జ్వాలా ద్వీప రహస్యం – 17


నరస సింహుడికి తెగ ముచ్చటేసింది. “ఇది పండు కోతి మాత్రమే కాదు, చాలా మెండు కోతి, స్నేహభావం కలిగిన నిండు కోతి,” అనుకున్నాడు.

తను కూడా గుర్రాన్ని అధిరోహించాడు యువరాజు. ఇప్పుడు అతని గమ్యం వీలైనంత త్వరగా దోమదేశం చేరుకోవడమే.

ఐతే అతని ప్రయాణానికి ఆదిలోనే అంతరాయం ఎదురయ్యింది. నరస సింహుడు ప్రయాణిస్తూంది కొండ ప్రాంతమే కానీ, ఏ జంతుజాలం లేని ప్రాంతం కాదు.

ఇంకా అక్కడినుంచి బయలుదేరడానికి ముందే ప్రమాదం ఒక చిన్న గుట్ట పక్కనుంచి ముంచుకొచ్చింది. ఒక సింహం గర్జిస్తూ సూటిగా వారి వైపు పరిగెత్తుకొచ్చింది.

అప్పుడే పాటందుకోబోతున్న నరస సింహుడు ఆ దృశ్యం చూడగానే పాట మరిచి పోయాడు. “అందరు ఇంట్లో బజ్జోగా, మనం బయట చచ్చుగా,” అని తప్పు పాడాడు. “సమయానికి పాట కూడా మర్చిపోయా, ఇక షట్ కళ్యాణి కదిలే అవకాశం లేదు,” అనుకున్నాడు.

ఐతే అతని అంచనాలకు విరుద్ధంగా షట్ కళ్యాణి పరుగు లంకించుకుంది. బోలెడు ఆశ్చర్యపోయాడు యువరాజు. “ఒక వేళ తిరిగి దోమదేశానికి పోవడం తటస్థిస్తే భుజబలుడికి చెప్పాలి. పాట పాడకపోయినా, సింహాన్ని చూస్తే షట్ కళ్యాణి మొహమాటం లేకుండా దౌడు తీస్తుందని,” అనుకున్నాడు.

షట్ కళ్యాణి దౌడు తీయడమే కాదు, ముందు ఎప్పుడూ లేనంత వేగంగా పరిగెత్త సాగింది. ఇంతలో నరస సింహుడికి గుర్తుకు వచ్చింది. సింహాన్ని ఎదిరించి, దాన్ని చంపి, మహా వీరుడిగా నిలిచిపోయే అవకాశం తాను కోల్పోయాడని!

“నహీ!” అంటూ అరిచాడు యువరాజు. “ఆగు షట్ కళ్యాణీ, ఆగు. రాచ బిడ్డనై ఉండి ఇలా పారిపోతే అది మనకు శోభాయమానం కాదు, నా మాట విను,” అర్థించాడు.

పరువు మర్యాదల గురించి షట్ కళ్యాణికి పెద్దగా పట్టింపు ఉన్నట్టు లేదు. నరస సింహుడి మాట వినిపించుకోకుండా అది అలా పరిగెడుతూనే పోయింది.

అంత వరకు తొందరలో పట్టించుకోలేదు కానీ అప్పుడు గమనించాడు నరస సింహుడు. షట్ కళ్యాణి సూటిగా ఒక కొండ పైకి దౌడు తీస్తూంది. దాదాపు ఆ కొండ పై అంచు వరకు వచ్చేశారు వాళ్ళు. యువరాజు గుండెలు గుభేలుమన్నాయి.

“నీ ముఖము వేడెక్కు గాక! ఈ కొండ పైనుంచి పడ్దాము అంటే ఏకాఏకి కింద ప్రవహిస్తున్న నదిలో పడతాము. దాని కంటే సింహాన్ని ఎదుర్కోవడమే మంచిది,” కోపంగా అరిచాడు.

షట్ కళ్యాణికి ఆ మాటలు అర్థమయ్యయో లేవో కానీ, అది అలా ఆగకుండా పరిగెడుతూ కొండ పైనుంచి దూకేసింది. పెద్ద శబ్దంతో కొద్ది క్షణల్లో కింద ప్రవహిస్తున్న నదిలో పడ్డారు గుర్రమూ, మనిషీ, కోతీ. సింహం కొండ అంచు దగ్గర ఆగిపోయి, నోటి కాడ కూడు పోయిందన్న బాధతో, విషాదంగా ఊళలాంటి ఒక శబ్దం వెలువరించింది.

అంత ఎత్తునుంచి నీటిలో పడగానే ఆ ఉధృతానికి యువరాజుకు దాదాపు స్పృహ తప్పిపోయింది. కానీ ఎలానో అపస్మారక స్థితిలోకి పోకుండా తనను తాను ఆపుకున్నాడు. పండు కోతి నరస సింహుడికీ, గుర్రానికీ చాలా దూరంగా వెళ్ళిపోయింది నదీ ప్రవాహంలో కొట్టుకుపోతూ. నరస సింహుడికి బాధ తన్నుకు వచ్చింది.

“అయ్యో నా పండు కోతి. ఇంత కష్టపడి సాధించాక ఇలా చేజారిపోయిందేంటి,” అనుకున్నాడు.

మళ్ళీ ప్రవాహం యువరాజునీ, గుర్రాన్నీ బలంగా కోతికి దూరంగా తోసేసింది. అప్పుడు నరస సింహుడికి తలకి ఏదో రాయి తగిలి స్పృహ తప్ప్పింది.

స్పృహ తప్పడానికి ఒక క్షణం ముందు, పండు కోతి సుదూరంగా కనిపిస్తున్న ఒక ద్వీపం వైపు కొట్టుకుపోవడం గమనించాడు యువరాజు.

(ఇంకా ఉంది)

Advertisements
This entry was posted in జ్వాలా ద్వీప రహస్యం. Bookmark the permalink.

6 Responses to జ్వాలా ద్వీప రహస్యం – 17

 1. ప్రదీప్ says:

  ఇంకో ద్వీపమా ??

 2. Kanth says:

  మీరు మీ షట్‌కళ్యాణిని చాలా నెమ్మదిగా నడిపిస్తున్నారు సార్. ఇదివరకు రోజూ నడిచేది. ఇప్పుడు వారానికోసారి మాత్రం నడుస్తొంది. మళ్ళా రోజూ నడిచే చాన్స్ ఎప్పుడు తెప్పిస్తారు సార్?

  • Murali says:

   ఏం చేయమంటారు? ఫుల్ టైం రచయితను కాదు కద! ప్రతి వారానికీ కనీసం ఒక భాగం ఐనా అందించడానికి ప్రయత్నిస్తున్నా. 🙂

 3. Seenu says:

  Murali garu…..dummu leputunnarandi. I’m eagerly waiting for the next parts to come.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s