జ్వాలా ద్వీప రహస్యం – 20


ఇంతకు ముందు ఎప్పుడు తెప్పని నడపలేదేమో, నరస సింహుడికి వడిగా ఉన్న ఆ నదీ ప్రవాహంలో అటూ ఇటూ కాకుండ తెప్పని నడిపించడం చాలా కష్టంగా తోచింది.

“దిక్కు మాలిన ద్వీపం. చూచుటకు దగ్గరలోనే ఉన్నట్టు తోచుచున్నది కానీ, ఎంత సేపు తెడ్లు వేసిననూ సమీపానికి రావుట లేదు. ఈ తెప్ప నడుపుట కంటే వీరబాహుడి వద్ద కత్తి యుద్ధం నేర్చుకొనుటే మేలైన పనిలా ఉంది,” తనలో తాను గొణుకున్నాడు.

కాసేపు అలా తెడ్లు వేశాక యువరాజుకి ఒక రకమైన వైరాగ్యం ఆవహించింది. ప్రాజ్ఞులు దీన్నే తెప్ప వైరాగ్యం అంటారు.

“అసలు నేనేమిటీ? ఇలా తెడ్లు వేయడమేంటి? పండు కోతి కోసం వెతకడమేంటి? దాని గుండె కాయ వండుకుని మా నాన్నగారు తినడమేంటి? ఏమిటీ మాయ?” అనుకున్నాడు విషాదంగా.

ఐతే అతని వైరాగ్యం ఎంతో సేపు నిలువలేదు. తెప్ప ఒక సుడిగుండంలో ఇరుక్కుంది. తెప్ప ఒక వైపు, యువరాజు ఒక వైపు విసిరి వేయబడ్డారు.

వెంటనే అశృ సింహుడి మాటలు గుర్తుకి వచ్చాయి నరస సింహుడికి.

“నీవు ఎంత పెనుగులాడితే అంత తొందరగా మునిగిపోతావు. నిశ్చేష్టుడవై ఉన్న ఆ ప్రమాదము తప్పుతుంది.”

ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు తను సాధారణంగా ఏం చేస్తాడా అని ఆలోచించాడు నరస సింహుడు. ఒక్కసారి మనసంతా శూన్యం అయిపోయింది. కాళ్ళూ చేతులూ స్తంభించి పోయాయి. నిశ్చేష్టుడైపోయాడు. అలా అనుకోకుండానే అశృ సింహుడి సలహా పాటించాడు.

అదే అతన్ని కాపాడింది. సుడిగుండం అతన్ని బయటకు విసిరేసింది. దాంతో ఒక ప్రవాహంలో ఇరుక్కున్నాడు నరస సింహుడు. ఆ ప్రవాహం అతన్ని వేగంగా లాక్కొని జ్వాలా ద్వీపం ఒడ్డున పడేసింది.

ఒడ్డున పడ్డ యువరాజు తల విదిలించి లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు. అతను వచ్చిన తెప్ప కానీ, తెడ్లు కానీ కనిపించలేదు.

వెంటనే మత్స్య కుమారుడు గుర్తుకు వచ్చాడు యువ రాజుకి. “పాపం, ఈ తెడ్లు పోగొట్టుకుపోయిన విషయము తెలిసిన అశృ సింహులవారి ఆస్థాన జాలరి పరిస్థితి ఏమగునో,” అనుకున్నాడు.

లేచి నిలబడి చుట్టూతా ఒకసారి చూశాడు యువరాజు. కను చూపు మేరకు అంతా దట్టమైన చెట్లూ పొదలూ కనిపించాయి అతడికి.

“ఇది ఎంత పెద్ద ద్వీపమో, పండు కోతి, రాకుమారి, ఎక్కడ ఉన్నారో?” కాస్త దిగులుగా అనుకున్నాడు నరస సింహుడు.

ఎదురుగా కనపడుతున్న కాలి బాటను ఆశ్రయించాడు యువరాజు. కొంత దూరం వెళ్ళాక చెట్లు పల్చబడ్డాయి. విశాలమైన ఒక ఖాళీ ప్రదేశం ఎదురయ్యింది అతనికి.

అక్కడ ఏదో పెనుగులాట జరిగిన చిహ్నాలు స్పష్టంగా కనిపించాయి నరస సింహుడికి. ఒక కాలి మువ్వ ఒక చెట్టు దగ్గర పడి ఉంది. మరో వైపు ఒక అరటి తొక్క పడి ఉంది.

“సందేహం లేదు. కాలి మువ్వ ఆత్రవిందది అయి ఉంటుంది. అరటి తొక్క పండు కోతిది అయి ఉంటుంది. ఇద్దరు ఇదే దారి గుండా తీసుకుని పోబడ్డారు,” అనుకున్నాడు యువరాజు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

2 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 20

  1. wanderer says:

    కాలి మువ్వ, అరటి పండు…. ఆహా… ఏం క్లూలు ఇచ్చారండీ మహానుభావా… మీ కథ రోజురోజుకీ మరింత రసవత్తరమైపోతోంది.

  2. jyothi reddy says:

    Murali ji,
    good one.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s