జ్వా.ద్వీ.ర. వెనుక కథ


నేను చిన్నప్పుడు అత్యంత ఆసక్తిగా చదివిన కథలు, జానపద కథలు.

ఆ కథల్లోని జగదేక వీరులు, అతిలోక సుందరులు, మహా మాంత్రికులు, దుష్ట సేనాపతులు, విధేయులైన మంత్రులు, దేవతలు, రాక్షసులు మొదలైన పాత్రలు నన్ను కట్టి పడేసేవి. ఆ రోజుల్లో నాకు అందుబాటులో ఉన్న రంగుల ప్రపంచం అదే.

తేటగీతి బ్లాగ్‌లో అనేక అంశాలపై సెటైర్ వేయడం, ప్యారడీ పండించడం జరిగాక, నేను గమనించింది నేను కవర్ చేయని టాపిక్స్‌లో ఒకటి జానపదాలని.

“కాదేదీ ప్యారడీకి అనర్హం, అవునవును సెటైర్ అనర్ఘం” అని నమ్మిన వాడిని కాబట్టి వెంటనే ఆ లోపాన్ని సవరించే ప్రయత్నంగా జ్వాలా ద్వీప రహస్యం వ్రాయడం జరిగింది.

My stories write themselves అని కొందరు రచయితలు అంటే, నాకు నమ్మకం కలిగేది కాదు ఒకప్పుడు. అదెలా సాధ్యం అని.

కాని నేను రచయితనయ్యాక నాకు కూడా అనుభవంలో వచ్చిన విషయం అది. జ్వా.ద్వీ.ర. కథ కూడా పెద్దగా నా ప్రమేయం లేకుండా అదే సాగిపోయింది.

కొందరు పాఠకులకు నేను ఈ కథ తొందరగా ముగించాను అని నిరాశ కలిగింది అని నాకు తెలుసు. కానీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ కథ ముగింపు అదే రాసుకుంది. నిజం! వీరబాహుడి మీదొట్టు!

-మురళి

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

6 Responses to జ్వా.ద్వీ.ర. వెనుక కథ

 1. jatardamal says:

  ఇందుమూలంగా తెలియజేయటం ఏమనగా …
  మీరు తొందరగా ఈ జ్వాలాదీప రహస్యం ఐపోగోట్టినందుకు మీ మీద ఒక వ్యాజ్యం సదరు న్యాయస్థానం లో వేయుటకు నిశ్చయించితినని .. మీరు దానియందు ప్రతివాదిగా వున్నారని , త్వరలో మీకు న్యాయస్థానం నుండి తాకీదు అందునని తెలియజేయటమైనది …

  కాచుకోండి ఇక …

  😉

 2. jatardamal says:

  పై వ్యాఖ్యలో నేను ఎవరో చెప్పలేదు …
  జ్వాలాదీప రహస్యం అభిమాన ఏక సభ్య మనోభావ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ..

  ;-( 😉

 3. Kanth says:

  మీలా నేను కథలు రాయ(లే)ను గాని, మా అబ్బాయిలకి రోజూ రాత్రి పడుకోబోయెముందు, ఆశువుగా ఇలాంటి సీరియల్ కథలు చెబుతూ ఉంటాను (చిన్నప్పుడు విన్న, చదివిన, చూసిన ప్రేరణతో).

 4. Sumna says:

  Anthe nandi .. papam veerabahudu matram em cheyyagaladu?

 5. mrudula says:

  Really very good. I feel so bad for closing this soon. When is your new post? I am daily watching for the update.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s