయటకు వచ్చి నన్ను చూసి కెవ్వున అరిచాడు. “ఏంట్రా ఆ పోజు? కలకత్తా కాళిక నాలుకలా అలా బయట పెట్టావు?” అన్నాడు చిన్నగా వణుకుతూ.

వాడికి క్షమాపణలు చెప్పుకుని, ఈ సారి మళ్ళీ కాఫీ పెట్టకుండా బాత్‌రూంకి వెళ్ళి నాలుక సరిగ్గా గీక్కుని వచ్చాను. అప్పుడు కాఫీ పెట్టా. అది సరిగ్గా అయ్యాక, గెడ్డానికి షేవింగ్ క్రీం పూసుకుని లంచ్ బాక్స్ ప్యాక్ చెయ్యడం స్టార్ట్ చేశా.

అంతకు ముందు రాత్రి చేసిన కూరని అన్నంలో కలుపుతూంటే, గెడ్డానికి ఉన్న షేవింగ్ క్రీం కొంత అందులో పడింది. నేను నాలుక కర్చుకుని ఆ ప్రాంతంలో ఉన్న అన్నం తీసి పడేస్తూంటే మా రూంమేట్ మళ్ళీ ప్రత్యక్ష్యం అయ్యాడు.

“అదేంటి, పెరుగన్నం అలా పారేస్తున్నావు?” ఆశ్చర్యం వెలిబుచ్చాడు. నాకు వొళ్ళు మండింది.

“అది పెరుగన్నం కాదు. నా షేవింగ్ క్రీం అన్నంలో కలిసి అలా కనిపిస్తూంది.”

“ఓహో, ఐతే నాదే తప్పు ప్రశ్న. షేవింగ్ క్రీం అన్నంలో ఎందుకు కలుపుతున్నావు?”

“బుద్ధి తక్కువయ్యి. నన్ను వదిలేయ్యరా! ఈ రోజు నేను టైం ఆదా చేసే ప్రోగ్రాంలో ఉన్నాను.”

వాడు నన్ను అదో రకంగా చూస్తూ వెళ్ళిపోయాడు.

మొత్తానికి కాఫీ మధ్య మధ్యలో గుటకలు వేస్తూ లంచ్ ప్యాక్ చేసేశా. ఆ తరువాత మిగిలిన కాఫీని పట్టుకుని బాత్‌రూంలోకి దూరాను. అప్పటికి నా షేవింగ్ క్రీం ఎండిపోయింది. కాబట్టి ఇంకొంత క్రీం పూసుకుని, కాఫీ కప్ పక్కన పెట్టి షేవింగ్ మొదలు పెట్టా.

గుడ్. ఇదేదో బాగానే ఉంది. కొంచెం ప్రాక్టీస్ అయితే బానే ఉంటుంది. బోలెడు టైం కలిసొస్తుంది అనుకుంటూ రాత్రి టీవీలో చూసిన మాడెల్‌లా రేజర్‌తో స్టైల్‌గా ఒక గీకు గీకా. ఆశ్చర్యం. తెల్లగా ఉన్న నా షేవింగ్ క్రీం, గీకిన చోట కాఫీ రంగులోకి మారిపోయింది. అప్పుడు అర్థమయ్యింది. అంతకు ముందు పొరపాటున నా రేజర్‌ని కాఫీ కప్‌లో ముంచి కడిగాననని.

నన్ను నేను తిట్టుకుంటూ ఆ కాఫీ పారబోసి, షేవింగ్ ముగించాను. నెక్స్ట్ నా కర్తవ్యం గుర్తొచ్చింది. ఐరన్ బాక్స్ ప్లగ్‌లో పెట్టి స్నానానికి బయలు దేరా. తిరిగి వచ్చే సరికి పుస్తకంలో చెప్పినట్టే ఐరన్ బాక్స్ సెగలు పొగలు కక్కుతూంది. టిఫిన్ (అంటే cereals లెండి) బౌల్‌లో వేసుకుని తెచ్చుకుని ఇస్త్రీ మొదలు పెట్టా.

టిఫిన్ నములుతున్నప్పుడు ఇస్త్రీ చేయ్యడం కొంచెం కష్టంగానే ఉన్నా కాసేపు బానే మ్యానేజ్ చేశా. కానీ ఎక్కడో రిథం తప్పి పొరపాటున టిఫిన్ నోట్లో పెట్టుకోవడానికి బదులు మూతికి ఐరన్ బాక్స్ తాకించాను. కెవ్వున కేక వేసి ఆ హడావుడిలో ఐరన్ బాక్స్ కాలి మీద వేసుకున్నా. నా కేకలకు మా రూంమేట్ పరిగెట్టుకుంటూ వచ్చాడు.

***

హాస్పిటల్‌లో బాగా రష్‌గా ఉంది. నా వంతు వచ్చాక డాక్టర్ నా మూతికి ఆయింట్‌మెంట్ పూసి కాలికి కట్టు కట్టాడు.

“అసలేం జరిగింది?” సానుభూతిగా అడిగాడు. నేను వివరంగా చెప్పాను.

“ఓహో! మీరు కూడా అదే బాపతా! ఇదే వెర్షన్‌తో ఈ వారం ఒక యాభయి మంది వచ్చారు. మాంచి పవర్‌ఫుల్ బుక్‌లా ఉంది,” అన్నాడు కొంత ఆనందంగానే.

అదే టైంలో కాంపౌండర్ లోపలికి వచ్చి ఒక కవర్ డాక్టర్ చేతిలో పెట్టాడు. “ఏంటిది?” అడిగాడు అతన్ని డాక్టర్.

“ఏదో లీగల్ నోటీస్‌లా ఉంది,” చెప్పాడతను.

డాక్టర్ కవర్ చించి అందులో ఉన్న కాగితాల్ని చదివాడు. సడన్‌గా ఆయన మొహం పాలిపోయింది.

“ఏమయ్యింది?” అడిగాను నేను.

“మీరు ఏ పుస్తకం చదివి ఇక్క్డడికి వచ్చారో, ఆ రచయిత పంపిన నోటీస్ ఇది. ఆయన బుక్ వల్లే నాకు ఇంత మంది కొత్త పేషేంట్స్ వచ్చారు కాబట్టి, ఈ లాభాల్లో ఆయనకు పదో వంతు ఇవ్వాలట,” చెప్పాడు ఆయన.

నాకు నోట మాట పెగల్లేదు.

Advertisements
This entry was posted in మన సమాజం. Bookmark the permalink.

31 Responses to విజయానికి యాభై చెట్లు

 1. రవి says:

  “విజయానికి ఐదు చెట్లు” చదివినప్పుడు నాకూ ఇట్లాంటి డవుట్లే వచ్చాయి. నేనీ సంగతి మా వాళ్ళతో చెబితే, తెలుగులో అంత అద్భుతమైన రచయితను అలా తిడతావా అని నా మీద “ఫత్వా” జారీ చేసారు. ఇన్నాళ్ళకు ఓ భావ సారూప్యం ఉన్న వ్యక్తి కలిసాడు నాకు.

  “మండుటెండలో మత్తుపిల్ల” నవల్లోనూ అంతే…born to win పుస్తకాన్ని అందంగా కాపీ కొట్టాడాయన.

  • Murali says:

   రవి,

   రెండు రెళ్ళు నాలుగన్నందుకు
   గుండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో
   ……….
   పెద్ద అపరాధమయి పోయింది.

   శ్రీ శ్రీ గారి కవితలో మూడో లైన్‌ని మీ ఇష్టమొచ్చిన టాపిక్‌తో పూరించుకోండి. 🙂

   -మురళి

 2. బాబు says:

  హ హ హ్హ హ్హ హ్హాహ్హాహ్హా…!ఇరగదీసేసారంతే!

 3. laxmi says:

  ROFL 🙂 Too good as always!!!

 4. Malakpet Rowdy says:

  LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL .. Porli Porli navvutunnaanandiii

 5. name says:

  Amazing! Hilarious! Excellent as always!

 6. Sravya says:

  ha ha ha 🙂

 7. mohanrazz says:

  బాగుంది.
  ఆల్ మోస్ట్ ఇదే కాన్సెప్ట్ తో పోస్ట్ వ్రాయబోతూ దీన్ని చూసాను. కాకతాళీయం.

  • Murali says:

   సారీ, మోహన్ రాజ్ గారు.

   I am glad you liked it. I can only assure you this was not a premeditated attempt to steal your thunder. 🙂

   -మురళి

 8. బాగుంది. నాకు మాత్రం విజయానికి ఐదు మెట్లు నచ్చింది. బహుశా నాకు ఇంగ్లీషు పుస్తకాలు చదివే అవకాశం లేకపోవడం వల్ల అయ్యుంటుంది.

  • Murali says:

   మహేష్,

   చిన్న విశేషం. మీ కామెంట్ యాక్సిడెంటల్‌గా నా బ్లాగుకి వెయ్యవ(1000th) కామెంట్. 🙂

   -మురళి

 9. కెవ్‌వ్‌వ్ కేక పోస్టు. మన వ్యక్తిత్వ వికాసాలన్నీ అనువాదాలే, కాకపోతే రచయిత మాత్రం ఆ సంగతి చెప్పకుండా సొమ్ము చేసుకుంటాడు. అన్నట్టు నేను కూడా నా బ్లాగులో Eat That Frog అనే పుస్తకం చదివి, “నోట్స్” రాసుకుంటున్నా 🙂

 10. sri says:

  ha ha ha……………..

 11. prasad says:

  🙂 ha ha ha Super

 12. sunita says:

  Avunu. Aayana taruvaata ide oravadi edurulekundaa saagindi. idee pandhalo english navalalini tenugeekarinche udyamam modaliendi. aadebbaki telugu lo chadavatam maanesaamu.

 13. CHAITANYA MARE says:

  After a long interval……keka pettincharu

  challa happy ga navv kunna

  THANK YOU VERY MUCH

 14. krishna rao jallipalli says:

  ముందు ఆ రాసిన ఆయన, ఆయన రాసిన సూత్రాలని పాటించి విజయాలను (సిని రంగంలోనూ, టి.వి రంగంలోనూ) పొందమనండి చూద్దాం. అప్పుడు మనమంతా ‘ తెర తీద్దాం’.

 15. హ హ హ. భలే భలే భలే.
  ఒక్క విషయం. ఆ రచయిత విజయానికి చెట్లెక్కలేదేమో గానీ అన్ని వేల కాపీలు ఆ పుస్తకాన్ని ముద్రించడానికి మాత్రం కనీసం కొన్ని వేల చెట్లు కొట్టేసి ఉంటారు!

 16. Jyothi Reddy says:

  haha….

 17. Narsi reddy says:

  Inni rojulaki ilanti manchi rachaitha rachanalani chudagaliganu fabulous

 18. హహహ! నిజం. ఈ వ్యక్తిత్వ వికాస పుస్తకాలంటేనే అదో రోత నాకు.
  అందులోనూ కాపీ కొట్టి ఒరిజినల్‌గా చెలాయించే వారంటే …

 19. హ హ హ్హ… భలే చెప్పారు… ఈ “విజయానికి…” నవల నేను కూడా చదివుడమని మొదలు పెట్టాను ఆ మధ్య కాని మొత్తం చదవటం నా వల్ల కాలేదు ఎందుకో… మా అమ్మ కూడా మొదలు పెట్టింది కానీ పూర్తి చేయటం తన వల్ల కూడా కాలేదు… 🙂

 20. Wanderer says:

  ఈ రచయిత మీద ఏంటీగా కామెంట్లు రాస్తే “ఆహా నాకెంత మంది ఏంటీగా ఉన్నారో, నేను జ్యా పాల్ సార్త్రే లాంటి గొప్పవాడిని” అనేసుకుంటాడేమో అన్న భయంతో నేనెప్పుడూ నోరు విప్పను. ఈయన మొదట్లో నిజాయితీగా రాసినవాడే. ఓ చెంచాడు ప్రతిభ ఉన్న మాట నిజమే. ఎప్పుడైతే వీధి చివర పాన్ షాపుల్లో ఈయన నవలలు రెంటుకి దొరకడం మొదలయ్యిందో అప్పుడే ఈయన రచన అధోముఖం పట్టడం మొదలయ్యింది. ఒరిజినాలిటీ కి సెలవిచ్చేసి కాపీ కొట్టడం మొదలు పెట్టారు. ఒకటి కాదు, రెండు కాదు కాపీ నవలలు… చాలా వరకు ప్లేజియరైజ్ చేసారు. కనీసం ఇక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాను అని కూడా అక్నాలెడ్జ్ చెయ్యరు. కిళ్ళీ కొట్లో రెంటుకి తీసుకి చదివేవాళ్ళకి ఆ డీటైల్సు ఎందుకనుకుంటాడో ఏమో. ఈయనకి తన పాఠకుల మీద ఘోరమైన చిన్న చూపు. సీ గ్రేడ్ సినిమాలని తీసి ప్రజల మీదకి తోసేసి ప్రజల అభిరుచిని తప్పు పట్టే నిర్మాతలకీ ఈయనకీ పెద్ద తేడా లేదనిపిస్తుంది.

  All said and done, I have to give the credit where it is due…. కొన్ని మంచి ఇంగ్లీషు రచనలని తన “అనువాదం” ద్వారా ఆ నవలలు చదివే అవకాశం యే మాత్రం లేని వాళ్ళకి అందించాడు. ఆల్బర్ట్ కామూ రాసిన The Stranger తెలుగులోకి అంత బాగా నేటివిటీ చెడకుండా అనువాదం అయ్యిందంటే, మెచ్చుకోవాల్సిందే.

 21. panipuri123 says:

  ha ha ha 🙂

 22. sowmya says:

  హ హ హ ఇప్పుడే చదివాను మీ బ్లాగు ని మొద్టిసారి
  బాబోయి కిందపడి పొర్లి పొర్లి నవ్వుకున్నాను….నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చింది.
  నా జీవితంలో ఇంతవరకు ఈ వికాస పుస్తకలు చదవే ధైర్యం చెయ్యలెదు అటు ఇంగ్లీషు, తెలుగులోనూ కూడా…ఇక మీదట కూడా చెయ్యకూడదని మీ పోస్ట్ చూసాక నిర్ణయించుకున్నాను

  you are unbelievable 😀

 23. రవి చంద్ర says:

  నాకు ఆయన రాసిన నవలలు కొన్ని నచ్చాయి కానీ వ్యక్తిత్వ వికాస పుస్తకాలే (ముఖ్యంగా ఆంగ్ల రచయితలను అనుసరించి/అనుకరించి రాసినవే) నచ్చలేదు.

 24. Shravan says:

  “విజయానికి ఐదు…” రచయితగారి ప్రతిభ ఇంకా ఉంది. Of course ఈ విషయం చాలామందికి తెలిసేఉండొచ్చు. ఈయనగారు ఆంగ్ల నవలలే కాదు. మన యుద్దనపూడి సులోచనారాణి నవలలను ghost nameతో తమిళంలోకి అనువదించి డబ్బుచేసుకున్నాడు. తర్వాత ఆ విషయం బయటపడి యుద్దనపూడి కోర్టులో దావా వేస్తే క్షమాపణ చెప్పి…ఆమెకు కొంత పరిహారం కట్టి తప్పించుకున్నాడు. ఈ విషయం అప్పట్లో హిందూ పేపర్లో కూడా వచ్చింద

  –శ్రవణ్

 25. హహహః చాలా బాగా రాసారు. చదువుతూ పొర్లి పొర్లి నవ్వాను. నెనర్లు.
  నాకు మొదట్లో ఈ రచయిత అంటే చాలా అభిమానం ఉండేది కాని తర్వాత ఆయన గారి లీలలు తెలిసాక ఆయనమీద ఉన్న సదభిప్రాయం పోయింది. కాకపోతే ఆయనగారి టాలెంట్ ఏంటంటే ఏది (అనువదించి)రాసిన కూడా చాలా ఇంటరెస్టింగ్ గా రాస్తాడు.

 26. Jitu says:

  Hilarious!! Mind-blowing!! :))))))))))))))))))))))))))))))

  ROFL…

  Nenu chaesae toMbhai SaataM panulu dikku maalina daridrapugoTTu panulae. ee blog chadavaDaM okkaTae ee madhya kaalaMlO nenu chaesina telivaina pani. 😀 😀 😀 Asalu meeru ee blog maa laanti aebraasi jeeveethaalalo navvu nimmpadaanike raasinattunnaaru?? 😀 😀 😀

  Navvaleka navvaleka… kadupu ubbipoyinndi… buggalu noppedtunnaayi.

  Annattu… payina… coments lo chadivenu… mee blog ki 1000th comment ee post ke vachindani. Mari mee blog ki intha traffic techinanduku, aa rachayita… meeku notice pampinchaledaa?? 😀 😀 😀

  This post was priceless. 🙂
  Keep writing!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s