రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు

యదావిధిగా నాకు కొత్త సందేహం రాగానే మా రాజేష్ గాడికి ఫోన్ కొట్టాను.

“ఒరేయి. ఈ మధ్య టీవీలో ఏ రాజకీయనాయకుడు చూసినా, రాజకీయాల్లో శాశ్వత శత్రువులెవరూ ఉండరు, అని అంటున్నాడు. అంటే ఏంటి?”

“అంటే మన రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ వస్తుందని అర్థం,” చెప్పాడు వాడు.

చెప్పాను కద వాడొక మేధావి అని. వాడికి మనుషుల మాటల్లో గూఢార్థాలు ఇట్టే తెలిసిపోతాయి. “ఎలా చెప్పగలవురా అంత ఖచ్చితంగా?” అడిగాను వాడిని.

“హంగ్ అసెంబ్లీ రాబోతూంది కాబట్టే, ఎన్నికల ఫలితాలు వెల్లడి అయ్యాక పొత్తులు ఎలాగూ తప్పవు కాబట్టే, ముందుగానే జనాన్ని ఇలా మానసికంగా ప్రిపేర్ చేస్తున్నారు.”

“ఓహో!”

“అవును. ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాదు అని మన పార్టీలు అన్నీ భావిస్తున్నాయి కాబట్టే, ఇలా రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఎన్నికల ముందు ఒకరినొకరు బూతులు తిట్టుకుని ఇప్పుడు సడన్‌గా కావులించుకుంటే ప్రజలకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే ఈ సంధి ప్రేలాపన. ఐ మీన్, సంధి చేసుకునే ప్రయత్నాలు.”

“ఐతే ఎన్నికల తరువాత ఎవరు ఎవరితో సంధి చేసుకుంటారంటావు?”

“ఒక్క తెగులుదేశం, గాంక్రెస్ తప్ప ఎవరు ఎవరితో ఐనా కలవచ్చు. ఏమైనా చేయొచ్చు.”

“ఏం? వాళ్ళు మాత్రం ఎందుకు కలవరు?”

“రాజకీయాలు ఎంత దిక్కు మాలినవైనా, వాటికీ కొన్ని రూల్స్ ఉంటాయి. లేకపోతే ఆట రక్తి కట్టదు.”

“కానీ ఈ పార్టీలు ఒకరిపై ఒకరు ఎన్నికల ముందు దుమ్మెత్తి పోసుకున్నారు కద? అందుకే కదా, ఆ టైంలో రోడ్లు కూడా చాలా శుభ్రంగా తయారయ్యాయి! మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కలిసిపోతారు?”

“వాళ్ళ మొహాలు పెట్టుకునే కలిసిపోతారు. అంటే వాళ్ళ ఒరిజినల్ మొహాలు అన్న మాట. ప్రజలకు వాగ్ధానాలు చేసినప్పుడు చూపెట్టిన మొహాలు కావు. అవి వాళ్ళ నకిలీ మొహాలు.”

“అంటే పదవికోసం గడ్డి తింటారు అంటావు!”

“గడ్డి తింటారు అని పశువులని ఎందుకురా అవమానిస్తావు! గడ్డి చాలా క్లీన్ ఫుడ్డు. మన రాజకీయ నాయకులు పదవి కోసం అంత కంటే అసహ్యమైంది కూడా తింటారు.”

“అంటే, ఏం తినొచ్చబ్బా? వద్దులే, నువ్వు చెప్పకు, నాకర్థమయ్యింది. యాక్!”

“అర్థమయ్యింది కద! మరి దానికే రెడీగా ఉండే వారికి, తిట్టుకున్న వాళ్ళతో కలిసిపోవడం ఏం కష్టం?”

“పాపం, ఇలాంటి నాయకులు దొరకడం మన ప్రజల దురదృష్టం.”

“కాదు, ఇలాంటి ప్రజలు ఉండడం మన రాష్ట్రానిది దురదృష్టం. ఈ ప్రజలే కద, వోట్ వేసో, లేక వోట్ వేయకుండా ఇంట్లో కూర్చునో, ఇలాంటి నాయకులని గెలిపించింది! ప్రజలని బట్టే నాయకులు వస్తారు. ప్రజల్లోంచే నాయకులు పుడతారు.”

“దీనికి కారణం మన ప్రజల్లో ఎక్కువ మంది చదువుకోకపోవడమే. ఇల్లిటరేట్ పబ్లిక్ అంతా డబ్బుకు అమ్ముడుపోయి, లేదా మందుకు దాసోహమై వోటేస్తారు. వాళ్ల వల్లే ఇలాంటి నాయకులు గెలిచేది,” నేను ఆవేశంతో ఊగిపోయాను. నాకు చిన్నప్పటినుంచి ఆవేశం ఎక్కువ.

“ఏడిచావు. వోటు వేసే వాళ్ళలో మెజారిటీ ప్రజలకి ఎవరు వెధవలో, ఎవరు కాదో తెలుసుకునేంత రాజకీయ స్పృహ ఉంది. దానికి చదువుకున్న వాళ్ళే కానక్కరలేదు.”

“మరి?”

“మన రాష్ట్రంలో కూసింత తెలివితేటలు ఉన్న ఒక నాయకుడు చెప్పనే చెప్పాడు, అన్నీ పార్టీలూ, ప్రజలకు బిచ్చగాళ్ళలా బతకడం అలవాటు చేస్తున్నారు అని. నన్నడిగితే, ఈ సో-కాల్డ్ ఇల్లిటరేట్ ప్రజలే బిచ్చగాళ్ళలా బతకటానికి ఎప్పటినుంచో అలవాటు పడిపోయారు. అలాంటి వరాలూ, సబ్సిడీలూ ఇచ్చే వాళ్ళకే వోటు వేసి గెలిపిస్తున్నారు.”

“అంటే వాళ్ళు గవర్న్‌మెంట్ తమ కష్టాలు తీర్చాలని ఆశపడుతున్నారు. అది తప్పా?”

“నాకు తెలిసి ఏ దేశం కూడా ప్రభుత్వం వల్ల సంపన్నం కాలేదు. ప్రజల వల్లే అయ్యింది. ప్రభుత్వం పని, ప్రజలకు రక్షణ కలిపించడమే, వాళ్ళ జీవితాలు ఉద్ధరించడం కాదు. మన పేద, బడుగు వర్గాలకు తెలుసు, ఈ సబ్సిడీల వల్లా, వరాల వల్లా, వాళ్ళ జీవితాలు బాగు పడవని. కానీ వీళ్ళు కూడా అవకాశవాదులే. దొరికినంత కాడికి దండుకుందాం అనే ఫిలాసఫీకి అలవాటు పడిపోయారు. కాబట్టి పాపం పేద ప్రజలు అనకు.”

“మరి చదువుకున్న వాళ్ళు?”

“వాళ్ళు ఇంకా పెద్ద హిపోక్రాట్స్. కనీసం బడుగు వర్గాల వాళ్ళైనా, ఏదైనా మేలు జరుగుతుంది అనుకుంటే, కుల వివక్ష లేకుండా వోటు వేస్తారు కాని, ఈ చదువుకున్న వాళ్ళు, జాగ్రత్తగా అన్ని వివరాలు తెలుసుకుని మరీ, వాళ్ళ కులం వాడు గెలిచేలాగానో, లేదా వాళ్ళకిష్టం లేని కులం వాడు ఓడిపోయేలాగానో చూసి మరీ వోటు వేస్తారు. ఎక్కువ మంది అసలు ఎవరికీ వోటు వేయరనుకో. కాబట్టి మన మనస్తత్వం మారననంత వరకు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగి కూడా ఏం లాభం లేదు.”

“మరి అన్ని పార్టీలు అలానే ఉన్నప్పుడు, కనీసం మన కులం వాడైనా గెలిస్తే మంచిది అనుకుంటారు.”

“ఎవరికిరా మంచిది? అయినా అన్నీ పార్టీలు గాంక్రెస్‌లా పూర్తిగా భ్రష్టు పట్టిపోలేదు. ఉన్న వాటిలో మంచి పార్టీని గెలిపించవచ్చు. అలాంటి పార్టీలు ఉన్నాయి కూడా.”

“కానీ అలాంటి పార్టీలకు వోటు వేసినా అవి గెలవవురా!”

“అది చాలా తప్పుడు మాట. గెలిచే ఛాన్స్ ఉన్న పార్టీకి వోటు వేయడం ముఖ్యం కాదు. గెలిచే అర్హత ఉన్న పార్టీకి వోటు వేయడం ముఖ్యం. ఒక వేళ ఆ మంచి పార్టీ ఓడిపోయినా, ఆ పార్టీకి పడిన ప్రతి వోటూ, ఈ క్షుద్ర పార్టీలకు ఒక హెచ్చరిక అవుతుంది. కొంత మంది ప్రజలు ఐనా మేలుకుంటున్నారు అన్న విషయం వాళ్ళకు అర్థం అవుతుంది. తద్వారా, కనీసం వోట్లకోసం ఐనా వాళ్ళ రూటు మార్చుకునే అవకాశం ఉంటుంది.”

“కానీ ఈ సారి ఎలెక్షన్లు అయిపోయాయి కద. ఇప్పుడేమవుతుందో చెప్పు.”

“ఏముంది! ఒక వేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే ఈ పార్టీలు కొన్ని కలిసిపోయి ఔట్‌సైడ్ సపొర్ట్ అనో, ఇన్‌సైడ్ రిపోర్టో అనో ఏవో మాయ మాటలు చెప్పి ఒక కిచిడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఎవరి వాటాలు వాళ్ళకు దక్కుతాయి.”

“పాపం ప్రజలు!”

“నీ ప్రజలు సరిగ్గా పదే పది రోజుల్లో, ఈ ఎన్నికల గురించి మర్చిపోయి, టీవీలో క్రికెట్ మ్యాచెస్ చూసుకుంటూ, తమ అభిమాన హీరోల సినిమాల టికెట్లకోసం ముష్టి యుద్ధాలు చేసుకుంటూ, హ్యపీగా గడిపేస్తారు. ఇంకో సారి మళ్ళీ పాపం ప్రజలు అన్నావంటే, మీ ఇంటికొచ్చి మరీ తంతాను!”

నేను గబుక్కున ఫోను పెట్టేశాను.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

8 Responses to రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు

 1. Independent says:

  Murali,
  I always like your writings

 2. చిలమకూరు విజయమోహన్ says:

  “ఇల్లిటరేట్ పబ్లిక్ అంతా డబ్బుకు అమ్ముడుపోయి, లేదా మందుకు దాసోహమై వోటేస్తారు”
  ఈమాట ప్రస్తుతం తప్పండి.ఉపాధ్యాయులు,ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు పోష్టల్ బ్యాలెట్లకు రెండువేలనుంచి మూడువేలవరకు తీసుకున్నారు.

  • Murali says:

   శుభం! నేను చెప్పేది కూడా చదువురాని వాళ్ళకు మల్లే చదువుకున్న వాళ్ళకు కూడా ప్రలోభాలు ఉంటాయనే.

 3. Amma Odi says:

  Good one.

 4. Pradeep says:

  Super … good satire for Educated

 5. prasad says:

  Good one
  mana political leaders chala worst ga tayarayyaru
  1 week eenadu and sakshi papers chadivite mental ravadam khayam

  monnati daaka memu king meeru bongu annaru

  ippudemo memu king lamu meeremo king makers(ante maku supprt ichhevallu) antunnatu

 6. Kiran says:

  “పాపం, ఇలాంటి నాయకులు దొరకడం మన ప్రజల దురదృష్టం.”

  “కాదు, ఇలాంటి ప్రజలు ఉండడం మన రాష్ట్రానిది దురదృష్టం. ఈ ప్రజలే కద, వోట్ వేసో, లేక వోట్ వేయకుండా ఇంట్లో కూర్చునో, ఇలాంటి నాయకులని గెలిపించింది! ప్రజలని బట్టే నాయకులు వస్తారు. ప్రజల్లోంచే నాయకులు పుడతారు.”

  chaalaa correct-gaa cheppaaru, maamaa! “enta sEpU blame game aaDaTaanikE alavaaTu paDipOyaam manam kooDaa” ani andaramU grahinchina rOjE better avutundi situation.

  “కానీ అలాంటి పార్టీలకు వోటు వేసినా అవి గెలవవురా!”

  “అది చాలా తప్పుడు మాట. గెలిచే ఛాన్స్ ఉన్న పార్టీకి వోటు వేయడం ముఖ్యం కాదు. గెలిచే అర్హత ఉన్న పార్టీకి వోటు వేయడం ముఖ్యం.”

  …idE maaTa nEnU cheppaanu. “idi horse racing kaadu, gelichE gurram meeda Dabbulu peTTaDaaniki. evariki mana votes vEstaamO vaaLLE gelustaaru! prati chOTaa prajaa sankshEmaanni promise chEsina party-kE vote vEstE vaaLLE gelustaaru raashTramantaTaa” ani kooDaa cheppaanu. “Voting is not an exercise of satisfying one’s ego – ‘hammayya, manam vote vEsina vaaDE gelichaaDu!’ ani santOshinchaTaaniki. It’s about the country you vote. Not about your caste or movie interests or other personal interests.” ani kooDaa cheppaanu. …Em laabham!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s