అసెంబ్లీ ఫలితాలు – టీవీ 999 రిపోర్ట్!

(స్థలం: టీవీ 999 స్టూడియో
కాలం: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తదనంతరం)

టీవీ యాంకర్ జలగా రావ్: “నమస్కారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత మేం సమగ్ర పరిశోధన చేసి ప్రజల అభిప్రాయలు సేకరించాం. గాంక్రెస్ ఎందుకు మళ్ళీ గెలిచింది, తెగులు దేశం , ఇష్టా రాజ్యం ఎందుకు ఓడిపోయాయి అన్న ప్రశ్నలకు సమాధానం రాబట్టడం కోసమే ఇదంతా చేశాం. ఈ సమగ్ర పరిశోధన ఫలితాల కోసం మీరే కాదు, మన నాయకులు కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ లైవ్ రిపోర్ట్ చూద్దామా?”

(కట్ చేస్తే స్పెషల్ రిపోర్టర్ నికృష్ట రావు కొందరు పల్లె వాసులని ఇంటర్వ్యూ చేస్తున్నాడు.)

“మీ వూళ్ళో గతంలో రిచూ వస్తే, లెక్ఖ లేనంత మంది జనం వచ్చారు. కానీ ఈ వూర్లోనే ఇష్టారాజ్యం పార్టీ క్యాండిడేట్ చిత్తుగా ఓడిపోయాడు. ఎందువలన చేత?”

“మాకూ అర్థం కావట్లేదండి. మేమంతా గొడుగు గుర్తుకే వోటు వేశాం మరి.”

“గొడుగు గుర్తు ఏంటండి బాబూ. రైల్ ఇంజన్ కద! మీ నియోజక వర్గంలో గొడుగు గుర్తు ఎవరో ఇండిపెండెంటుది.”

“ఓహో! అందుకేనా, మా ఊరిలో ఇండిపెండెంటు యాదగిరికి మూడో స్థానం వచ్చింది. వాడికి ఏ తలకు మాసిన వాళ్ళు వోటు వేశారో అనుకున్నాం!”

“బహుశా మీరే అయ్యుంటారు ఆ తలకు మాసిన వాళ్ళు.”

“!”

(ఇంకో చోట ఆర్భాటరావు ఇంకొందరిని ప్రశ్నలు అడుగుతున్నాడు.)

“లోక్ చస్తా నాయకుడు పేచీ గారి పై మీ అభిప్రాయం?”

“ఆయన మా దొడ్డ మనిషండి. ఒకప్పుడు కలకటేరు అట గద. ఆయనకు తెలీని పరిపాలనా వ్యవహారాలు ఏముంటాయి చెప్పండి?” చెప్పాడు ఒక పెద్దాయన.

“మరి ఆయన పార్టీ క్యాండిడేట్ మీ నియోజక వర్గంలో డిపాజిట్ కోల్పోయాడేంటి?”

“అంటే మరి ఆయన ప్రజలు బిచ్చగాళ్ళు కాదు, తగినంత అవకాశాలు కల్పిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు, అన్న కాడి నుంచి మాకు భయం పట్టుకుంది.”

“ఎందుకో?”

“మా కాళ్ళ మీద మేం నిలబడే అలవాటు లేదు కదండి! కొంప దీసి ఆయన గెలిస్తే నిలబడాల్సి వస్తుందేమో అని బెంగతో!”

“అవును ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే కాన్సెప్ట్ అంటేనే నాకు అసయ్యం,” అన్నాడు వత్తాసు పలుకుతూ ఒక యువకుడు.

“సొంత కాళ్ళ మీద నిలబడాలంటే, నాకు చిరాకూ, చిన్న చూపూ,” సిగ్గు పడుతూ చెప్పాడు ఇంకో కుర్ర వాడు.

(ఈ సారి ఫోకస్ మళ్ళీ నికృష్ట రావు మీదకు షిఫ్ట్ అయ్యింది.)

“ఆర్భాటరావు గారితో మాట్లాడిన ప్రజలు, తమ కాళ్ళ మీద తాము నిలబడాల్సి వస్తుందేమో అని లోక్ చస్తాకి వోటు వెయ్యలేదు అని చెప్పారు. మరి సూర్య బాబు గారు, నెలకింతేసి డబ్బులు బిళ్ళ కుడుముల్లా ఇస్తామని రక్త తిలకం దిద్దుకుని మరీ ప్రామీస్ చేశారు కద. తెగులు దేశాన్ని గెలిపించలేదెందుకు?”

“ఆయన తిలకం దిద్దుకుంది తన రక్తంతో కాదండి. తన బావమరిది రక్తంతో. ఐనా ఆయన్ని నమ్మలేమండి. నిముషానికో మాట చెప్తాడు. ఒకో సారి ప్యాంట్‌కి బెల్ట్ ఎంత అవసరమో, మనిషికి మద్యం అంతే అవసరమంటాడు. మరో సారి, బెల్ట్ షాపులు లేపేస్తానని చిందులు వేస్తాడు,” ఒక తల పండిపోయిన వృద్ధుడు సమాధానమిచ్చాడు.

“ఆయన్ని నమ్ముకుని కేబుల్ కనెక్షన్ తీసుకున్నాక, కలర్ టీవీ ఇవ్వలేదనుకోండి, మా గతేం కాను,” వాపోయాడు ఇంకొకాయన.

(మళ్ళీ సీన్ మారితే ఆర్భాటరావు ఇంకో గుంపుని ఇంటర్వ్యూ చేస్తున్నాడు.)

“గాంక్రెస్ పార్టీ మీద మీ అభిప్రాయం?”

“అది వొట్టి లంచగొండుల పార్టీ కద! వాళ్ళ ప్రభుత్వంలో ప్రతి పనికి ఒక నిర్దిష్టమైన రేటు వుంటుంది. ఎవరికి తెలీదు కనక?” సెలవిచ్చాడు కాషాయ వస్త్రాలు వేసుకుని ఉన్న ఒక బాబాగారు.

“మరి తెలిసి తెలిసి ఆ పార్టీనే గెలిపించారేం?”

బాబా గారు చిరు నవ్వు నవ్వారు. “ఆవేశపడకు నాయనా. సావధానంగా విను. తెగులుదేశం, ఇష్టారాజ్యం ప్రజలకు లంచాలు పెట్టి గెలిచే ప్రయత్నం చేశారు”

“లంచాలు పెట్టా!”

“మరి కాదా? నెలకు నికరంగా ఇన్ని డబ్బులు, ఒక్క రూపాయికే వంట సరుకు పథకాలు ఏ కోవలోకి వస్తాయి, లంచం కాకపోతే?”

“కానీ ఏ లంచం ఇవ్వని లోక్ చస్తాని కూడా తిరస్కరించారు కద?”

“లోక్ చస్తాకి ప్రజలని ఆకట్టుకోగలిగే ఒక గొప్ప నాయకుడు లేడు నాయన.తగినంత మంది మార్బలం కూడా లేవు. ఎలాగూ అది గెలవదు అనుకున్న ప్రజలు పోన్లే ప్రభుత్వం ఇచ్చే లంచాలైనా తీసుకుందాం అనుకున్నారు.

కానీ లంచం ఒక్కటే సరిపోదు. ప్రజలకు అలా ఖచ్చితంగా జరుగుతుందని గ్యారంటీ ఇవ్వగలిగే పార్టీ కూడా కావాలి. లంచాలు ఇవ్వడంలో, పుచ్చుకోవడంలో గాంక్రెస్ పార్టీకంటే ఏ పార్టీకి అనుభవమెక్కువ ఉంది? అందుకనే, తెలిసిన దెయ్యం మేలు అని గాంక్రెస్‌నే గెలిపించారు.”

“అంటే మీరనేది, ఇలా తాయిలాలు చూపెట్టకుండా, లంచాలు అరికట్టే సమర్థవంతమైన ప్రభుత్వాన్ని అందిస్తామని జనంలో పలుకుబడి ఉన్న ఒక ప్రజా నాయకుడు ప్రచారం చేసి ఉంటే, గాంక్రెస్ ఓడిపోయేది అంటారా?”

“బహుశా ఓడిపోయేదేమో నాయనా. ఐనా కాసేపు ఆగితే టీవీ 999 వాళ్ళ సమగ్ర రిపోర్ట్ రాబోతూంది కద. అది చూస్తే తెలుస్తుందిలే!”

“ఏడ్చినట్టుంది, మేమే కద టీవీ 999 వాళ్ళం. అది తెలుసుకోవడం కోసమే కద మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతుంటా!”

“అవును కదూ!” నాలుక కర్చుకున్నారు బాబాగారు.

Advertisements
This entry was posted in 'కరెంట్' అఫైర్స్. Bookmark the permalink.

9 Responses to అసెంబ్లీ ఫలితాలు – టీవీ 999 రిపోర్ట్!

 1. Pradeep says:

  Good analysis. Exactly after one month of results

 2. Sravya says:

  అంతే అంటారా 🙂

 3. రవి says:

  మురళీ,
  మన తోలు చాలా మందమండీ. గాంక్రెసుకు ఓటు వేసిన వాళ్ళను, నేను అడిగి కనుక్కుంటే, నాకు దొరికిన సమాధానాలు.
  1. చంద్రబాబుకు తొన్ని ఉంది. తొన్ని ఉన్న వాడు రాజ్యం పాలిస్తే అక్కడ వర్షాలు పడవు. (భారతంలో పాండు రాజుకు రాజ్యం ఇవ్వకపోటానికి అదో కారణమట!)
  2. మధ్య తరగతి వాళ్ళను (ఎన్ జీ వో) లాలించేది గాంక్రెస్ మాత్రమే. చంద్రబాబు జన్మ భూమని, అదని ఇదని తల తింటాడు.
  3. రిచంజీవి బామ్మర్ది కూచి. ఇంకా ఎదగాలి.
  4. లోక్ చస్తా మాటలు జనాలకు అసలు అర్థమే అవట్లేదు. ఇక ఓటు సంగతి దేవుడెరుగు.

  మనకిదే ప్రాప్తం.అనుభవిద్దాం.

 4. Koolisetty says:

  బావుంది మురళి
  తేట తెల్లు చేసావ్

 5. Hilarious 🙂
  good anlysis.!

 6. పార్వతి says:

  >>”ఐనా కాసేపు ఆగితే టీవీ 999 వాళ్ళ సమగ్ర రిపోర్ట్ చూస్తే తెలుస్తుందిలే!”

  >>“ఏడ్చినట్టుంది, మేమే కద టీవీ 999 వాళ్ళం. అది తెలుసుకోవడం కోసమే కద మిమ్మల్ని ఈ ప్రశ్నలు అడుగుతుంటా!” 😀

  ఇందులో హాస్యాన్ని రుచి చూసినా, టీవీ 999 రిపోర్ట్ ఎంత common place గా (తెలుగు అనువాదం ఏంటో గుర్తు రాట్లేదు !) ఉంటాయో చెప్పటానికి ఈ ఒక్క లైన్ చాలు !

  ఎప్పట్లాగే, చక్కని హాస్యంతో సెటైర్ ! ఎన్నికల తర్వాతా మీరే సమగ్ర నివేదకలు రాయలేదేంటి చెప్మా, దండకం తప్ప అని హాశ్చర్యపోయాను ! 🙂 ఇప్పటికి ఫలించింది అన్నమాట మన ఎదురు చూపు !

  రవి గారి వ్యాఖ్య కూడా బాగుంది ! నిజం చెప్పకూడదు కానీ, అలానే ఉంటోంది మన జనాల విశ్లేషణ ! 😀

 7. Ramana Turlapati says:

  nice satire! surprised to see no mention of TRS.

 8. Jyothi Reddy says:

  Muraliji,
  Nice and great satire.
  Keep going please

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s