అందరికి అన్నీ ఇస్తాం

అప్పారావు గాడు నన్ను చూడగానే ఘొల్లుమన్నాడు.

“ఏమయ్యిందిరా? మళ్ళీ ఏమొచ్చింది?” అడిగాను నేను.

“ఇవి ఆనంద భాష్పాలురా! అన్నయ్య వచ్చేశాడు. ఇక మనకేం ఇబ్బంది లేదు,” ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు వాడు.

“అన్నయ్య?”

“అదే గిగాస్టార్ రిచంజీవి!”

ఏ మాటకామాటే చెప్పుకోవాలి. రిచంజీవి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఆశించిన వాళ్ళలో నేనూ ఒకడిని.

“నిజమేరా. అన్నయ్య వచ్చేశాడు. అందరి కష్టాలు గట్టెక్కినట్టే,” ఆనందంగా అన్నాను నేను.

“ముఖ్యంగా ఆ వై.నో.ని గద్దె దింపగలిగింది మన రిచూ ఒక్కడే,” వంత పలికాడు అప్పడు.

వై.నో. అంటే మన ప్రస్తుత ప్రియతమ ముఖ్యమంత్రి. ఆయన త్రిలింగదేశంలో అన్ని భూములు కబ్జా చేసి, ఎన్నో ఆస్తులు కూడబెట్టాక, ఇంకా ఏమీ మిగల్లేదు అన్న దు:ఖంతో బెంగ పెట్టుకుని మంచమెక్కినట్టు ఉదయమే పేపర్‌లో కూడా వచ్చింది.

“యాహూ!” అని గట్టిగా అరిచి ఇద్దరం ఒక హై-ఫైవ్ ఇచ్చుకున్నాము.

***

నేనూ అప్పిగాడూ టీవీ చూస్తున్నాం. ఊ టీవీ చానెల్‌లో ఏదో పొలిటికల్ మీటింగ్ చూపిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరూ ముస్లీముల మల్లే ఉన్నారు. వేదిక మీద ఉన్న నాయకుడు కూడా ముస్లీం లానే ఉన్నాడు. లుంగీ కట్టుకుని, టోపీ పెట్టుకుని, టిపికల్ ముస్లిం గెటప్‌లో ఉన్నాడు.

“మాకీ కనుక హధికారం హిస్తే మీకీ మేలూ చేస్తాం. మిమ్మల్ని అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో ఉపయోగించుకుని వదిలేశారు. మేము అలా చెయ్యం. మిమ్మల్ని సిన్సియర్‌గా ఆదుకుంటాం. ఉద్యోగం లేని యువకులకు నెలకు కొంత నిరుద్యోగ భృతి మా ఇష్టారాజ్యం ఇస్తుంది. మీ సంక్షేమం కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తాం. ఇంకా చాలా చేస్తాము.

నాకు చిన్నప్పుడు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు. (ఈ మధ్య పార్టీ పెట్టాక అర్జెంటుగా వాళ్ళెక్కడున్నారో కనుక్కుని అందరితో మళ్ళీ కాంటాక్ట్ ఏర్పరుచుకున్నా.) కావాలంటే చూస్కోండి, నా పరిజ్ఞానం,” అంటూ ఆ నాయకుడు ఖురాన్‌లోని కొన్ని వ్యాక్యాలను అరబిక్‌లో ఉటంకించాడు. జనం అందరు హర్ష ధ్వానాలు చేసారు.

“ఛీ ఛీ, ఎంత నిర్లజ్జగా మతాన్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు చూడు. ఇలాంటి కుళ్ళు రాజకీయాలు పోవాలంటే, రిచు లాంటి వాళ్ళు తప్పకుండా రావాల్సిందే,” కోపంగా అన్నాను నేను.

అప్పారావు ఇబ్బందిగా కదిలాడు. “అతనెవరో కాదు గురూ, మన రిచునే,” అన్నాడు మెల్లగా.

“మన గిగాస్టారా?” కళ్ళు తేలవేశాను నేను. నిజమే! కాస్త పరిశీలనగా చూస్తే గుర్తు పట్టగలిగాను. రిచూనే!

“రిచు కూడా ఇలాంటి వోటు బ్యాంకు రాజకీయాలు ఆడడమేంటి?” నిస్పృహగా అన్నాను నేను.

“అందరు చేస్తున్నారుగా. రాజకీయాల్లో ఇవి తప్పవేమో గురు. ముఖ్య మంత్రి అయ్యాక అప్పుడు సిన్సియర్‌గానే ఉంటాడులే,” సమర్థించాడు అప్పారావు.

నేను మెల్లగా తలూపాను.

***

ఆ తరువాత నాకు టీవీలో, న్యూస్ పేపర్స్‌లో ఎక్కడ చూసినా రిచు వాగ్ధానాలే కనిపించాయి, వినిపించాయి. కానీ విజన్ ఏ కోశానా కనిపించలేదు.

“రోజుకి ఇరవయ్యి ఆరు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాం. నాకు తెలుసు రోజుకు ఇరవయి నాలుగు గంటలే అని. మిగతా రెండు గంటలు ఎక్స్‌ట్రా అన్న మాట. ఒక వేళ లేట్‌గా తెల్లారితే ఎందుకన్నామంచిదని!”

“ఒక్క బీసీలకు, పేదలకు, ముస్లీములకూ మాత్రమే వరాలు అనుకుని తప్పులో కాలేయకండి! అగ్ర వర్ణాల వారికి కూడా అన్నీ ఉచితంగా ఇస్తాం. సామాజిక న్యాయమా, మజాకానా!”

“వంద రూపాయలకే వంట సరుకు ఇస్తాము. మిగిలిన డబ్బు మీరు హ్యాపీగా ఏ స్విస్ బ్యాంకులోనో ఆదా చేసుకోవచ్చు!”

“బీసీలకు వంద సీట్లిస్తాం. మా పార్టీలో ముందు ఉండేది అందరూ వెనక పడిన వాళ్ళే. ఐ మీన్ వెనక పడిన వర్గాలే.”

“భూమి లేని ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల పొడి భూమి లేదా రెండున్నర ఎకర్లాల తడి భూమి ఉచితంగా ఇస్తాం.”

ఈ ఆఖరి వాగ్ధానం విని వై.నో. వెంటనే తన కొడుకు గగన్‌కి కాల్ చేశాడు. “ఏరా! త్రిలింగ దేశంలో అన్ని భూములు కబ్జా చేసేశాం అన్నావు. ఇంకా ఏం మిగిలి లేవు అన్నావు! రిచు ఎలారా, ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు ఇస్తామంటున్నాడు?” అంటూ గద్దించాడు.

“ఏమో తెలీదు డ్యాడీ. మనం కబ్జా చేయకపోయినా, అసలు అంత పంట భూమి త్రిలింగదేశంలో లేదు. లెక్ఖల్లో వీక్ అనుకుంటా?” అనుమానం వెలిబుచ్చాడు గగన్. ఆ సమాధానానికి తృప్తి పడి మళ్ళీ ఫ్రెష్‌గా బెంగతో మంచం ఎక్కాడు వై.నో.

వై.నో. సంగతి ఏమో కానీ ఈ వరాల వర్షానికి నాకు బెంగ ముంచుకొచ్చింది. అసలు రిచు మాట్లాడే ముందు ఆలోచిస్తున్నాడా? వీటన్నిటి అవసరం ఉందా? అవినీతి లేని సమర్థవంతమైన పాలన అందిస్తాను అని ఒక వాగ్ధానం చేస్తే, తనకున్న ప్రజాదరణతో ఈ ఎన్నికల్లో గెలవలేడా? ఇలాంటి పనికిమాలిన ప్రజాకర్షక పథకాల వల్ల ప్రయోజనం ఉండదని, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యి, పనికొచ్చే ప్రాజెక్టులకు డబ్బులు మిగలవు అని అతని సలహా దారుల్లో ఎవరూ చెప్పడంలేదా?

ఈ సందేహాలు అప్పారావు ముందు వుంచితే వాడు, “అక్కడ అందరూ రిచుకి భక్తుల్లా ఉన్నారు కానీ, మంచి సలహా చెప్పే దమ్ములూ లేదా తెలివితేటలూ ఎవరికీ ఉన్నట్టు లేవు గురూ.

నువ్వే చూశావుగా? ఎర్ర పార్టీ సిద్ధాంతాలు రంగరించుకున్న డాక్టర్ స్నేహా, నాయకుల పంచలు ఊడదీసి, వాటితో పేదలకు గోచీలు కుట్టిస్తాను అంటున్న తమ్ముడు వాయు కళ్యాణ్. బూతుకు పరమ బూతే సమాధానమనుకునే అచ్చోసిన కృష్ణ మురళి, గుంభనంగా ఉంటూ వెనక పావులు కదుపుతున్న సొల్లూ అరవింద్, వీళ్ళు అన్నయ్య తరువాత పెద్దలు ఆ పార్టీలో. ఇంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం?

ఐనా కొంపదీసి నువ్వు రిచుకి నీ వోటు వెయ్యవా?” అందోళనగా ప్రశ్నించాడు.

ఒక్క క్షణం నా కళ్ళ ముందు ఉన్న ప్రత్యమ్నాయాలు మెదిలాయి. రిచు కాకుండా గెలవలగలిగే అవకాశం ఉన్న వారు ఇద్దరే!

మొదటి వాడు వై.నో. ఈ సారి మళ్ళీ ముఖ్యమంత్రయితే ప్రజల సొంత భూములు కూడా కబ్జా చేస్తాడని, న్యూస్ పేపర్ వాళ్ళే కాదు, మా వీధిలో తిరిగే చిలక జోస్యం వాడు కూడా చెప్పాడు.

రెండో వాడు సూర్య బాబు. కరప్షన్ మెండుగా ఉన్నా ఒకప్పుడు కొంత విజన్‌తో పని చేసిన వ్యక్తి. కానీ ఐదేళ్ళు అధికారం లేకపోయే సరికి తన పాలసీలను పూర్తిగా రివర్స్ చేసిన మహానుభావుడు.

“రిచు సినిమా మొదటి రోజు విడుదలైనప్పుడు ఉన్న ఉత్సాహం లేదు కానీ, వోటు మాత్రం ఇష్టారాజ్యానికే,” తేల్చేశాను నేను.

అప్పుడే రిచు టీవీ తెర మీద ప్రత్యక్షమయ్యాడు.

“మిగతా పార్టీలకు మీ పార్టీకు ముఖ్యమైన తేడా ఏమిటి?” అని ఒక విలేఖరి వేసిన ప్రశ్నకు సమాధానంగా, “మిగతా పార్టీలు కొందరికి కొన్నే చేస్తాయి. మేము అందరికీ అన్నీ చేస్తాము,” చిరు నవ్వుతో అన్నాడు రిచు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

19 Responses to అందరికి అన్నీ ఇస్తాం

 1. Jyothi Reddy says:

  మురళి గారూ,

  చాలా రోజుల తరువాత మీ పంచ్ ఉగాది పచ్చడిలా రుచికరంగా ఉంది. చాల థాంక్సండి. బాగా రాశారు. నిజంగా చాలా నవ్వాను. అసలు నవ్వాగలేదు. మీరు రాస్తూనే ఉండండి ఈ ఎలెక్షన్స్ అయ్యేంతవరకు. మీ బ్లాగు చూస్తూనే ఉంటాను.

  మీకు మా విరోధి నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు…మీ కలలు ఫలించాలని కొరుకుంటూ మీ పాఠకురాలు…

 2. pratap says:

  చాలాబాగా చెప్పారు.. ఒక్కసారి ఈ వీడియో ని తిలకించండి..

 3. prabhakar says:

  అయ్యా మీలో కొన్ని కోతికొమ్మచ్చి లక్షణాలు కనిపిస్తున్నాయి. (బాపురమణల స్వగతం స్వాతిలొ చదువుతున్నారనుకుంటాను)
  వ్రాయడం మానకండి ఇంకా హాస్యంతో పదునుపెట్టండి.

 4. “భూమి లేని ప్రతి ఒక్కరికి ఐదు ఎకరాల పొడి భూమి లేదా రెండున్నర ఎకర్లాల తడి భూమి ఉచితంగా ఇస్తాం.”

  ఈ వాగ్దానం సూర్యబాబుది కదా.

  నా ఓటూ రిచుకే.

 5. prabhakar says:

  naa replies endukano discard avutunnai.
  mee rachanaa saili baagundi. all the best

 6. kalesa says:

  loksatta vaipoo oka choopeyyaru. jp garini choododhu. party lo ni ithara vyakthulu, siddanthalu choosi plzz….

 7. chaitanya says:

  బాగుందండి…
  లోక్ సత్తా పార్టీ ని మర్చిపోయారా?

  ఉగాది శుభాకాంక్షలు!

 8. Murali says:

  లోక్ సత్తాని మర్చి పోలేదు. కానీ ఈ సారి ఎన్నికలలో విజయం సాధించే అవకాశం ఉన్న నాయకుల్లో రిచు కాకుండా మనకు ఇంకా ఎవరు ప్రత్యమ్నాయాం అని చూస్తే, కనిపించేది సూర్యబాబు, వై.నో. మాత్రమే.

  -మురళి

 9. Suresh Thotakura says:

  చాలా బాగుంది!

 10. Wanderer says:

  మురళి గారూ, రిచంజీవి అంటే మీకు ఇష్టమని తెలుసు. అందువల్ల ఈ పోస్టు కి విలువ మరింత పెరిగింది. నిజాయితీతో కూడిన విమర్శ. మీరు రాసింది అక్షరాలా నిజం. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చో అన్ని రకాలుగానూ విభజించి ప్రతీ వర్గానికీ సెపరేట్ గా వాగ్దానాలు చేస్తున్నాడు. ఆ వాగ్దానాలు ఒక దానితో ఒకటి కాన్ఫ్లిక్ట్ అయ్యే సందర్భాల్లో యే వర్గాన్ని ఫేవర్ చేస్తాడుట? అసలు ఈ విభజనలు వర్క్ అవుట్ అవుతాయని యే వెధవ చెప్పాడు? పోనీ ఇదివరకు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు విభజించి పాలించారు అన్న చరిత్ర పాఠం చదువుకుని అలా ఫాలో అయిపోదామనుకున్నాడా అంటే మరీ ఇంత blatant గానా? రాజకీయాల్లో పైకొచ్చే లక్షణాలు లేవు సరికదా, minimum తెలివితేటలైనా లేవే… విజన్ ముందే శూన్యం…

  ఇంతా చెప్పి, చివరికి మళ్ళీ ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇష్టారాజ్యమే అంటారు. సమర్థుడైన శతృవు కంటే అసమర్థుడైన స్నేహితుడే ఎక్కువ dangerous అన్న నానుడి ఉంది కదా.

 11. prasad says:

  Good One

 12. Prasad says:

  నా ఓటూ రిచుకే..
  అల్ ఫ్రి సూర్య బాబు.. కబ్జా వై.నొ… కాకుండ ఇంక రిచునె కదా వున్నది . కె.బా.ర్ పార్టి మా వైపు లేదాయే :((

 13. Rajiv says:

  మురళి గారు

  ముందుగా “విరొధి నామ సంవత్సర శుభాకాంక్షలు”

  చక్కగా రాసారండి, ఇంచుమించు నా మనసులొ ఈవె ఆలొచనలు, ఎవరూ కూడ రిచంజీవి కి చెప్పరా ఎంటి??? అని. ఎందుకు అంత అవివెకంగా మాట్లాడుతున్నాడు అని అనిపిస్తుంది ఆ వాగ్ధానాలు చూస్తుంటె, కాని మీరన్నట్టు గానె ‘సూర్య బాబు” కన్నా ‘వైనొ రెడ్డి” కన్నా కాని మన గిగాస్టార్ రిచంజీవి గారె నయం ఎమొ…

 14. “ఒక వేళ లేట్‌గా తెల్లారితే ఎందుకన్నామంచిదని!”
  హ హ హ. భలే.

 15. Shilpa says:

  Richu gari dance lage adaragottesaru 🙂 !

  Happy Ugadi andi !!

 16. nelabaludu says:

  మాకీ కనుక హధికారం హిస్తే మీకీ మేలూ చేస్తాం….

  మిగతా పార్టీలకు మీ పార్టీకు ముఖ్యమైన తేడా ఏమిటి?” అని ఒక విలేఖరి వేసిన ప్రశ్నకు సమాధానంగా, “మిగతా పార్టీలు కొందరికి కొన్నే చేస్తాయి. మేము అందరికీ అన్నీ చేస్తాము,”..

  చాల బాగా చెప్పారు… హు హు.. రాసారు..

 17. రవి says:

  వై.నో, గగన్ గురించిన సెటైరూ అదిరింది. ఈ శుభ సందర్భంలో వై.నో కు “కబ్జా రత్న” బిరుద ప్రదానం చేస్తున్నాను.

 18. mohan kurella says:

  I liked your vision about Chiranjeevi or for that matter any politician’s poupulist promises.

  As you said rightly, surya(chandra) babu who is a changed person( from bad to good or good to bad ?), I feel is a better choice to these devils.. than Ruchi who started dividing people in lines castes….

 19. anigalla says:

  wonderful.. gr8 job..
  i agree with Wanderer..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s