జ్వాలా ద్వీప రహస్యం – 19


అర్థమైనట్టు తల పంకించాడు నరస సింహుడు.

“సరే, అదే దోమాంబ ఇచ్ఛ అయిన చేయునదేమున్నది. జ్వాలా ద్వీపమునకు బయలుదేరి వెళ్ళుటకు నేను సన్నిద్ధుడనే,” అంటూ నిట్టూర్చాడు.

“దోమాంబా? ఎవరా స్త్రీ?” అడిగాడు అశృ సింహుడు.

“స్త్రీ కాదు, మా కుల దేవత. ఆమె ఆజ్ఞ లేనిదే ఎవరినీ దోమైనా కుట్టదు.”

“ఆజ్ఞ అయ్యేంతవరకూ దోమలన్నీ కేవలం ఆమెనే కుడతాయా?”

“అహో! మీరు నన్ను సరిగ్గా అర్థము చేసికొనలేదు. దోమాంబ సర్వ శక్తిమంతురాలని తెలియ చేయడమే నా ఉద్దేశం.”

“అటులనా! దోమాంబ సంగతి పక్కన పెడితే, నీవు జ్వాలా ద్వీపానికి ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది పరదేశీ. ఆలస్యం అమృతం విషం!” అన్నాడు అశృ సింహుడు.

“ఆలస్యం పండుకోతి హతం కూడా. మరి అక్కడికి వెళ్ళాలంటే మార్గం?” ప్రశ్నించాడు యువరాజు.

“జలమార్గం తప్ప వేరే దారి లేదు. పడవ ప్రయాణం ఒక్కటే మార్గం. కానీ బెంగ నగరములో ఎవరూ అటు వైపు వెళ్ళుటకు సాహసించరు. పడవను నీవే నడుపవలెను.”

“ఓస్! అంతే కద నడుపుతాను.”

“పూర్తిగా వినుము. దారిలో ఒక భయంకరమైన సుడి గుండం వస్తుంది.”

“ఒక వేళ పడవ బోల్తా పడితే, ఈదుకుని ఆవలి ఒడ్డు చేరవలె. అంతేనా?”

“తప్పు! అసలు కాళ్ళూ చేతులూ ఆడించరాదు. నీవు ఎంత పెనుగులాడితే అంత తొందరగా మునిగిపోతావు. నిశ్చేష్టుడవై ఉన్న ఆ ప్రమాదము తప్పుతుంది.”

“చాలా విచిత్రంగా ఉన్నది. సరే ఆ పడవ వద్దకు దారి తీయండి. ప్రయాణానికి నేను సిద్ధం,” అన్నాడు నరస సింహుడు.

అందరూ నదీ తీరానికి బయలు దేరారు. పడవని చూసి విస్తూ పోయాడు యువరాజు.

“పడవ అన్న నేను ఇంకా ఏదో ఊహించుకొంటిని. చూడబోతే ఇది తెప్పలా ఉంది. ఈ ఏరు దాటిన పిదప నేను దీన్ని తగులబెట్టవలెనా?” అడిగాడు నరస సింహుడు.

“వలదు, వలదు. అటుల చేసిన, ఆత్రవిందను నువ్వు తిరిగి మా దగ్గరకు ఎటుల తీసుకు రాగలవు? కావాలంటే తిరిగి వచ్చిన తరువాత తగుల బెట్టుము,” ఆందోళనగా అన్నాడు అశృ సింహుడు.

అంగీకారంగా తల ఊచి తెప్పని అధిరోహించాడు యువరాజు. “మరి దీన్ని నడుపవలెనన్న తెడ్లు కావలెను. అవి ఏవీ?” అడిగాడు.

“అవును కదూ! మా ఆస్థాన జాలరి దగ్గర మాత్రమే తెడ్లు ఉన్నవి,” అంటూ పక్కకు తిరిగి, “మత్స్య కుమారా, నీ తెడ్లు కాస్త పరదేశీకి ఇవ్వు,” అక్కడ వల భుజం మీద వేసుకుని నిలబడి ఉన్న ఒక వ్యక్తిని అడిగాడు అశృ సింహుడు.

“తెడ్లు అతనికి ఇచ్చిన నేను చేపలు పట్టడం ఎలా? నా జీవనోపాధికే ముప్పు కద?” సందేహం వెలిబుచ్చాడు మత్స్య కుమారుడు.

“బాబ్బాబూ! అంత మాట అనకు. పరదేశి రాకుమార్తెతో తిరిగి వచ్చు వరకు, నిన్ను పోషించే బాధ్యత నాది,” హామీ ఇచ్చాడు అశృ సింహుడు.

దాంతో తృప్తి పడి తన తెడ్లు నరస సింహుడికి అందించాడు మత్స్య కుమారుడు.

“నీ పండు కోతితో, మా ఇంటి జ్యోతితో తొందరగా తిరిగి రా పరదేశీ. ఆలస్యం ఐన కొలది, నాకు ఇక్కడ ఖర్చు కూడా పెరుగుతుంది,” దిగులుగా అన్నాడు అశృ సింహుడు.

నరస సింహుడు తెడ్లు వేయగానే తెప్ప కదిలింది.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

3 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 19

  1. Jyothi Reddy says:

    Muraliji,
    “నీ పండు కోతితో, మా ఇంటి జ్యోతితో తొందరగా తిరిగి రా పరదేశీ. ఆలస్యం ఐన కొలది, నాకు ఇక్కడ ఖర్చు కూడా పెరుగుతుంది,”
    Chalaa bagundhi sir….

  2. wanderer says:

    Super Super Super….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s